చేతి పుస్తకములు మరియు పిలుపులు
1. దేవుని ప్రణాళిక మరియు రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో మీ పాత్ర


“1. దేవుని ప్రణాళిక మరియు రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో మీ పాత్ర,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“1. రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
గృహమును నిర్మిస్తున్న పురుషులు

1.

దేవుని ప్రణాళిక మరియు రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో మీ పాత్ర

1.0

పరిచయము

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సేవ చేయడానికి మీరు పిలువబడ్డారు. మీ సేవకు ధన్యవాదాలు. మీరు నమ్మకముగా సేవ చేస్తున్నప్పుడు మీరు జీవితాలను ఆశీర్వదిస్తారు మరియు ఆనందాన్ని అనుభవిస్తారు.

ఈ చేతిపుస్తకము క్రీస్తువంటి సేవ యొక్క సూత్రాలను తెలుసుకోవడానికి మరియు మీ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. సంఘములో మీ సేవను తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క పనితో సమలేఖనం చేసినప్పుడు మీరు అత్యంత ప్రభావవంతంగా ఉంటారు.

1.1

దేవుని యొక్క సంతోష ప్రణాళిక

ఆయన దీవెనలన్నిటినీ మనం ఆస్వాదించగలిగేలా పరలోక తండ్రి సంతోష ప్రణాళికను అందించారు. “నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే” ఆయన కార్యము మరియు మహిమయైయున్నది (మోషే 1:39).

దేవుని యొక్క ప్రణాళికలో యేసు క్రీస్తే ప్రధానము. పరలోక తండ్రికి మనపై ఉన్న అపరిమితమైన ప్రేమ కారణంగా, ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా పాపం మరియు మరణం నుండి మనలను విమోచించడానికి ఆయన తన కుమారుడిని పంపారు (యోహాను 3:16 చూడండి). ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా, మనలో భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ పునరుత్థానము చెందుతారని మరియు అమర్త్యత్వాన్ని పొందుతారని యేసు క్రీస్తు నిర్ధారించారు. ఆయన ప్రాయశ్చిత్తం, మనము పాపం నుండి శుద్ధి చేయబడడాన్ని మరియు మన హృదయాలను మార్చుకోవడాన్ని కూడా సాధ్యం చేస్తుంది, తద్వారా మనం నిత్యజీవాన్ని మరియు సంపూర్ణ ఆనందాన్ని పొందగలము.

నిత్యజీవమును పొందాలంటే, మనము “క్రీస్తు నొద్దకు రావాలి మరియు ఆయనలో పరిపూర్ణులు కావాలి” (మొరోనై 10:32).

1.2

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము

మనము క్రీస్తునొద్దకు వచ్చి, ఇతరులు కూడా అదే విధంగా రావడానికి సహాయం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో మనం పాల్గొంటాము. ఈ కార్యము దేవుణ్ణి ప్రేమించడం మరియు మన పొరుగువారిని ప్రేమించడం అనే రెండు గొప్ప ఆజ్ఞల ద్వారా మార్గనిర్దేశం చేయబడింది ( మత్తయి 22:37–39 చూడండి).

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము దైవికంగా నియమించబడిన నాలుగు బాధ్యతలపై దృష్టి పెడుతుంది.

దేవుని కార్యములోని ఈ నాలుగు అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ చేతిపుస్తకము మీకు సహాయం చేస్తుంది. వాటిని నెరవేర్చడంలో మీరు మీ వంతు కృషి చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మీకు మార్గనిర్దేశం చేస్తారు (2 నీఫై 32:5 చూడండి).

1.2.1

యేసు క్రీస్తు సువార్తను జీవించడం

యేసు క్రీస్తు సువార్తను జీవించడం వీటిని కలిగి ఉంటుంది:

  • క్రీస్తునందు విశ్వాసాన్ని అభ్యసించుట, ప్రతిదినము పశ్చాత్తాపపడుట, మనం రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను పొందినప్పుడు దేవునితో నిబంధనలను చేయుట మరియు ఆ నిబంధనలను పాటించుట ద్వారా అంతము వరకు సహించుట (3.5.1 చూడండి).

  • గృహములో మరియు సంఘములో యేసు క్రీస్తు సువార్తను నేర్చుకోవడం మరియు బోధించడం.

  • ఆధ్యాత్మికంగా మరియు తాత్కాలికంగా మనకు మరియు మన కుటుంబాలకు కావలసినవి సమకూర్చుటలో స్వావలంబనగా మారడం.

1.2.2

అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం

అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం వీటిని కలిగి ఉంటుంది:

  • వ్యక్తులు, కుటుంబాలు మరియు సమాజాలకు సేవ చేయడం మరియు పరిచర్య చేయడం.

  • సంఘ సహాయంతోపాటు, అవసరతలోనున్న వారితో వనరులను పంచుకోవడం.

  • ఇతరులు స్వావలంబనగా మారడానికి సహాయం చేయడం.

1.2.3

సువార్తను స్వీకరించమని అందరినీ ఆహ్వానించడం

సువార్తను స్వీకరించమని అందరినీ ఆహ్వానించడం వీటిని కలిగి ఉంటుంది:

  • సువార్త సేవలో పాల్గొనడం మరియు సువార్తికులుగా సేవ చేయడం.

  • నిబంధన మార్గములో పురోగమించడానికి క్రొత్త మరియు తిరిగి వస్తున్న సంఘ సభ్యులకు సహాయం చేయడం.

1.2.4

నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయడం

నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయడం వీటిని కలిగి ఉంటుంది:

  • మన స్వంత దేవాలయ విధులను పొందినప్పుడు నిబంధనలను చేయడం.

  • మరణించిన మన పూర్వీకులను కనుగొనడం మరియు దేవాలయంలో వారి కోసం విధులను నిర్వహించడం, తద్వారా వారు దేవునితో నిబంధనలు చేయగలరు.

  • సాధ్యమైన చోట, దేవుణ్ణి ఆరాధించడానికి మరియు ఆయన పిల్లల కొరకు విధులను నిర్వహించడానికి క్రమం తప్పక దేవాలయానికి వెళ్ళడం.

1.3

సంఘము యొక్క ఉద్దేశ్యము

వ్యక్తులు మరియు కుటుంబాలు రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును చేయగలిగేలా యేసు క్రీస్తు తన సంఘమును స్థాపించారు (ఎఫెసీయులకు 4:11–13 చూడండి; ఈ చేతిపుస్తకములో 2.2 కూడా చూడండి). ఈ దైవిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడంలో సహాయం చేయడానికి, సంఘము మరియు సంఘ నాయకులు వీటిని అందిస్తారు:

  • యాజకత్వ అధికారము మరియు తాళపుచెవులు.

  • నిబంధనలు మరియు విధులు.

  • ప్రవచనాత్మక దిశానిర్దేశము.

  • లేఖనాలు.

  • సువార్త అభ్యాసము మరియు బోధనా మద్దతు.

  • సేవ మరియు నాయకత్వ అవకాశాలు.

  • పరిశుద్ధుల సమాజము.

1.3.1

యాజకత్వ అధికారము మరియు తాళపుచెవులు

యాజకత్వం ద్వారా, దేవుడు రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును సాధిస్తారు. భూమిపై దేవుని యొక్క కార్యమును నిర్దేశించడానికి అవసరమైన యాజకత్వ అధికారం మరియు తాళపుచెవులు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు పునరుద్ధరించబడ్డాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11–16; 112:30 చూడండి). ఈ తాళపుచెవులను నేడు సంఘ నాయకులు కలిగియున్నారు. వారు దేవుని కార్యములో సహాయం చేయడానికి ఇతరులను పిలిచి, అధికారం ఇస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:8, 65–67 చూడండి).

1.3.2

నిబంధనలు మరియు విధులు

పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో, బాప్తిస్మము వంటి రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను పొందినప్పుడు మనం నిబంధనలు చేస్తాము (యోహాను 3:5 చూడండి; ఈ చేతిపుస్తకములోని 18వ అధ్యాయం కూడా చూడండి). మనం ఎక్కువగా దేవునిలా మారడానికి మరియు ఆయన సన్నిధిలో నివసించేలా తిరిగి వెళ్ళడానికి ఈ నిబంధనలు మరియు విధులు ఆవశ్యకమైనవి (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19–22 చూడండి).

1.3.3

ప్రవచనాత్మక దిశానిర్దేశము

ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారా, దేవుడు సత్యాన్ని బయల్పరుస్తారు, ప్రేరేపిత మార్గదర్శకత్వమును మరియు హెచ్చరికలను అందిస్తారు (ఆమోసు 3:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 1:4 చూడండి). ఈ మార్గదర్శకత్వం నిత్య జీవానికి దారితీసే మార్గంలో ప్రవేశించడానికి మరియు కొనసాగడానికి మనకు సహాయపడుతుంది.

1.3.4

లేఖనాలు

ప్రభువు యొక్క ప్రవక్తలు మరియు అపొస్తలుల ఆధ్వర్యంలో, సంఘము పరిశుద్ధ లేఖనాలలో కనిపించే విధంగా దేవుని వాక్యాన్ని అందజేస్తుంది మరియు సంరక్షిస్తుంది. లేఖనాలు క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తాయి, ఆయన సువార్తను బోధిస్తాయి మరియు ఆయనపై విశ్వాసాన్ని సాధన చేయడంలో మనకు సహాయపడతాయి (జేకబ్ 7:10–11; హీలమన్‌ 15:7 చూడండి).

1.3.5

సువార్త అభ్యాసము మరియు బోధనా మద్దతు

సువార్త సత్యాలను తెలుసుకోవడానికి, కుటుంబ సభ్యులకు మరియు ఇతరులకు ఈ సత్యాలను బోధించడానికి వారి బాధ్యతలో వ్యక్తులు మరియు కుటుంబాలకు సంఘము మద్దతు ఇస్తుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:77–78, 118 చూడండి; ఈ చేతిపుస్తకములో 2.2.3 కూడా చూడండి).

1.3.6

సేవ మరియు నాయకత్వ అవకాశాలు

సంఘములో పిలుపులు మరియు నియామకాల ద్వారా, సేవ చేయడానికి మరియు నడిపించడానికి దేవుడు సభ్యులకు అవకాశాలను ఇస్తాడు. అవసరములోనున్న సభ్యుల సంరక్షణ కొరకు మరియు ఇతరులకు మానవతా సహాయాన్ని అందించడానికి సంఘము నిర్మాణాన్ని అందిస్తుంది (మోషైయ 18:27–29 చూడండి).

1.3.7

పరిశుద్ధుల సమాజము

పరిశుద్ధుల సమాజముగా, సంఘ సభ్యులు దేవుడిని ఆరాధించడానికి మరియు సంస్కారములో పాల్గొనడం ద్వారా రక్షకుని జ్ఞాపకం చేసుకోవడానికి క్రమం తప్పకుండా సమకూడుతారు(మొరోనై 6:4–6; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77 చూడండి). సభ్యులు ఒకరినొకరు సంరక్షించుకుంటారు మరియు పరిచర్య చేసుకుంటారు కూడా (ఎఫెసీయులకు 2:19 చూడండి).

1.4

దేవుని కార్యములో మీ పాత్ర

సంఘములో ఒక నాయకుడిగా, మీరు సేవ చేసేవారు రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో నిమగ్నమైయుండగా వారికి బోధించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి మీరు పిలువబడ్డారు (1.2 చూడండి). మీ పిలుపును నెరవేర్చడానికి మరియు “పూర్తి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని … బోధించడానికి” మీరు జవాబుదారులైయున్నారు (జేకబ్ 1:19). ఆయన ద్రాక్షతోటలో ప్రభువుతో కలిసి పనిచేయడం మీకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది (జేకబ్ 5:70–72 చూడండి).

దేవుని పని గురించి, మీరు చేయాలని ఆయన ఆహ్వానించే దాని గురించి మరియు ఆయన సంఘము యొక్క ఉద్దేశ్యం గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం ఆత్మలను క్రీస్తు వద్దకు తీసుకురావడంపై మీ ప్రయత్నాలను కేంద్రీకరించడంలో మీకు సహాయం చేస్తుంది.

ఈ అధ్యాయంలోని సూత్రాలను తరచుగా చూడండి. మీరు సేవ చేసే వారి జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాలను తీసుకురావడంలో మీరు ఎలా సహాయం చేయవచ్చో తెలుసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా వెదకండి. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణల ద్వారా దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు.