చేతి పుస్తకములు మరియు పిలుపులు
34. ఆర్థికాంశాలు మరియు లెక్కల తనిఖీలు


“34. ఆర్థికాంశాలు మరియు లెక్కల తనిఖీలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“34. ఆర్థికాంశాలు మరియు లెక్కల తనిఖీలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
కవరు పట్టుకున్న బిడ్డ

34.

ఆర్థికాంశాలు మరియు లెక్కల తనిఖీలు

34.0

పరిచయము

దశమభాగాలు మరియు కానుకలు ప్రభువు యొక్క రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును కొనసాగించడానికి సంఘమును అనుమతిస్తాయి (1.2చూడండి). ఈ నిధులు పవిత్రమైనవి. అవి సంఘ సభ్యుల త్యాగం మరియు విశ్వాసాన్ని సూచిస్తాయి (మార్కు 12:41–44 చూడండి).

34.2

వార్డు ఆర్థిక నాయకత్వము

34.2.1

బిషప్రిక్కు

వార్డు ఆర్థికాంశాల కోసం బిషప్పు క్రింది బాధ్యతలను కలిగి ఉన్నారు. అతను ఈ పనిలో కొంతభాగాన్ని తన సలహాదారులకు మరియు గుమాస్తాలకు అప్పగిస్తాడు.

బిషప్పు:

  • పూర్తి దశమభాగం చెల్లించమని మరియు ఉదారమైన కానుకలను ఇవ్వమని సభ్యులకు బోధిస్తారు మరియు ప్రేరేపిస్తారు (34.3 చూడండి).

  • వార్డు నిధులు సక్రమంగా నిర్వహించబడుతున్నాయని మరియు లెక్క అప్పగించబడుతున్నాయని నిర్ధారిస్తారు (34.5 చూడండి).

  • ప్రతి నెలా ఆర్థిక నివేదికను సమీక్షిస్తారు మరియు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించబడ్డాయని నిర్ధారిస్తారు.

  • నిర్మాణ నాయకులు మరియు గుమాస్తాలు పవిత్ర సంఘ నిధుల కోసం తమ బాధ్యతను తెలుసుకునేలా నిర్ధారిస్తారు.

  • వార్షిక వార్డు ఆదాయవ్యయాల అంచనాలను సిద్ధం చేస్తారు మరియు నిర్వహిస్తారు (34.6 చూడండి).

  • వారి దశమభాగ ప్రకటనను స్వీకరించడానికి ప్రతిసంవత్సరము వార్డు సభ్యులతో సమావేశమవుతారు.

34.2.2

వార్డు గుమాస్తాలు

వార్డు ఆర్థిక వృత్తాంతములను వ్రాయడంలో సహాయం చేయడానికి వార్డు గుమాస్తా లేదా వార్డు సహాయక గుమాస్తా‌ను బిషప్పు నియమిస్తారు. సంఘ నిధులను రక్షించడానికి మరియు సంఘ వృత్తాంతములు ఖచ్చితమైనవని నిర్ధారించడానికి గుమాస్తాలు ప్రస్తుత విధానాలను జాగ్రత్తగా అనుసరిస్తారు.

గుమాస్తా క్రింది బాధ్యతలను కలిగి ఉంటాడు:

  • బిషప్రిక్కు సభ్యుని నుండి అందుకున్న ఏ నిధులనైనా నమోదు చేస్తాడు మరియు జమ చేస్తాడు.

  • ప్రతి నెలా ఆర్థిక నివేదికను సమీక్షిస్తాడు మరియు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించబడ్డాయని నిర్ధారిస్తాడు.

  • వార్షిక వార్డు ఆదాయవ్యయాల అంచనాలను సిద్ధం చేయడంలో బిషప్రిక్కుకు సహాయపడతాడు (34.6.1 మరియు 34.6.2 చూడండి).

  • సభ్యులు వారి విరాళాల ప్రకటనలకు ప్రవేశము కలిగి ఉన్నారని నిర్ధారిస్తాడు మరియు అవసరమైన విధంగా సహాయం చేస్తాడు.

గుమాస్తాలు మెల్కీసెదెకు యాజకత్వాన్ని మరియు ప్రస్తుత దేవాలయ సిఫారసును కలిగి ఉండాలి.

34.3

విరాళాలు

34.3.1

దశమభాగము

దశమభాగము అనేది దేవుని సంఘానికి ఒకరి ఆదాయంలో పదో వంతు విరాళం (సిద్ధాంతము మరియు నిబంధనలు 119:3–4 చూడండి; వడ్డీ అంటే ఆదాయం అని అర్థం). ఆదాయం ఉన్న సభ్యులందరూ దశమభాగము చెల్లించాలి.

34.3.1.2

దశమభాగ ప్రకటన

బిషప్పు ప్రతి సంవత్సరం చివరి కొన్ని నెలల్లో అతని లేదా ఆమె దశమభాగ ప్రకటనను స్వీకరించడానికి ప్రతి సభ్యుడిని కలుసుకుంటారు.

ఈ కారణంగా బిషప్పు‌ని కలిసేందుకు సభ్యులందరూ ఆహ్వానించబడతారు:

  • దశమభాగ చెల్లింపుదారులుగా వారి స్థితిని బిషప్పుకు ప్రకటించడానికి.

  • వారి విరాళ వృత్తాంతములు ఖచ్చితమైనవని నిర్ధారించుకోవడానికి.

వీలైనప్పుడల్లా, పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ కలిసి హాజరు కావాలి.

34.3.2

ఉపవాస కానుకలు

సంఘ నాయకులు ఉపవాస చట్టాన్ని జీవించమని సభ్యులను ప్రోత్సహిస్తారు. ఇందులో ఉదారమైన ఉపవాస కానుక ఇవ్వడం కూడా ఉంటుంది (22.2.2 చూడండి).

ఉపవాస కానుకల నిధులను ఉపయోగించడం కోసం మార్గదర్శకాలు 22.5.2 లో ఇవ్వబడ్డాయి.

34.3.3

సువార్తికుని నిధులు

వార్డు సువార్తికుని నిధికి వచ్చే విరాళాలు ప్రధానంగా వార్డుకు చెందిన పూర్తి-కాల సువార్తికుల విరాళ వాగ్దానాలను తీర్చడానికి ఉపయోగించబడతాయి.

సాధారణ సువార్తికుని నిధికి వచ్చే‌ విరాళాలను సంఘము తన సమగ్ర సువార్తసేవా ప్రయత్నాలలో ఉపయోగిస్తుంది.

34.3.7

విరాళాలు తిరిగి చెల్లించబడవు

సంఘానికి దశమభాగాలు మరియు ఇతర అర్పణలు ఇవ్వబడినప్పుడు, అవి ప్రభువుకు చెందుతాయి. అవి ఆయనకు ప్రతిష్ఠించబడతాయి.

స్టేకు అధ్యక్షుడు మరియు బిషప్పులు దశమభాగాలు మరియు అర్పణలు అందించిన వారికి ఈ విరాళాలు తిరిగి చెల్లించబడవని తెలియజేస్తారు.

34.4

దశమభాగం మరియు ఇతర అర్పణల గోప్యత

దాత చెల్లించే దశమభాగం మరియు ఇతర అర్పణల మొత్తం గోప్యంగా ఉంచబడుతుంది. బిషప్పు మరియు ఈ విరాళాలను నిర్వహించడానికి లేదా వీక్షించడానికి అధికారం గలవారు మాత్రమే ఈ సమాచారాన్ని పొందగలగాలి.

34.5

సంఘ నిధులను నిర్వహించడం

స్టేకు అధ్యక్షుడు మరియు బిషప్పు సంఘ నిధులన్నీ సరిగ్గా నిర్వహించబడేలా చూస్తారు. బిషప్రిక్కులు మరియు గుమాస్తా‌లు కనీసం సంవత్సరానికి ఒకసారి “Sacred Funds, Sacred Responsibilities [పవిత్ర నిధులు, పవిత్ర బాధ్యతలు]” అనే వీడియో చూడమని ప్రోత్సహించబడతారు.

34.5.1

సహవాస సూత్రం

సహవాస సూత్రం ప్రకారం ఇద్దరు వ్యక్తులు—బిషప్రిక్కు సభ్యుడు మరియు ఒక గుమాస్తా లేదా బిషప్రిక్కులోని ఇద్దరు సభ్యులు—సంఘ నిధులను నమోదు చేసేటప్పుడు మరియు పంపిణీ చేసేటప్పుడు చురుకుగా పాల్గొనడం అవసరం.

నాయకులు వారి పాస్‌వర్డ్‌లను రక్షించుకోవాలి మరియు ఎప్పటికీ పంచుకోకూడదు (33.9.1.1 చూడండి).

34.5.2

దశమభాగము మరియు ఇతర అర్పణలను స్వీకరించడం

పరిశుద్ధుల యొక్క దశమభాగము మరియు ఇతర అర్పణలను స్వీకరించడం మరియు లెక్కించడం వంటి పవిత్రమైన నమ్మకాన్ని ప్రభువు బిషప్పు‌లకు ఇచ్చారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:30–33; 119 చూడండి). బిషప్పు మరియు అతని సలహాదారులు మాత్రమే దశమభాగాలు మరియు ఇతర అర్పణలను స్వీకరించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి భార్యలు, వారి కుటుంబ సభ్యులు, గుమాస్తాలు లేదా ఇతర వార్డు సభ్యులు ఈ విరాళాలను స్వీకరించకూడదు.

34.5.3

దశమభాగము మరియు ఇతర అర్పణలను ధృవీకరించడం మరియు నమోదు చేయడం

విరాళాలు అవి స్వీకరించబడిన ఆదివారమే ధృవీకరణ చేయబడి, నమోదు చేయబడాలి. బిషప్రిక్కు సభ్యుడు మరియు ఒక గుమాస్తా లేదా బిషప్రిక్కులోని ఇద్దరు సభ్యులు కలిసి ప్రతి కవరును తెరవాలి. జతచేయబడిన నిధులు దశమభాగము మరియు ఇతర అర్పణల ఫారమ్‌లో వ్రాసిన మొత్తానికి సమానంగా ఉన్నాయని వారు ధృవీకరిస్తారు. వారు ప్రతి విరాళాన్ని సరిగ్గా నమోదు చేస్తారు. నిధులు మరియు వ్రాతపూర్వక మొత్తంలో తేడా ఉంటే, వ్యత్యాసాన్ని పరిష్కరించడానికి వారు వీలైనంత త్వరగా దాతను సంప్రదిస్తారు.

34.5.4

దశమభాగము మరియు ఇతర అర్పణలను జమ చేయడం

నమోదు చేయబడిన మొత్తాలు అందుకున్న నిధులతో సరిపోలినట్లు నిర్ధారించుకున్న తర్వాత జమ చేయడానికి సిద్ధం చేయబడాలి.

24 గంటల బ్యాంకు జమ అందుబాటులో ఉన్న చోట, బిషప్రిక్కు సభ్యుడు మరియు మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న ఒకరు నిధులు తెరువబడి, ధృవీకరించబడిన రోజునే బ్యాంకులో నిధులను జమ చేస్తారు.

24 గంటల బ్యాంకు జమ అందుబాటులో లేనప్పుడు మరియు ఆదివారం బ్యాంకు మూసివేయబడిన చోట, మరుసటి పనిదినమున డిపాజిట్ చేయడానికి మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న ఒకరిని బిషప్పు నియమిస్తారు. అతను తప్పక:

  • నిధులు జమ అయ్యే వరకు అవి భద్రంగా ఉండేలా చూసుకోవాలి.

  • తేదీ మరియు జమ చేసిన పైకము మొత్తాన్ని చూపించే డిపాజిట్ రసీదును పొందాలి.

34.5.5

సంఘ నిధులను పరిరక్షించడం

సంఘ నిధులకు బాధ్యత వహించే సభ్యులు వాటిని రాత్రిపూట సమావేశ మందిరంలో వదిలివేయకూడదు లేదా సమావేశాలు మరియు కార్యకలాపాల సమయంలో వాటిని ఏ సమయంలోనైనా గమనించకుండా వదిలివేయకూడదు.

34.5.7

స్టేకు మరియు వార్డు చెల్లింపులను నిర్వహించడం

అధ్యక్షత్వము వహించు అధికారి అనుమతి లేకుండా స్టేకు లేదా వార్డు ఖర్చులు చేయకూడదు లేదా చెల్లించకూడదు.

ప్రతి చెల్లింపును అధికారంగల ఇద్దరు నాయకులు తప్పనిసరిగా ఆమోదించాలి. వారిలో ఒకరు తప్పనిసరిగా స్టేకు అధ్యక్షత్వము లేదా బిషప్రిక్కు సభ్యుడు అయ్యుండాలి. చెల్లింపులను ఆమోదించడానికి సలహదారులకు అధికారం ఉన్నప్పటికీ, స్టేకు అధ్యక్షుడు లేదా బిషప్పు తప్పనిసరిగా ప్రతి చెల్లింపును సమీక్షించాలి. నాయకులు తమ చెల్లింపును తామే ఆమోదించకూడదు.

బిషప్పు తనకు లేదా తన కుటుంబానికి బిషప్పు యొక్క ఆదేశాన్ని ఆమోదించడానికి లేదా ఉపవాస కానుకలను ఉపయోగించడానికి ముందు స్టేకు అధ్యక్షుని యొక్క వ్రాతపూర్వక ఆమోదం అవసరం. ఒక బిషప్పు ఉపవాస కానుకలను ఉపయోగించే ముందు లేదా స్టేకు అధ్యక్షుడు లేదా అతని కుటుంబం కోసం బిషప్పు యొక్క ఆదేశాన్ని ఆమోదించే ముందు ప్రాంతీయ అధ్యక్షత్వ సభ్యుని నుండి వ్రాతపూర్వక ఆమోదం అవసరం. మార్గదర్శకాల కోసం 22.5.1.2 చూడండి.

తిరిగి చెల్లింపును అభ్యర్థించే సభ్యుడు ఏవైనా రసీదులు లేదా ధరలపట్టీల భౌతిక లేదా ఎలక్ట్రానిక్ కాపీని అందజేస్తారు. అతను లేదా ఆమె కొనుగోలు ఉద్దేశం, మొత్తం మరియు తేదీని కూడా చేర్చుతారు.

నిధులు ముందస్తుగా ఉంటే, సభ్యుడు ఉద్దేశం, మొత్తం మరియు తేదీని పేర్కొంటూ చెల్లింపు అభ్యర్థన ఫారమ్‌ను సమర్పిస్తాడు. ఖర్చు చెల్లించిన తర్వాత, సభ్యుడు (1) వెచ్చించిన నిధుల కోసం రసీదులు లేదా ధరలపట్టీలను అందిస్తాడు మరియు (2) ఖర్చు చేయని నిధులను తిరిగి ఇస్తాడు. తిరిగి వచ్చిన నిధులను తిరిగి జమ చేయాలి.

34.5.9

ఆర్థిక వృత్తాంతములను ఉంచడం

ప్రతి స్టేకు మరియు వార్డు ప్రస్తుత, ఖచ్చితమైన ఆర్థిక వృత్తాంతములను ఉంచాలి.

వృత్తాంతములు మరియు నివేదికల ఉపయోగం మరియు నిలుపుదల గురించి సమాచారం కోసం, గుమాస్తాలు సంఘ ప్రధాన కార్యాలయం లేదా ప్రాంతీయ కార్యాలయం నుండి సూచనలను తీసుకోవాలి. ప్రస్తుత సంవత్సరంతో పాటు కనీసం మూడు సంవత్సరాల పాటు ఆర్థిక వృత్తాంతములను భద్రపరచాలి.

34.6

ఆదాయ వ్యయ అంచనాలు మరియు ఖర్చులు

ఆదాయ వ్యయ అంచనాల భత్యం కార్యక్రమం స్టేకులు మరియు వార్డుల కార్యకలాపాలు మరియు కార్యక్రమాలకు చెల్లించడానికి సాధారణ సంఘ నిధులను అందిస్తుంది.

చాలామట్టుకు ప్రోత్సాహ కార్యక్రమాలు సరళంగా ఉండాలి మరియు తక్కువ ఖర్చుతో లేదా ఖర్చు లేకుండా ఉండాలి.

34.6.1

స్టేకు మరియు వార్డు ఆదాయ వ్యయ అంచనాలు

ప్రతి స్టేకు మరియు వార్డు వార్షిక ఆదాయ వ్యయ అంచనాలను సిద్ధం చేస్తుంది మరియు నిర్వహిస్తుంది. స్టేకు అధ్యక్షుడు స్టేకు ఆదాయ వ్యయ అంచనాలను నిర్వహిస్తారు మరియు బిషప్పు వార్డు ఆదాయ వ్యయ అంచనాలను నిర్వహిస్తారు.

మార్గదర్శకాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • పునరావృత ఖర్చులు పరిగణించబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి మునుపటి సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తాలను సమీక్షించండి.

  • వారి ఆదాయ వ్యయ అంచనాలను వివరంగా అంచనా వేయమని నిర్మాణాలను అడగండి.

  • ఆమోదించబడిన ఆదాయ వ్యయ అంచనాల పద్ధతులను ఉపయోగించి ఆదాయ వ్యయ అంచనాలను సంగ్రహించండి.

34.6.2

ఆదాయ వ్యయ అంచనాల భత్యం

34.6.2.1

ఆదాయ వ్యయముల కేటాయింపు

క్రింది వర్గాలలో హాజరు ఆధారంగా త్రైమాసిక ఆదాయ వ్యయముల నిధులు కేటాయించబడతాయి:

  • సంస్కార కూడిక

  • యువకులు

  • యువతులు

  • 7–10 సంవత్సరాల వయస్సు గల ప్రాథమిక పిల్లలు

  • ఒంటరి వయో జనులు

హాజరును ఖచ్చితంగా మరియు సమయానికి నివేదించడం ముఖ్యం (33.5.1.1 చూడండి).

34.6.2.2

ఆదాయ వ్యయ అంచనాను సముచితంగా ఉపయోగించడం

స్టేకు అధ్యక్షులు మరియు బిషప్పులు ఆదాయ వ్యయ అంచనా భత్యం నిధులు తెలివిగా ఖర్చు చేయబడేలా నిర్ధారిస్తారు.

అన్ని ప్రోత్సాహ కార్యక్రమాలు, కార్యకలాపాలు, పుస్తకాలు మరియు సామాగ్రి కోసం చెల్లించడానికి స్టేకు మరియు వార్డు ఆదాయ వ్యయ అంచనాల నిధులను ఉపయోగించాలి.

34.6.2.3

అదనపు ఆదాయ వ్యయ అంచనా

అదనపు ఆదాయ వ్యయ అంచనాల భత్యం నిధులను ఖర్చు చేయకూడదు. అదనపు వార్డు నిధులను స్టేకుకు తిరిగి ఇవ్వాలి.

34.7

లెక్కల తనిఖీ‌లు

34.7.1

స్టేకు లెక్కల తనిఖీ సమితి

స్టేకు అధ్యక్షుడు ఒక స్టేకు లెక్కల తనిఖీ‌ సమితిని నియమిస్తాడు. సంఘ విధానం ప్రకారం స్టేకు మరియు వార్డు ఆర్థికాంశాలు నిర్వహించబడుతున్నాయని ఈ సమితి నిర్ధారిస్తుంది.

34.7.3

ఆర్థిక లెక్కల తనిఖీ

స్టేకు లెక్కల తనిఖీదారులు ప్రతి సంవత్సరం రెండుసార్లు స్టేకు, వార్డులు మరియు కుటుంబ చరిత్ర కేంద్రాల ఆర్థిక వృత్తాంతములను తనిఖీ చేస్తారు.

విభాగము యొక్క అధ్యక్షత్వము వహించు అధికారి మరియు ఆర్థికాంశాలకు నియమించబడిన గుమాస్తా లెక్కల తనిఖీ సమయంలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అందుబాటులో ఉండాలి.

34.7.5

సంఘ నిధుల నష్టం, దొంగతనం, అపహరణ లేదా దుర్వినియోగం

ఈ విధముగా అయినట్లయితే స్టేకు అధ్యక్షునికి లేదా స్టేకు లెక్కల తనిఖీ‌ సమితి అధ్యక్షునికి తక్షణమే తెలియజేయాలి:

  • సంఘ నిధులు పోయినా లేదా దొంగిలించబడినా.

  • ఒక నాయకుడు సంఘ నిధులను అపహరించినా లేదా దుర్వినియోగం చేసినా.