2020
రండి, నన్ను అనుసరించండి ద్వారా పరిచర్య చేయుట
సెప్టెంబర్ 2020


రండి, నన్ను అనుసరించండి ద్వారా పరిచర్య చేయుట లియహోనా సెప్టెంబర్ 2020

చిత్రం
పరిచర్య చేయుట

పరిచర్య సూత్రములు, సెప్టెంబర్ 2020

రండి, నన్ను అనుసరించండి ద్వారా పరిచర్య చేయుట

ఏవిధంగా రండి, నన్ను అనుసరించండి ఇతరుల జీవితాలలో మార్పు కలుగుజేయుటకు మీకు సహాయపడగలదు?

మీ కుటుంబంతో మీరు సబ్బాతు బడి తరగతి గదిలో బోధించేవారిగా లేదా విద్యార్థిగా ఉన్నా, లేదా పాఠశాలలో, పనిలో, లేదా మరెక్కడ ఉన్నా, రండి, నన్ను అనుసరించండి ద్వారా లేఖన అధ్యయనం ఇతరులకు పరిచర్య చేయడానికి తగినంత అవకాశాలను అందిస్తుంది. బోధన అనేది “ఆదివారం చర్చకు నాయకత్వం వహించడం కంటే ఎక్కువ; ఇది ప్రేమతో సేవ చేయడం, సువార్తతో ఇతరులను ఆశీర్వదించడం.” 1

విద్యార్ధులతో కలవడం

తన మెక్సికో సిటీ వార్డులో యువకులకు బోధించడానికి ఒఫెలియా ట్రెజో డి కార్డెనాస్‌ను పిలిచినప్పుడు, తన ప్రతి సబ్బాతుబడి విద్యార్థులతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం వల్ల వారికి బోధించే, బలోపేతం చేసే సామర్థ్యం పెరుగుతుందని ఆమె భావించింది.

“నా విద్యార్థులతో నాకు సన్నిహిత సంబంధం లేకపోతే, వారు నా ప్రేమను అనుభవించకపోతే, నేను ఒక తరగతి బోధించేటప్పుడు లేదా నా సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు వారు నన్ను నమ్మకపోవచ్చు” అని ఆమె చెప్పింది “నేను కేవలం సబ్బాతుబడి బోధకురాలిని అని వారు భావించవచ్చు.”

ప్రతి రెండు వారాలకు ఒకసారి మాత్రమే నేర్పిస్తే సహోదరి కార్డెనాస్ అలాంటి సంబంధాన్ని ఎలా పెంచుకోవచ్చు? ఆమె టెక్నాలజీ ద్వారా సమాధానం కనుగొంది. మొబైల్ ఫోన్ అప్లికేషన్ వాట్సాప్ ఉపయోగించి, ఆమె మరియు ఆమె విద్యార్థులు త్వరలో ప్రతిరోజూ టెక్స్ట్ మరియు వాయిస్ సందేశాల ద్వారా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు, తరువాతి సబ్బాతుబడి పాఠానికి ముందు ప్రతిరోజూ, ఒక తరగతి వాలంటీర్ ఇతర తరగతి సభ్యులకు ఆ పాఠంతో వ్యక్తిగత సంబంధిత ఆలోచనతో ఒక లేఖన వచనాన్ని పంపును. వచనం మరియు ఆలోచన చదివిన తరువాత, తరగతి సభ్యులు తమ సొంత ఆలోచనలతో స్పందిస్తారు.

“లేఖనాన్ని చదివినప్పుడు వారు సంతోషకరమైన ముఖాన్ని పంపుతారు, అందువల్ల వారు లేఖనాన్ని చదివారని లేదా అధ్యయనం చేశారని, వారు దాని గురించి ఆలోచించారని నాకు తెలుసు” అని సహోదరి కార్డెనాస్ చెప్పారు. తరువాతి ఆదివారం పాఠం కోసం సమయం వచ్చినప్పుడు, విద్యార్థులు పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు.

ఈ రోజువారీ సంబంధం ఇటీవల సంఘంలో చురుకుగా లేని ఒక యువకుడిని ఆశీర్వదించింది.

“అతను సంఘానికి రావడాన్ని చూసినప్పుడు నేను దానిని నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే అక్కడకు వెళ్ళడానికి, అతను అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చిందని నాకు తెలుసు” అని సహోదరి కార్డెనాస్ చెప్పారు. “అతని సహవిద్యార్థులు పంపిన లేఖనాలు, ఆలోచనలు మరియు అతని వంతు వచ్చినప్పుడు అతను పంపిన లేఖనాలు, ఆలోచనలు అతన్ని చాలా బలపరిచాయని నాకు ఖచ్చితంగా తెలుసు.”

సహోదరి కార్డెనాస్ లేఖనాల ద్వారా పరిచర్య చేయడాన్ని తన ఆదివారం పాఠం, తరగతి రోజువారీ లేఖన సంబంధాలతో ఆపదు.

“నా విద్యార్థుల కోసం ప్రార్థన చేయడం నా సిద్ధపాటులో భాగం” అని ఆమె చెప్పింది. “నేను ఆదివారం మాత్రమే కాదు, వారంలోని ప్రతి రోజు కూడా వారిని గురించి ఆలోచిస్తాను. వారిలో ప్రతి ఒక్కరికి నిర్దిష్ట మరియు విభిన్న అవసరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డే. నేను నా పాఠాలు సిద్ధం చేస్తున్నప్పుడు వారి గురించి ఆలోచిస్తాను.”

ఆమె బోధించేటప్పుడు—తన విద్యార్థులను, పరిశుద్ధాత్మను - ఇరువురిని వింటుంది.

“బోధించేది ఆత్మే,” దానిని ఆమె తన విద్యార్థుల స్వరములలో తరచుగా వింటుంది. “నేను శ్రద్ధ వహించాలి ఎందుకంటే వారు చెప్పేది ఆత్మ వారికి ఇస్తున్న బయల్పాటు.”

మా తరగతి “గృహ సాయంకాలం వంటింది”

కార్లా గుటియెర్రెజ్ ఒర్టెగా కార్డోబా సహోదరి కార్డెనాస్ యొక్క సబ్బాతుబడి తరగతిలో సభ్యురాలిగా ఉండటం ఆశీర్వాదంగా భావిస్తుంది ఎందుకంటే బలోపేత, పరిచర్య వాతావరణం అక్కడ ఉంది. కార్లా ఆ వాతావరణాన్ని అనేక అంశాలకు ఆపాదించింది, వీటిలో:

  • సిద్ధపాటు: లేఖనాలు, ఆలోచనలు పంచుకోవడం విద్యార్థులకు తదుపరి తరగతికి సిద్ధం కావడానికి సహాయపడుతుంది. “రోజువారీ లేఖనాలు మనల్ని పోషిస్తాయి, మన జ్ఞానాన్ని విస్తరిస్తాయి” అని ఆమె వివరిస్తుంది.

  • పాల్గొనడం: “మేమందరం మాట్లాడుతాం. ఇది నా తోటి విద్ధార్థులను మరింత లోతుగా, స్నేహితులుగా, సహోదరులు మరియు సహోదరిలుగా తెలుసుకోవడానికి నన్ను అనుమతిస్తుంది. ”

  • ప్రేమ: “సహోదరి కార్డెనాస్ మిమ్మల్ని తన చేతితో నడిపిస్తుంది. చాలా మంది సహోదర, సహోదరిలతో మా తరగతి ఒక గృహ సాయంకాలంగా అనిపిస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైనది.”

  • పరిశుద్ధాత్మ: “మా తరగతిలో మాకు ఆహ్లాదకరమైన, శ్రావ్యమైన ఆత్మ ఉంది, ఎందుకంటే మేము ఆత్మతో ఒకే అవగాహనలో ఉన్నాము.”

  • సాక్ష్యం: “ రండి, నన్ను అనుసరించండి నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండటానికి నాకు సహాయపడింది. మోర్మన్ గ్రంథం మరియు బైబిల్ గురించి నాకు లోతైన జ్ఞానం ఉంది. నేను నేర్చుకుంటున్న వాటిని పాఠశాలలోని నా తోటి విద్యార్థులతో మరియు పనిచేస్తున్న స్థలంలో ఉన్న వ్యక్తులతో పంచుకోవడానికి ఇది నన్ను అనుమతిస్తుంది. ”

ఆధ్యాత్మిక అవసరాలకు పరిచర్య చేయడం

అమెరికాలోని కెంటుకీకి చెందిన గ్రెగ్ మరియు నిక్కీ క్రిస్టెన్‌సెన్ తమ ముగ్గురు కుమారులు లేఖనాలలో అబ్రాహాము నిబంధన గురించి చదివినప్పుడు, వారికి వివరించడం చాలా కష్టమైంది. వారిలో ప్రతి ఒక్కరూ తమ స్వంతంగా అబ్రాహాము నిబంధనను అధ్యయనం చేసి, ఆపై తాము కనుగొన్న వాటిని పంచుకోవాలని ఒక కుటుంబంగా వారు నిర్ణయించుకున్నారు.

“మాకు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వచ్చాయి” అని గ్రెగ్ చెప్పారు. “మా ఎనిమిదేళ్ల వయసుగల బిడ్డ, అబ్రాహాము పేరు అబ్రాము అని తెలుసుకొన్నాడు. పాపం నుండి తప్పుకోవాలని మరియు నీతికరమైన జీవితాన్ని గడపాలని ప్రభువుకు వాగ్దానం చేసినందున అతని పేరు అబ్రాహాముగా మార్చబడింది. అతను దానిని గ్రహించ గలిగాడని నేను నిజంగా ఆశ్చర్యపోయాను. “

వారందరూ క్రొత్తదాన్ని నేర్చుకున్నారు మరియు అబ్రాహాము నిబంధన అంటే ఏమిటి మరియు నేటి కడవరి-దిన పరిశుద్ధులు అంటే ఏమిటి అనే దాని గురించి మంచి చర్చలు జరిపారు.

“మేము గది చుట్టూ తిరుగుతూ, మా కుటుంబ లేఖన అధ్యయనం కోసం లేఖన వచనాలను ఒకరి తరువాత మరొకరు చదివుతాము” అని నిక్కీ చెప్పింది. “రండి, నన్ను అనుసరించండి ఆత్మ బోధన వైపు ఎక్కువ దృష్టి సారించింది. ఇప్పుడు మేము కలిసి అధ్యయనం చేసినప్పుడు, మా కుటుంబ అవసరాలను బట్టి మా చర్చలను వేరే దిశలో తీసుకెళ్లడానికి ఆత్మ నుండి నేను చిన్నచిన్న ప్రేరేపణలను పొందుతున్నాను. ”

రండి, నన్ను అనుసరించండి వారి కుటుంబానికి మరింత సువార్త మరియు కుటుంబ సువార్త అధ్యయనం పట్ల ఆసక్తి కలిగి ఉండటమే కాకుండా, గ్రెగ్ మరియు నిక్కీ వారి పిల్లల ఆధ్యాత్మిక అవసరాలకు పరిచర్య చేయడానికి ఇది సహాయపడింది.

రండి, నన్ను అనుసరించండి నా పిల్లలకు నేర్పడానికి నాకు సహాయపడుతుంది” అని నిక్కీ చెప్పింది. “ఇది నా పిల్లలతో నేను కొన్నిసార్లు ఎదుర్కొనే విభిన్న సవాళ్లను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. నేను ఆత్మతో మరింత సన్నిహితంగా ఉన్నాను, నేను మరింత దగ్గరగా వింటాను మరియు ప్రతి బిడ్డకు నేను ఎలా సహాయం చేయగలను అనే దానిపై నేను ప్రేరేపణలు పొందాను.”

రండి, నన్ను అనుసరించండి కుటుంబంలో ఉత్పత్తి చేయుటకు సహాయపడే సుదీర్ఘ సువార్త చర్చలను గ్రెగ్ ఆనందిస్తాడు. “మా కుమారులు వారి సువార్త జ్ఞానంలో వారు ఎక్కడ ఉన్నారో చాలా భిన్నంగా ఉంటారు” అని ఆయన చెప్పారు..రండి, నన్ను అనుసరించండి ప్రతి ఒక్కరూ వారి అవసరాలను బట్టి నేర్చుకోవడంలో మాకు సహాయపడటానికి మాకు ఒక మార్గాన్ని అందించింది. వారు సువార్త పట్ల ప్రేమను పెంచుకోవడాన్ని చూడటం మరియు వారు వారి జీవితాల్లో సువార్త జ్ఞానాన్ని ఎలా అన్వయించవచ్చో గుర్తించడం అద్భుతమైన ఆశీర్వాదం.”

వివరణ

  1. రండి, నన్ను అనుసరించండి—సబ్బాతుబడి కోసం: మోర్మన్ గ్రంథం 2020 (2019), 19.