చేతి పుస్తకములు మరియు పిలుపులు
32. పశ్చాత్తాపము మరియు సంఘ సభ్యత్వ సభ‌లు


“32. పశ్చాత్తాపము మరియు సంఘ సభ్యత్వ సభ‌లు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“32. పశ్చాత్తాపము మరియు సంఘ సభ్యత్వ సభ‌లు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
మాట్లాడుతున్న పురుషులు

32.

పశ్చాత్తాపము మరియు సంఘ సభ్యత్వ సభ‌లు

32.0

పరిచయం

చాలావరకు పశ్చాత్తాపము ఒక వ్యక్తి, దేవుడు మరియు ఆ వ్యక్తి యొక్క పాపాలచే ప్రభావితమైన వారి మధ్య జరుగుతుంది. అయితే, కొన్నిసార్లు బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు సంఘ సభ్యులు పశ్చాత్తాపపడేందుకు చేసే ప్రయత్నాల్లో వారికి సహాయం చేయాల్సి ఉంటుంది.

పశ్చాత్తాపపడేందుకు సభ్యులకు సహాయం చేస్తున్నప్పుడు, బిషప్పులు మరియు స్టేకు అధ్యక్షులు ప్రేమగా మరియు శ్రద్ధగా ఉంటారు. వారు రక్షకుని మాదిరిని అనుసరిస్తారు, ఆయన వ్యక్తులను ఉద్ధరించారు, పాపం నుండి వైదొలగడంలో మరియు దేవుని వైపు తిరగడంలో వారికి సహాయం చేసారు (మత్తయి 9:10–13; యోహాను 8:3–11 చూడండి).

32.1

పశ్చాత్తాపము మరియు క్షమాపణ

ఆయన కనికరము యొక్క ప్రణాళికను తీసుకురావడానికి, పరలోక తండ్రి తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును మన పాపాలకు ప్రాయశ్చిత్తము చేయడానికి పంపారు (ఆల్మా 42:15 చూడండి). మన పాపములకు ధర్మశాస్త్రము కోరే శిక్షను యేసు అనుభవించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:15–19 చూడండి; ఆల్మా 42:24–25 కూడా చూడండి). ఈ త్యాగం ద్వారా, తండ్రీ మరియు కుమారులిద్దరూ మనపై తమ అనంతమైన ప్రేమను చూపించారు (యోహాను 3:16 చూడండి).

మనము “పశ్చాత్తాపము నిమిత్తము విశ్వాసమును” సాధన చేసినప్పుడు, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా కనికరమును అనుగ్రహిస్తూ పరలోక తండ్రి మనల్ని క్షమిస్తారు (ఆల్మా 34:15; ఆల్మా 42:13 కూడా చూడండి). మనము శుద్ధి చేయబడి, క్షమించబడినప్పుడు, చివరకు మనం దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందగలము (యెషయా 1:18; సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42 చూడండి).

పశ్చాత్తాపము అనేది ప్రవర్తనను మార్చుకోవడం కంటే చాలా ఎక్కువైనది. అది పాపం నుండి దూరంగా వైదొలగడం, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వైపు తిరగడంతో కూడినది. అది హృదయం మరియు మనస్సు యొక్క మార్పుకు దారితీస్తుంది (మోషైయ 5:2; ఆల్మా 5:12–14; హీలమన్‌ 15:7 చూడండి). పశ్చాత్తాపము ద్వారా మనం నూతన వ్యక్తులుగా మారతాము, దేవునితో సమాధానపడతాము (2 కొరింథీయులకు 5:17–18; మోషైయ 27:25–26 చూడండి).

పశ్చాత్తాపపడే అవకాశం తన కుమారుని బహుమానం ద్వారా పరలోక తండ్రి మనకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి.

32.2

సంఘ సభ్యత్వ పరిమితులు లేదా ఉపసంహరణ యొక్క ఉద్దేశాలు

ఒక సభ్యుడు తీవ్రమైన పాపానికి పాల్పడితే, బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు అతనికి లేదా ఆమెకు పశ్చాత్తాపపడేందుకు సహాయం చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా, అతను కొంతకాలానికి కొన్ని సంఘ సభ్యత్వ అధికారాలను పరిమితం చేయాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో, అతను ఒక వ్యక్తి యొక్క సభ్యత్వాన్ని కొంతకాలం పాటు ఉపసంహరించవలసి ఉంటుంది.

ఒక వ్యక్తి యొక్క సభ్యత్వాన్ని పరిమితం చేయడం లేదా ఉపసంహరించడం శిక్షించడానికి ఉద్దేశించినది కాదు. బదులుగా, ఒక వ్యక్తి పశ్చాత్తాపం చెందడానికి మరియు హృదయమందు మార్పును అనుభవించడానికి ఈ చర్యలు కొన్నిసార్లు అవసరం. అవి ఒక వ్యక్తికి అతని లేదా ఆమె నిబంధనలను పునరుద్ధరించడానికి మరియు పాటించడానికి ఆధ్యాత్మికంగా సిద్ధపడే సమయాన్ని కూడా ఇస్తాయి.

సభ్యత్వ పరిమితులు లేదా ఉపసంహరణ యొక్క మూడు ఉద్దేశ్యాలు క్రింది విధంగా ఉన్నాయి.

32.2.1

ఇతరులను రక్షించడంలో సహాయపడడం

మొదటి ఉద్దేశ్యం ఇతరులను రక్షించడంలో సహాయపడడం. కొన్నిసార్లు ఒక వ్యక్తి భౌతిక లేదా ఆధ్యాత్మిక ముప్పును కలిగి ఉంటాడు. దోపిడీ ప్రవర్తనలు, శారీరక హాని, లైంగిక దుర్వినియోగం, మాదకద్రవ్య దుర్వినియోగం, మోసం మరియు విశ్వాసభ్రష్టత్వము వంటివి ఇది సంభవించే కొన్ని మార్గాలు. ఎవరైనా ఈ మార్గాల్లో లేదా ఇతర తీవ్రమైన మార్గాల్లో ముప్పు కలిగిస్తే ఇతరులను రక్షించడానికి ప్రేరేపణతో బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు చర్యలు తీసుకుంటారు (ఆల్మా 5:59–60 చూడండి).

32.2.2

పశ్చాత్తాపం ద్వారా యేసు క్రీస్తు యొక్క విమోచన శక్తిని పొందేందుకు ఒక వ్యక్తికి సహాయం చేయడం

పశ్చాత్తాపం ద్వారా యేసు క్రీస్తు యొక్క విమోచన శక్తిని పొందడంలో ఒక వ్యక్తికి సహాయం చేయడం రెండవ ఉద్దేశ్యం. ఈ ప్రక్రియ ద్వారా, అతడు లేదా ఆమె మళ్లీ పరిశుభ్రంగా మరియు దేవుని దీవెనలన్నింటినీ పొందేందుకు అర్హులుగా మారవచ్చు.

32.2.3

సంఘము యొక్క నీతిని కాపాడడం

మూడవ ఉద్దేశ్యం సంఘము యొక్క నీతిని కాపాడడం. ఒక వ్యక్తి ప్రవర్తన సంఘానికి గణనీయంగా హాని కలిగిస్తే, అతడు లేదా ఆమె సంఘ సభ్యత్వాన్ని పరిమితం చేయడం లేదా ఉపసంహరించడం అవసరం కావచ్చు (ఆల్మా 39:11 చూడండి). తీవ్రమైన పాపాలను దాచడం లేదా తగ్గించడం ద్వారా సంఘము యొక్క నీతి కాపాడబడదు—కానీ వాటిని పరిష్కరించడం ద్వారా కాపాడబడుతుంది.

32.3

ఇశ్రాయేలులో న్యాయాధిపతుల పాత్ర

బిషప్పులు మరియు స్టేకు అధ్యక్షులు ఇశ్రాయేలులో న్యాయాధిపతులుగా పిలువబడ్డారు మరియు ప్రత్యేకపరచబడ్డారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:72–74 చూడండి). సంఘ సభ్యులు పశ్చాత్తాపం చెందడానికి సహాయం చేయడంలో ప్రభువుకు ప్రాతినిధ్యం వహించడానికి వారు యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1; 107:16–18 చూడండి).

తరచుగా బిషప్పులు మరియు స్టేకు అధ్యక్షులు వ్యక్తిగత ఉపదేశము ద్వారా పశ్చాత్తాపమునందు సహాయం చేస్తారు. ఈ సహాయం అనధికారికంగా సంఘ సభ్యత్వం యొక్క కొన్ని అధికారాలను కొంతకాలానికి పరిమితం చేయవచ్చు.

కొన్ని తీవ్రమైన పాపాల కొరకు, నాయకులు సభ్యత్వ సభలను నిర్వహించడం ద్వారా పశ్చాత్తాపమునందు సహాయం చేస్తారు (32.6 చూడండి). ఈ సహాయంలో సంఘ సభ్యత్వం యొక్క కొన్ని అధికారాలను అధికారికంగా పరిమితం చేయడం లేదా ఒక వ్యక్తి యొక్క సభ్యత్వాన్ని కొంతకాలం ఉపసంహరించడం వంటివి ఉండవచ్చు.

సభ్యులు పశ్చాత్తాపపడేందుకు సహాయం చేస్తున్నప్పుడు బిషప్పులు మరియు స్టేకు అధ్యక్షులు ప్రేమగా మరియు శ్రద్ధగా ఉంటారు. వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీపట్ల రక్షకుని ప్రతిస్పందన ఒక మార్గదర్శకం (యోహాను 8:3–11 చూడండి). ఆమె పాపాలు క్షమించబడ్డాయని ఆయన చెప్పనప్పటికీ, ఆయన ఆమెను ఖండించలేదు. బదులుగా, “ఇక పాపము చేయకుమని”—పశ్చాత్తాపపడి ఆమె జీవితాన్ని మార్చుకోమని ఆయన చెప్పారు.

“మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు … ఎక్కువ సంతోషము” కలుగునని ఈ నాయకులు బోధిస్తారు (లూకా 15:7). వారు సహనంగా, మద్దతుగా మరియు సానుకూలంగా ఉంటారు. వారు నిరీక్షణను ప్రేరేపిస్తారు. రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగం కారణంగా, అందరూ పశ్చాత్తాపపడి పరిశుభ్రంగా ఉండగలరని వారు బోధిస్తారు మరియు సాక్ష్యమిస్తారు.

బిషప్పులు మరియు స్టేకు అధ్యక్షులు ప్రతి వ్యక్తి పశ్చాత్తాపపడేందుకు ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడానికి ఆత్మ నుండి మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు. అత్యంత తీవ్రమైన పాపాలకు మాత్రమే సంఘము దాని నాయకులు ఏ చర్యలు తీసుకోవాలో నిర్ణయించే ప్రమాణాన్ని కలిగి ఉంది (32.6 చూడండి). ఏ రెండు పరిస్థితులు ఒకేలా ఉండవు. నాయకులు ఇచ్చే ఉపదేశము మరియు వారు సులభతరం చేసే పశ్చాత్తాప ప్రక్రియ తప్పనిసరిగా ప్రేరేపితమైనదై ఉండాలి మరియు ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు.

32.4

ఒప్పుకోలు, గోప్యత మరియు ప్రభుత్వ అధికారులకు నివేదించడం

32.4.1

ఒప్పుకోలు

పశ్చాత్తాపానికి పరలోక తండ్రి వద్ద పాపాలు ఒప్పుకోవడం అవసరం. యేసు క్రీస్తు ఇలా చెప్పారు, “ఒక మనుష్యుడు తన పాపములను ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టుటను బట్టి—అతడు పశ్చాత్తాపపడెనని మీరు తెలుసుకొందురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:43; మోషైయ 26:29 కూడా చూడండి).

సంఘ సభ్యులు తీవ్రమైన పాపాలు చేసినప్పుడు, వారి పశ్చాత్తాపం వారి బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుని వద్ద ఒప్పుకోలును కూడా కలిగి ఉంటుంది. అప్పుడు అతను వారి తరఫున పశ్చాత్తాప సువార్త యొక్క తాళపుచెవులను ఉపయోగించగలడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1; 84:26–27; 107:18, 20 చూడండి). ఇది వారికి రక్షకుని ప్రాయశ్చిత్తం యొక్క శక్తి ద్వారా స్వస్థతకు మరియు సువార్త మార్గానికి తిరిగి రావడానికి సహాయపడుతుంది.

ఒప్పుకోలు యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, సభ్యులు తమ భారం తగ్గించుకునేలా ప్రోత్సహించడం, తద్వారా వారు మారడంలో మరియు స్వస్థపడడంలో పూర్తిగా ప్రభువు సహాయాన్ని పొందవచ్చు. “విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మను” వృద్ధి చేసుకోవటం ఒప్పుకోలు ద్వారా సహకారమివ్వబడుతుంది (2 నీఫై 2:7). స్వచ్ఛంద ఒప్పుకోలు ఒక వ్యక్తి పశ్చాత్తాపపడాలని కోరుకుంటున్నట్లు చూపుతుంది.

ఒక సభ్యుడు ఒప్పుకున్నప్పుడు, బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు ఉపదేశము కోసం 32.8 లోని మార్గదర్శకాలను అనుసరిస్తారు. సభ్యుని పశ్చాత్తాపానికి సహాయం చేయడానికి తగిన విధానము గురించి అతను ప్రార్థనాపూర్వకంగా మార్గనిర్దేశం కోరతాడు. సభ్యత్వ సభ సహాయకారిగా ఉంటుందా లేదా అని అతను ఆలోచిస్తాడు. సంఘ విధానానికి సభ్యత్వ సభ అవసరమైతే, అతను దీనిని వివరిస్తాడు (32.6 చూడండి).

కొన్నిసార్లు సభ్యుడు జీవిత భాగస్వామికి లేదా మరొక వయోజనునికి అన్యాయం చేసాడు. పశ్చాత్తాపంలో భాగంగా, అతను లేదా ఆమె సాధారణంగా ఆ వ్యక్తి వద్ద ఒప్పుకొని క్షమాపణ కోరాలి. తీవ్రమైన పాపం చేసిన యౌవనస్థులు సాధారణంగా అతని లేదా ఆమె తల్లిదండ్రులతో చర్చించమని ప్రోత్సహించబడతారు.

32.4.4

గోప్యత

బిషప్పులు, స్టేకు అధ్యక్షులు మరియు వారి సలహాదారులు వారితో పంచుకున్న అన్ని రహస్య సమాచారాలను కాపాడే పవిత్రమైన బాధ్యతను కలిగి ఉంటారు. ఈ సమాచారం మౌఖికాలలో, సలహాలలో మరియు ఒప్పకోలులో రావచ్చు. సభ్యత్వ సభలలో పాల్గొనే వారందరికీ గోప్యత యొక్క అదే బాధ్యత వర్తిస్తుంది. గోప్యత చాలా అవసరం, ఎందుకంటే సభ్యులు పంచుకునేది గోప్యంగా ఉంచబడకపోతే వారు తమ పాపాలను ఒప్పుకోకపోవచ్చు లేదా వారు మార్గదర్శకత్వం కోరకపోవచ్చు. విశ్వాసాన్ని ఉల్లంఘించడం సభ్యుల నమ్మకానికి ద్రోహం చేస్తుంది మరియు వారి నాయకులపై వారు విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది.

వారి గోప్యత బాధ్యతకు అనుగుణంగా, బిషప్పు, స్టేకు అధ్యక్షుడు లేదా వారి సలహాదారులు అటువంటి సమాచారాన్ని ఈ క్రింది విధంగా మాత్రమే పంచుకోవచ్చు:

  • వారు సభ్యత్వ సభలను నిర్వహించడం లేదా సంబంధిత విషయాల గురించి సభ్యుని స్టేకు అధ్యక్షుడు, మిషను అధ్యక్షుడు లేదా బిషప్పుతో చర్చించాలి.

  • సభ్యత్వ చర్య లేదా ఇతర తీవ్రమైన విచారాలు అమలులో ఉండగా వ్యక్తి క్రొత్త వార్డుకు మారినప్పుడు (లేదా యాజకత్వ నాయకుడు విడుదల చేయబడినప్పుడు).

  • వార్డు లేదా స్టేకు వెలుపల నివసిస్తున్న ఒక సంఘ సభ్యుడు తీవ్రమైన పాపంలో చిక్కుకున్నట్లు ఒక బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు తెలుసుకున్నప్పుడు.

  • సభ్యత్వ సభల సమయంలో సమాచారాన్ని బహిర్గతం చేయడం అవసరం.

  • నిర్దిష్ట వ్యక్తులతో సమాచారాన్ని పంచుకోవడానికి నాయకుడికి అనుమతి ఇవ్వడానికి సభ్యుడు ఎంచుకుంటాడు.

  • సభ్యత్వ సభ యొక్క నిర్ణయం గురించి పరిమిత సమాచారాన్ని పంచుకోవడం అవసరం కావచ్చు.

ఇతరులను రక్షించడంలో మరియు చట్టాన్ని పాటించడంలో నాయకులకు సహకరించడానికి, సంఘము శిక్షణ పొందిన నిపుణుల నుండి సహాయం అందిస్తుంది. ఈ మార్గదర్శకత్వాన్ని పొందడానికి, నాయకులు సంఘము యొక్క హింస హెల్ప్ లైన్ అందుబాటులో ఉన్న చోట వెంటనే దానిని సంప్రదిస్తారు (38.6.2.1 చూడండి). అది అందుబాటులో లేని చోట, స్టేకు అధ్యక్షుడు ప్రాంతీయ కార్యాలయంలోని ప్రాంతీయ న్యాయ సలహాదారులను సంప్రదిస్తారు.

ఒక సందర్భంలో మాత్రమే ఒక బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు అటువంటి మార్గదర్శకత్వం కోరకుండా రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయాలి. ప్రాణాంతక హాని లేదా తీవ్రమైన గాయాన్ని నివారించడానికి బహిర్గతం చేయడం అవసరమైనప్పుడు మరియు మార్గదర్శకత్వం కోరడానికి సమయం ఉండనప్పుడు. అటువంటి సందర్భాలలో, గోప్యత యొక్క బాధ్యత కంటే ఇతరులను రక్షించే బాధ్యత చాలా ముఖ్యం. నాయకులు వెంటనే పౌర అధికారులను సంప్రదించాలి.

32.6

పాపము యొక్క తీవ్రత మరియు సంఘ విధానం

(1) ఇతరులను రక్షించడంలో సహాయపడే మరియు (2) పశ్చాత్తాపపడడంలో వ్యక్తికి సహాయపడే విధానమును నిర్ణయించడంలో పాపము యొక్క తీవ్రత ముఖ్యముగా పరిశీలించవలసినది. ప్రభువైన నేను “పాపమును ఎంత మాత్రము అంగీకరించను” అని ఆయన చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:31; మోషైయ 26:29 కూడా చూడండి). ఆయన సేవకులు తీవ్రమైన పాపానికి సంబంధించిన రుజువులను విస్మరించకూడదు.

తీవ్రమైన పాపాలు ఉద్దేశపూర్వకమైనవి మరియు దేవుని ధర్మశాస్త్రమునకు వ్యతిరేకమైన పెద్ద నేరం. తీవ్రమైన పాపాల రకములు క్రింద ఇవ్వబడ్డాయి.

  • హింసాత్మక చర్యలు మరియు దూషణ

  • లైంగిక అనైతికత

  • మోసపూరిత చర్యలు

  • విశ్వాస ఉల్లంఘనలు

  • మరికొన్ని చర్యలు

సభ్యత్వ సభ అవసరమైనప్పుడు లేదా ఆవశ్యకమైనప్పుడు

పాపము యొక్క రకం

సభ్యత్వ సభ అవసరము

సభ్యత్వ సభ ఆవశ్యకము కావచ్చు

పాపము యొక్క రకం

హింసాత్మక చర్యలు మరియు దూషణ

సభ్యత్వ సభ అవసరము

  • హత్య

  • అత్యాచారం

  • లైంగిక వేధింపుల నేరం

  • పిల్లలు లేదా యువతను హింసించడం

  • హింసాత్మక దోపిడీ ప్రవర్తన

సభ్యత్వ సభ ఆవశ్యకము కావచ్చు

  • హత్యా ప్రయత్నం

  • దాడి మరియు వేధింపులతో సహా లైంగిక హింస (సలహాసభ అవసరమైనప్పుడు 38.6.18 చూడండి)

  • జీవిత భాగస్వామిని లేదా మరొక వయోజనుని హింసించడం (సలహాసభ అవసరమైనప్పుడు 38.6.2.4 చూడండి)

పాపము యొక్క రకం

లైంగిక అనైతికత

సభ్యత్వ సభ అవసరము

  • వివాహేతర సంబంధం

  • పిల్లల అశ్లీలత

  • బహు వివాహములు

  • లైంగిక దోపిడీ ప్రవర్తన

సభ్యత్వ సభ ఆవశ్యకము కావచ్చు

  • వ్యభిచారము, జారత్వము, స్వలింగ సంబంధాలు మరియు ఆన్‌లైన్‌లో లేదా ఫోనులో లైంగిక వ్యవహారాలతో పాటు ఒక స్త్రీ మరియు పురుషుని మధ్య చట్టబద్ధమైన వివాహానికి వెలుపల ఉన్న అన్ని ఇతర లైంగిక సంబంధాలు

  • సహజీవనం, చట్టపరమైన స్వలింగ సంబంధాలు మరియు భాగస్వామ్యాలు మరియు స్వలింగ వివాహం

  • సభ్యుని వివాహానికి లేదా కుటుంబానికి గణనీయమైన హాని కలిగించే అశ్లీలతను తీవ్రంగా లేదా నిర్బంధంగా ఉపయోగించడం

పాపము యొక్క రకం

మోసపూరిత చర్యలు

సభ్యత్వ సభ అవసరము

  • ఆర్థిక దోపిడీ ప్రవర్తన, మోసం మరియు దోపిడీవంటి కార్యకలాపాలు (ఒక సభ్యుడు సంఘ నిధులు లేదా ఆస్తిని అపహరించడంలో పాలుపంచుకున్నట్లయితే 32.6.3.3 చూడండి)

సభ్యత్వ సభ ఆవశ్యకము కావచ్చు

  • దోపిడీ, దొంగతనం, అపహరణ లేదా అక్రమార్జన (ఒక సభ్యుడు సంఘ నిధులు లేదా ఆస్తిని అపహరించడంలో పాలుపంచుకున్నట్లయితే 32.6.3.3 చూడండి)

  • అబద్ధ సాక్ష్యం

పాపము యొక్క రకం

విశ్వాస ఉల్లంఘనలు

సభ్యత్వ సభ అవసరము

  • సంఘములో ఒక ప్రముఖ హోదాలో ఉన్నప్పుడు తీవ్రమైన పాపం

సభ్యత్వ సభ ఆవశ్యకము కావచ్చు

  • సంఘము లేదా సమాజంలో అధికారిక స్థానాన్ని లేదా నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు తీవ్రమైన పాపం (ఒక సభ్యుడు సంఘ నిధులు లేదా ఆస్తిని అపహరించడంలో పాలుపంచుకున్నట్లయితే 32.6.3.3 చూడండి)

  • విస్తృతంగా తెలిసిన తీవ్రమైన పాపం

పాపము యొక్క రకం

మరికొన్ని చర్యలు

సభ్యత్వ సభ అవసరము

  • చాలా నేరారోపణలు

సభ్యత్వ సభ ఆవశ్యకము కావచ్చు

  • గర్భస్రావం (38.6.1 లో మినహాయింపు వర్తిస్తే తప్ప)

  • తీవ్రమైన పాపాలకు సంబంధించిన నమూనా

  • పిల్లల మద్దతు మరియు భరణం చెల్లించకపోవటంతో సహా కుటుంబ బాధ్యతలను ఉద్దేశపూర్వకంగా వదిలివేయడం

  • చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల విక్రయం

  • ఇతర తీవ్రమైన నేరపూరిత చర్యలు

32.6.3

సభ్యత్వ సభ లేదా ఇతర చర్య అవసరమా అనే దాని గురించి స్టేకు అధ్యక్షుడు ప్రాంతీయ అధ్యక్షత్వముతో ఎప్పుడు చర్చిస్తారు

కొన్ని విషయాలకు అదనపు సున్నితత్వం మరియు మార్గదర్శకత్వం అవసరం. ఉత్తమంగా ఎలా సహాయం చేయాలో తెలుసుకోవాలంటే, ఈ విభాగంలోని పరిస్థితుల గురించి స్టేకు అధ్యక్షుడు తప్పనిసరిగా ప్రాంతీయ అధ్యక్షత్వముతో చర్చలు జరపాలి.

32.6.3.2

విశ్వాసభ్రష్టత్వము

విశ్వాసభ్రష్టత్వ సమస్యలు తరచుగా వార్డు లేదా స్టేకు యొక్క సరిహద్దులను దాటి ప్రభావం చూపుతాయి. ఇతరులను రక్షించడానికి వాటిని వెంటనే పరిష్కరించాలి.

సభ్యుని చర్య విశ్వాసభ్రష్టత్వాన్ని ఏర్పరుస్తుందని బిషప్పు భావిస్తే, అతను స్టేకు అధ్యక్షునితో చర్చిస్తాడు.

ఇక్కడ ఉపయోగించినట్లుగా, విశ్వాసభ్రష్టత్వము అనేది క్రింది వాటిలో దేనిలోనైనా నిమగ్నమయ్యే సభ్యుడిని సూచిస్తుంది:

  • సంఘము, దాని సిద్ధాంతము, దాని విధానాలు లేదా దాని నాయకుల పట్ల పదేపదే స్పష్టమైన మరియు ఉద్దేశపూర్వకమైన బహిరంగ వ్యతిరేకతతో ప్రవర్తించడం

  • బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుని ద్వారా సరిదిద్దబడిన తర్వాత సంఘ సిద్ధాంతం కాని దానిని సంఘ సిద్ధాంతంగా బోధించడంలో కొనసాగడం

  • సంఘ సభ్యుల విశ్వాసం మరియు కార్యకలాపాలను బలహీనపరిచేందుకు ఉద్దేశపూర్వకంగా పని చేసే నమూనాను చూపడం

  • బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుని ద్వారా సరిదిద్దబడిన తర్వాత విశ్వాసభ్రష్టత్వ శాఖల బోధనలను అనుసరించడాన్ని కొనసాగించడం

  • అధికారికంగా మరొక సంఘములో చేరడం మరియు ఆ బోధనలను ప్రచారం చేయడం

32.6.3.3

సంఘ నిధులను అపహరించడం

ఒక సభ్యుడు సంఘ నిధులను అపహరించినా లేదా విలువైన సంఘ ఆస్తులను దొంగిలించినా, సభ్యత్వ సభ లేదా ఇతర చర్య అవసరమా అనే దాని గురించి స్టేకు అధ్యక్షుడు ప్రాంతీయ అధ్యక్షత్వముతో చర్చలు జరుపుతారు.