2023 క్రొత్త నిబంధన
ఏప్రిల్ 3-9. ఈస్టరు: “ఓ మరణమా, నీ విజయమెక్కడ?”


“ఏప్రిల్ 3-9. ఈస్టరు:‘ఓ మరణమా, నీ విజయమెక్కడ?,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఏప్రిల్ 3-9. ఈస్టరు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
తోట సమాధి

ఏప్రిల్ 3-9

ఈస్టరు

“ఓ మరణమా, నీ విజయమెక్కడ?”

ఈ సారాంశములో మీరు రక్షకుని పునరుత్థానం యొక్క సాక్ష్యాలను చదువుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ నుండి మీకు వచ్చే భావాలు మరియు ప్రేరణలను వ్రాయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

రక్షకుని జీవితంలో చివరి వారంలో, ఆయన చుట్టూ ఉన్న చాలా మంది యూదులు పస్కా సంప్రదాయాలలో పాల్గొంటున్నారు. వారు భోజనం సిద్ధం చేశారు, పాటలు పాడారు మరియు ఐగుప్తీయుల బానిసత్వం నుండి ఇశ్రాయేలీయుల విడుదలను గుర్తుచేసుకోవడానికి కలిసి సమకూడారు. గొర్రె రక్తంతో తమ తలుపులపైన గుర్తువేసిన వారి పూర్వీకుల ఇళ్ళ మీదుగా నాశనం చేయు దేవదూత వెళ్ళిన కథను కుటుంబాలు విన్నారు. విడుదల యొక్క చిహ్నముతో గొప్పగా ఉన్న ఈ వేడుకలన్నిటి మధ్య, దేవుని గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు—ఆయన బాధలు, మరణం మరియు పునరుత్థానం ద్వారా—పాపం మరియు మరణం యొక్క బానిసత్వం నుండి వారిని విడిపించబోతున్నారని చాలా తక్కువ మందికి తెలుసు. అయినప్పటికీ, యేసును వాగ్దానం చేయబడిన తమ మెస్సీయగా, వారి నిత్య విమోచకుడిగా గుర్తించిన వారూ ఉన్నారు. ఆ రోజు నుండి, “క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను …; ఆయన సమాధిచేయబడెను మరియు మూడవ దినమున లేపబడెను” (1 కొరింథీయులకు 15: 3–4) అని యేసు క్రీస్తు శిష్యులు ప్రపంచమంతటా సాక్ష్యమిచ్చారు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 21–28

యేసు క్రీస్తు నన్ను పాపము మరియు మరణం నుండి విడిపిస్తారు, నా బలహీనతలలో నన్ను బలపరుస్తారు మరియు నా శ్రమలలో నన్ను ఓదారుస్తారు.

ఈ వారం రక్షకుని ప్రాయశ్చిత్తం యొక్క ఆశీర్వాదాలపై దృష్టి పెట్టడానికి ఒక మార్గం ఏమిటంటే, యేసు జీవితపు చివరి వారం గురించి చదవడంలో ప్రతిరోజూ సమయం గడపడం (సాధ్యమయ్యే ఒక పఠన పట్టిక ఇవ్వబడింది). రక్షకుని ప్రేమను అనుభవించడంలో మీకు సహాయపడే దేనిని మీరు ఈ అధ్యాయాలలో కనుగొన్నారు? పాపం, మరణం, శ్రమలు మరియు బలహీనతల నుండి మిమ్మల్ని ఆయన ఎలా విడిపిస్తారనే దాని గురించి ఈ అధ్యాయాలు మీకేమి బోధిస్తున్నాయో ధ్యానించండి. ఆయన విమోచన శక్తిపై విశ్వాసాన్ని మీరెలా సాధన చేస్తున్నారు?

Easter.ComeuntoChrist.org కూడా చూడండి.

చిత్రం
సిలువపైన క్రీస్తు

సిలువ వేయబడడం, లూయిస్ పార్కర్ చేత

మత్తయి 28:1–10; లూకా 24: 13–35; యోహాను 20:19–29 ; 1 కొరింథీయులకు 15:1–8, 55

చాలామంది సాక్షులు యేసు క్రీస్తు పునరుత్థానం గురించి సాక్ష్యమిచ్చారు.

యేసును ఎగతాళి చేయడం, అవమానించడం మరియు సిలువ వేయడం వంటివి శిష్యులు చూడడం ఎలా ఉంటుందో ఊహించుకోండి. వారు ఆయన శక్తికి సాక్షులుగా ఉన్నారు, ఆయన బోధనల సత్యాన్ని అనుభవించారు మరియు ఆయన దేవుని కుమారుడని విశ్వాసం కలిగియున్నారు. ఆయన మరణాన్ని స్వయంగా చూడడం ఆయన శిష్యులను బాధకు, గందరగోళానికి గురిచేసి ఉండవచ్చు. కానీ త్వరలోనే వారు ఆయన పునరుత్థానం యొక్క గొప్ప అద్భుతానికి సాక్షులయ్యారు.

పునరుత్థానం చెందిన రక్షకుడిని చూసిన వారి వృత్తాంతాల నుండి మీరు ఏమి నేర్చుకోగలరు? మత్తయి 28:1–10; లూకా 24:13–35; యోహాను 20:19–29; మరియు 1 కొరింథీయులకు 15:1–8, 55 లో ప్రతి వ్యక్తి అనుభవాన్ని గుర్తించండి లేదా గమనించండి. (పునరుత్థానం చెందిన క్రీస్తు యొక్క ఇతర సాక్ష్యాలు 3 నీఫై 11 ; మోర్మన్ 1:15; ఈథర్ 12: 38-39 ; సిద్ధాంతము మరియు నిబంధనలు76:19–24 ; 110:1–10 ; మరియు జోసెఫ్ స్మిత్ —చరిత్ర 1:15–17 లో కనుగొనబడగలవు.) ఈ సాక్షుల సాక్ష్యాలను గూర్చి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేది ఏమిటి? రక్షకుని పునరుత్థానం తరువాత, ఇతరులు పునరుత్థానం చెందారు మరియు చాలామందికి కనిపించారు (మత్తయి 27: 52–53; 3 నీఫై 23:9 చూడండి). రక్షకునిలో మీ విశ్వాసం మరియు పునరుత్థానం యొక్క వాగ్దానం మీరు జీవించే విధానమును ఎలా ప్రభావితం చేస్తుంది?

 .

1 పేతురు 1:3–11

యేసు క్రీస్తు నాకు నిరీక్షణను, ఆనందాన్ని ఇస్తారు.

1 పేతురు 1: 3–11 లోని ఏ పదాలు లేదా వాక్యభాగాలు యేసు క్రీస్తు కారణంగా మీకు నిరీక్షణను కలుగజేస్తాయి? మీరు ఆ నిరీక్షణను ఎప్పుడు అనుభవించారు?

పునరుత్థానము “అవయవాలను కోల్పోయిన వారికి; చూడడానికి, వినడానికి లేదా నడవడానికి సామర్థ్యాన్ని కోల్పోయిన వారికి; లేదా కనికరంలేని వ్యాధి, మానసిక అనారోగ్యం లేదా ఇతర విధాలుగా సామర్థ్యం కోల్పోయిన వారికి నిరీక్షణనిస్తుంది. ఆయన మనల్ని కనుగొంటారు. ఆయన మనల్ని పరిపూర్ణులుగా చేస్తారు. … ‘దేవుడు తానే లోకము యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయును’ [ఆల్మా 42:15], కావున … ఆయన దయతో మన బలహీనతల ప్రకారం మనకు సహాయం చేయగలరు. … మనము పశ్చాత్తాపపడి, మనం చేయగలిగినదంతా చేస్తాము. ఆయన మనలను శాశ్వతంగా ‘తన ప్రేమగల హస్తములలో’ చుట్టుముట్టును అని గెరిట్ డబ్ల్యు. గాంగ్ సాక్ష్యమిచ్చారు [2 నీఫై 1:15]” (“హల్లెలూయా, హోసన్న—సజీవుడైన యేసు క్రీస్తు: పునఃస్థాపన మరియు ఈస్టరు యొక్క ముఖ్యభాగము,” లియహోనా, మే 2020, 54).

ఆల్మా 27:28; 36:1-24; 3 నీఫై 9:11–17; మొరోనై 7:40–41 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ComeuntoChrist.org.రక్షకుని జీవితంలో చివరి వారంలోని ప్రతి రోజు ఏమి జరిగిందో కాలక్రమం మరియు వివరణను Easter.ComeuntoChrist.org కలిగియుంది. వారంలో ప్రతిరోజు, ఆ రోజు రక్షకుడు ఏమి చేశారో చూడడానికి మీ కుటుంబం ఈ వివరణలను సమీక్షించగలదు లేదా మీరు ఆయన చివరి వారం గురించి ఒక కుటుంబంగా లేఖనాల్లో చదవవచ్చు (పైన “వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు” విభాగంలో సూచించిన జాబితాను చూడండి).

కీర్తనలు మరియు పిల్లల పాటల పుస్తకము.మీకు అంతగా పరిచయంలేని వాటితో కలిపి, ఈ వారంలో రక్షకుని ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానం గురించి కలిసి పాటలు పాడడాన్ని పరిగణించండి. కుటుంబ సభ్యులకు పాటలు నేర్చుకోవడంలో సహాయపడడానికి, మీరు పదాలకు సంబంధించిన చిత్రాలను చూపవచ్చు.

యేసు క్రీస్తు” పేరుతో ఉన్న సువార్త గ్రంథాలయ సేకరణలో వీడియోలు, కళాఖండాలు మరియు సంగీతం ఉన్నాయి, ఇవి ఈస్టరు‌లో రక్షకుని పునరుత్థానాన్ని జరుపుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడతాయి.

“జీవముగల క్రీస్తు: అపొస్తులుల యొక్క సాక్ష్యము.”ఒక కుటుంబముగా “జీవముగల క్రీస్తు: అపొస్తులుల యొక్క సాక్ష్యము” (ChurchofJesusChrist.org) చదవండి. ఇతరులతో పంచుకోవడానికి ఈ సాక్ష్యము నుండి ఒక ఈస్టరు సందేశాన్ని ఎంచుకోమని ప్రతి కుటుంబ సభ్యుడిని ఆహ్వానించండి. ఉదాహరణకు, మీరు సామాజిక మాధ్యమంలో, మీ ప్రధాన ద్వారం మీద లేదా మీ ఇంటిలో ప్రదర్శించడానికి పోస్టరులను తయారు చేయవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

సాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకోండి. రోజుకు కొన్ని నిమిషాలైనా లేఖనాలను అధ్యయనం చేయడం మీ జీవితాన్ని ఆశీర్వదించగలదు. ప్రతిరోజూ అధ్యయనం చేయడానికి కట్టుబడి ఉండండి, మీ నిబద్ధతను మీరే గుర్తు చేసుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనండి మరియు అనుసరించడానికి మీ వంతు కృషి చేయండి. మీరు మరచిపోయినట్లయితే, ఆశ వదులుకోవద్దు. మళ్ళీ ప్రారంభించండి.

చిత్రం
గెత్సేమనేలో క్రీస్తు

గెత్సేమనే, ఆడమ్ అబ్రామ్ చేత