2020
సర్వసభ్య సమావేశము ద్వారా పరిచర్య చేయుట
2020 ఏప్రిల్


“సర్వసభ్య సమావేశము ద్వారా పరిచర్య చేయుట,” లియహోనా, ఏప్రిల్ 2020

చిత్రం
పరిచర్య

పరిచర్య సూత్రములు, ఏప్రిల్ 2020

సర్వసభ్య సమావేశము ద్వారా పరిచర్య చేయుట

ప్రేరేపించు వ్యాఖ్యానాలు, కుటుంబ సంప్రదాయాలు, ప్రభువు యొక్క సేవకుల నుండి బోధనలతో సర్వసభ్య సమావేశపు వారాంతానికి ముందు, ఆ సమయంలో మరియు తరువాత —పరిచర్య చేయడానికి అనేక విధానాలను సర్వసభ్య సమావేశము మనకిస్తుంది.

మిషను-సిద్ధపాటు తరగతి బోధకులుగా సుసి మరియు టామ్ ముల్లన్, సర్వసభ్య సమావేశము చూడడానికి ఎవరినైనా ఆహ్వానించమని వారి తరగతుల సభ్యులను క్రమం తప్పక ప్రోత్సహించేవారు.

“ఏదైనా చేయమని ఎవరినైనా ఆహ్వానించడం మిషనరీ కార్యపు అంతర్గత భాగము, అది పరిచర్యకు కూడా అన్వయిస్తుంది,” అని ఆమె చెప్తుంది. “అది వారికి మరియు వారు ఆహ్వానించిన వ్యక్తికి కూడా ఎంతవరకు ఉపయోగపడిందనే దాని గురించి మా విద్యార్ధులు క్రమంగా తెలియజేసారు.”

వారి విద్యార్ధులు చేరువగుతూ తెలియజేసిన కొన్ని విధానాలు ఇక్కడున్నాయి:

  • “కొన్ని సమస్యలతో పోరాడుతున్న ఒక స్నేహితునికి మేము పరిచర్య చేసాము. జవాబుల కొరకు సర్వసభ్య సమావేశమును వినమని మేము అతడిని ఆహ్వానించాము. సమావేశము తరువాత మేము అతడిని సందర్శించినప్పుడు, సహాయపడగల అనేక ఉపాయాలను తాను విన్నానని అతడు మాతో చెప్పాడు.”

  • “మేము ఒక సర్వసభ్య సమావేశ విందు ఏర్పాటు చేసాము మరియు ప్రతీఒక్కరు పంచుకోవడానికి అల్పాహారాలను తెచ్చారు. అది చాలా సరదాగా ఉంది, కనుక మేము మరలా దానిని చేయాలనుకుంటున్నాము.”

  • “నాతో సర్వసభ్య సమావేశము చూడమని నేను ఒక స్నేహితుడిని ఆహ్వానించాను. మేము దాని గురించి మాట్లాడినప్పుడు, సమావేశగృహములో దానిని చూడడానికి వెళ్ళాలని మేము నిర్ణయించాము. మేము వెళ్ళాము, మరియు అక్కడ చూడడం గొప్ప అనుభవం!”

ముల్లెన్స్ మరియు వారి విద్యార్ధులు నేర్చుకున్నట్లుగా, సర్వసభ్య సమావేశము ద్వారా పరిచర్య చేయడానికి అనేక విధానాలున్నాయి. ప్రేరేపించు వ్యాఖ్యానాలు, కుటుంబ సంప్రదాయాలు, అర్ధవంతమైన చర్చలు మరియు ప్రభువు యొక్క సేవకుల నుండి బోధనలను పంచుకోవడం ఒక అద్భుతమైన విధానం!

ఇతరులను మీ ఇంటికి ఆహ్వానించండి

“రక్షకుడు తన అనుచరులను, ‘నేను మిమ్మును ప్రేమించినట్టే, మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను’ (యోహాను 13:34) అని ఆజ్ఞాపించారు. కాబట్టి ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో చూద్దాం. … ఆయనను మనం ఆదర్శంగా తీసుకున్నట్లయితే, ప్రతీఒక్కరిని చేర్చుకోవడానికి సమీపించేందుకు మనము ఎల్లప్పుడు ప్రయత్నించాలి.” —అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్1

సంవత్సరాల క్రితం మా అద్భుతమైన గృహ బోధకుడు మైక్, మా ముగ్గురు పిల్లలు, నేను సర్వసభ్య సమావేశము చూడడానికి చిన్న లాప్‌టాప్ ను మాత్రమే కలిగియున్నామని గమనించాడు. అతడు తనతో, తన భార్య జాకీతో పాటు చూడడానికి తన ఇంటికి రమ్మని, మా సహవాసాన్ని వారిష్టపడతారని బలవంతం చేస్తూ వెంటనే ఆహ్వానించాడు. నిజమైన టీవిలో సమావేశాన్ని చూసి నా పిల్లలు పులకించిపోయారు; ఆ సహకారాన్ని నేను చాలా ప్రశంసించాను; మరియు మేము కలిసియున్న సమయాన్ని మేమంతా ఇష్టపడ్డాము.

దాని తరువాత, సర్వసభ్య సమావేశమును కలిసి చూడడం ఒక సంప్రదాయమైంది. మాకు మా స్వంత టీవి ఉన్నా మేమిప్పటికీ సర్వసభ్య సమావేశము కోసం మైక్, జాకీల వద్దకు మా తలగడలు, నోటు పుస్తకాలు, మరియు అల్పాహారాలతో సంతోషంగా వెళ్తాము.కలిసి ప్రవక్తల మాటలను వినడం దానిని మరింత ప్రత్యేకంగా చేసింది. మేము కుటుంబం వలే అయ్యాము. మైక్, జాకీలు నాకు మంచి స్నేహితులు మరియు నా పిల్లలకు రెండవ తాతమామ్మలు అయ్యారు. వారి ప్రేమ మరియు స్నేహము నా కుటుంబానికి అపురూపమైన దీవెనైంది. మాకోసం వారి ఇంటిని, వారి హృదయాలను తెరవడానికి ఇష్టపడినందుకు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను.

సుజాన్నె ఎర్డ్, కాలిఫోర్నియా, అమెరికా

పరిగణించవలసిన సూత్రములు

“గమనించాడు”

రక్షకుడు ఇతరుల అవసరాలను చూడడానికి ప్రేమగా సమయాన్ని తీసుకున్నారు, తరువాత ఆ అవసరాలను తీర్చడానికి పనిచేసారు (మత్తయి 9:35–36; యోహాను 6:5; 19:26–27 చూడుము). మనము అదేవిధంగా చేయగలము.

“వెంటనే ఆహ్వానించాడు”

మనము పరిచర్య చేసే వారి అవసరాలను మనం గమనించిన తరువాత, చేయవలసింది దానిపై పనిచేయడం.“ప్రవక్తల మాటలను ఆలకించడం”

మనము కలిసి నేర్చుకోవడానికి, కలిసి ఎదగడానికి మరియు మన ఆత్మలకు అతి ముఖ్యమైన ఆత్మీయ విషయాలను గూర్చి మాట్లాడుకోవడానికి “తరచుగా కూడుకోవాలి” (మొరోనై 6:5).

“రండి, ప్రవక్త స్వరము వినండి మరియు దేవుని వాక్యము వినండి”2 అనేది మనము పరిచర్య చేసే వారికి మనమివ్వగల అతి ముఖ్యమైన ఆహ్వానాలలో ఒకటి కాగలదు.

“ప్రేమ మరియు స్నేహము”

ఇతరులకు నిజంగా సహాయపడడానికి, వారిని ప్రభావితం చేయడానికి కనికరముతో, “కపటం లేని ప్రేమ” (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:41 చూడుము) తో అనుబంధాలను మనము నిర్మించాలి.

అంతర్జాలంలో పంచుకోండి

“సామాజిక మాధ్యమాలు అనేవి ప్రపంచ సాధనాలు, అవి వ్యక్తిగతంగా, సానుకూలంగా, పెద్ద సంఖ్యలో వ్యక్తులు మరియు కుటుంబాలను ప్రభావితం చేయగలవు. క్రీస్తు యొక్క శిష్యులుగా మనము నిత్య తండ్రియైన దేవుని గూర్చి, ఆయన పిల్లల కొరకైన ఆయన సంతోష ప్రణాళిక గూర్చి మరియు లోక రక్షకునిగా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమివ్వడానికి, సముచితంగా మరియు సమర్ధవంతంగా ఈ ప్రేరేపించబడిన సాధనాలను ఉపయోగించేందుకు మనకు సమయము ఆసన్నమైందని నేను నమ్ముతున్నాను.” —Elder David A. Bednar3

యావత్ ప్రపంచంతో సువార్తను పంచుకోవడానికి అంతర్జాలం మనకు అనుమతిస్తుంది. నేను దానిని ప్రేమిస్తున్నాను! సర్వసభ్య సమావేశం కోసం కొన్ని ప్రోత్సాహకార్యక్రమాలను నేను పంచుకున్నాను, కానీ సర్వసభ్య సమావేశ ప్రసంగాలనుండి ఇతరులు ఒక చర్చను మొదలుపెట్టడానికి సహాయపడేందుకు నేను ఎక్కువగా ప్రయత్నిస్తాను. ఇతరుల ప్రశ్నలు చూడడం ఒక క్రొత్త వెలుగులో సంగతులను చూడడానికి తరచు మనకు సహాయపడగలదు, మరియు మన స్వంత గొప్ప చర్చా ప్రశ్నలకు ఆధారము కాగలదు.

మీ పరిచర్య కుటుంబాలతో సర్వసభ్య సమావేశ ప్రసంగాలను చర్చించడానికి మీరు ప్రశ్నలను ఉపయోగించినప్పుడు, వారి అవసరాలు అదేవిధంగా వారి బలాలను చూడడానికి అది మీకు సహాయపడుతుందని నేను కనుగొన్నాను. అడగడానికి నాకు ఇష్టమైన ప్రశ్నలలో ఒకటి, ఇటీవల సర్వసభ్య సమావేశ భాగమునుండి ఒక ఇతివృత్తము ఏదని మీరనుకుంటున్నారు?

దాదాపుగా జవాబు ఎల్లప్పుడు వారి జీవితంలో జరుగుతున్నదానిని, వారికి ముఖ్యమైన దానిని మీరు చూడడానికి అనుమతిస్తుంది. మీరు వారిని మరింత స్పష్టముగా చూడగలుగుతారు, కనుక మీరు ఒక మంచి పరిచర్య చేయు సహోదరుడు లేక సహోదరిగా కావడానికి అది మీకు అనుమతిస్తుంది.

కామిల్లి గిల్హామ్, కొలరాడో, అమెరికా

పరిగణించవలసిన సూత్రములు

“సువార్తను పంచుకోండి”

“అన్ని సమయములలో మరియు అన్ని విషయములలో మరియు అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడుటకు” (మోషైయ 18:9) మనము నిబంధన చేసాము.

“ఒక చర్చను మొదలుపెట్టండి”

సర్వసభ్య సమావేశ సందేశాలు అద్భుతమైన, సంబంధిత, మరియు ఆత్మీయంగా నడిపించే సంభాషణలను ప్రేరేపించగలవు. ఈ రకమైన చర్చలు మీ అనుబంధాలను బలపరచగలవు, మీ సాక్ష్యము ఎదగడానికి సహాయపడగలవు, మరియు మీకు ఆనందాన్నివ్వగలవు! (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:22 చూడుము).

“ప్రశ్నలు ఉపయోగించండి”

“మంచి ప్రశ్నలు ఇతరులు కలిగియున్న ఆసక్తులు, సందేహాలు, లేక ప్రశ్నలను మీరు గ్రహించడానికి సహాయపడతాయి. అవి మీ బోధనను మెరుగుపరచగలవు, ఆత్మను ఆహ్వానించగలవు మరియు జనులు నేర్చుకోవడానికి సహాయపడగలవు.”4

వివరణలు

  1. Dallin H. Oaks, “Love and the Law” (video), mormonandgay.ChurchofJesusChrist.org.

  2. “రండి, ప్రవక్త స్వరము వినండి,” కీర్తనలు, సం. 21.

  3. David A. Bednar, “Flood the Earth through Social Media,” Liahona, Aug. 2015, 50.

  4. నా సువార్తను ప్రకటించుడి: మిషనరీ సేవకు ఒక మార్గదర్శి (2004), 185.