చేతి పుస్తకములు మరియు పిలుపులు
31 సభ్యులతో మౌఖికాలు మరియు ఇతర సమావేశాలు


“31. సభ్యులతో మౌఖికాలు మరియు ఇతర సమావేశాలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“31. సభ్యులతో మౌఖికాలు మరియు ఇతర సమావేశాలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
కరచాలనం చేస్తున్న పురుషులు

31.

మౌఖికాలు మరియు ఇతర సమావేశాలు

31.0

పరిచయము

యేసు క్రీస్తు తరచుగా ఇతరులకు ఒక్కొక్కరికి పరిచర్య చేసారు (ఉదాహరణకు, యోహాను 4:5–26; 3 నీఫై 17:21 చూడండి). ఆయన దేవుని యొక్క ప్రతీ బిడ్డను ప్రేమిస్తారు. ఆయన వారికి వ్యక్తిగతంగా సహాయం చేస్తారు.

ఈ అధ్యాయం వ్యక్తిగతంగా సభ్యులతో కలిసే అవకాశం ఉన్న నాయకులందరికీ సహాయపడుతుంది.

31.1

మార్గదర్శక సూత్రాలు

31.1.1

ఆధ్యాత్మికంగా సిద్ధపడండి

ప్రార్థన, లేఖన అధ్యయనం మరియు నీతియుక్తమైన జీవనం ద్వారా మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా సిద్ధం చేసుకోండి. పరిశుద్ధాత్మ యొక్క గుసగుసలను వినండి.

31.1.2

దేవుని ప్రేమను అనుభూతి చెందడానికి సభ్యునికి సహాయం చేయండి

సభ్యులు మీ వద్దకు మౌఖికం కోసం లేదా వ్యక్తిగత సవాలుతో సహాయం కోసం వచ్చినప్పుడు, తరచుగా వారికి అత్యంత అవసరమైనది పరలోక తండ్రి వారిని ప్రేమిస్తున్నారని తెలుసుకోవడం.

లేఖనాలు మరియు కడవరి దిన ప్రవక్తల మాటలు ఆత్మను ఆహ్వానిస్తాయి మరియు స్వచ్ఛమైన సిద్ధాంతాన్ని బోధిస్తాయి. ప్రేరేపించడానికి మరియు ప్రోత్సహించడానికి వాటిని ఉపయోగించండి, ఖండించడానికి, బలవంతం చేయడానికి లేదా భయాన్ని కలిగించడానికి కాదు (లూకా 9:56 చూడండి).

31.1.3

రక్షకుని శక్తిపై ఆధారపడేలా సభ్యునికి సహాయం చేయండి

ఆయన వైపు తిరిగేలా సభ్యులను ప్రోత్సహించండి. బలపరచడానికి, ఓదార్పునివ్వడానికి మరియు విమోచించడానికి ఆయన శక్తిని పొందేందుకు వారికి సహాయం చేయండి.

31.1.4

సౌకర్యంగా మరియు సురక్షితంగా భావించడానికి సభ్యునికి సహాయం చేయండి

సభ్యునికి ఎల్లప్పుడూ మౌఖికము లేదా సమావేశ సమయంలో ఎవరైనా తోడు ఉండే అవకాశం ఇవ్వండి. వ్యతిరేక లింగానికి చెందిన వారిని, పిల్లలను లేదా యౌవనులను కలిసినప్పుడు, తల్లిదండ్రులు లేదా మరొక పెద్దవారు ఉండేలా నిర్ధారించుకోండి. మీరు కలిసే సభ్యుని ప్రాధాన్యతలను బట్టి అతను లేదా ఆమె సమావేశములో చేరవచ్చు లేదా గది వెలుపల వేచి ఉండవచ్చు.

సభ్యుడు అనుమతి ఇస్తే తప్ప—మీ జీవిత భాగస్వామి లేదా ఇతర సంఘ నాయకులతో సహా—ఎవరితోనూ రహస్య సమాచారాన్ని పంచుకోవద్దు.

31.1.5

ప్రేరేపిత ప్రశ్నలు అడగండి మరియు జాగ్రత్తగా వినండి

సభ్యునితో సమావేశమైనప్పుడు, అతని లేదా ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే ప్రశ్నలను అడగండి.

సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు, శ్రద్ధగా మరియు జాగ్రత్తగా వినండి.

31.1.6

స్వావలంబనను ప్రోత్సహించండి

సభ్యుల పట్ల మీకున్న ప్రేమ కారణంగా, మీరు వారి సమస్యలకు వెంటనే పరిష్కారాలను అందించాలనుకోవచ్చు. అయినప్పటికీ, వారి స్వంత పరిష్కారాలను కనుగొనడంలో మరియు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడడం ద్వారా మీరు వారిని మరింత ఆశీర్వదిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 9:8 చూడండి).

31.1.7

పశ్చాత్తాపం చెందడానికి చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వండి

తీవ్రమైన పాపాలను పరిష్కరించడంలో ఒక వ్యక్తికి బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు మాత్రమే సహాయం చేయగలరు. వీటిలో కొన్ని 32.6లో జాబితా చేయబడ్డాయి. సభ్యుడు ఈ పాపాలలో ఏదైనా చేసినట్లయితే, అతను లేదా ఆమె వెంటనే బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడిని కలవాలి.

31.1.8

హింసపట్ల తగిన విధంగా ప్రతిస్పందించండి

హింసను ఏ రూపంలోనూ సహించలేము. హింస యొక్క నివేదికలను తీవ్రంగా పరిగణించండి. ఎవరైనా హింసకు గురైనట్లు మీకు తెలిస్తే, హింసను పౌర అధికారులకు నివేదించండి మరియు బిషప్పు‌తో చర్చించండి. హింసను నివేదించడం మరియు ప్రతిస్పందించడం కోసం మార్గదర్శకాలు 38.6.2లో అందించబడ్డాయి.

31.2

మౌఖికాలు

31.2.1

మౌఖికాల యొక్క ఉద్దేశాలు

సాధారణంగా, సంఘ నాయకులు ఈ విషయాలను నిర్ధారించడానికి సభ్యులను మౌఖికం చేస్తారు:

  • విధిని పొందడానికి లేదా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారా.

  • సంఘములో ఒక స్థానానికి పిలువబడవచ్చా.

31.2.2

మౌఖికాల రకాలు

మౌఖికాన్ని ఎవరు నిర్వహించగలరు

మౌఖికం యొక్క ఉద్దేశము

మౌఖికాన్ని ఎవరు నిర్వహించగలరు

బిషప్పు మాత్రమే

మౌఖికం యొక్క ఉద్దేశము

  • అతని లేదా ఆమె స్వంత వరము పొందుతున్న లేదా జీవిత భాగస్వామితో ముద్రవేయబడుతున్న సభ్యునికి దేవాలయ సిఫారసు జారీ చేయడం (26.3.1 చూడండి).

  • క్రొత్తగా పరివర్తన చెందిన వ్యక్తికి దేవాలయ సిఫారసును జారీ చేయడం (26.4.2 చూడండి).

  • క్రొత్తగా పరివర్తన చెందిన పురుషుడిని అహరోను యాజకత్వములో ఒక స్థానానికి నియమించడం.

  • ఒక యువకుడిని లేదా పురుషుని యాజకుని కార్యాలయానికి నియమించడం (18.10.2 చూడండి).

  • ఒక వ్యక్తిని పెద్ద లేదా ప్రధాన యాజకుడిగా నియమించమని సిఫార్సు చేయడం (31.2.6 చూడండి). ఈ మౌఖికాన్ని నిర్వహించడానికి స్టేకు అధ్యక్షత్వము నుండి అనుమతి అవసరం.

  • పూర్తి-కాల సువార్తికునిగా సేవ చేయడానికి ఒక సభ్యుడిని సిఫార్సు చేయడం (24.4.2 చూడండి).

  • వార్డు నిర్మాణ అధ్యక్షునిగా పనిచేయడానికి ఒక సభ్యుడిని పిలవడం.

  • యాజకుల సమూహములో సహాయకుడిగా పనిచేయడానికి ఒక యాజకుడిని పిలవడం.

  • తీవ్రమైన పాపం గురించి పశ్చాత్తాపం చెందడానికి ఒక సభ్యునికి సహాయం చేయడం (32వ అధ్యాయము చూడండి).

  • అందుబాటులో ఉన్నచోట, Perpetual Education Fund loan [శాశ్వత విద్యా నిధి రుణాన్ని] పొందడానికి ఒక సభ్యుడిని ఆమోదించడం.

  • దశమభాగ చెల్లింపుదారునిగా అతని లేదా ఆమె స్థితిని ప్రకటించడానికి ఒక సభ్యుని అనుమతించడం (34.3.1.2 చూడండి).

  • ఉపవాస కానుక నిధుల వినియోగానికి అధికారం ఇవ్వడం (22.6.1 చూడండి).

మౌఖికాన్ని ఎవరు నిర్వహించగలరు

బిషప్పు లేదా అతను నియమించిన సలహాదారుడు

మౌఖికం యొక్క ఉద్దేశము

  • దేవాలయ సిఫారసును పునరుద్ధరించడం (26.3.1 చూడండి).

  • ప్రాతినిధ్య బాప్తిస్మములు మరియు నిర్ధారణలలో పాల్గొనడానికి దేవాలయ సిఫారసు ఇవ్వడం (26.4.3 చూడండి).

  • తల్లిదండ్రులతో ముద్రవేయబడుటకు లేదా తల్లిదండ్రులతో తోబుట్టువులు ముద్రవేయబడడాన్ని చూసేందుకు దేవాలయ సిఫారసు ఇవ్వడం (26.4.4 చూడండి).

  • 30.8లో సూచించిన విధంగా వార్డు పిలుపులో సేవ చేయడానికి ఒక సభ్యుడిని పిలవడం.

  • రికార్డులలో సభ్యుడైన లేదా సంఘములో సభ్యులైన తల్లిదండ్రులను లేదా సంరక్షకుడిని కలిగి ఉన్న 8 ఏళ్ల బాలుడి బాప్తిస్మము మరియు నిర్ధారణకు అధికారం ఇవ్వడం (31.2.3.1 చూడండి).

  • పరిచారకుడు లేదా బోధకుని స్థానానికి ఒక యువకుడిని నియమించడానికి అధికారం ఇవ్వడం (18.10.2 చూడండి).

  • గోత్రజనకుని దీవెన సిఫారసును జారీ చేయడం (18.17 చూడండి).

  • యాజకత్వము కలిగియున్న ఒకరికి దేవాలయ సిఫారసు లేకపోయినా, మరొక వార్డులో యాజకత్వ విధిని నిర్వహించడానికి అతనికి అధికారం ఇవ్వడం. (Recommend to Perform an Ordinance form [ఒక విధిని నిర్వహించడానికి సిఫారసు ఫారం] చూడండి).

31.2.3

బాప్తిస్మము మరియు నిర్ధారణ మౌఖికాలు

31.2.3.1

రికార్డులలో సభ్యులుగా ఉన్న పిల్లలు

తన వార్డులో రికార్డులలో ఉన్న 8 ఏళ్ల వయస్సున్న సభ్యులకు బాప్తిస్మము ఇవ్వడానికి బిషప్పు యాజకత్వ తాళపుచెవులు కలిగి ఉన్నారు. ఈ కారణంగా, అతను లేదా నియమించబడిన సలహాదారుడు బాప్తిస్మము కోసం క్రింది వ్యక్తులను మౌఖికం చేస్తారు:

  • రికార్డులలో సభ్యులుగా ఉన్న 8 ఏళ్ల పిల్లలు.

  • 8 ఏళ్ల వయస్సు ఉండి, రికార్డుల‌లో సభ్యులుగా లేనప్పటికీ, సభ్యులైన తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కలిగి ఉన్న పిల్లలు.

  • మేధోపరమైన వైకల్యాల కారణంగా బాప్తిస్మము ఆలస్యం అయిన 9 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల రికార్డులలోని సభ్యులు.

మౌఖికములో, బిషప్రిక్కు సభ్యుడు బాప్తిస్మము యొక్క ఉద్దేశాలను పిల్లవాడు అర్థం చేసుకున్నాడని నిర్ధారిస్తారు (2 నీఫై 31:5–20 చూడండి). పిల్లవాడు బాప్తిస్మపు నిబంధనను అర్థం చేసుకున్నాడని మరియు దాని ప్రకారం జీవించడానికి కట్టుబడి ఉన్నాడని కూడా అతను నిర్ధారిస్తాడు (మోషైయ 18:8–10 చూడండి). అతను నిర్దిష్ట ప్రశ్నల జాబితాను ఉపయోగించాల్సిన అవసరం లేదు. “చిన్న పిల్లలకు ఎట్టి పశ్చాత్తాపము అవసరము లేదు,” కాబట్టి ఇది యోగ్యతను నిర్ణయించడానికి చేసే మౌఖికము కాదు (మొరోనై 8:11).

31.2.3.2

పరివర్తన చెందినవారు

పరివర్తన చెందినవారికి బాప్తిస్మము ఇవ్వడానికి మిషను అధ్యక్షుడు యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్నారు. ఈ కారణంగా, పూర్తి-కాల సువార్తికులు వీరిని మౌఖికం చేస్తారు:

  • ఎన్నడూ బాప్తిస్మము మరియు నిర్ధారణ పొందని 9 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు. మేధోపరమైన వైకల్యాలు ఉన్నవారికి మినహాయింపు కోసం 31.2.3.1 చూడండి.

  • సంఘములో సభ్యులు కాని తల్లిదండ్రులను కలిగియున్న 8 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పిల్లలు.

  • వారితోపాటు బాప్తిస్మము మరియు నిర్ధారణ పొందుతున్న తల్లిదండ్రులను కలిగియున్న 8 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు.

31.2.4

అహరోను యాజకత్వములో ఒక స్థానానికి నియామకము కొరకు మౌఖికాలు

మరింత సమాచారం కోసం, 18.10.2 చూడండి.

31.2.5

దేవాలయ సిఫారసు మౌఖికాలు

దేవాలయం ప్రభువు యొక్క మందిరము. దేవాలయంలోకి ప్రవేశించడం మరియు అక్కడ విధులలో పాల్గొనడం ఒక పవిత్రమైన విశేషాధికారము. యాజకత్వ నాయకులచే నిర్ణయించబడినట్లుగా, ఆధ్యాత్మికంగా సిద్ధపడి, ప్రభువు యొక్క ప్రమాణాల ప్రకారం జీవించడానికి కృషి చేసే వారికి ఈ విశేషాధికారము ప్రత్యేకించబడింది.

ఈ నిర్ణయం తీసుకోవడానికి, యాజకత్వ నాయకులు LCR లోని ప్రశ్నలను ఉపయోగించి సభ్యుడిని మౌఖికం చేస్తారు (26.3 లోని మార్గదర్శకాలను కూడా చూడండి).

31.2.6

మెల్కీసెదెకు యాజకత్వములో ఒక స్థానానికి నియామకము కొరకు మౌఖికాలు

మెల్కీసెదెకు యాజకత్వాన్ని అనుగ్రహించడానికి స్టేకు అధ్యక్షుడు యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్నారు. అతను ఎల్ఢర్ మరియు ప్రధాన యాజకుని స్థానాలకు నియమించడానికి కూడా తాళపుచెవులను కలిగి ఉన్నారు.

స్టేకు అధ్యక్షత్వ ఆమోదంతో, బిషప్పు Melchizedek Priesthood Ordination Record [మెల్కీసెదెకు యాజకత్వ నియామక రికార్డు]‌లో ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించి సభ్యుడిని మౌఖికం చేస్తారు.

31.3

సభ్యులను కలవడానికి నాయకులకు గల ఇతర అవకాశాలు

  • సభ్యులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు లేదా బరువైన వ్యక్తిగత సమస్యలున్నప్పుడు సంఘ నాయకు‌డిని కలుసుకోమని వారు అడుగబడవచ్చు.

  • బిషప్పు లేదా అతను నియమించిన వ్యక్తి తాత్కాలిక అవసరాలు ఉన్న సభ్యులను కలుస్తారు (22.6 చూడండి).

  • బిషప్రిక్కులో ఒక సభ్యుడు ప్రతి 11 ఏళ్ల బిడ్డను అతను లేదా ఆమె ప్రాథమిక నుండి పరిచారకుల సమూహము లేదా యువతుల తరగతికి వెళ్లినప్పుడు కలుస్తారు.

31.3.1

యౌవనులను కలుసుకోవడం

బిషప్పు లేదా అతని సలహాదారుల్లో ఒకరు ప్రతి యౌవనునితో సంవత్సరానికి రెండుసార్లు కలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ సమావేశాలలో కనీసం ఒక్కటైనా బిషప్పు‌తో ఉండాలి. యౌవనునికి 16 ఏళ్లు వచ్చిన సంవత్సరం నుండి, వీలైతే సంవత్సరంలోని రెండు సమావేశాలు బిషప్పు‌తో ఉండాలి.

యువతుల అధ్యక్షురాలికి కూడా విడివిడిగా యువతులకు పరిచర్య చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా (లేదా మరొక పెద్ద వయస్కునితోపాటు) యువతులను కలవడం ద్వారా ఆమె దీన్ని చేయగలదు.

31.3.1.2

చర్చించవలసిన అంశాలు

యౌవనులతో సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించడం మరియు యౌవనులు వారిని అనుసరించడంలో సహాయపడటం. ఈ సమావేశాలు ఉద్ధరించే ఆధ్యాత్మిక అనుభవాలుగా ఉండాలి.

31.3.2

ఒంటరి వయో జనులను కలుసుకోవడం

బిషప్పు తన వార్డులోని ఒంటరి వయో జనుల ఆధ్యాత్మిక పురోగతికి అధిక ప్రాధాన్యతనిస్తారు. అతను లేదా నియమించబడిన సలహాదారుడు ప్రతి ఒంటరి వయో జనునితో కనీసం సంవత్సరానికి ఒకసారి కలుస్తారు.

31.3.3

వారి పిలుపులు మరియు బాధ్యతల గురించి చర్చించడానికి సభ్యులను కలుసుకోవడం

వారి పిలుపుల గురించి వారికి నివేదించే సభ్యులతో స్టేకు అధ్యక్షత్వములు, బిషప్రిక్కులు మరియు ఇతర నాయకులు వ్యక్తిగతంగా సమావేశమవుతారు.

నాయకుడు సభ్యుని సేవకు కృతజ్ఞతలు తెలుపుతాడు మరియు ప్రోత్సాహాన్ని అందిస్తాడు.

31.3.6

వృత్తిపరమైన సలహా మరియు చికిత్స

సంఘ నాయకులు వృత్తిపరమైన సలహాదారులుగా ఉండడానికి లేదా చికిత్స అందించడానికి పిలువబడరు. యేసు క్రీస్తు యొక్క బలపరిచే, ఓదార్పునిచ్చే, విమోచించే శక్తిపై దృష్టి పెడుతూ వారు ఇచ్చే సహాయం ఆధ్యాత్మికమైనది. ఈ ముఖ్యమైన మరియు ప్రేరేపిత సహాయంతో పాటు, కొంతమంది సభ్యులు వృత్తిపరమైన సలహా అందుబాటులో ఉన్నచోట దాని నుండి ప్రయోజనం పొందవచ్చు.

31.4

వర్చువల్‌గా సభ్యులను కలుసుకోవడం

సాధారణంగా, నాయకులు మౌఖికాల కోసం మరియు ఆధ్యాత్మిక సహాయాన్ని, పరిచర్యను అందించడం కోసం వ్యక్తిగతంగా సభ్యులను కలుసుకుంటారు. అయితే, దానికి మినహాయింపుగా, వ్యక్తిగతంగా కలవడం వీలుకానప్పుడు వారు వర్చువల్‌గా కలుసుకోవచ్చు.