చేతి పుస్తకములు మరియు పిలుపులు
17. సువార్తను బోధించడం


“17. సువార్తను బోధించడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“17. సువార్తను బోధించడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
కుమారునికి బోధిస్తున్న తల్లి

17.

సువార్తను బోధించడం

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై జనులు తమ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి సహాయపడేందుకు మనము సువార్తను బోధిస్తాము.

17.1

క్రీస్తువంటి బోధనా సూత్రాలు

సువార్త బోధించేటప్పుడు తల్లిదండ్రులు, బోధకులు మరియు నాయకులు ప్రధాన బోధకుడైన యేసు క్రీస్తు యొక్క ఉదాహరణను అనుసరిస్తారు.

నాయకులు తమ నిర్మాణాలలోని బోధకులతో క్రీస్తువంటి బోధన యొక్క క్రింది సూత్రాలను పంచుకుంటారు. ఈ సూత్రాలు Teaching in the Savior’s Way లో మరింత వివరంగా వివరించబడ్డాయి.

17.1.1

మీరు బోధించే వారిని ప్రేమించండి

రక్షకుడు చేసే ప్రతిదీ ఆయన ప్రేమ యొక్క వ్యక్తీకరణే(2 నీఫై 26:24 చూడండి).

17.1.2

ఆత్మ ద్వారా బోధించండి

బోధకులు సిద్ధపడేటప్పుడు మరియు బోధించేటప్పుడు ఆత్మ యొక్క నడిపింపును వెదుకుతారు మరియు వారు ప్రతిరోజూ ఆయన ప్రభావానికి యోగ్యులుగా జీవించడానికి ప్రయత్నిస్తారు.

17.1.3

సిద్ధాంతాన్ని బోధించండి

రక్షకుని మాదిరిని అనుసరించి, బోధకులు సువార్త యొక్క ముఖ్యమైన, రక్షణ సత్యాలపై దృష్టి పెడతారు. వారు లేఖనాలు, కడవరి దిన ప్రవక్తల బోధనలు మరియు ఆమోదించబడిన పాఠ్యాంశాలను ఉపయోగించి బోధిస్తారు.

17.1.4

శ్రద్ధగా నేర్చుకోవడాన్ని ఆహ్వానించండి

వారి స్వంతగా నేర్చుకోవడానికి బాధ్యత వహించాలని బోధకులు సభ్యులను ప్రోత్సహిస్తారు.

17.2

గృహ-కేంద్రీకృత సువార్త అభ్యాసం మరియు బోధన

సంఘ నాయకులు మరియు బోధకులు గృహ-కేంద్రీకృత సువార్త అభ్యాసం మరియు బోధనను ప్రోత్సహిస్తారు మరియు మద్దతు ఇస్తారు.

సువార్తను ఎలా అధ్యయనం చేయాలి మరియు బోధించాలి అనే దాని గురించి వారి స్వంత ప్రేరణను పొందాలని నాయకులు మరియు బోధకులు సభ్యులను ప్రోత్సహిస్తారు. లేఖనాలు మరియు సర్వసభ్య సమావేశములు వారి ప్రధాన వనరులుగా ఉండాలి.

17.3

నాయకుల యొక్క బాధ్యతలు

  • సువార్త నేర్చుకోవడం మరియు రక్షకుని విధానములో దానిని బోధించడం ద్వారా ఒక ఉదాహరణగా ఉండడం.

  • వారి నిర్మాణాలలో బోధన విశ్వాసాన్ని పెంపొందించేలా మరియు సిద్ధాంతపరంగా సరిగ్గా ఉందని నిర్ధారించుకోవడం.

  • వారి నిర్మాణాలలో బోధకులకు నిరంతర మద్దతు ఇవ్వడం.

17.4

బోధకుల సలహాసభ సమావేశాలు

బోధకుల సలహాసభ సమావేశాలలో, బోధకులు కలిసి క్రీస్తువంటి బోధనా సూత్రాల గురించి ఆలోచన చేస్తారు. వారు సువార్త అభ్యాసం మరియు బోధనను ఎలా మెరుగుపరచాలనే దాని గురించి కూడా ఆలోచన చేస్తారు. వారు Teaching in the Savior’s Wayను ఒక వనరుగా ఉపయోగిస్తారు.

త్రైమాసికంలో ఒకసారి ఆదివారం 50 నిమిషాల తరగతి సమయంలో బోధకుల సలహాసభ సమావేశాలు జరుగుతాయి.