చేతి పుస్తకములు మరియు పిలుపులు
36. క్రొత్త విభాగములను సృష్టించడం, మార్చడం మరియు నామకరణం చేయడం


“36. క్రొత్త విభాగములను సృష్టించడం, మార్చడం మరియు నామకరణం చేయడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“36. క్రొత్త విభాగములను సృష్టించడం, మార్చడం మరియు నామకరణం చేయడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
సంస్కార కూడికలో ప్రసంగిస్తున్న వ్యక్తి

36.

క్రొత్త విభాగములను సృష్టించడం, మార్చడం మరియు నామకరణం చేయడం

36.0

పరిచయము

సంఘ సభ్యులు వారు నివసించే ప్రదేశం ఆధారంగా సమూహములకు చెందియుంటారు (మోషైయ 25:17–24 చూడండి). సరైన యాజకత్వ అధికారం క్రింద సంఘము యొక్క పనిని చేయడానికి మరియు నిర్వహించడానికి ఈ సమూహములు అవసరం.

సంఘ సమూహములలో (విభాగములు అని కూడా పిలుస్తారు) స్టేకులు, జిల్లాలు, వార్డులు మరియు శాఖలు ఉంటాయి. అవి అవసరమైనప్పుడు మాత్రమే సృష్టించబడతాయి, మార్చబడతాయి లేదా నిలిపివేయబడతాయి.

నాయకులు క్రొత్త విభాగమును సృష్టించడానికి లేదా విభాగ సరిహద్దును మార్చడానికి ప్రతిపాదించే ముందు సభ్యుల ఆధ్యాత్మిక బలాన్ని పెంచడానికి పని చేస్తారు. ఇప్పటికే ఉన్న విభాగములు తగినంత బలంగా ఉన్నప్పుడే క్రొత్త విభాగములను సృష్టించాలి.

సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడాలో మద్దతు కోసం, 1-801-240-1007కు ఫోను చేయండి. సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడా వెలుపల, ప్రాంతీయ కార్యాలయానికి ఫోను చేయండి.