చేతి పుస్తకములు మరియు పిలుపులు
37 ప్రత్యేకమైన స్టేకులు, వార్డులు మరియు శాఖలు


“37. ప్రత్యేకమైన స్టేకులు, వార్డులు మరియు శాఖలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“37. ప్రత్యేకమైన స్టేకులు, వార్డులు మరియు శాఖలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
బయట తింటున్న వ్యక్తులు

37.

ప్రత్యేకమైన స్టేకులు, వార్డులు మరియు శాఖలు

37.0

పరిచయము

ఈ అధ్యాయంలో వివరించిన విధంగా సభ్యులకు సేవ చేయడానికి ప్రత్యేకమైన స్టేకులు, వార్డులు మరియు శాఖలు సృష్టించాలని ఒక స్టేకు అధ్యక్షుడు ప్రతిపాదించవచ్చు.

37.1

భాషా వార్డులు మరియు శాఖలు

స్టేకు అధ్యక్షుడు (1) స్థానిక భాష మాట్లాడని వారు లేదా (2) సంకేత భాషను ఉపయోగించే స్టేకు సభ్యుల కోసం భాషా వార్డులు లేదా శాఖలు రూపొందించాలని ప్రతిపాదించవచ్చు.

37.7

స్టేకులు, మిషనులు మరియు ప్రాంతాలలో సమూహాలు

సమూహములు అంటే బిషప్పు, శాఖాధ్యక్షుడు లేదా మిషను అధ్యక్షుడు పర్యవేక్షించే సభ్యుల యొక్క చిన్న అధీకృత సమావేశాలు. స్టేకు లేదా మిషను అధ్యక్షుడు ఈ క్రింది పరిస్థితులలో సమూహాన్ని సృష్టించమని సిఫారసు చేయవచ్చు:

  • ఒక వార్డు లేదా శాఖతో కలవడానికి దాని సంభావ్య సభ్యులకు ప్రయాణం కష్టతరమైనప్పుడు.

  • తక్కువ సంఖ్యలో సభ్యులు వార్డు లేదా శాఖలోని వారి కంటే భిన్నమైన భాష మాట్లాడుతున్నప్పుడు.

  • సైన్యంలోని సభ్యులకు సమూహంలో ఉండటం ద్వారా ఉత్తమంగా సేవలందించగలిగినప్పుడు.

ఒక సమూహంలో కనీసం ఇద్దరు సభ్యులు ఉండాలి. ఒకరు అహరోను యాజకత్వమునందు యోగ్యుడైన యాజకుడై ఉండాలి లేదా మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్న యోగ్యుడైయుండాలి.

స్టేకులలో, సమూహాన్ని నిర్వహించడానికి మరియు పర్యవేక్షించడానికి స్టేకు అధ్యక్షుడు ఒక బిషప్పును లేదా శాఖాధ్యక్షుడిని నియమిస్తాడు. మిషనులలో, మిషను అధ్యక్షుడు దానిని నిర్వహించడానికి మరియు పర్యవేక్షించడానికి ఒక శాఖాధ్యక్షుడిని నియమిస్తాడు.

స్టేకు అధ్యక్షుడు, మిషను అధ్యక్షుడు, బిషప్పు లేదా శాఖాధ్యక్షుడు ఒక సమూహ నాయకుడిని పిలిచి, అతనిని ప్రత్యేకపరుస్తారు. సమూహ నాయకుడు సమూహ సమావేశాలను ఏర్పాటు చేస్తాడు మరియు నిర్వహిస్తాడు, ఇందులో సంస్కారమును నిర్వహించడం ఉంటుంది.

సమూహ నాయకుడు యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉండడు మరియు అతనికి ఈ అధికారములు లేవు:

  • దశమభాగాలు మరియు అర్పణలను స్వీకరించడం.

  • తీవ్రమైన పాపం గురించి సభ్యులకు ఉపదేశమివ్వడం.

  • అనధికారిక లేదా అధికారిక సభ్యత్వ పరిమితులను ఇవ్వడం.

  • యాజకత్వ తాళపుచెవులు అవసరమయ్యే ఇతర విధులను నిర్వహించడం.

సాధారణంగా, సమూహాలు ప్రాథమిక విభాగ కార్యక్రమమును ఉపయోగిస్తాయి.

సమూహ సభ్యుల సభ్యత్వ రికార్డులు సమూహాన్ని పర్యవేక్షించే వార్డు లేదా శాఖలో ఉంచబడతాయి.

సంఘ ప్రధాన కార్యాలయం సమూహాలకు విభాగ సంఖ్యను కేటాయించదు.