లేఖనములు
ఎనిమిదిమంది సాక్షుల సాక్ష్యము


ఎనిమిదిమంది సాక్షుల సాక్ష్యము

ఈ గ్రంథము ఎవరి దగ్గరికి వచ్చునో అట్టి సమస్త జనములకు, వంశములకు, భాషలకు మరియు ప్రజలకు ఇది తెలియును గాక: ఈ గ్రంథము యొక్క అనువాదకర్త అయిన జోసెఫ్‌ స్మిత్‌ జూనియర్‌, చెప్పబడిన పలకలను మాకు చూపించెను, అవి బంగారముతో చేయబడినట్లుండెను; స్మిత్ అనబడు వ్యక్తి అనువదించిన పుటలన్నింటిని మేము మా స్వహస్తములతో ముట్టుకొనియున్నాము. మరియు ప్రాచీనమైనవిగా అగుపిస్తూ వింతైన పనితనముతో వాటిపై గల చెక్కడములను కూడా మేము చూచితిమి. స్మిత్‌ అనబడు వ్యక్తి వాటిని మాకు చూపించెనని, మేము వాటిని పట్టుకొని చూచియుంటిమి గనుక మేము చెప్పియుండిన పలకలను ఆ స్మిత్‌ కలిగియున్నాడని నిశ్చయముగా మేమెరుగుదుమని గంభీరమైన మాటలతో సాక్ష్యమిచ్చుచున్నాము. లోకమునకు మేము చూచినదాని సాక్ష్యార్థమై, మేము మా పేర్లను లోకమునకిచ్చుచున్నాము. మరియు మేము అబద్ధమాడుటలేదు, దేవుడే దానికి సాక్షి.

క్రిస్టియన్‌ విట్మర్‌

జేకబ్ విట్మర్‌

పీటర్‌ విట్మర్‌ జూనియర్‌

జాన్‌ విట్మర్‌

హైరమ్ పేజ్

జోసెఫ్‌ స్మిత్‌ సీనియర్‌

హైరమ్ స్మిత్‌

శామ్యుల్ హెచ్‌. స్మిత్‌