2020
సంస్కార సమావేశము ద్వారా పరిచర్య చేయుట
2020 జూన్


“సంస్కార సమావేశము ద్వారా పరిచర్య చేయుట,” లియహోనా, 2020 జూన్

చిత్రం
పరిచర్య

ఎడ్వర్డ్ మెక్గొవాన్ చేత దృష్టాంతములు

పరిచర్య చేయు సూత్రములు, 2020 జూన్

సంస్కార సమావేశము ద్వారా పరిచర్య చేయుట

సంస్కార సమావేశము ఇతరులతో కలుసుకొనుటకు మరియు పరిచర్య చేయుటకు అవకాశాలను అందించును.

సంస్కార సమావేశము ఆత్మీయ పోషణకు, రక్షకుడు మరియు ఆయన ప్రాయశ్చిత్తఃముపై వ్యక్తిగత మననము చేయుటకు సమయము. ప్రతీవారము మనము సంస్కారములో పాల్గొన్నప్పుడు, మనము కలిసి జ్ఞానవృద్ధి పొందుతాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:110 చూడుము). మన వార్డులు మరియు బ్రాంచీలలో కొందరు వారితో భారమైన బరువులను తెస్తారు లేక వారు అసలు అక్కడ ఉండరు.

ఆ పరిశుద్ధ గడియను ఇతరులకు పరిచర్య చేయుటకు మరియు వారి జీవితాలలో ప్రత్యేకతను చేయుటకు మనము ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ కొన్ని అవకాశాలున్నాయి.

మీరు పరిచర్య చేయువారికి సంస్కార సమావేశము శ్రేష్టమైనదిగా చేయుటకు సహాయపడుము

ఎలా పరిచర్య చేయాలో నేర్చుకొనుటలో మొదటి మెట్టు ఏదనగా వ్యక్తులు లేక కుటుంబాలను మరియు వారి అవసరాలు తెలుసుకొనుట. కేవలము వారి గురించి నేర్చుకొనుట ద్వారా సంస్కార ఆరాధానా అనుభవము శ్రేష్టమైనదిగా చేయుటకు మీకు సహాయపడుటకు విధానములున్నాయి.

కవల పసిబిడ్డల తల్లి, మిండికి, తన పరిచర్య సహోదరి యొక్క సాధారణమైన ప్రయత్నాలు ప్రతీవారము ఆమె సంస్కార సమావేశ అనుభవములో పెద్ద భిన్నత్వాన్ని కలిగించాయి.

“నా భర్త యొక్క పని వేళల వలన, ప్రతీవారము మా ఇద్దరు కవల కూతుర్లను సంఘానికి నేనే తీసుకొనివెళ్తాను,” మిండి వివరించును. “ఇద్దరు తీరికలేని కవలలతో సంస్కార సమావేశమంతా ఉండటం నిజంగా కష్టమైనది, కానీ నా పరిచర్య చేయు సహోదరి నాకు సహాయపడటానికి దానిని తనపై తీసుకొన్నది.

“ఆమె మాతో కూర్చోంటుంది మరియు ప్రతీవారము నా బాలికలను శ్రద్ధ తీసుకొవటానికి నాకు సహాయపడుతుంది. ఆమె నా ప్రక్కన ఉండటం చాలా అర్ధవంతమైనది మరియు వారి అల్లరి లేక తొందర పెట్టు క్షణాలలో నా ఆందోళనను నిజంగా తేలిక చేయును. నా జీవితంలో ఈ సమయమందు ఆమె చర్యలు నన్ను ఎంతగా ప్రభావితం చేసాయో ఆమెకు ఎప్పటికైనా తెలుస్తుందా నాకు తెలియదు. ఒక యౌవన ఆందోళన నిండిన తల్లిగా నా అవసరతను ఆమె చూసింది, మరియు సంఘము మా అందరికి శాంతికరమైనదిగా మరియు సంతోషకరమైనది చేయుటకు ఆమె సహాయపడింది.

ప్రత్యేక అవసరతలు గల వారికి సహాయపడుటకు ఉపాయములు

  • సభ్యుల అవసరాలను గూర్చి ఎల్డర్ల కోరము మరియు ఉపశమన సమాజముకు తెలియజేయుము.

  • నాయకులారా, సభ్యుల అవసరాలను తీర్చుటకు సహాయపడుటకు సంస్కార సమావేశ ప్రసంగాలను ప్రణాళిక చేయుము. మీరు పరిచర్య చేయువారు ఒక నిర్ధిష్టమైన సందేశమును వినుట నుండి ప్రయోజనము పొందితే, మీ నాయకులతో ఆ ఆలోచనను పంచుకొనుము.

  • సంస్కార దీవెనలు ఆనందించుట నుండి వారిని నిలిపివేయు వైకల్యము లేక ఆహారపు అలర్జీలు ఒకరికి ఉందని మీకు తెలిస్తే, వివరాల కొరకు మరియు వారి ఆరాధనా అనుభవము మెరుగుపరచుటకు చేయగల సర్ధుబాట్లు ఏమిటో అడుగుము. ఈ సమాచారమును మీ నాయకులతో పంచుకొనుము.

  • మీరు పరిచర్య చేయువారు లేక తెలిసిన వారు శాశ్వతంగా లేక తాత్కాలికంగా ఇంటికే పరిమితం అయ్యారని తెలిస్తే, ఇంటివద్ద వారికి సంస్కారము ఇవ్వవచ్చా అని మీ బిషప్పును అడుగుము. సంస్కార సమావేశమందు మీరు వివరాలను వ్రాయవచ్చు మరియు వాటిని ఫోను, ఈ-మెయిల్ ద్వారా, లేక వ్యక్తిగతంగా పంచుకోవచ్చు.

  • మీరు పరిచర్య చేయువారు చిన్న పిల్లలను కలిగియున్న యెడల, సంస్కార సమావేశమందు వారికి సహాయపడుటకు మీరు అడగవచ్చు.

  • మీరు పరిచర్య చేయువారు తరచుగా సంస్కార సమావేశానికి రాని యెడల, అర్ధము చేసుకోవటానికి ప్రయత్నించుము మరియు సహాయపడగల విధానాలు ఆలోచించుము. వారికి ప్రయాణ సహాయము అవసరమైతే, మీరు తీసుకొనివెళ్తామని అడగవచ్చు. వారి కుటుంబము చేత వారు సహకరించబడలేదని వారు భావిస్తే, మీతోపాటు కూర్చోవటానికి మీరు వారిని ఆహ్వానించవచ్చు. వారు స్వాగతించబడుతున్నట్లు మరియు సంస్కార సమావేశమందు కావలెనని వారు భావించునట్లు చేయుటకు సహాయపడుటకు మీరు ప్రత్యేక ఆహ్వానాలు చేయవచ్చు.

జ్ఞాపకముంచుకొనుము, సాధారణమైన హావభావాలు చాలా దూరం వెళ్తాయి.

పరిచర్య గురించి మాట్లాడుతూ, ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షురాలైన, సహోదరి జీన్ బి. బింగమ్ ఇలా బోధించారు: “కొన్నిసార్లు మన పొరుగువారికి సేవ చేస్తున్నట్లుగా ‘లెక్కించడానికి’ గొప్పగా, వీరోచితంగా ఏదైనా చేయాల్సి ఉంటుందని మనము భావిస్తాము. అయినప్పటికినీ సాధారణమైన సేవా చర్యలు ఇతరులపై—అదేవిధంగా మనపై లోతైన ప్రభావమును కలిగియుండగలవు.”1

బెల్జియమ్‌లో చిన్న వార్డులో, ఈవిటా స్పానిష్ మాట్లాడే సందర్శకుల కొరకు మరియు సంఘ సమావేశాలందు సభ్యులకు అనువదించుటకు తరచుగా సహాయపడును. ఒకసారి, ఈవిటా సంఘము గురించి నేర్చుకొనుచున్న డోమినికన్ రిపబ్లిక్ నుండి ఒకరికి పరిచయము చేయబడింది. అతనికి కొంత ఆంగ్లము తెలుసు, కానీ స్పానిష్ అతడి మాతృభాష. కనుక అతడు ఎక్కువ సౌకర్యముగా భావించునట్లు సంస్కార సమావేశములో మెల్లగా అనువదిస్తానని అతనిని అడిగింది.

“అనువదించుట కొన్నిసార్లు నా సబ్బాతును కాస్త ఎక్కువ తీవ్రమైనదిగా చేయగలదు,” ఈవిటా చెప్పుచున్నది. “కానీ అనువదించువారు కావాలా అని ఇతరులను అడుగుటకు ప్రేరేపణలను అనుసరించుట, సంతోషముగల భావనను మరియు ఆత్మను అనుభవించుటకు నేను వారికి సహాయపడగలిగానని తెలుసుకొనుటలో ఉత్సాహమును ఖచ్చితంగా నాకిస్తుంది.”

సాధారణమైన చిహ్నముల ద్వారా సహాయపడుటకు ఉపాయములు

  • సంస్కార సమావేశమందు ఎవరికి కాస్త అదనపు సేవ అవసరమో చూడటానికి మీ నాయకులతో మాట్లాడండి. లేక ఎవరికి అవసరమో మీకు తెలిస్తే, మీ నాయకులు వారి గురించి తెలుసుకున్నారని నిర్ధారించుకొనండి.

  • సమావేశము ప్రారంభమగుటకు మీరు ఎదురుచూస్తున్నప్పుడు, మౌనంగా కూర్చోనుము. “మన చుట్టూ ఉన్న మిగిలిన విరిగిన హృదయాలు మరియు విచారిస్తున్న ఆత్మలకు”2 ఇది సహాయపడును, వారికి పరిశుద్ధ స్థలములో భక్తి ద్వారా రాగల శాంతి అవసరము.

  • ఉపవాస ఆదివారమున, అదనపు ఓదార్పు అవసరమైన మీరు పరిచర్య చేయు ఒకరికి మీ ఉపవాసము మరియు ప్రార్ధనలు సమర్పించుటకు ఆలోచించుము.

  • సంస్కార సమావేశములో మీరు ప్రక్కన లేక మీ దగ్గర కూర్చోనుట నుండి ప్రయోజనం పొందగల వారు ఎవరైనా ఉన్నయెడల, లేక మీరు సహాయపడుటకు మరొక మార్గము ఉంటే తెలుసుకోవటానికి ప్రార్ధించుము.

సంస్కార సమావేశము అందరికీ ఒక స్వాగతమిచ్చు స్థలము కావచ్చు

అధ్యక్షులు జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్ (1876–1972) ఇలా బోధించారు, “సంఘ సమావేశాలన్నిటిలో, సంస్కార సమావేశము అత్యంత పరిశుద్ధమైనది.”3 ఈ సందర్భములో, సంస్కార సమావేశము హాజరైన వారందరు—ప్రత్యేకంగా క్రొత్త సభ్యులు లేక కొంత కాలం హాజరు కాని సభ్యులు స్వాగతించబడి ఆత్మీయంగా ఆహారమివ్వబడినట్లు నిర్ధారించుట ముఖ్యమైనది.

ఆస్ట్రేలియా, క్రొత్త దక్షిణ వేల్స్ నుండి మెరానియా, తన వార్డులో సంఘమును గూర్చి నేర్చుకొన్న ఒక స్త్రీతో స్నేహము చేసింది. “ఆమె ఇప్పుడు నా ప్రియమైన స్నేహితులలో ఒకరైంది,” మెరానియా చెప్పును. “ప్రతీవారము సంస్కార సమావేశములో ఆమెతో కూర్చోవటం నాకిష్టమైనది, ఆమె ఎలా ఉన్నది మరియు ఆమెకు సహాయపడుటకు నేను చేయగలది ఏమైనా ఉన్నదా అని నేను ఎల్లప్పుడు అడుగుతాను.” కొంతకాలం తరువాత, మెరానియా స్నేహితురాలు బాప్తీస్మము పొందింది. వార్డు సభ్యుల ప్రయత్నాలు, అదేవిధంగా సంస్కార సమావేశములో స్వాగతమిచ్చు వాతావరణము, ఆమె నిర్ణయంలో భారీ పాత్ర వహించెను.

తిరిగి వెళ్లుటకు లేక క్రొత్త సభ్యులకు పరిచర్య చేయుటకు ఉపాయములు

  • సంస్కార సమావేశములో మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ సందేశమును వినుటకు మీ స్నేహితులు, కుటుంబము, మరియు ఇతరులను మీరు ఆహ్వానించవచ్చు.

  • మీరు ఒంటరిగా ఉన్న వారిని లేక సహాయము అవసరమైన వారిని వెదకి, స్వాగతించవచ్చు. మీరు వారి దగ్గర కూర్చోవచ్చా అని అడుగుము లేక మీతో కూర్చోమని వారిని ఆహ్వానించుము.

  • సమావేశము ముగిసినప్పుడు, సంఘ ప్రోత్సాహకార్యక్రమాలకు, దేవాలయమునకు, లేదా సామాజిక సంఘటనకు మీరు పరిచర్య చేయువారిని మరియు ఇతరులను ఆహ్వానించవచ్చు.

  • మీరు పరిచర్య చేయువారు సంస్కార సమావేశానికి హాజరయ్యారు, కానీ కొంత కాలము రాకపోతే, బోధింపబడిన దాని గురించి ప్రశ్నలు ఏవైనా ఉన్నాయా అని మీరు వారిని అడగవచ్చు. ఒక పదము, కధ, లేక వారు గ్రహించని సిద్ధాంతములో భాగము ఉన్న యెడల మిమ్మల్ని సంప్రదించుటకు వారు ఎల్లప్పుడు అడగవచ్చని వారికి చెప్పుము. అవసరమైతే, జవాబులను మీరు కలిసి చూడవచ్చు.

వివరణలు

  1. జీన్ బి. బింగం, “Ministering as the Savior Does,” Liahona, మే 2018, 104.

  2. జెఫ్రీ ఆర్. హాల్లండ్, “Behold the Lamb of God,” Liahona, మే 2019, 46.

  3. జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్, సర్వసభ్య సమావేశ నివేదికలో, అక్టో. 1929, 60–61.