యౌవనుల బలము కొరకు
నేను యేసు క్రీస్తు యొక్క శిష్యుడను
2024 జనవరి


“నేను యేసు క్రీస్తు యొక్క శిష్యుడను,” యౌవనుల బలము కొరకు, 2024 జనవరి

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2024 జనవరి

నేను యేసు క్రీస్తు యొక్క శిష్యుడను.

మీరు రక్షకుని అనుసరించుచు ఆయన వాక్యమును ఇతరులకు ప్రచారము చేయవచ్చును.

చిత్రం
2024 యవ్వనుల శిక్షణాంశ చిహ్నము.

జనులను స్వస్థపరచిన తరువాత, యేసు ఆ సంగతి ఎవరికి చెప్పవలదని వారిలో కొందరికి చెప్పినందుకు మీకు ఎప్పుడైనా ఆశ్చర్యము కలిగినదా? (మార్కు 7:36చూడుము) ఒక్క కారణం ఆయనకు అవసరమగు విధమైన అనుచరులకు సంబంధించినది కావచ్చును. జనములు తమ స్వస్థతను గురించి మాట్లాడినచో, ఆయన అనుచరులను ఆకర్షించుటకు యేసుకు మంచి మార్గం అని మీరనుకోవచ్చుచును. అయినను, యేసుకు అసలు అనుచరుల యొక్క అవసరం లేదు. ఆయనకు శిష్యులు అవసరం.

యేసు పేతురు మరియు ఆంద్రెయలతో అన్నారు, “నన్న అనుసరించండి” (మత్తయి 4:19). జోసెఫ్ స్మిత్ అనువాదంలో ఆ వాక్యం ఇలా వ్రాయబడింది. “ఎవని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడినదో ఆయనను నేనే, నన్ను అనుసరించుడి” జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 4:18[మత్తయి 4:19లో పుటచివరి గమనిక a]). ఆ ఆహ్వానము ఆయన వెంట కొంత కాలము తిరగమని కాదు. వారు ఆయన శిష్యులుగా నిత్యము ఉండవలెనని ఆయన కోరుకొనెను.

ఆయన కేవలము మనుష్యులకు బోధించుట, మనుష్యులను ప్రేమించుట, మరియు అద్భుతములు చేయుట మాత్రమే వారు చూడవలెనని కోరలేదు. వారు అదే విధముగ చేయవలెనని ఆయన కోరుకొనెను. తన పరిచర్య వారి పరిచర్య కావలెనని ఆయన కోరుకొనెను. క్రీస్తును ఎంచుకొనుట అనగా ఆయనవలె సేవచేయుట, ఆయనవలె తలంచుట అని వారు నేర్చుకొనవలెను. వారు ఆయనవలె జీవించుటను అభ్యసించునట్లు, వారికి తర్ఫీదునిచ్చి మరియు తన పోలికగా మరింత మారుటకు ఆయన వారికి అవసరమైన సహాయము చేయును.

చిత్రం
యేసు క్రీస్తు

శిష్యుడు అనుటకు గ్రీకు పదము మాతెటెస్ దాని అర్ధము అనుచరుడు లేక విద్యార్థి కంటే అధికుడు. అది తరచు శిక్షణార్ధి అని అనువదింపబడును. క్రీస్తు రోజులలో శిష్యులు సాధారణంగా గురువు యొద్ద నేర్చుకొని తాము కూడ గురువులు కావాలనే ఉద్దేశ్యముతో గురువును ఎంచుకునేవారు. క్రీస్తు అటువంటి సాధారణ అలవాటును పాటించలేదు. ఆయన దానికి మారుగా ఆయనే తనకొరకు శిష్యులను వెదకుకొని యున్నాడు. ఈ రోజు క్రీస్తు తన యొద్దకు రమ్మని మనలను పిలుచుచున్నాడు. మనము ఆయన యొక్క శిష్యులు కావలెననియు మరియు తన జనులు నిత్య జీవమును కలిగియుండునట్లు వారి మధ్య తన వాక్యమును ప్రకటించుటకు మనలను పిలుచుచున్నాడు (3 నీఫై 5:13) చూడుము.

కరిబ్బియన్ దేశములో హైతీ నుండి ఒక యువతి తన సంఘ సభ్యురాలు కానటువంటి ఒక స్నేహితురాలిని FSY సమావేశమునకు తనతో రావలెనని ఆహ్వానించుటద్వారా క్రీస్తు శిష్యురాలు కావలెనను కోరికను చూపెను. మొదట ఆమె స్నేహితురాలి తండ్రి తన కుమార్తె వెళ్ళటానికి అనుమతినిచ్చుటకు ఇష్టపడలేదు. సంఘ నాయకులు ఆమెకు కలుగబోవు ఆశాజనకమైన అనుభవాలను గూర్చియు, అద్భుతమైన యవ్వనుల సలహాదారులు ఆమెను కనిపెట్టుచుందురనియు వివరించిరి. ఆ తండ్రి తన కుమార్తె హాజరగుటకు అనుమతినిచ్చెను, మరియు అందువలన ఆమె జీవితంలో కలిగిన తేడా చూచి ఆమెను సంఘ సమావేశాలకు హాజరగుటకు—ఆరు నెలల తరువాత—బాప్తీస్మము పొందుటకు కూడ అనుమతించెను.

దక్షణ అమెరికా లోని అర్జెంటినా నుండి ఒక యువకుడు తన స్నేహితునితో కలిసి బస్సులో పాఠశాలకు వెళ్ళుచు మిఠాయిని కొంత పంచుకొనుట ద్వారా క్రీస్తు శిష్యుడగుటకు కోరిక కనుపరచెను అతనికి కాఫీ వాసనగల పదార్ధం ఎదురైనప్పుడు అతను వివరించాడు: తన ఇంట్లో ఎవరూ కాఫీ త్రాగరు కనుక ఆ వాసన యెడల తనకు ఎప్పుడూ రుచించదని. ఆ సంభాషణ సంఘ సమావేశాలకు ఆహ్వానించుటకు , తద్వార ఆ స్నేహితుడు సంఘంలో చేరడం మరియు చిలీలో మిషనరీ సేవచేయుటకు దారితీసింది.

మీరు సంఘం గూర్చి మాట్లాడిన ప్రతి ఒక్కరు గాని, సంఘ కార్యక్రమాలకు ఆహ్వానింపబడిన వారు గాని సంఘంలో చేరుటకు కోరుకోరు. ఫరవాలేదు. అలాగే క్రీస్తు భూమిమీద పరిచర్య చేసిన సమయంలో మాట్లాడిన ప్రతి ఒక్కరు ఆయనతో కలవలేదు. అయినప్పటికి, మనము యేసు క్రీస్తు యొక్క శిష్యులు అగుటకు కోరుకొని, ఆయన వాక్యమును ప్రకటించినప్పుడు ఆయన మనకు ధైర్యమును మరియు దైవ సహాయమును అనుగ్రహించును. మనము ఆయనవలే మరింత మారుటకు, నేర్చుకొందుము, మరియు, అదే శిష్యులును చేయుదురు.