చేతి పుస్తకములు మరియు పిలుపులు
13. ఆదివారపు బడి


“13. ఆదివారపు బడి,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“13. ఆదివారపు బడి,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న కుటుంబం

13.

ఆదివారపు బడి

13.1

ఉద్దేశ్యము

ఆదివారపు బడి నాయకులు, బోధకులు మరియు తరగతులు:

  • “పరలోక రాజ్యపు సిద్ధాంతమును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:77) బోధించడం ద్వారా పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని బలపరచడం.

  • గృహ-కేంద్రీకృత మరియు సంఘ-సహకార సువార్త అభ్యాసానికి మరియు బోధనకు మద్దతు ఇవ్వడం.

  • రక్షకుని విధానములో బోధించడానికి సభ్యులకు సహాయం చేయడం.

13.2

వార్డు ఆదివారపు బడి నాయకత్వము

13.2.1

బిషప్రిక్కు

ఆదివారపు బడిని బిషప్రిక్కు పర్యవేక్షిస్తారు. సాధారణంగా బిషప్పు తన మార్గదర్శకత్వంలో ఈ బాధ్యతను నెరవేర్చడానికి తన సలహాదారులలో ఒకరిని నియమిస్తారు.

13.2.2

ఆదివారపు బడి అధ్యక్షుడు

13.2.2.1

ఆదివారపు బడి అధ్యక్షుడిని పిలవడం

బిషప్పు మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్న ఒకరిని వార్డు ఆదివారపు బడి అధ్యక్షునిగా పిలిచి, ప్రత్యేకపరుస్తారు. సలహాదారులు అవసరమైతే మరియు ఈ స్థానాల్లో సేవ చేయడానికి తగినంత మంది పురుషులు ఉంటే, ఆదివారపు బడి అధ్యక్షుడు ఒకరు లేదా ఇద్దరు సలహాదారులను సిఫార్సు చేయవచ్చు.

13.2.2.2

బాధ్యతలు

  • వార్డు సలహాసభలో సేవ చేయడం.

  • గృహములో మరియు సంఘములో సువార్త అభ్యాసాన్ని మరియు బోధనను మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలను పర్యవేక్షించడం.

  • ఆదివారపు బడి బోధకులుగా సేవ చేయడానికి పెద్దలను బిషప్రిక్కుకు సిఫార్సు చేయడం.

  • ఆదివారపు బడి బోధకులకు మద్దతు, ప్రోత్సాహము మరియు సూచనలివ్వడం.

  • బిషప్పు చేత మార్గనిర్దేశం చేయబడినట్లుగా బోధకుల సలహాసభ సమావేశాలకు నాయకత్వం వహించడం (Teaching in the Savior’s Way, 3 చూడండి).

13.2.3

ఆదివారపు బడి బోధకులు

బోధించడానికి సిద్ధం కావడానికి, ఆదివారపు బడి బోధకులు లేఖనాలను, రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు మరియు రండి, నన్ను అనుసరించండి—ఆదివారపు బడి కొరకు ఉపయోగిస్తారు.

13.3

ఆదివారపు బడి తరగతులు

ఆదివారపు బడి తరగతులు నెలలో మొదటి మరియు మూడవ ఆదివారాలలో జరుగుతాయి.

బిషప్రిక్కు అనుమతితో, ఆదివారపు బడి అధ్యక్షుడు పెద్దలు మరియు యువజనుల కోసం తరగతులను నిర్వహిస్తారు.

ప్రతీ యువజన తరగతిలో కనీసం ఇద్దరు బాధ్యతగల పెద్దలు ఉండాలి.

యువజనులతో పనిచేసే పెద్దలందరూ ఆమోదించబడిన ఒక నెలలోపు తప్పనిసరిగా పిల్లలు మరియు యువత భద్రతా శిక్షణను పూర్తి చేయాలి (ProtectingChildren.ChurchofJesusChrist.org).

13.4

వార్డులో అభ్యాసాన్ని మరియు బోధనను మెరుగుపరచడం

వార్డు నాయకులు తమ నిర్మాణాల్లో అభ్యాసాన్ని మరియు బోధనను మెరుగుపరచడానికి బాధ్యత వహిస్తారు. అవసరమైతే వారు వార్డు ఆదివారపు బడి అధ్యక్షుడిని సహాయం కోసం అడగవచ్చు.

13.5

గృహములో అభ్యాసాన్ని మరియు బోధనను మెరుగుపరచడం

తమ పిల్లలకు సువార్తను బోధించే బాధ్యత తల్లిదండ్రులదే. బోధకులుగా వారు మెరుగుపడడానికి సహాయం చేయమని ఆదివారపు బడి అధ్యక్షుడిని వారు అడగవచ్చు.