చేతి పుస్తకములు మరియు పిలుపులు
15. మతసంబంధ సెమినరీలు మరియు ఇన్స్టిట్యూట్‌లు


“15. మతసంబంధ సెమినరీలు మరియు ఇన్స్టిట్యూట్‌లు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“15. మతసంబంధ సెమినరీలు మరియు ఇన్స్టిట్యూట్‌లు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
తరగతిలో తన చేయి పైకెత్తుతున్న యువతి

15.

మతసంబంధ సెమినరీలు మరియు ఇన్స్టిట్యూట్‌లు

15.0

పరిచయము

యేసు క్రీస్తు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్త యందు వారి విశ్వాసాన్ని పెంచుకోవడానికి యువ జనులకు మరియు వయో జనులకు సహాయం చేయడంలో తల్లిదండ్రులకు మరియు సంఘ నాయకులకు మతసంబంధ సెమినరీలు మరియు ఇన్స్టిట్యూట్‌లు (S&I) సహకారమందిస్తాయి.

S&I కార్యక్రమాలను నిర్వహించడంలో నాయకులకు సహాయం చేయడానికి ప్రతీ స్టేకుకు ఒక S&I ప్రతినిధి నియమించబడతారు.

15.1

సెమినరీ

సెమినరీ అనేది నాలుగు సంవత్సరాల కార్యక్రమం, దీనిలో యువ జనులు లేఖనాలలో మరియు కడవరి దిన ప్రవక్తల బోధనలలో కనుగొనబడినట్లుగా యేసు క్రీస్తు సువార్తను అధ్యయనం చేస్తారు. సెమినరీ విద్యార్థులు సాధారణంగా 14–18 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటారు.

బిషప్రిక్కు, యువజన నాయకులు, సమూహము మరియు తరగతి అధ్యక్షత్వములు సెమినరీలో పూర్తిగా పాల్గొనేలా ప్రతీ యువజనుని ప్రోత్సహిస్తారు.

15.1.1

బోధకులు

సెమినరీ బోధకులు సంఘ సభ్యులై ఉండాలి, వారు ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసం కలిగి ఉండాలి మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్త గురించి సాక్ష్యం కలిగి ఉండాలి. వారు తాము బోధించే సూత్రాలను పాటించి, యువ జనులతో బాగా పనిచేయాలి. సాధ్యమైనప్పుడు, బోధకులు ప్రస్తుత దేవాలయ సిఫారసును కలిగి ఉండాలి.

స్టేకు అధ్యక్షత్వ సభ్యుడు లేదా నియమించబడిన ఉన్నత సలహాదారుడు స్టేకు సెమినరీ బోధకులు మరియు స్టేకు పర్యవేక్షకులను పిలుస్తారు, ప్రత్యేకపరుస్తారు మరియు విడుదల చేస్తారు.

బోధకులు మరియు విద్యార్థులను రక్షించడానికి, సెమినరీ తరగతి బోధించబడే భవనం లేదా గృహములో ఇద్దరు పెద్దలు ఉండాలి.

15.1.2

సెమినరీ ఐచ్ఛికాలు

విద్యార్థులు వారంలో ప్రతీ రోజు బోధకుడిని కలుసుకోగలిగినప్పుడు సెమినరీ చాలా సహాయకారిగా ఉంటుంది. అయితే, భద్రతా సమస్యలు, ప్రయాణ దూరం మరియు ఇతర కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోవచ్చు.

సంఘ నాయకులు తమ S&I ప్రతినిధితో కలిసి ఏ ఐచ్ఛికాన్ని నిర్ణయించుకోవాలో సలహా తీసుకుంటారు, ఏదైతే:

  • విద్యార్థులు సువార్త నేర్చుకుని, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉత్తమంగా సహాయం చేస్తుంది.

  • విద్యార్థులను సురక్షితంగా ఉంచుతుంది.

  • అనవసరంగా కుటుంబాలకు భారం కాకుండా ఉంటుంది.

ఆదివారం తరగతులు నిర్వహించబడకూడదు.

15.1.3

భవనాలు, పరికరాలు మరియు సామాగ్రి

సెమినరీ తరగతుల కొరకు సమావేశ మందిరాలు లేదా సభ్యుల గృహాలు అందుబాటులో ఉన్నాయని స్టేకు మరియు వార్డు నాయకులు నిర్ధారిస్తారు.

S&I ప్రతినిధి ప్రతీ తరగతి యొక్క బోధకులకు మరియు విద్యార్థులకు సామాగ్రిని అందజేస్తారు. విద్యార్థులు తమ స్వంత లేఖనాలను, అచ్చువేసినవి లేదా డిజిటల్‌వి తీసుకురావాలి.

15.1.5

యోగ్యత మరియు పట్టభద్రత

సెమినరీ విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతికి హాజరవడం, పాల్గొనడం మరియు తరగతి వెలుపల లేఖనాలను అధ్యయనం చేయడం ద్వారా మరింత ప్రభావవంతంగా నేర్చుకోగలరు మరియు వారి పరివర్తనను మరింత ఎక్కువగా చేసుకోగలరు. వారు ఈ పనులను చేస్తున్నప్పుడు, వారు ప్రతీ సంవత్సరం సెమినరీ యోగ్యతను కూడా సంపాదిస్తారు మరియు సెమినరీ నుండి పట్టభద్రులు కాగలరు.

సెమినరీ నుండి పట్టభద్రులు కావడానికి, ఒక విద్యార్థి తప్పనిసరిగా నాలుగు సంవత్సరాల యోగ్యత సంపాదించాలి మరియు బిషప్రిక్కు సభ్యుని నుండి మతపరమైన ఆమోదాన్ని పొందాలి.

15.2

ఇన్స్టిట్యూట్

ఇన్స్టిట్యూట్ వారపు సువార్త అధ్యయన తరగతులను అందిస్తుంది, అది యేసు క్రీస్తు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్తపై విశ్వాసాన్ని మరియు సాక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది. 18–30 సంవత్సరాల వయస్సు గల ఒంటరి వయో జనులందరూ పాఠశాలకు హాజరవుతున్నా, లేకపోయినా ఇన్స్టిట్యూట్ తరగతులకు హాజరయ్యేలా ప్రోత్సహించబడాలి.

15.3

సంఘ పాఠశాలలు మరియు సంఘ విద్యా వ్యవస్థ

సంఘ ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలలు, BYU–Pathway Worldwide [బివైయు-పాత్‌వే వరల్డ్‌వైడ్] మరియు ఉన్నత విద్యా సంస్థల గురించి సమాచారం కోసం CES.ChurchofJesusChrist.org చూడండి. విద్యార్థులు ఈ పాఠశాలలకు హాజరు కావడానికి మతపరమైన ఆమోదాలను పూర్తి చేయడం గురించి సమాచారం కూడా అక్కడ అందించబడింది.

అదనంగా, CES మతపరమైన అనుమతుల కార్యాలయం ద్వారా మతపరమైన ఉద్యోగ అనుమతుల గురించి సమాచారాన్ని help.ChurchofJesusChrist.org వద్ద కనుగొనవచ్చు.