చేతి పుస్తకములు మరియు పిలుపులు
21. పరిచర్య


“21. పరిచర్య,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“21. పరిచర్య,”ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
రాయిని పైకెత్తుతున్న పురుషులు

21.

పరిచర్య

21.0

పరిచయము

పరిచర్య అంటే రక్షకుని వలె ఇతరులకు సేవ చేయడం (మత్తయి 20:26–28 చూడండి).

తన సంఘములోని సభ్యులందరూ అలాంటి సంరక్షణను పొందాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఈ కారణంగా, యాజకత్వము కలిగియున్నవారు ప్రతి సభ్యుని ఇంటికి పరిచర్య చేసే సహోదరులుగా నియమించబడ్డారు. పరిచర్య చేసే సహోదరీలు ప్రతి వయోజన సహోదరికి నియమించబడ్డారు.

21.1

పరిచర్య చేయు సహోదరీలు మరియు సహోదరుల బాధ్యతలు

పరిచర్య చేసే సహోదరీలు మరియు సహోదరులు వారికి కేటాయించిన వ్యక్తులు మరియు కుటుంబాల కోసం ఈ క్రింది బాధ్యతలను కలిగి ఉంటారు:

  • పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై వారి విశ్వాసాన్ని బలపరచుకోవడానికి వారికి సహాయం చేయడం.

  • వారు విధులను పొందినప్పుడు దేవునితో పవిత్రమైన నిబంధనలను చేయడానికి మరియు పాటించడానికి వారికి సహాయం చేయడం.

  • అవసరాలను గుర్తించడం మరియు క్రీస్తువంటి ప్రేమ, శ్రద్ధ మరియు సేవను అందించడం.

  • ఆధ్యాత్మికంగా మరియు తాత్కాలికంగా స్వావలంబన పొందేందుకు వారికి సహాయపడడం.

21.2

పరిచర్యను నిర్వహించడం

21.2.1

నియామకాలను చేయడం

పెద్దల సమూహం మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు పరిచర్య చేసే సహోదర సహోదరీల కొరకు నియామకాలను ప్రార్థనాపూర్వకంగా పరిశీలిస్తారు. వారు సాధారణంగా ఇద్దరు సహోదరులు లేదా ఇద్దరు సహోదరీలను సహచరులుగా నియమిస్తారు. పరిచర్య సహచరులు మరియు నియామకాల కోసం వారు బిషప్పు యొక్క ఆమోదాన్ని కోరుకుంటారు.

వివాహిత జంట ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి కలిసి పరిచర్య చేయడానికి నియమించబడవచ్చు.

పరిచర్య చేసే సహోదరులు మరియు సహోదరీలు పిలువబడరు, ఆమోదించబడరు లేదా ప్రత్యేకపరచబడరు.

21.2.2

యువత కొరకు పరిచర్య నియామకాలు

ఒక యువతి సుముఖంగా మరియు సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు ఆ యువతి ఉపశమన సమాజ సోదరికి పరిచర్య సహచరిగా ఉండవచ్చు. ఆమెకు 14 ఏళ్లు నిండిన సంవత్సరంలో సేవ చేయడం ప్రారంభించవచ్చు.

ఒక యువకుడు బోధకుడు లేదా యాజకుని స్థానానికి నియమించబడినప్పుడు మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్నవారికి పరిచర్య సహచరుడిగా పనిచేస్తాడు.

21.3

పరిచర్య మౌఖికాలు

పెద్దల సమూహ అధ్యక్షుడు మరియు అతని సలహాదారులు పరిచర్య చేస్తున్న సహోదరులను మౌఖికము చేస్తారు. ఉపశమన సమాజ అధ్యక్షురాలు మరియు ఆమె సలహాదారులు పరిచర్య చేస్తున్న సహోదరీలను మౌఖికము చేస్తారు.

ఈ మౌఖికాలు కనీసం ప్రతి త్రైమాసికంలో ఒకసారి జరుగుతాయి.

వారి ఉద్దేశాలు:

  • నియమించిన వ్యక్తులు మరియు కుటుంబాల బలాలు, అవసరాలు మరియు సవాళ్ల గురించి చర్చించడం.

  • అవసరమైతే విధులను పొందడానికి సిద్ధమయ్యేందుకు వ్యక్తులకు సహాయపడే మార్గాలను చర్చించడం.

  • పెద్దల సమూహము, ఉపశమన సమాజము, వార్డు సలహాసభ మరియు ఇతరులు ఎలా సహాయం చేయవచ్చో పరిగణించడం.

  • పరిచర్య చేస్తున్న సహోదర సహోదరీలకు బోధించి, ప్రోత్సహించడం.

21.4

పరిచర్య ప్రయత్నాలను సమన్వయం చేయడం

ఉపశమన సమాజం మరియు పెద్దల సమూహ అధ్యక్షత్వములు కనీసం త్రైమాసికానికి ఒకసారి సమావేశమవుతాయి. పరిచర్య మౌఖికాలలో వారు తెలుసుకున్న వాటిని వారు సమీక్షిస్తారు (21.3 చూడండి). వారు పరిచర్య నియామకాలను కూడా సమన్వయం చేస్తారు.

కొద్దిమందే చురుకైన సభ్యు‌లు ఉన్న విభాగము‌లలో, ఉపశమన సమాజము మరియు పెద్దల సమూహ అధ్యక్షత్వములు కొంతమంది సభ్యుల కొరకు పరిచర్య చేయు సహోదరీలు మరియు పరిచర్య చేయు సహోదరులు ఇద్దరినీ నియమించకూడదని నిర్ణయించుకోవచ్చు.