చేతి పుస్తకములు మరియు పిలుపులు
35. సమావేశ మందిరముల సంరక్షణ మరియు ఉపయోగం


“35. సమావేశ మందిరముల సంరక్షణ మరియు ఉపయోగం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“35. సమావేశ మందిరముల సంరక్షణ మరియు ఉపయోగం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
కిటికీలు కడుగుతున్న మరియు శుభ్రపరుస్తున్న జనులు

35.

సమావేశ మందిరముల సంరక్షణ మరియు ఉపయోగం

35.1

ఉద్దేశ్యము

సంఘము సమావేశ మందిరములను అందజేస్తుంది, తద్వారా ప్రవేశించే వారందరూ:

35.2

పాత్రలు మరియు బాధ్యతలు

35.2.2

సంఘ సౌకర్యాల నిర్వాహకుడు

సంఘ ఉద్యోగిత సౌకర్యాల నిర్వాహకుడు సమావేశ మందిరములను నిర్వహించడానికి ప్రతి స్టేకుకు సహాయం చేస్తాడు. అతను లేదా ఆమె పెద్ద మరమ్మతులు, లోతైన శుభ్రత మరియు సాధారణ భవన నిర్వహణను ఏర్పాటు చేస్తారు.

అవసరమైనప్పుడు, భవనాన్ని ఎలా శుభ్రం చేయాలి మరియు ఇతర స్థానిక పనులను ఎలా నిర్వహించాలి అనే దానిపై స్టేకు మరియు వార్డు భవన ప్రతినిధులకు సూచనలివ్వడంలో సౌకర్యాల నిర్వాహకుడు సహాయం చేస్తాడు. అతను లేదా ఆమె సూచనలు, సామానులు మరియు పరికరాలను అందజేస్తారు.

అతను లేదా ఆమె బిషప్రిక్కులతో కలసి భవనాల ఖర్చులను కూడా సమీక్షించవచ్చు.

35.2.7

బిషప్రిక్కు

బిషప్రిక్కు (లేదా వార్డు భవన ప్రతినిధి) సభ్యులకు భవనాన్ని ఎలా ఉపయోగించాలో, ఎలా శ్రద్ధ వహించాలో మరియు ఎలా భద్రపరచాలో బోధిస్తారు. బిషప్రిక్కు వార్డు నాయకులకు భవనం తాళాలు కూడా పంపిణీ చేస్తారు.

భవనంలో మరియు మైదానంలో ప్రోత్సాహ కార్యక్రమాలు సురక్షితంగా నిర్వహించబడుతున్నాయని వారు నిర్ధారిస్తారు (20.7 చూడండి).

నిర్వహణ మరియు కార్యాచరణ అవసరాల గురించి సంఘ సౌకర్యాల నిర్వాహకుడితో వారు సంభాషిస్తారు. వారు సౌకర్యాల నిర్వాహకుడితో కలిసి సంబంధిత ఖర్చులను కూడా సమీక్షించవచ్చు.

35.2.9

వార్డు భవన ప్రతినిధి

వార్డు భవన ప్రతినిధిని పిలవాలో లేదో బిషప్రిక్కు నిర్ణయిస్తారు. వారు ఈ పిలుపును ఇవ్వాలని నిర్ణయించుకుంటే, బిషప్రిక్కు వయోజన పురుషుడు లేదా స్త్రీని పిలవవచ్చు. వార్డు భవన ప్రతినిధి పిలువబడనట్లయితే, బిషప్పు ఈ బాధ్యతను తన సలహాదారులలో ఒకరికి, వార్డు గుమాస్తా లేదా వార్డు సహాయక గుమాస్తా లేదా కార్యనిర్వాహక కార్యదర్శికి అప్పగించవచ్చు.

వార్డు భవన ప్రతినిధి భవనాన్ని శుభ్రం చేయడానికి మరియు నిర్వహించడానికి సభ్యులను మరియు స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేస్తారు. అందుబాటులో ఉన్న సామాగ్రి మరియు పరికరాలతో ప్రతి పనిని ఎలా చేయాలో అతను లేదా ఆమె వారికి బోధిస్తారు.

35.3

సమావేశ మందిరములను అందించడం

స్థానిక అవసరాలు మరియు పరిస్థితుల ఆధారంగా సమావేశమందిరములు పరిమాణం మరియు నమూనాలో మారుతూ ఉంటాయి. సమావేశమందిరము అనేది సంఘము-నిర్మించిన లేదా కొనుగోలు చేసిన స్థలం, సభ్యుని ఇల్లు, స్థానిక పాఠశాల లేదా సామాజిక భవనం, అద్దెకు తీసుకున్న స్థలం లేదా ఆమోదించబడిన మరొక ఎంపిక కావచ్చు.

ప్రాంతీయ మరియు స్థానిక నాయకులు ఇప్పటికే ఉన్న సమావేశమందిరములను పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు అదనపు స్థలాన్ని సిఫార్సు చేయడంలో వివేకంతో వ్యవహరిస్తారు.

35.4

సమావేశ మందిరములను నిర్వహించడం

35.4.1

సమావేశ మందిరములను శుభ్రపరచడం మరియు నిర్వహించడం

ప్రతి భవనాన్ని శుభ్రంగా మరియు మంచి స్థితిలో ఉంచడానికి యువతతో సహా స్థానిక నాయకులు మరియు సభ్యులు బాధ్యత వహించాలి.

శుభ్రపరచడానికి సమయపట్టిక సభ్యులపై భారం కాకూడదు. ఉదాహరణకు, భవనానికి వెళ్ళడం సవాలుగా ఉన్నట్లయితే, సభ్యులు భవనం వద్ద ఉన్నప్పుడు వారపు కార్యకలాపాలలో భాగంగా శుభ్రం చేయవచ్చు.

35.4.2

మరమ్మతులను అభ్యర్థించడం

వార్డు మరియు స్టేకు సలహాసభ సభ్యులు భవన మరమ్మతుల అవసరాలను నివేదించవచ్చు. ఇది Facility Issue Reporting (FIR) [సౌకర్య సమస్య నివేదిక] సాధనాన్ని ఉపయోగించడం ద్వారా చేయబడవచ్చు.

35.4.5

భద్రత మరియు రక్షణ

నాయకులు మరియు సభ్యులు తప్పక:

  • సురక్షితమైన ప్రవేశం మరియు నిష్క్రమణ కోసం హాలు, మెట్లు, నిష్క్రమణలు మరియు వినియోగ గదులను శుభ్రంగా ఉంచాలి.

  • భవనాలలో ప్రమాదకరమైన లేదా మండే పదార్థాలను ఉపయోగించరాదు లేదా నిల్వ చేయరాదు.

  • భవనము మూసివేయు విధానాలను ఏర్పాటు చేసి, అనుసరించాలి.

  • దొంగిలించబడకుండా సంఘ యాజమాన్యంలోని పరికరాలను సురక్షితంగా ఉంచాలి.

  • నీరు, విద్యుత్తు మరియు గ్యాస్ లేదా ఇంధనం వంటి వినియోగాలను ఎలా ఆపివేయాలో తెలుసుకోవాలి.

అవసరమైతే, సౌకర్యాల నిర్వాహకుడు అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి మరియు వినియోగాలను ఆపివేయడానికి స్థానాలను చూపించే పటమును అందించవచ్చు. భద్రత గురించి మరింత సమాచారం “సమావేశమందిరములను నిర్వహించడం” (Meetinghouse Facilities Guide) లోని “భద్రత మరియు మూసివేయు విధానాలలో” అందుబాటులో ఉంది. 20.7 చూడండి.

35.5

సంఘ ఆస్తులను ఉపయోగించే విధానాలు

35.5.1

కళాకృతి

సమావేశమందిరములు యేసు క్రీస్తు పట్ల గౌరవప్రదమైన వైఖరిని ప్రతిబింబించాలి మరియు ఆయనపై సభ్యుల విశ్వాసానికి సాక్ష్యమివ్వాలి. ఈ కేంద్ర విశ్వాసాన్ని చూపించడంలో సహాయం చేయడానికి యేసు క్రీస్తును చిత్రీకరించే కళను సమావేశమందిర ముఖద్వార ప్రాంతాల్లో ఉంచాలి.

35.5.2

అనుమతించబడని భవన ఉపయోగాలు

35.5.2.1

వాణిజ్య ఉపయోగాలు

సంఘ ఆస్తిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఉదాహరణకు, ఇది ఏ రకమైన వ్యాపారానికి మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడకూడదు. అటువంటి ఉపయోగం సంఘ ఆస్తుల ప్రయోజనాలకు అనుగుణంగా లేదు. అది సంఘ ఆస్తిపై పన్ను మినహాయింపును అనుమతించే స్థానిక లేదా జాతీయ చట్టాలతో కూడా విభేదించవచ్చు.

సదస్సులు, పాఠాలు (వ్యక్తిగత పియానో లేదా ఆర్గాన్ సూచనలు మినహా; 19.7.2 చూడండి), వ్యాయామ తరగతులు మరియు ఇతర ప్రోత్సాహకార్యక్రమాలలో పాల్గొనేవారిని నియమించేవారు, వినియోగదారులను లేదా ఖాతాదారులను అభ్యర్థించేవారు లేదా ఫీజు చెల్లించే ఆతిథ్య వక్తలు లేదా అధ్యాపకులు ఆమోదించబడరు.

35.5.2.2

రాజకీయ ప్రయోజనాలు

సంఘ ఆస్తులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. రాజకీయ సమావేశాలు లేదా ప్రచారాలను నిర్వహించడం వీటిలో ఉన్నాయి. సంఘము రాజకీయంగా తటస్థంగా ఉంది (38.8.30 చూడండి).

35.5.2.3

ఇతర ఉపయోగాలు

అనుమతించబడని సంఘ ఆస్తి యొక్క ఇతర ఉపయోగాలు:

  • సంఘము చేత నిర్వహించబడని క్రీడా సంబంధ అభ్యాసా‌లు లేదా ఇతర కార్యములను నిర్వహించడం. సామాజిక గాయక బృందాలు మరియు పౌర వివాహాలు మినహాయింపులు కావచ్చు (పౌర వివాహాల గురించి 38.3.4 చూడండి).

  • రాత్రిపూట ఆశ్రయాన్ని అనుమతించడం (అత్యవసర పరిస్థితుల్లో మినహా; 35.5.4 చూడండి).

  • రాత్రిపూట నిద్రపోవడాన్ని కలిపియున్న శిబిరాలు లేదా ఇతర ప్రోత్సాహకార్యక్రమాలు.

క్రింది ఉపయోగాలు సాధారణంగా ఆమోదించబడవు. మినహాయింపు అవసరమని భావిస్తే స్థానిక నాయకులు సౌకర్యాల నిర్వాహకుడిని సంప్రదిస్తారు.

  • సంఘ భవనాలు మరియు ఆస్తులను అద్దెకు ఇవ్వడం లేదా లీజుకు ఇవ్వడం

  • రాజకీయ ఓటరు నమోదు కోసం లేదా పోలింగ్ స్థలాలుగా ఆస్తులను ఉపయోగించడం; సహేతుకమైన ప్రత్యామ్నాయం లేనప్పుడు మరియు ఈ సంఘటన సంఘము యొక్క హోదా లేదా తటస్థ స్థితికి హాని కలిగించనప్పుడు, ప్రభుత్వ అధికారుల అభ్యర్థన మేరకు మినహాయింపు ఇవ్వవచ్చు (38.8.30 చూడండి)

35.5.4

అత్యవసరాలు

అత్యవసర సమయంలో, వార్డు మరియు స్టేకు సమావేశాలను నిర్వహించాలా వద్దా అని స్టేకు అధ్యక్షుడు నిర్ణయిస్తారు. అతను భవనాలు మరియు సంఘ ఆస్తులను విపత్తు-ఉపశమన ఏజెన్సీలు మరియు అనుబంధ ప్రయత్నాల కోసం ఉపయోగించడాన్ని కూడా అనుమతించవచ్చు.

35.5.10

సంస్కార కూడిక సమయంలో ఫోటోగ్రాఫ్‌లు మరియు వీడియో రికార్డింగు‌లు

సంస్కార కూడికలు పవిత్రమైనవి. ఈ కారణంగా, సంస్కార కూడికలలో ఫోటోలు తీయడం లేదా రికార్డు చేయడం అనుమతించబడదు.

సంస్కార కూడికలు మరియు ఇతర సమావేశాలను ప్రసారం చేయడం గురించిన సమాచారం కోసం, 29.7 చూడండి.