చేతి పుస్తకములు మరియు పిలుపులు
24. సువార్తికుల సిఫార్సులు మరియు సేవ


“24. సువార్తికుల సిఫార్సులు మరియు సేవ,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“24. సువార్తికుల సిఫార్సులు మరియు సేవ,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు.

చిత్రం
నడుస్తున్న సువార్తికులు

24.

సువార్తికుల సిఫార్సులు మరియు సేవ

24.0

పరిచయము

ప్రాచీన కాలంలో, “సమస్త దేశాలలో ఇశ్రాయేలును సమీకరించి, తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములో వారికి బాప్తిస్మమివ్వమని” ప్రభువు నియామకాన్ని ఇచ్చారు (మత్తయి 28:19; 20వ వచనము కూడా చూడండి). ఈ చివరి రోజులలో ప్రభువు ఆ నియామకాన్ని పునరుద్ధరించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 39:11; 68:6–8; 112:28–30 చూడండి).

సువార్తికునిగా ప్రభువును సేవించడం ఒక పవిత్రమైన విశేషాధికారము. ఇది వ్యక్తికి మరియు అతను లేదా ఆమె సేవ చేసేవారికి నిత్య దీవెనలను తెస్తుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:14–16 చూడండి).

ప్రతి యోగ్యమైన, సమర్థుడైన యువకుడిని సువార్తసేవ కోసం సిద్ధపడి, సేవ చేయమని ప్రభువు అడుగుతారు.

యోగ్యమైన, సమర్థులైన యువతులు కోరుకున్నట్లయితే, సువార్తసేవ చేయడానికి ప్రభువు వారిని కూడా స్వాగతిస్తారు.

సీనియర్ సువార్తికులు కూడా అవసరం మరియు సేవ చేయడానికి సిద్ధపడమని వారు ప్రోత్సహించబడ్డారు.

24.1

సేవ చేయడానికి పిలువబడడం

సువార్తికులు ప్రభువును సూచిస్తారు మరియు సరైన అధికారం ద్వారా పిలువబడాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:11; విశ్వాస ప్రమాణాలు 1:5 చూడండి). మిషను సేవ చేయాలనే పిలుపు సాధారణంగా సంఘము యొక్క అధ్యక్షుని ద్వారా ఇవ్వబడుతుంది. సీనియర్ సేవా సువార్తికుల కోసం, స్టేకు అధ్యక్షుని ద్వారా పిలుపు ఇవ్వబడుతుంది.

24.2

సువార్తికుల నియామకాలు

సువార్తికునిగా సేవ చేయాలనే పిలుపులో ఒక నిర్దిష్ట నియామకం ఉంటుంది. ఈ నియామకాలు విస్తృతంగా మారుతూ ఉంటాయి.

24.2.1

యువ బోధనా సువార్తికులు

చాలామంది యువ సువార్తికులు గృహము నుండి దూరంగా సువార్త బోధించడానికి నియమించబడ్డారు. ఈ నియామకాలు అపొస్తలులకు బయల్పాటు ద్వారా ఇవ్వబడ్డాయి. ఈ సువార్తికులు మిషను అధ్యక్షుని ఆధ్వర్యంలో పనిచేస్తారు.

24.2.2

యువ సేవా సువార్తికులు

కొంతమంది యువ సువార్తికులు గృహములో నివసిస్తూ సంఘంలో మరియు సమాజంలో సేవ చేయడానికి నియమించబడ్డారు. ఈ నియామకాలు అపొస్తలులకు బయల్పాటు ద్వారా ఇవ్వబడ్డాయి మరియు సేవా మిషనుకు అత్యంత అనుకూలమైన పరిస్థితులను కలిగి ఉన్న అభ్యర్థులకు ఇవ్వబడతాయి (24.3.3 చూడండి).

24.2.3

సీనియర్ సువార్తికులు

సీనియర్ సువార్తికులందరూ బోధించడానికి వ్యక్తులను కనుగొని, బాప్తిస్మము కోసం సిద్ధపడడంలో వారికి సహాయం చేయమని ప్రోత్సహించబడ్డారు. సీనియర్ సువార్తికులు వీరికి మద్దతు ఇవ్వడానికి కూడా నియమించబడవచ్చు:

  • సభ్యులు, ప్రాంతీయ మరియు స్థానిక నాయకులు.

  • సంఘ విభాగములు మరియు సౌకర్యములు.

  • స్వచ్ఛంద సంస్థలు.

సీనియర్ సువార్తికులు యువ సువార్తికులు వలె అన్ని గంటలు పని చేయాలని, అదే విధమైన కార్యకలాపాలన్నీ చేయాలని లేదా అవే అంచనాలను అందుకోవాలని అడుగబడరు.

సీనియర్ సువార్తికుల కోసం నియామకాలు అపొస్తలులకు బయల్పాటు ద్వారా ఇవ్వబడ్డాయి. అభ్యర్థులు ఒక నియామకము కోసం ప్రాధాన్యతను వ్యక్తం చేయవచ్చు, కానీ ఏదైనా నియామకమును అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి.

24.2.4

సీనియర్ సేవా సువార్తికులు

వారి స్వంత వార్డు లేదా స్టేకు‌లోని పిలుపులతో పాటు, సభ్యులు సీనియర్ సేవా సువార్తికులుగా ప్రభువును సేవించవచ్చు. ఈ సువార్తికులు సంఘ విభాగాలు, సౌకర్యాలు మరియు మిషనులలో విలువైన సేవలను అందిస్తారు (24.7.1 చూడండి). వారు ఇంటి వద్ద నివసిస్తారు.

సీనియర్ సేవా సువార్తికులను స్టేకు అధ్యక్షుడు పిలుస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే వారు సేవ చేస్తారు. ప్రతీవారం వారు సేవ చేసే సమయం వారి సామర్థ్యం, వారి ప్రాంతంలో సేవా అవకాశాలు మరియు ప్రాంతీయ అధ్యక్షత్వము నుండి వచ్చే దిశానిర్దేశంపై ఆధారపడి ఉంటుంది.

24.2.5

సువార్తికుని నియామకాల సారాంశం

క్రింది పట్టిక సువార్తికుని నియామకాల రకాలను వివరిస్తుంది.

యువ బోధనా సువార్తికుడు
(24.2.1చూడండి)

యువ సేవా సువార్తికుడు
(24.2.2 చూడండి)

సీనియర్ సువార్తికుడు
(24.2.3 చూడండి)

సీనియర్ సేవా సువార్తికుడు
(24.2.4 చూడండి)

వీరి ద్వారా పిలువబడతారు

యువ బోధనా సువార్తికుడు
(24.2.1చూడండి)

సంఘాధ్యక్షుడు

యువ సేవా సువార్తికుడు
(24.2.2 చూడండి)

సంఘాధ్యక్షుడు

సీనియర్ సువార్తికుడు
(24.2.3 చూడండి)

సంఘాధ్యక్షుడు

సీనియర్ సేవా సువార్తికుడు
(24.2.4 చూడండి)

స్టేకు అధ్యక్షుడు

వీరి ద్వారా నియమించబడతారు

యువ బోధనా సువార్తికుడు
(24.2.1చూడండి)

అపొస్తలుడు

యువ సేవా సువార్తికుడు
(24.2.2 చూడండి)

అపొస్తలుడు

సీనియర్ సువార్తికుడు
(24.2.3 చూడండి)

అపొస్తలుడు

సీనియర్ సేవా సువార్తికుడు
(24.2.4 చూడండి)

స్టేకు అధ్యక్షుడు

వీరి ద్వారా ప్రత్యేకపరచబడతారు

యువ బోధనా సువార్తికుడు
(24.2.1చూడండి)

స్టేకు అధ్యక్షుడు

యువ సేవా సువార్తికుడు
(24.2.2 చూడండి)

స్టేకు అధ్యక్షుడు

సీనియర్ సువార్తికుడు
(24.2.3 చూడండి)

స్టేకు అధ్యక్షుడు

సీనియర్ సేవా సువార్తికుడు
(24.2.4 చూడండి)

స్టేకు అధ్యక్షుడు లేదా సలహాదారుడు

నివాసము

యువ బోధనా సువార్తికుడు
(24.2.1చూడండి)

గృహము నుంచి దూరంగా

యువ సేవా సువార్తికుడు
(24.2.2 చూడండి)

ఇంటి వద్ద

సీనియర్ సువార్తికుడు
(24.2.3 చూడండి)

ఇంటి నుంచి దూరంగా లేదా ఇంటి వద్ద

సీనియర్ సేవా సువార్తికుడు
(24.2.4 చూడండి)

ఇంటి వద్ద

మతపరమైన నాయకుడు

యువ బోధనా సువార్తికుడు
(24.2.1చూడండి)

మిషను అధ్యక్షుడు లేదా చారిత్రక ప్రదేశ అధ్యక్షుడు

యువ సేవా సువార్తికుడు
(24.2.2 చూడండి)

స్టేకు అధ్యక్షుడు

సీనియర్ సువార్తికుడు
(24.2.3 చూడండి)

మిషను, దేవాలయం లేదా చారిత్రక ప్రదేశ అధ్యక్షుడు; లేదా ప్రాంతీయ అధ్యక్షుడు

సీనియర్ సేవా సువార్తికుడు
(24.2.4 చూడండి)

స్టేకు అధ్యక్షుడు

వీరికి నివేదిస్తారు

యువ బోధనా సువార్తికుడు
(24.2.1చూడండి)

మిషను అధ్యక్షుడు లేదా చారిత్రక ప్రదేశ అధ్యక్షుడు

యువ సేవా సువార్తికుడు
(24.2.2 చూడండి)

సేవా మిషను నాయకుడు

సీనియర్ సువార్తికుడు
(24.2.3 చూడండి)

మిషను, దేవాలయం లేదా చారిత్రక ప్రదేశ అధ్యక్షుడు; ప్రాంతీయ అధ్యక్షుడు; సందర్శకుల కేంద్రం సంచాలకుడు; లేదా సంఘ విభాగం లేదా సౌకర్యాల నిర్వాహకుడు

సీనియర్ సేవా సువార్తికుడు
(24.2.4 చూడండి)

సేవా నియామక నిర్వాహకుడు

వయస్సు పరిమితులు

యువ బోధనా సువార్తికుడు
(24.2.1చూడండి)

18–25 (పురుషులు)
19–29 (స్త్రీలు)

యువ సేవా సువార్తికుడు
(24.2.2 చూడండి)

18–25 (పురుషులు)
19–29 (స్త్రీలు)

సీనియర్ సువార్తికుడు
(24.2.3 చూడండి)

వివాహిత లేదా ఒంటరి సోదరి అయితే 40 లేదా అంతకంటే ఎక్కువ

సీనియర్ సేవా సువార్తికుడు
(24.2.4 చూడండి)

26 లేదా అంతకంటే ఎక్కువ

24.3

మిషను సేవ చేయడానికి సిద్ధపడుట మరియు అర్హత పొందుట

కాబోయే సువార్తికులు ప్రభువుపట్ల మరియు ఆయన బిడ్డల పట్ల వారి ప్రేమ కారణంగా సువార్తసేవకు ప్రోత్సహించబడతారు. వారు మిషనరీ సిఫార్సు మౌఖిక ప్రశ్నలతో బాగా సుపరిచితమై ఉండాలి.

24.3.1

యేసు క్రీస్తుకు పరివర్తన చెందడం

కాబోయే సువార్తికులు యేసు క్రీస్తు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్తపట్ల తమ పరివర్తనను బలపరచుకోవడానికి ప్రయత్నిస్తారు.

24.3.2

యోగ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం

కాబోయే సువార్తికులు ఆత్మ యొక్క సహవాసానికి యోగ్యులుగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సమర్థవంతమైన సువార్తసేవ కోసం ఇది అవసరం (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:13–14 చూడండి).

24.3.2.1

పశ్చాత్తాపం

పశ్చాత్తాపానికి క్రీస్తునందు విశ్వాసాన్ని సాధన చేయడం, నిజమైన ఉద్దేశ్యాన్ని కలిగియుండడం మరియు ఆజ్ఞలను పాటించడం అవసరం. పాపాన్ని ఒప్పుకోవడం మరియు విడిచిపెట్టడాన్ని ఇది కలిగియుంటుంది. తీవ్రమైన పాపాలకు, పశ్చాత్తాపపడి బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడి ముందు ఒప్పుకోవడం అవసరం.

పశ్చాత్తాపపడిన వ్యక్తి యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం మరియు కృప ద్వారా క్షమించబడతాడు మరియు శుద్ధిచేయబడతాడు. ప్రభువు ఆ పాపాన్ని ఇక జ్ఞాపకం చేసుకోరు. (యెషయా 43:25; జేకబ్ 6:5; ఆల్మా 34:15–17; హీలమన్ 5:10–11; సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42–43 చూడండి. ఈ చేతిపుస్తకము‌లో 32.1 కూడా చూడండి.)

స్టేకు అధ్యక్షుడు అతని లేదా ఆమె సిఫార్సును సమర్పించే ముందు మిషనరీ అభ్యర్థి తీవ్రమైన పాపం చేసి ఉంటే కనుక దాని గురించి తప్పక పశ్చాత్తాపపడి ఉండాలి (32.6 చూడండి; 24.4.4 కూడా చూడండి). పశ్చాత్తాప ప్రక్రియలో అతను లేదా ఆమె పాప పరిహారము కొరకు క్రీస్తు యొక్క ఆత్మను పొందినట్లు నీతివంతమైన జీవనం ద్వారా చూపించడానికి తగినంత సమయం ఉంటుంది.

24.3.3

శారీరక, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం

సువార్త పరిచర్య సవాలుతో కూడుకున్నది. యువ బోధనా సువార్తికులు తప్పనిసరిగా నిబద్ధత కలిగి ఉండాలి మరియు శారీరకంగా, మానసికంగా మరియు భావోద్వేగపరంగా పూర్తి సువార్తికుని షెడ్యూల్‌లో పని చేయగలగాలి.

24.3.4

ఆర్థికాంశాలు

24.3.4.1

ఇంటి నుండి దూరంగా సేవ చేస్తున్న యువ సువార్తికులకు ఆర్థిక సహాయం

తమ సామర్థ్యానికి అనుగుణంగా సిద్ధపడిన యువ అభ్యర్థులు ఆర్థిక కారణాలవల్ల సేవలందించడంలో ఆలస్యం చేయకూడదు. ఆశించిన సహకార నిబద్ధతలను చేరుకోవడానికి ఆర్థిక సహాయం అవసరమైన వారు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుండి అందుకోవచ్చు.

అవసరమైతే, బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు వార్డు లేదా స్టేకులోని సభ్యులను వార్డు సువార్తికుని నిధికి విరాళమివ్వమని అడగవచ్చు.

స్థానిక విభాగ ఆదాయవ్యయాలను మరియు ఉపవాస కానుకల నిధులను ఉపయోగించరాదు.

నెలవారీ సహకార నిబద్ధత. సువార్తికుని కార్యక్రమ ఖర్చులను సమం చేయడంలో సహాయం చేయడానికి యువ బోధనా సువార్తికులు మరియు వారి కుటుంబాలు ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని అందజేస్తాయి.

వార్డు సువార్తికుని నిధికి విరాళాలు అందజేయబడతాయి. ప్రతి నెలా నిధులు విరాళమివ్వబడ్డాయని బిషప్పులు ధృవీకరిస్తారు. నెలవారీ మొత్తానికి మించిన నిధులను ముందుగా ఇవ్వకూడదు. సువార్తికుడు త్వరగా ఇంటికి తిరిగి వచ్చినట్లయితే, ముందుగా అందించిన నిధులు తిరిగి చెల్లించబడవు.

క్షేత్రంలో ఖర్చులు. ప్రతి నెల, యువ సువార్తికులు ఆహారం, రవాణా మరియు ఇతర జీవన ఖర్చుల కోసం మిషను నుండి నిధులను అందుకుంటారు. ఈ నిధులు పవిత్రమైనవి. సువార్తికులు వాటిని మిషను సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. వాటిని వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించకూడదు, ఆదా చేయకూడదు, కుటుంబ సభ్యులు లేదా ఇతరులకు పంపకూడదు. సువార్తికులు తమకు అవసరం లేని నిధులను మిషనుకు తిరిగి పంపుతారు.

సువార్తికులు ఇతర ఖర్చులను భరించడానికి వ్యక్తిగత నిధులను ఉపయోగిస్తారు. ఈ వ్యక్తిగత ఖర్చులు తక్కువగా ఉండాలి. (యేసు క్రీస్తు శిష్యుల కొరకు మిషనరీ ప్రమాణాలు, 4.8 చూడండి).

24.3.4.2

ఇంటి నుండి దూరంగా సేవ చేస్తున్న సీనియర్ సువార్తికులకు ఆర్థిక సహాయం

నెలవారీ సహకార నిబద్ధత. ఇంటి నుండి దూరంగా సేవ చేస్తున్న సీనియర్ సువార్తికులు ప్రతి నెలా వారి స్వంత వార్డు సువార్తికుని నిధికి విరాళాలు అందిస్తారు. ఈ విరాళాలు గృహ మరియు వాహన ఖర్చులను భరించడంలో సహాయపడతాయి.

ప్రతి నెలా నిధులు విరాళమివ్వబడ్డాయని బిషప్పులు ధృవీకరిస్తారు. నెలవారీ మొత్తానికి మించిన నిధులను ముందుగా ఇవ్వకూడదు.

అదనపు ఖర్చులు. గృహ మరియు వాహన ఖర్చులను సమం చేయడంలో సహాయపడే నెలవారీ సహకార నిబద్ధతల‌తో పాటు, సీనియర్ సువార్తికులు ఆహారంతో సహా అన్ని ఇతర ఖర్చులను పూర్తిగా భరించాలి.

24.3.4.3

ఇంటివద్ద సేవ చేస్తున్న సువార్తికులకు ఆర్థిక సహాయం

ఇంటివద్ద సేవ చేస్తున్న సువార్తికులు వారి ఆర్థిక అవసరాలన్నింటికీ బాధ్యత వహిస్తారు.

24.3.4.4

వైద్య బీమా మరియు ఖర్చులు

యువ బోధనా సువార్తికులతో సహా సువార్తికులందరూ వీలైతే తమ ప్రస్తుత వైద్య బీమాను కొనసాగించాలని గట్టిగా ప్రోత్సహించబడతారు.

ఇంటివద్ద సేవ చేస్తున్న సువార్తికులు తప్పనిసరిగా వారి స్వంత వైద్య మరియు ఇతర బీమా పరిమితులను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి నుండి దూరంగా సేవ చేస్తున్న సీనియర్ సువార్తికులు కూడా ఈ పరిమితులను ఏర్పాటు చేసుకోవాలి. వారి స్వదేశం వెలుపల సేవ చేసే సీనియర్ సువార్తికులు Senior Service Medical Plan ద్వారా బీమాను పొందగలరు.

24.3.5

సువార్తికులను సిద్ధం చేయడంలో కుటుంబ సభ్యులు మరియు నాయకుల పాత్ర

కుటుంబ సభ్యులు, బిషప్పు‌లు మరియు ఇతర నాయకులు సువార్త సేవ చేయడానికి యువతను సిద్ధం చేయడంలో సహాయం చేస్తారు.

కుటుంబ సభ్యులు మరియు నాయకులు మిషనరీ అభ్యర్థులందరినీ ఇవి అధ్యయనం చేయమని ప్రోత్సహిస్తారు:

  • మోర్మన్‌ గ్రంథము మరియు ఇతర లేఖనములు.

  • Preach My Gospel [నా సువార్తను ప్రకటించండి].

  • Safeguards for Using Technology [సాంకేతికతను ఉపయోగించడం కోసం జాగ్రత్తలు].

కుటుంబ సభ్యులు మరియు నాయకులు సువార్తికుని ప్రమాణాలను అనుసరించడానికి అభ్యర్థులందరికీ సహాయం చేస్తారు. వారు అభ్యర్థులను వారి సంభావ్య నియామకానికి సంబంధించిన సువార్తికుని ప్రమాణాల చేతిపుస్తకమును అధ్యయనం చేయమని ప్రోత్సహిస్తారు:

  • యువ బోధనా సువార్తికుల కోసం: Missionary Standards for Disciples of Jesus Christ

24.4

సువార్తికులను సిఫార్సు చేయడం

24.4.1

ఆరోగ్య అంచనాలు

అభ్యర్థులందరికీ వైద్య నిపుణులు వారి ఆరోగ్య సంసిద్ధతను అంచనా వేయవలసి ఉంటుంది.

24.4.2

మౌఖికాలు మరియు సిఫార్సు ఫారమ్‌లు

బిషప్పు మరియు స్టేకు అధ్యక్షుడు ప్రతి అభ్యర్థితో క్షుణ్ణంగా, ఆధ్యాత్మికంగా శోధించే మరియు ఉద్ధరించే మౌఖికాలను నిర్వహిస్తారు. వారు సువార్తికుని సిఫార్సు మౌఖిక ప్రశ్నలను ఉపయోగిస్తారు.

బిషప్పు మరియు స్టేకు అధ్యక్షుడు కూడా సువార్తికుని యోగ్యత మరియు ఆరోగ్య సంసిద్ధత యొక్క ప్రమాణాల గురించి సమాచారాన్ని Missionary Online Recommendation System లో సమీక్షిస్తారు. బిషప్పు మరియు స్టేకు అధ్యక్షుడు ఎటువంటి అర్హత ప్రమాణాలను జోడించరు. అలాగే వారు మౌఖిక ప్రశ్నలను మార్చరు.

బిషప్పు మరియు స్టేకు అధ్యక్షుడు ఒక అభ్యర్థి యొక్క యోగ్యతా ప్రమాణాలు లేదా అతని లేదా ఆమె ఆరోగ్య సంసిద్ధత గురించి ఆందోళన కలిగి ఉంటే, వారు ఒకరితో ఒకరు మరియు ఆ వ్యక్తితో చర్చిస్తారు. యువ అభ్యర్థి అనుమతితో, వారు అతని లేదా ఆమె తల్లిదండ్రులతో కూడా చర్చించవచ్చు. ఒక వ్యక్తి తీవ్రమైన పాపం గురించి పశ్చాత్తాపం చెందే వరకు బిషప్పు మరియు స్టేకు అధ్యక్షుడు సిఫార్సును సమర్పించరు (24.3.2.1 చూడండి). వ్యక్తి యొక్క శారీరక, మానసిక లేదా భావోద్వేగ ఆరోగ్యంపై ఆధారపడి, వారు సేవా సువార్తికునిగా నియమించబడే అవకాశాన్ని చర్చించవచ్చు.

బిషప్పు మరియు స్టేకు అధ్యక్షుడు అందుబాటులో లేనప్పుడు అత్యవసర సందర్భాల్లో, అతను ఈ మౌఖికాలను నిర్వహించడానికి తన సలహాదారుల్లో ఒకరికి అధికారం ఇవ్వవచ్చు.

జిల్లాల్లో, మిషను అధ్యక్షుడు లేదా నియమించబడిన సలహాదారుడు మిషనరీ అభ్యర్థులను మౌఖికం చేసి సిఫార్సు చేస్తారు. జిల్లా అధ్యక్షులు ఈ మౌఖికాలు నిర్వహించరు.

24.4.4

పూర్తి-కాల సువార్తికులుగా సేవ చేయలేని వారు

కొన్నిసార్లు సేవ చేయాలనుకునే సభ్యుడు పూర్తి-కాల సువార్తికునిగా పిలువబడకపోవచ్చు. ఇది ఆరోగ్య సవాళ్ళు, యోగ్యతా ప్రమాణాలు, చట్టపరమైన సమస్యలు లేదా ఇతర పరిస్థితుల వల్ల కావచ్చు. స్టేకు అధ్యక్షుడు అతన్ని లేదా ఆమెను పూర్తి-కాల సువార్త సేవ నుండి తొలగించవచ్చు.

24.5

మిషను పిలుపు అందుకున్న తర్వాత

క్రొత్తగా పిలువబడే సువార్తికులు తమ సువార్తసేవ ప్రారంభించే ముందు మోర్మన్‌ గ్రంథమును చదవమని లేదా మళ్ళీ చదవమని ప్రోత్సహించబడతారు. “మీరు మిమ్ములను, మీ తలంపులను, మీ మాటలను, మీ క్రియలను కనిపెట్టుకొనియుండుడి” అని రాజైన బెంజమిన్ చెప్పిన సలహాను వారు అనుసరిస్తారు (మోషైయ 4:30).

24.5.1

దేవాలయ వరము మరియు దేవాలయ సేవ

క్రొత్తగా పిలువబడే సువార్తికులు దేవాలయ వరము విధి పొందకపోతే, సాధ్యమైన చోట సువార్త సేవను ప్రారంభించే ముందు వారు ఆ విధులను పొందాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 43:15–16; 105:33 చూడండి). వారి పరిస్థితులకు తగినట్లయితే ఇందులో సేవా సువార్తికులు కూడా ఉంటారు.

క్రొత్తగా పిలువబడే వరము పొందిన సువార్తికులు వారు సువార్త సేవను సముచితంగా ప్రారంభించే ముందు దేవాలయ విధి నిర్వాహకులుగా పని చేయవచ్చు (25.5 చూడండి).

24.5.2

సంస్కార సమావేశాలు

బిషప్రిక్కు క్రొత్తగా పిలువబడే సువార్తికులను వారి సువార్తసేవను ప్రారంభించే ముందు సంస్కార సమావేశంలో మాట్లాడమని ఆహ్వానిస్తారు. ఇది సాధారణ సంస్కార సమావేశం. సంస్కారము మరియు రక్షకునిపై దృష్టి పెట్టాలి.

24.5.3

సువార్తికులను ప్రత్యేకపరచడం

స్వంత స్టేకు అధ్యక్షుడు అతని లేదా ఆమె సువార్తసేవ ప్రారంభ తేదీకి వీలైనంత దగ్గరలో ప్రతి సువార్తికుని ప్రత్యేకపరుస్తారు. అత్యవసర సందర్భాల్లో, స్టేకు అధ్యక్షుడు అందుబాటులో లేనప్పుడు, సువార్తికులను ప్రత్యేకపరచడానికి అతను తన సలహాదారుల్లో ఒకరికి అధికారం ఇవ్వవచ్చు.

మిషను అధ్యక్షుడు లేదా అతని సలహాదారుల్లో ఒకరు తన మిషనులోని జిల్లాల నుండి పిలువబడిన సువార్తికులను ప్రత్యేకపరుస్తారు. జిల్లా అధ్యక్షుడు సువార్తికులను ప్రత్యేకపరచరు.

ఇంటి నుండి దూరంగా సేవ చేసే ఒక సహోదరుడు సువార్తికునిగా ప్రత్యేకపరచబడే ముందు తప్పనిసరిగా మెల్కీసెదెకు యాజకత్వాన్ని పొంది ఉండాలి. సేవా సువార్తికునిగా సేవ చేసే సహోదరుడు తన పరిస్థితులకు తగినట్లయితే మెల్కీసెదెకు యాజకత్వాన్ని కలిగి ఉండాలి.

24.6

ఇంటి నుండి దూరంగా సేవ చేయడం

24.6.2

క్షేత్రంలో

24.6.2.5

ఆర్థికంగా లేదా పాఠశాల విద్య లేదా వలసలతో ఇతరులకు మద్దతు ఇవ్వడానికి అభ్యర్థనలు

సువార్తికులు మరియు వారి కుటుంబాలు పాఠశాల విద్యకు ఆర్థిక సహాయంతో సహా సువార్తికులు సేవ చేస్తున్న చోట నివసించే వారికి ఆర్థిక సహాయాన్ని అందించకూడదు. అలాగే సువార్తికులు మరియు వారి కుటుంబాలు ఇతర దేశాలకు వలస వెళ్ళాలనుకునే వ్యక్తులకు బాధ్యత వహించకూడదు (38.8.19చూడండి).

24.6.2.8

సభ్యత్వ రికార్డులు మరియు దశమభాగము

ఒక సువార్తికుని స్వంత వార్డు సభ్యత్వ రికార్డును కలిగి ఉంటుంది. స్వంత వార్డు అతని లేదా ఆమె దశమభాగ స్థితిని కూడా నమోదు చేస్తుంది. సువార్తికులు మిషను నుండి స్వీకరించే సహాయ నిధులపై దశమభాగము చెల్లించరు. అయితే, వారికి ఏదైనా వ్యక్తిగత ఆదాయం ఉంటే దానిపై దశమభాగము చెల్లిస్తారు.

24.6.3

మిషను నుండి ఇంటికి తిరిగి రావడం

24.6.3.1

అసలైన కాలపట్టిక ప్రకారం ఇంటికి తిరిగి రావడం

సువార్తికులు మరియు వారి కుటుంబ సభ్యులు వ్యక్తిగత సౌలభ్యం కోసం ముందస్తు విడుదలలు లేదా సేవా పొడిగింపులను అభ్యర్థించకూడదు.

యువ సువార్తికులు వారి సువార్తసేవ నుండి నేరుగా ఇంటికి ప్రయాణించాలి. సువార్తికునితో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో కనీసం ఒకరు ఉన్నట్లయితే మాత్రమే ఏదైనా ఇతర ప్రయాణం ఆమోదించబడుతుంది.

సువార్తికులు తమ స్టేకు అధ్యక్షుడికి నివేదించే వరకు విడుదల చేయబడరు. వారు అప్పటి వరకు సువార్తికుని ప్రమాణాలను అనుసరిస్తారు.

24.6.3.2

ముందుగా ఇంటికి తిరిగి రావడం

కొంతమంది సువార్తికులు ఆరోగ్యం, యోగ్యత లేదా ఇతర కారణాల వల్ల ముందుగానే విడుదల చేయబడతారు. తిరిగి వచ్చిన ఈ సువార్తికులకు బిషప్పులు మరియు స్టేకు అధ్యక్షులు ప్రత్యేక మద్దతునిస్తారు. వీలైతే ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి లేదా సేవకు తిరిగి రావడానికి నాయకులు వారికి సహాయం చేస్తారు.

24.7

సేవా సువార్తికులు

24.7.1

సేవా సువార్తికుల కోసం అవకాశాలను గుర్తించడం

సేవ చేయడానికి స్థానిక అవకాశాలను గుర్తించడానికి బిషప్పు, స్టేకు అధ్యక్షుడు మరియు సేవా సువార్తికులు కలసి చర్చిస్తారు. యువ సేవా సువార్తికుల కోసం, సేవా మిషను నాయకుడు మరియు సువార్తికుని తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చర్చలో పాల్గొంటారు.

24.8

సువార్త సేవ తర్వాత

24.8.2

సువార్తికుని విడుదల మౌఖికము

స్టేకు అధ్యక్షుడు సువార్తికులను విడుదల చేస్తాడు మరియు విడుదల మౌఖికమును నిర్వహిస్తాడు. జిల్లాల్లో, సాధారణంగా మిషను అధ్యక్షుడు లేదా నియమించబడిన సలహాదారుడు సువార్తికులను విడుదల చేస్తారు.

ఈ మౌఖికము కోసం క్రింది మార్గదర్శకాలు సహాయకరంగా ఉండవచ్చు.

  • యేసు క్రీస్తు యొక్క జీవితకాల శిష్యుడిగా కొనసాగడానికి వారిని ప్రోత్సహించండి.

  • సువార్తికునిగా వారు వృద్ధి చేసుకున్న మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని వారికి సలహా ఇవ్వండి.

  • యువ సువార్తికుల కొరకు విద్య మరియు ఉపాధితో సహా, భవిష్యత్తు కోసం ఆలోచించమని మరియు సిద్ధపడమని వారిని ప్రోత్సహించండి.

  • ఎల్లప్పుడూ దేవాలయ సిఫారసుకు తగినట్లుగా జీవించమని వారిని ప్రోత్సహించండి.

24.8.4

పిలుపులు

ఇటీవల విడుదలైన సువార్తికులకు నాయకులు వెంటనే పరిచర్య నియామకాలు మరియు పిలుపులు ఇస్తారు. ఇది తగినవిధంగా దేవాలయ విధి నిర్వాహకులుగా పరిగణించబడడాన్ని కలిపియుంది (25.5 చూడండి).

24.9

మిషనరీ సిఫార్సులు మరియు సేవ కొరకు వనరులు

24.9.2

వెబ్‌సైట్‌లు