చేతి పుస్తకములు మరియు పిలుపులు
12. ప్రాథమిక


“12. ప్రాథమిక,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“12. ప్రాథమిక,”ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
లేఖనాలను పట్టుకున్న కుటుంబం

12.

ప్రాథమిక

12.1

ఉద్దేశ్యము మరియు నిర్మాణము

ప్రాథమిక అనేది గృహ-కేంద్రీకృత, సంఘ-సహకారమివ్వబడిన నిర్మాణము. ఇది 18 నెలల నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లల కొరకైనది.

12.1.1

ఉద్దేశ్యము

పిల్లలకు ప్రాథమిక ఇలా సహాయం చేస్తుంది:

  • వారి పరలోక తండ్రి యొక్క ప్రేమను అనుభవించడానికి మరియు ఆయన సంతోష ప్రణాళికను గురించి తెలుసుకోవడానికి.

  • యేసు క్రీస్తు గురించి మరియు పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో ఆయన పాత్ర గురించి తెలుసుకోవడానికి.

  • యేసు క్రీస్తు సువార్తను నేర్చుకొని, జీవించడానికి.

  • పరిశుద్ధాత్మ ప్రభావాన్ని అనుభవించి, గుర్తించి, చర్య తీసుకోవడానికి.

  • పవిత్రమైన నిబంధనల కొరకు సిద్ధపడి, చేసి, పాటించడానికి.

  • రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనడానికి.

12.1.3

తరగతులు

తగినంత మంది పిల్లలు ఉన్నప్పుడు, వారి వయస్సు ఆధారంగా వారు తరగతులుగా విభజించబడతారు.

పిల్లలు సాధారణంగా‌ వారికి 12 ఏళ్లు నిండిన సంవత్సరం జనవరిలో ప్రాథమిక నుండి యువతులు లేదా పరిచారకుల సమూహములోనికి పురోగమిస్తారు.

12.1.4

పాడే సమయం

పాడే సమయము పిల్లలు పరలోక తండ్రి ప్రేమను అనుభూతి చెందడానికి మరియు ఆయన సంతోష ప్రణాళిక గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. పిల్లలు సువార్త సూత్రాల గురించి పాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ వాటి యథార్థతకు సాక్ష్యమిస్తాడు.

పిల్లలు తమ తరగతుల్లో మరియు గృహములో నేర్చుకుంటున్న సువార్త సూత్రాలను బలోపేతం చేయడానికి ప్రాథమిక అధ్యక్షత్వము మరియు సంగీత నాయకుడు ప్రతి నెల పాటలను ఎంపిక చేస్తారు.

12.1.5

నర్సరీ

నర్సరీ 18 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు పరలోక తండ్రి ప్రేమను అనుభూతి చెందడానికి మరియు ఆయన సంతోష ప్రణాళిక గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

12.2

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనడం

12.2.1

యేసు క్రీస్తు సువార్తను జీవించడం

12.2.1.2

సువార్త అభ్యాసం

ఆదివారం ప్రాథమిక సమావేశాలు. ప్రాథమిక అధ్యక్షత్వ సభ్యురాలు ప్రారంభాన్ని నిర్వహిస్తారు.

షెడ్యూల్ క్రింది విధంగా ఉంటుంది:

సమావేశంలో భాగం

సమయం

సమావేశంలో భాగం

ప్రారంభం (ప్రార్థన, లేఖనము లేదా విశ్వాస ప్రమాణము మరియు ప్రసంగము-అన్నీ పిల్లలచేత చేయబడతాయి)

సమయం

5 నిమిషాలు

సమావేశంలో భాగం

పాడే సమయం

సమయం

20 నిమిషాలు

సమావేశంలో భాగం

తరగతులకు మారడం

సమయం

5 నిమిషాలు

సమావేశంలో భాగం

తరగతులు మరియు ముగింపు ప్రార్థన

సమయం

20 నిమిషాలు

18 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం నర్సరీ 50 నిమిషాల పాటు ఉంటుంది. Behold Your Little Ones సూచించబడిన షెడ్యూల్‌ను అందిస్తుంది.

పిల్లల సంస్కార సమావేశ ప్రదర్శన. పిల్లల వార్షిక సంస్కార సమావేశ ప్రదర్శన సంవత్సరంలో చివరి కొన్ని నెలల్లో నిర్వహించబడుతుంది.

ప్రాథమిక అధ్యక్షత్వము మరియు సంగీత నాయకుడు ప్రార్థనాపూర్వకంగా ప్రదర్శనను ప్రణాళిక చేస్తారు. బిషప్రిక్కు దిశానిర్దేశం చేస్తారు. పిల్లలు పాడవచ్చు, ప్రసంగాలు ఇవ్వవచ్చు మరియు కథలు, లేఖనాలు లేదా సాక్ష్యాలను పంచుకోవచ్చు.

దేవాలయం మరియు యాజకత్వ సిద్ధపాటు సమావేశము. ప్రాథమిక అధ్యక్షత్వము ప్రతి సంవత్సరం దేవాలయం మరియు యాజకత్వ సిద్ధపాటు సమావేశమును ప్రణాళిక చేస్తారు. బిషప్రిక్కు దిశానిర్దేశం చేస్తారు. సమావేశము 10 ఏళ్ల వయస్సు గల పిల్లల కొరకైనది. తల్లిదండ్రులు ఆహ్వానించబడతారు.

12.2.1.3

సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలు

వారికి 8 సంవత్సరాలు నిండిన సంవత్సరం జనవరి నుండి పిల్లలు ప్రాథమిక ప్రోత్సాహ కార్యక్రమాలకు హాజరుకావచ్చు.

ప్రాథమిక ప్రోత్సాహ కార్యక్రమాలు ఆదివారాలు లేదా సోమవారం సాయంత్రాలు కాకుండా ఇతర సమయాల్లో నిర్వహించబడతాయి.

  • సాధ్యమైనప్పుడు ప్రాథమిక ప్రోత్సాహ కార్యక్రమాలు నెలకు రెండుసార్లు నిర్వహించబడతాయి.

  • సాధారణంగా అబ్బాయిలు మరియు అమ్మాయిలు విడివిడిగా కలుసుకుంటారు. అయినప్పటికీ, వారు కొన్ని ప్రోత్సాహ కార్యక్రమాల కోసం లేదా కొద్దిమంది పిల్లలు ఉన్న ప్రదేశాలలో కలుపబడవచ్చు.

ప్రాథమికలో అబ్బాయిలు మరియు అమ్మాయిలకు ఆదాయ వ్యయ అంచనాలు మరియు ప్రోత్సాహ కార్యక్రమాలు తగినంతగా మరియు సమానంగా ఉండేలా బిషప్రిక్కు నిర్ధారిస్తారు.

12.2.1.4

వ్యక్తిగత అభివృద్ధి

మరింతగా రక్షకుని వలె మారడానికి వారి ప్రయత్నాలలో, పిల్లలు—వారికి 8 ఏళ్ళు వచ్చినప్పుడు ప్రారంభించి—ఆధ్యాత్మికంగా, సామాజికంగా, భౌతికంగా మరియు మేధోపరంగా ఎదగడానికి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఆహ్వానించబడ్డారు (లూకా 2:52 చూడండి).

లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి మరియు నమోదు చేయడానికి వారు Personal Development: Children’s Guidebook ను ఉపయోగించవచ్చు.

12.3

వార్డు ప్రాథమిక నాయకత్వము

12.3.1

బిషప్రిక్కు

పిల్లలతో సహా భావి తరానిది బిషప్పు యొక్క ప్రధాన బాధ్యత. ప్రాథమిక పట్ల తన బాధ్యతలో సహాయం చేయడానికి బిషప్పు ఒక సలహాదారుడిని నియమించవచ్చు. బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు ప్రాథమిక అధ్యక్షురాలిని క్రమం తప్పకుండా కలుస్తారు.

బిషప్పు మరియు అతని సలహాదారులు ప్రాథమికకు క్రమం తప్పకుండా హాజరవుతారు.

12.3.2

ప్రాథమిక అధ్యక్షత్వము

వార్డు ప్రాథమిక అధ్యక్షురాలి‌గా సేవ చేయడానికి బిషప్పు ఒక స్త్రీని పిలిచి, ప్రత్యేకపరుస్తారు.

చిన్న విభాగం‌లో, ప్రాథమిక అధ్యక్షురాలు ప్రాథమికలో పిలువబడిన ఏకైక నాయకురాలు కావచ్చు. ఈ సందర్భంలో, పాఠాలు, పాడే సమయం మరియు ప్రోత్సాహ కార్యక్రమాలను నిర్వహించడానికి ఆమె తల్లిదండ్రులతో కలిసి పని చేస్తుంది. విభాగం తగినంత పెద్దదైతే, ఈ క్రమంలో అదనపు పిలుపులను పూరించవచ్చు: సలహాదారులు, సంగీత నాయకుడు, బోధకులు, మరియు నర్సరీ నాయకులు, కార్యదర్శి మరియు ప్రోత్సాహ కార్యక్రమాల నాయకులు.

నిబంధన మార్గంలో ప్రవేశించడానికి మరియు ముందుకు సాగడానికి పిల్లలను సిద్ధం చేయడంలో ప్రాథమిక అధ్యక్షత్వము తల్లిదండ్రులకు సహాయపడుతుంది.

దీనిని నెరవేర్చడానికి, వారి పిల్లలను బాప్తిస్మము మరియు నిర్ధారణ కొరకు సిద్ధం చేయడంలో తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ప్రాథమిక అధ్యక్షురాలు అధ్యక్షత్వములో ఒక సభ్యురాలిని నియమించవచ్చు. వారి పిల్లలను దేవాలయం మరియు యాజకత్వము కొరకు సిద్ధం చేయడంలో తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ప్రాథమిక అధ్యక్షురాలు అధ్యక్షత్వములో మరొక సభ్యురాలిని నియమించవచ్చు.

ప్రాథమిక అధ్యక్షురాలికి క్రింది అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆమె సలహాదారులు ఆమెకు సహాయం చేస్తారు.

  • వార్డు సలహాసభలో సేవ చేయటం.

  • ప్రాథమిక అధ్యక్షత్వ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించడం మరియు బిషప్పు లేదా ఆయన నియమించిన సలహాదారుడిని కలుసుకోవడం.

  • రికార్డులలో ఉన్న పిల్లల కోసం బాప్తిస్మపు సేవలను అడిగినప్పుడు ప్రణాళిక చేయడంలో సహాయం చేయడం (18.7.2 చూడండి).

  • ఆదివారం ప్రాథమిక సమావేశాల ప్రారంభాన్ని ప్రణాళిక చేయడం మరియు నిర్వహించడం.

  • ప్రాథమికలో ప్రతీ బిడ్డకు, బోధకులకు మరియు నాయకులకు పరిచర్య చేయడం.

  • ప్రాథమిక నాయకులు మరియు బోధకులకు వారి బాధ్యతలను బోధించడం మరియు వారి పిలుపుల గురించి వారికి దిశానిర్దేశం చేయడం ద్వారా ఆ బాధ్యతలలో వారికి మద్దతు ఇవ్వడం (Teaching in the Savior’s Way [2016], 38 చూడండి).

  • ప్రాథమిక యొక్క రికార్డులు, నివేదికలు, ఆదాయ వ్యయ అంచనాలు మరియు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడం.

12.3.4

సంగీత నాయకుడు మరియు పియానిస్ట్

సంగీత నాయకుడు మరియు పియానిస్ట్ పాడే సమయంలో పిల్లలకు యేసు క్రీస్తు సువార్తను సంగీతం ద్వారా బోధిస్తారు.

పియానిస్ట్ లేదా పియానో అందుబాటులో లేకుంటే, నాయకులు రికార్డింగులను ఉపయోగించవచ్చు.

12.3.5

బోధకులు మరియు నర్సరీ నాయకులు

ప్రాథమిక అధ్యక్షత్వము ప్రాథమిక బోధకులుగా మరియు నర్సరీ నాయకులుగా సేవ చేయడానికి పురుషులు మరియు స్త్రీలను బిషప్రిక్కుకు సిఫార్సు చేస్తారు. ఈ సభ్యులు నిర్దిష్ట వయస్సుగల పిల్లల సమూహాలకు బోధించడానికి మరియు పరిచర్య చేయడానికి పిలువబడతారు.

ప్రాథమిక బోధకులు మరియు నర్సరీ నాయకులు రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు (3–11 సంవత్సరాల వయస్సు) మరియు Behold Your Little Ones (నర్సరీ) నుండి బోధిస్తారు.

12.3.6

ప్రోత్సాహ కార్యక్రమాల నాయకులు

పిల్లలకు 8 సంవత్సరాలు నిండిన సంవత్సరం జనవరిలో ప్రారంభమయ్యే సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ప్రాథమిక ప్రోత్సాహ కార్యక్రమాల నాయకులు పిల్లలకు పరిచర్య చేస్తారు (12.2.1.3 చూడండి). సేవ మరియు ప్రోత్సాహ కార్యక్రమాలు రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యముపై దృష్టి పెడతాయి. అవి సరదాగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి.

12.5

అదనపు మార్గదర్శకాలు మరియు విధానాలు

12.5.1

పిల్లలను కాపాడుకోవడం

సంఘ కార్యక్రమాలలో పెద్దలు పిల్లలతో సంభాషిస్తున్నప్పుడు, కనీసం ఇద్దరు బాధ్యతగల పెద్దలు అక్కడ ఉండాలి.

పిల్లలతో పనిచేసే పెద్దలందరూ వారు ఆమోదించబడిన ఒక నెలలోపు తప్పనిసరిగా పిల్లలు మరియు యువత రక్షణా శిక్షణను పూర్తి చేయాలి (ProtectingChildren.ChurchofJesusChrist.org).