అశ్లీలత
ఆరోగ్యకరమైన లైంగికత గురించి నేను నా బిడ్డతో ఎలా మాట్లాడగలను?


ఆరోగ్యకరమైన లైంగికత గురించి నేను నా బిడ్డతో ఎలా మాట్లాడగలను? తల్లిదండ్రుల కొరకు సహాయం (2021)

“ఆరోగ్యకరమైన లైంగికత గురించి నేను నా బిడ్డతో ఎలా మాట్లాడగలను?” తల్లిదండ్రుల కొరకు సహాయం

చిత్రం
బయట నడిచివెళ్తున్న కుటుంబము

ఆరోగ్యకరమైన లైంగికత గురించి నేను నా బిడ్డతో ఎలా మాట్లాడగలను?

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో లైంగికత గురించి మాట్లాడడానికి సంకోచిస్తారు లేదా సిగ్గుపడతారు లేదా లైంగికత గురించి తమ పిల్లలతో మాట్లాడటం వలన వారి లైంగిక ప్రవర్తన మేల్కొల్పబడుతుందని వారు భయపడతారు. నిజం ఏమిటంటే, మీరు మీ పిల్లలతో లైంగికత గురించి మాట్లాడకపోతే, వారు దాని గురించి మరొక ఆధారం నుండి నేర్చుకుంటారు. ఆరోగ్యకరమైన లైంగికత వంటి ముఖ్యమైన అంశాల గురించి మీ పిల్లలతో క్రమం తప్పకుండా సంభాషణలు జరపడం ద్వారా, సంప్రదించగల సురక్షితమైన వ్యక్తి మీరు అని వారు అర్థం చేసుకోవడానికి మీరు వారికి సహాయపడతారు.

చాలామంది పిల్లలు సహజంగానే ఆసక్తిని కలిగి ఉంటారు మరియు వారు అనుభవించే సహజమైన, దేవుడు ఇచ్చిన భావాలను అర్థం చేసుకోవాలని వారు కోరుకుంటారు. మీ పిల్లల వయస్సులో ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవారో గుర్తుంచుకోవడం ద్వారా వారితో లైంగికత గురించి మాట్లాడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు. మీరు అనుభవించిన కొన్ని భావాలు ఏమిటి? మీకు ఎలాంటి ఆలోచనలు, ప్రశ్నలు లేదా ఆందోళనలు ఉండేవి? మీరు సమాచారాన్ని ఎక్కడ వెదికారు? ఏమి వినియుండాలని లేదా బోధించబడియుండాలని మీరు కోరుకుంటున్నారు?

ఈ సంభాషణలను ఉత్తమంగా ఎలా నిర్వహించాలో మీకు తెలియకపోతే ఫర్వాలేదు. మీ పిల్లలతో మీ సంబంధాన్ని పెంచుకోవడానికి మీరు మీ దుర్బలత్వాన్ని ఉపయోగించవచ్చు. మీరు ఎటువంటి అసౌకర్యాన్ని భావిస్తున్నప్పటికీ, వారితో మాట్లాడేటప్పుడు మీరు నిజాయితీగా మరియు చిత్తశుద్ధితో ఉన్నందున పిల్లలు మీ ప్రేమను అనుభవించగలరు.

దాపరికం లేకుండా మాట్లాడడానికి మీరు వీటిని చేయగలరు:

  • మీ పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడే, శరీర భాగాలను వాటి సరైన పేర్లతో పిలవడం ద్వారా ప్రారంభించండి. ఇది పిల్లలకు వారి శరీరాల గురించి బోధిస్తుంది మరియు వారు ఆరోగ్యంగా ఉండడానికి మరియు సమాచారం ఇవ్వబడడానికి అవసరమైన భాషను అందిస్తుంది.

  • వారు మిమ్మల్ని ఏవైనా ప్రశ్నలు అడగవచ్చని మీ పిల్లలకు తెలియజేయండి, ఆపై వారి ప్రశ్నలు లేదా తప్పు ఒప్పుకొనుట గురించి అతిగా స్పందించకుండా లేదా అవమానించకుండా ఉండడానికి ప్రయత్నించండి. వారు మీతో మాట్లాడుతున్నారని సంబరాలు చేసుకోండి, వారికి ప్రేమ మరియు మద్దతును ఇవ్వండి మరియు వారితో సంభాషించడానికి మీ వంతు కృషి చేయండి.

  • లైంగికత కోసం రూపకాలను ఉపయోగించడం మానుకోండి. స్పష్టంగా మరియు నిజాయితీగా అందించబడిన సమాచారం పిల్లలకు అవసరం. ఉదాహరణకు, పవిత్రత యొక్క చట్టాన్ని ఉల్లంఘించడాన్ని నమిలి పడేసిన బబుల్‌‌గమ్‌తో లేదా గది చుట్టూ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి పంపే ఆహారంతో పోల్చి మరియు అందువల్ల ఇకపై అవి కోరదగినవి కాదని చేప్పే పాఠాలను కొంతమంది యువత చెప్తారు. మంచి ఉద్దేశ్యంతో ఉన్నప్పటికీ, ఈ రకమైన రూపకాలు తరచుగా లైంగికత పట్ల భయాన్ని లేదా తక్కువ లేదా కోలుకోలేని స్వీయ-విలువ భావాలను ప్రోత్సహిస్తాయి.

  • గృహ సాయంకాల పాఠాలలో లైంగికతకు సంబంధించిన అంశాలు చేర్చండి మరియు మీ పిల్లలు సిద్ధంగా ఉన్నట్లు భావించినప్పుడు వారిని బోధించనివ్వండి. అంశాలలో యుక్తవయస్సు, శరీర చిత్రం మరియు లైంగికత యొక్క సానుకూల అంశాలు ఉండవచ్చు.

  • లైంగిక భావాలు మరియు లైంగిక ప్రేరేపణలను అనుభవించడం ఏవిధంగా సాధారణమైనవో చర్చించండి. పిల్లలు ఆ భావాలు మరియు అనుభూతులపై చర్య తీసుకోవలసిన అవసరం లేదు కానీ వాటిని గుర్తుంచుకోగలరు. దీని అర్థం లైంగిక భావాలను గమనించడమే, కానీ ప్రతికూలంగా వాటిని విమర్శించడం కాదు. జాగరూకతను అభ్యసించడం వల్ల పిల్లలు వారి విలువలు మరియు లక్ష్యాలకు అనుగుణంగా మంచి ఎంపికలు చేయడంలో వారికి సహాయపడతాయని పరిశోధనలో తేలింది.

  • పిల్లలు స్వీయ-స్పర్శలో నిమగ్నమైనప్పుడు లేదా యువత హస్తప్రయోగానికి అంగీకరించినప్పుడు అసహ్యం లేదా కోపంతో ప్రతిస్పందించకుండా ప్రయత్నించండి. ఈ ప్రవర్తనలకు తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారు అనేది పిల్లలు మరియు యువత తమ గురించి మరియు తమ లైంగికత గురించి ఎలా భావిస్తున్నారో ప్రభావితం చేయబడుతుంది.

  • అనుబంధాలు మరియు లైంగికతకు సంబంధించిన ప్రమాణాల వెనుక ఉన్న కారణాలను మీ పిల్లలకు నేర్పండి. మీరు ఈ ప్రమాణాలు మరియు అవి ఎందుకు విలువైనవి అనే కారణాలను బోధిస్తున్నప్పుడు, సిగ్గు లేదా భయం లేకుండా చేయడం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి.1

వివరణ

  1. లారా ఎం. పాడిల్లా-వాకర్ మరియు మెగ్ ఓ. జాంకోవిచ్ నుండి బుల్లెట్ పాయింట్లు ఉదహరించబడ్డాయి మరియు స్వీకరించబడ్డాయి, “ఎలా, ఎప్పుడు మరియు ఎందుకు: లైంగికత గురించి మీ పిల్లలతో మాట్లాడటం,” లియాహోనా, ఆగ. 2020.