లేఖనములు
మొరోనై 4


4వ అధ్యాయము

పెద్దలు మరియు యాజకులు సంస్కారపు రొట్టెను ఏ విధముగా నిర్వహించెదరో వివరించబడినది. సుమారు క్రీ. శ. 401–421 సం.

1 వారి పెద్దలు, యాజకులు క్రీస్తు యొక్క శరీరమును మరియు రక్తమును సంఘము కొరకు నిర్వహించు విధానమిది; దానిని వారు క్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారము నిర్వహించిరి; అందువలన ఆ విధానము సత్యమైనదని మేమెరుగుదుము; మరియు పెద్ద లేదా యాజకుడు దానిని నిర్వహించిరి—

2 వారు సంఘముతోపాటుగా మోకరించి, ఈ విధముగా చెప్పుచూ క్రీసు యొక్క నామమందు తండ్రికి ప్రార్థన చేసిరి:

3 ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, ఈ రొట్టెను దానిలో పాలుపొందుచున్న వారందరి ఆత్మల కొరకు ఆశీర్వదించి, పరిశుద్ధపరచమని మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో మిమ్ములను అడుగుచున్నాము; తద్వారా మీ కుమారుని శరీరము యొక్క జ్ఞాపకార్థము వారు దానిని తిని, ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, వారు మీ కుమారుని నామమును తమపై తీసుకొనుటకు, ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు, ఆయన వారికిచ్చిన ఆయన ఆజ్ఞలను పాటించుటకు సమ్మతించుచున్నామని మీకు సాక్ష్యమిచ్చెదరు గాక, తద్వారా వారు ఎల్లప్పుడు ఆయన ఆత్మను వారితో కలిగియుండెదరు గాక. ఆమేన్.