2023 క్రొత్త నిబంధన
అనుబంధము: దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు మీ పిల్లలను సిద్ధపరచుట


“అనుబంధము: దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు మీ పిల్లలను సిద్ధపరచుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“అనుబంధము,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023

అనుబంధము

దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు మీ పిల్లలను సిద్ధపరచుట

ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, నమ్ముతున్నారు మరియు మీ సామర్థ్యమును ఎరిగియున్నారు గనుక, నిత్య జీవితానికి మార్గమైన ఆయన నిబంధన బాటలో ప్రవేశించి, పురోగమించడానికి మీ పిల్లలకు సహాయపడే అవకాశాన్ని పరలోక తండ్రి మీకు ఇచ్చారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–28 చూడండి). ఇది బాప్తిస్మపు నిబంధన మరియు దేవాలయంలో చేసే నిబంధనలు వంటి పవిత్రమైన నిబంధనలు చేసి, పాటించడానికి సిద్ధపడేందుకు వారికి సహాయపడడాన్ని కలిపియున్నది. ఈ నిబంధనల ద్వారా మీ పిల్లలు తమనుతాము రక్షకుడైన యేసు క్రీస్తుతో బంధించుకుంటారు.

నిబంధన బాటపై ఈ ప్రయాణం కొరకు మీ పిల్లలను సిద్ధపరచడానికి అనేక విధానాలున్నాయి మరియు వారికి సహాయం చేయడానికి శ్రేష్ఠమైన విధానాన్ని కనుగొనడానికి పరలోక తండ్రి మీకు సహాయపడతారు. మీరు ప్రేరేపణను వెదకినప్పుడు, అభ్యాసమంతా ప్రణాళిక చేయబడిన పాఠ్యసమయాల్లోనే జరగదని గుర్తుంచుకోండి. వాస్తవానికి, ఇంటివద్ద అభ్యాసాన్ని అంత శక్తివంతంగా చేసేదానిలో భాగమేమిటంటే, మాదిరి ద్వారా మరియు అనుదిన జీవితంలో భాగంగా సహజంగా సంభవించే చిన్న, సరళమైన అనుభవాల ద్వారా నేర్చుకొనే అవకాశం. నిబంధన బాటను అనుసరించడం అనేది ఒక నిలకడయైన జీవితకాలపు ప్రక్రియ, అదేవిధంగా నిబంధన బాట గురించి నేర్చుకోవడం కూడా అటువంటిదే. (“Home and Family,” Teaching in the Savior’s Way [2022], 30–31 చూడండి.)

చిత్రం
బిడ్డతోనున్న తల్లి

దేవుని నిబంధన బాటపై వారి ప్రయాణం కొరకు మీ పిల్లలను సిద్ధపరచడానికి అనేక విధానాలున్నాయి.

మరింత ప్రేరేపణకు నడిపించే కొన్ని ఉపాయాలు క్రింద ఉన్నాయి. ప్రాథమిక-వయస్సు గల పిల్లలకు బోధించడానికి అదనపు ఉపాయాలను రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులోని “దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు మీ పిల్లలను సిద్ధపరచుట” లో మీరు కనుగొనగలరు.

బాప్తిస్మము మరియు నిర్ధారణ

నిబంధన బాటలో “[మీరు] ప్రవేశించవలసిన ద్వారము పశ్చాత్తాపము మరియు నీటి ద్వారా బాప్తిస్మము” (2 నీఫై 31:17) అని నీఫై బోధించాడు. బాప్తిస్మము మరియు నిర్ధారణ కొరకు సిద్ధపడేందుకు మీ పిల్లలకు సహాయపడడానికి మీరు చేసే ప్రయత్నాలు వారి పాదాలను ఆ మార్గములో స్థిరంగా నిలుపగలవు. యేసు క్రీస్తు నందు విశ్వాసము మరియు పశ్చాత్తాపము గురించి బోధించడంతో ఈ ప్రయత్నాలు మొదలవుతాయి. ప్రతీ వారము సంస్కారములో పాల్గొనుట ద్వారా మన బాప్తిస్మపు నిబంధనలను మనం ఏవిధంగా క్రొత్తవిగా చేస్తామనే దాని గురించి బోధించడాన్ని కూడా అవి కలిపియున్నాయి.

మీకు సహాయపడగల కొన్ని వనరులు ఇక్కడున్నాయి: 2 నీఫై 31 topics.ChurchofJesusChrist.org.

  • పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు నందు మీ విశ్వాసాన్ని బలపరిచే అనుభవం మీకు కలిగినప్పుడల్లా దానిని మీ బిడ్డతో పంచుకోండి. విశ్వాసమనేది జీవితాంతము ఇంకా ఇంకా బలంగా ఎదగగలదని అతడు లేదా ఆమె గ్రహించేలా సహాయం చేయండి. అతడు లేదా ఆమె బాప్తిస్మము పొందడానికి ముందు క్రీస్తు నందు బలమైన విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి మీ బిడ్డ చేయగల కొన్ని పనులేవి?

  • మీ బిడ్డ ఒక తప్పు ఎంపిక చేసినప్పుడు, పశ్చాత్తాపం యొక్క బహుమానం గురించి ఆనందంగా మాట్లాడండి. మీరు ఒక తప్పు ఎంపిక చేసినప్పుడు, మీరు పశ్చాత్తాపపడినప్పుడు కలిగే ఆనందాన్ని పంచుకోండి. మన పాపాల కొరకు యేసు క్రీస్తు బాధననుభవించి, మరణించారు గనుక, మార్పు చెందగల శక్తిని ఆయన మనకు ఇచ్చారని సాక్ష్యమివ్వండి. మీ బిడ్డ క్షమాపణను కోరినప్పుడు, స్వచ్ఛందంగా మరియు ఆనందంగా క్షమించండి.

  • మీ బాప్తిస్మము గురించి మీ బిడ్డకు చెప్పండి. ఫోటోలు చూపించండి మరియు జ్ఞాపకాలను పంచుకోండి. మీరెలా భావించారు, మీ బాప్తిస్మపు నిబంధనలు యేసు క్రీస్తును ఇంకా బాగా తెలుసుకోవడానికి మీకెలా సహాయపడ్డాయి మరియు అవి మీ జీవితాన్ని ఇంకా దీవించుటను ఎలా కొనసాగిస్తున్నాయి అనేదాని గురించి మాట్లాడండి. ప్రశ్నలు అడగడానికి మీ బిడ్డను ప్రోత్సహించండి.

  • మీ కుటుంబములో లేదా మీ వార్డులో బాప్తిస్మము జరిగినప్పుడు దానిని చూడడానికి మీ బిడ్డను తీసుకువెళ్ళండి. మీరు మరియు మీ బిడ్డ చూసిన దానిని, భావించిన దానిని గురించి కలిసి మాట్లాడండి. సాధ్యమైనట్లయితే, బాప్తిస్మము పొందుతున్న వ్యక్తితో మాట్లాడండి మరియు క్రింది ప్రశ్నల వంటివి అడగండి: “ఈ నిర్ణయాన్ని మీరు ఎలా తీసుకున్నారు? మీరు ఎలా సిద్ధపడ్డారు?”

  • అతడు లేదా ఆమె చేస్తానని వాగ్దానం చేసినదేదైనా మీ బిడ్డ చేయడాన్ని మీరు గమనించినప్పుడల్లా మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. ఒప్పందాలను పాటించడం అనేది మనం బాప్తిస్మమప్పుడు చేసే నిబంధనలను పాటించడానికి సిద్ధపడేందుకు మనకు సహాయపడుతుందని చెప్పండి. మనం బాప్తిస్మము పొందినప్పుడు మనం దేవునితో ఏమని వాగ్దానం చేస్తాము? ఆయన మనతో ఏమని వాగ్దానం చేస్తారు? (మోషైయ 18:8–10, 13 చూడండి).

  • మీరు మరియు మీ బిడ్డ కలిసి ఒక పవిత్రమైన అనుభవాన్ని కలిగియున్నప్పుడు (సంఘములో, లేఖనాలు చదువుతున్నప్పుడు లేదా ఎవరికైనా సేవ చేస్తున్నప్పుడు), మీకు కలిగిన ఆత్మీయ భావనలు లేదా మనోభావాల గురించి అతడు లేదా ఆమెకు చెప్పండి. అతడు లేదా ఆమె ఎలా భావిస్తున్నారో పంచుకోమని మీ బిడ్డను ఆహ్వానించండి. ఆయన మీతో వ్యక్తిగతంగా మాట్లాడే విధానాలతో కలిపి, ఆత్మ జనులతో మాట్లాడగల వివిధ రకాల విధానాలను గమనించండి. అతడు లేదా ఆమె పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని అనుభవించే క్షణాలను గుర్తించడానికి మీ బిడ్డకు సహాయపడండి.

  • ప్రభువు యొక్క సేవకులు ఆయన స్వరాన్ని వినే వివిధ మార్గాల గురించి కలిసి మాట్లాడండి. అతడు లేదా ఆమె రక్షకుని స్వరాన్ని ఏవిధంగా వింటారనే దాని గురించి ఒక బొమ్మ గీయమని లేదా ఒక వీడియో చేయమని మీ బిడ్డను ఆహ్వానించండి.

  • యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యునిగా కావడం మిమ్మల్ని ఏవిధంగా దీవించిందనే దాని గురించి మాట్లాడండి. మీరు ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు మరియు ఇతరులు మీకు సేవ చేస్తున్నప్పుడు మీరు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు ఎలా దగ్గరయ్యారు? సంఘ సభ్యునిగా ఇతరులకు సేవ చేసే మరియు బలపరిచే విధానాల గురించి ఆలోచించడానికి మీ బిడ్డకు సహాయపడండి.

  • సంస్కారమును మీ కుటుంబములో ఒక పవిత్రమైన మరియు ఆనందకరమైన సంఘటనగా చేయండి. సంస్కార సమయంలో యేసు క్రీస్తుపై దృష్టిసారించే విధానాలను ప్రణాళిక చేయడానికి మీ బిడ్డకు సహాయపడండి. సంస్కారము మనకు పవిత్రమైనదని మనమెలా చూపగలము?

  • ఫ్రెండ్ పత్రికలో తరచు బాప్తిస్మము మరియు నిర్ధారణ కొరకు పిల్లలు సిద్ధపడడంలో సహాయపడేందుకు వ్యాసాలు, కథలు మరియు ప్రోత్సాహకార్యక్రమాలు ఉంటాయి. చదవడానికి మరియు మీతో కలిసి ఆనందించడానికి మీ బిడ్డను వాటిలో కొన్ని ఎంపిక చేయనివ్వండి.

    చిత్రం
    బాప్తిస్మము పొందుతున్న బాలుడు

    నిబంధన బాటలో “[మీరు] ప్రవేశించవలసిన ద్వారము పశ్చాత్తాపము మరియు నీటి ద్వారా బాప్తిస్మము” (2 నీఫై 31:17) అని నీఫై బోధించాడు.

యాజకత్వము గురించి మీ పిల్లలకు బోధించుట

యాజకత్వము అనేది దేవుని యొక్క అధికారము మరియు శక్తి, దానిచేత ఆయన తన పిల్లలను దీవిస్తారు. నేడు భూమి మీద యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో దేవుని యొక్క యాజకత్వము ఉంది. తమ నిబంధనలను పాటించే సంఘ సభ్యులందరు తమను మరియు తమ కుటుంబాలను బలపరచుకోవడానికి తమ ఇళ్ళలో దేవుని యొక్క యాజకత్వపు శక్తితో దీవించబడ్డారు  ,   ChurchofJesusChrist.org. తమ వ్యక్తిగత జీవితాల్లో మరియు కుటుంబాల్లో రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యమును చేయడంలో ఈ శక్తి సభ్యులకు సహాయపడుతుంది.  ,  

యాజకత్వపు అధికారం ద్వారా మనం విధులను పొందుతాము. స్త్రీ పురుషులు సంఘ పిలుపులలో సేవ చేసినప్పుడు, వారు యాజకత్వపు అధికారంతో, యాజకత్వపు తాళపుచెవులు కలిగియున్న వారి నడిపింపు క్రింద ఆవిధంగా చేస్తారు. పరలోక తండ్రి పిల్లలందరు—ఆయన కుమారులు మరియు ఆయన కుమార్తెలు—యాజకత్వమును బాగా అర్థం చేసుకున్నప్పుడు దీవించబడతారు.

యాజకత్వము గురించి మరింత నేర్చుకోవడానికి, రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆత్మీయ నిధులు,” లియహోనా, నవ. 2019, 76–79 చూడండి.     

  • యాజకత్వపు విధులను మీ కుటుంబ జీవితంలో ఒక స్థిరమైన భాగంగా చేసుకోండి. ఉదాహరణకు, ప్రతీవారము సంస్కారము కొరకు ఆత్మీయంగా సిద్ధపడడానికి మీ బిడ్డకు సహాయపడండి. అతడు లేదా ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఓదార్పు లేదా నడిపింపు అవసరమైనప్పుడు యాజకత్వపు దీవెనలు కోరమని మీ బిడ్డను ప్రోత్సహించండి. యాజకత్వపు శక్తి ద్వారా ప్రభువు మీ కుటుంబాన్ని దీవిస్తున్న విధానాలను తెలియజేయడాన్ని అలవాటుగా మార్చుకోండి.

  • మీరు లేఖనాలను కలిసి చదువుతున్నప్పుడు, దేవుడు తన శక్తి చేత జనులను ఎలా దీవిస్తారో చర్చించడానికి అవకాశాల కొరకు గమనించండి. ఆయన యాజకత్వము ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించిన స్వీయానుభవాలను పంచుకోండి.

  • మీ కుటుంబంలో ఎవరైనా ఒకరి యాజకత్వ అధికార క్రమము గురించి తెలుసుకోండి. (మెల్కీసెదెకు యాజకత్వం గలవారు LineofAuthority@ChurchofJesusChrist.org కు ఈ-మెయిల్ పంపడం ద్వారా తమ యాజకత్వ అధికార క్రమము యొక్క ప్రతిని పొందగలరు.) LineofAuthority@ChurchofJesusChrist.org ChurchofJesusChrist.org యాజకత్వ అధికారం స్వయంగా యేసు క్రీస్తు నుండి వస్తుందని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమనేదాని గురించి మాట్లాడండి. ఆయన దానిని మనతో ఎందుకు పంచుకుంటారు?

  • బాప్తిస్మము తర్వాత, బాప్తిస్మపు నిబంధనను పాటించడం ద్వారా అతడు లేదా ఆమె యాజకత్వ శక్తిని పొందగలరని మీ బిడ్డకు బోధించండి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశము “ఆత్మీయ నిధులు” (లియహోనా, నవ. 2019, 76–79) కలిసి పునర్వీక్షించండి. యాజకత్వపు విధులు మీ జీవితంలోకి దేవుని శక్తిని ఏవిధంగా తెచ్చాయో మీ బిడ్డకు చెప్పండి. యాజకత్వపు శక్తి చేత మనం దీవించబడిన కొన్ని విధానాల జాబితా కొరకు General Handbook,  3.5 చూడండి.

  • “ప్రభువు యొక్క సేవకుడు ఎలా ఉంటాడు?” అనే ప్రశ్నను చర్చించండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:36–42 ను కలిసి చదవండి మరియు జవాబుల కొరకు చూడండి. మీ బిడ్డ (లేదా ఇంకెవరైనా) ఈ వచనాలలోని సూత్రాలు లేదా సుగుణాలలో ఒకదానిని అన్వయించడాన్ని మీరెప్పుడు చూసినా, దానిని ప్రత్యేకించి చూపండి.

  • మీరు లేదా మీ బిడ్డ ఒక తలుపు తెరవడానికి లేదా కారులో బయలుదేరడానికి తాళపుచెవులను ఉపయోగించినప్పుడు, ఒక్క క్షణం ఆ తాళపుచెవులను యాజకత్వ నాయకులు కలిగియున్న తాళపుచెవులతో పోల్చండి. యాజకత్వపు తాళపుచెవులు మన కొరకు దేనిని “తెరుస్తాయి” లేదా “ఆరంభిస్తాయి”? ChurchofJesusChrist.org.

  • మీరు ఒక పిలుపు కొరకు ప్రత్యేకపరచబడినప్పుడు, సాధ్యమైనట్లయితే అక్కడ ఉండమని మీ బిడ్డను ఆహ్వానించండి. మీరు మీ పిలుపును నెరవేర్చడాన్ని మీ బిడ్డను చూడనివ్వండి. అతడు లేదా ఆమె మీకు సహాయపడగల సరియైన విధానాల కొరకు కూడా మీరు చూడవచ్చు. మీ పిలుపులో ప్రభువు యొక్క శక్తిని మీరెలా అనుభవిస్తారో వర్ణించండి.

దేవాలయానికి వెళ్ళుట—మరణించిన వారి కొరకు బాప్తిస్మములు మరియు నిర్ధారణలు

దేవాలయాలు ఆయన పిల్లల కొరకు పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో భాగము. దేవాలయాలలో మనం పవిత్ర విధులలో పాల్గొనినప్పుడు మనం పరలోక తండ్రితో పవిత్ర నిబంధనలను చేస్తాము, అవన్నీ యేసు క్రీస్తు వైపు దారిచూపుతాయి. వాటిని ఈ జీవితంలో పొందని వారితో పాటు ఆయన పిల్లలందరి కొరకు నిబంధనలను చేయడానికి మరియు విధులలో పాల్గొనడానికి పరలోక తండ్రి ఒక మార్గాన్ని ఏర్పాటుచేసారు. అతడు లేదా ఆమెకు 12 ఏళ్ళు వచ్చిన సంవత్సరం ఆరంభం నుండి మీ బిడ్డ, మరణించిన పూర్వీకుల కొరకు దేవాలయంలో బాప్తిస్మము పొందడానికి మరియు నిర్ధారించబడడానికి తగిన వయస్సు గలవాడు.

temples.ChurchofJesusChrist.org.

  • మీ పరిస్థితులు అనుమతించినంత తరచుగా దేవాలయానికి హాజరుకండి. మీరు ఎందుకు వెళ్తున్నారు మరియు పరలోక తండ్రికి, యేసు క్రీస్తుకు దగ్గరగా భావించడానికి దేవాలయం మీకెలా సహాయపడుతుందనే దాని గురించి మీ బిడ్డతో మాట్లాడండి.

  • దేవాలయ సిఫారసు ప్రశ్నలు పునర్వీక్షించండి మరియు కలిసి చర్చించండి. దేవాలయ సిఫారసు మౌఖికములో ఏమి జరుగుతుందనే దాని గురించి మీ బిడ్డతో మాట్లాడండి. దేవాలయ సిఫారసును కలిగియుండడం మీకు ఎందుకు ముఖ్యమైనదో పంచుకోండి.

  • మలాకీ 4:6 కలిసి చదవండి. ఏవిధంగా మీ హృదయాలు మీ పూర్వీకుల వైపు తిరుగగలవనే దాని గురించి మాట్లాడండి. కలిసి మీ కుటుంబ చరిత్రను పరిశోధించడం ద్వారా మీ పూర్వీకుల గురించి మరింత తెలుసుకోండి FamilySearch.org. బాప్తిస్మము పొంది, నిర్ధారించబడవలసిన పూర్వీకుల కొరకు వెదకండి. వార్డు దేవాలయ మరియు కుటుంబ చరిత్ర సలహాదారు మీకు సహాయపడగలరు.

  • ChurchofJesusChrist.org.)

గోత్రజనకుని దీవెన పొందుట

గోత్రజనకుని దీవెన నడిపింపు, ఓదార్పు మరియు ప్రేరేపణకు మూలాధారం కాగలదు. అది మన కొరకు పరలోక తండ్రి నుండి వ్యక్తిగత ఉపదేశాన్ని కలిగియుంటుంది మరియు మన నిత్య ఉనికిని, ఉద్దేశ్యాన్ని గ్రహించడానికి మనకు సహాయపడుతుంది. గోత్రజనకుని దీవెనల యొక్క ప్రాముఖ్యతను, పవిత్ర స్వభావాన్ని అతడు లేదా ఆమెకు బోధించడం ద్వారా గోత్రజనకుని దీవెనను పొందడానికి సిద్ధపడడంలో మీ బిడ్డకు సహాయపడండి.

topics.ChurchofJesusChrist.org.

  • గోత్రజనకుని దీవెన పొందడంలో మీ అనుభవాన్ని మీ బిడ్డతో పంచుకోండి. దానిని పొందడానికి మీరెలా సిద్ధపడ్డారు, దేవునికి దగ్గర కావడానికి అది మీకెలా సహాయపడింది మరియు ఆ దీవెనను మీ జీవితంలో మీరెలా ఉపయోగిస్తారు వంటి విషయాలను మీరు పంచుకోవచ్చు. తమ గోత్రజనకుని దీవెనలను పొందిన ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడమని మీరు మీ బిడ్డను ఆహ్వానించవచ్చు.

  • గోత్రజనకుని దీవెనలు పొందిన పూర్వీకులను మీరు కలిగియున్నట్లయితే, వారిలో కొందరివి మీ బిడ్డతో కలిసి చదవడం ప్రేరేపణ కలిగించేదిగా ఉండవచ్చు. మరణించిన పూర్వీకుల దీవెనల కొరకు మనవి చేయడానికి, ChurchofJesusChrist.org లో లాగిన్ అయ్యి, ChurchofJesusChrist.orgతెర మీద కుడివైపు పైన మూలనున్న అకౌంట్ ఐకాన్‌ను క్లిక్ చేసి, “గోత్రజనకుని దీవెన” ఎంపిక చేయండి.

  • మీ బిడ్డ గోత్రజనకుని దీవెన పొందిన తర్వాత, వారి భావాలను నమోదు చేయమని మరియు వాటిని మీ బిడ్డతో పంచుకోమని అక్కడ ఉన్న కుటుంబ సభ్యులలో ఎవరినైనా ఆహ్వానించండి.

దేవాలయానికి వెళ్ళుట—వరము

“మహోన్నత స్థలము నుండి శక్తి” తో (సిద్ధాంతము మరియు నిబంధనలు 95:8) తన పిల్లలందరికి వరమివ్వాలని లేదా దీవించాలని దేవుడు కోరుతున్నారు. కేవలం ఒక్కసారి మన స్వంత వరమును పొందడానికి మనం దేవాలయానికి వెళ్తాము, కానీ దేవునితో మనం చేసే నిబంధనలు మరియు వరములో భాగంగా ఆయన మనకిచ్చే ఆత్మీయ శక్తి మన జీవితాల్లో అనుదినము మనల్ని దీవించగలదు.

temples.ChurchofJesusChrist.org

  • మీ ఇంటిలో దేవాలయము యొక్క చిత్రాన్ని ప్రదర్శించండి. దేవాలయంలో మీరు అనుభూతి చెందిన భావాల గురించి మీ బిడ్డకు చెప్పండి. ప్రభువు పట్ల మరియు ఆయన మందిరం పట్ల మీ ప్రేమ గురించి, అక్కడ మీరు చేసిన నిబంధనల గురించి తరచు మాట్లాడండి.

  • కలిసి శోధించండి temples.ChurchofJesusChrist.org. “దేవాలయ వరము గురించి” మరియు “ప్రభువు యొక్క మందిరం కొరకు సిద్ధపడండి” వంటి వ్యాసాలను కలిసి చదవండి. దేవాలయం గురించి అతడు లేదా ఆమె కలిగియున్న ప్రశ్నలేవైనా మీ బిడ్డను అడగనివ్వండి. దేవాలయం వెలుపల మీరు దేని గురించి మాట్లాడవచ్చు అనేదాని గురించి నడిపింపు కొరకు, ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ గారి సందేశము “అవసరమైన ప్రతిదానిని పొందుటకు సిద్ధపడుము” చూడండి (లియహోనా, మే 2019, 101–4; ప్రత్యేకించి “గృహ-కేంద్రిత సంఘ-సహకార అభ్యాసము మరియు దేవాలయ సిద్ధపాటు” అనే శీర్షిక గల విభాగాన్ని చూడండి).

  • మీరు, మీ బిడ్డ ఇతర విధులలో పాల్గొనినప్పుడు లేదా సాక్షిగా ఉన్నప్పుడు (సంస్కారము లేదా స్వస్థపరిచే దీవెన వంటివి), ఆ విధిలో ఉన్న చిహ్నము గురించి ఒక్క క్షణం చర్చించండి. చిహ్నములు దేనిని సూచిస్తాయి? అవి యేసు క్రీస్తు గురించి ఏవిధంగా సాక్ష్యమిస్తాయి? యేసు క్రీస్తు గురించి కూడా సాక్ష్యమిచ్చే దేవాలయ విధుల యొక్క చిహ్నరూపకమైన అర్థాన్ని ధ్యానించడానికి సిద్ధపడేలా ఇది మీ బిడ్డకు సహాయపడగలదు.

  • మోషైయ 18:8–10, 13లో వివరించబడిన బాప్తిస్మపు నిబంధనను అతడు లేదా ఆమె ఎలా పాటిస్తున్నారో గమనించడానికి మీ బిడ్డకు సహాయపడండి. అతడిని లేదా ఆమెను ప్రభువు ఎలా దీవిస్తున్నారో గమనించడానికి కూడా మీ బిడ్డకు సహాయపడండి. నిబంధనలను పాటించడానికి అతడు లేదా ఆమె సామర్థ్యంలో మీ బిడ్డ నమ్మకాన్ని పెంపొందించండి.

  • మీ దేవాలయ నిబంధనలు మీ ఎంపికలను ఎలా నడిపిస్తాయో మరియు యేసు క్రీస్తుకు దగ్గర కావడానికి మీకెలా సహాయపడతాయో అనేదాని గురించి బహిరంగంగా, తరచుగా మాట్లాడండి.

సువార్తసేవ చేయుట

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు: “సేవ చేయాలనే పిలుపు కొరకు సిద్ధపడేందుకు మీరు చేయగల ఏకైక అత్యంత ముఖ్యమైన విషయమేమనగా, మీరు సువార్తసేవకు వెళ్ళడానికి చాలాకాలం ముందే మీరు ఒక సువార్తికునిగా మారడం. … విషయం సువార్తసేవకు వెళ్ళడం కాదు; బదులుగా, విషయమేమిటంటే సువార్తికునిగా మారడం మరియు మన హృదయము, శక్తి, మనస్సు మరియు బలమంతటితో మన జీవితమంతా సేవ చేయడం. … జీవితకాల సువార్తసేవ కొరకు మీరు సిద్ధపడుతున్నారు” (“Becoming a Missionary,” Liahona, Nov. 2005, 45–46). ఒక సువార్తికునిగా మారడంలో మీ బిడ్డ కలిగియున్న అనుభవాలు అతడిని లేదా ఆమెను నిత్యము దీవిస్తాయి, కేవలం అతడు లేదా ఆమె సువార్తికులుగా సేవ చేసిన కాలవ్యవధికే అవి పరిమితం కావు.

మరింత తెలుసుకోవడానికి, రస్సెల్ ఎమ్. నెల్సన్, “శాంతికరమైన సువార్తను బోధించుట,” లియహోనా, మే 2022, 6–7; ఎమ్. రస్సెల్ బాల్లర్డ్, “సువార్త సేవ నా జీవితాన్ని శాశ్వతంగా దీవించింది,” లియహోనా, మే 2022, 8–10 చూడండి  ChurchofJesusChrist.org.

  • సహజమైన విధానాల్లో సువార్తను ఎలా పంచుకోవాలో చేసి చూపించండి. పరలోక తండ్రి మరియు రక్షకుని గురించి మీ భావాలను మరియు ఆయన సంఘ సభ్యునిగా మీరు పొందే దీవెనలను ఇతరులతో పంచుకొనే అవకాశాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. సంఘములో మరియు కుటుంబ సంబంధిత ప్రోత్సాహ కార్యక్రమాల్లో మీ కుటుంబంతో చేరడానికి ఇతరులను ఆహ్వానించండి.

  • మీ కుటుంబం సువార్తికులతో సంభాషించడానికి అవకాశాల కొరకు చూడండి. మీ స్నేహితులకు బోధించడానికి వారిని ఆహ్వానించండి లేదా మీ ఇంటిలోని జనులకు బోధించడానికి వారికి అవకాశమివ్వండి. వారు కలిగియున్న అనుభవాల గురించి మరియు యేసు క్రీస్తుకు దగ్గర కావడానికి సువార్తసేవ వారికి ఎలా సహాయపడుతున్నది అనేదాని గురించి సువార్తికులను అడగండి. సువార్తికులుగా కావడానికి సిద్ధపడేందుకు వారు ఏమి చేసారు (లేదా చేయాలనుకున్నారు) అని కూడా అడగండి.

  • మీరు సువార్తసేవ చేసినట్లయితే, మీ అనుభవాల గురించి బహిరంగంగా మరియు తరచుగా మాట్లాడండి. లేదా సువార్తసేవ చేసిన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను దాని గురించి మాట్లాడమని ఆహ్వానించండి. మీ జీవితమంతా మీరు ఇతరులతో సువార్తను పంచుకున్న విధానాల గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. అతడు లేదా ఆమె సువార్తను పంచుకోగల విధానాల గురించి ఆలోచించడానికి మీ బిడ్డకు సహాయపడండి.

  • సువార్త సూత్రాలను మీ కుటుంబానికి బోధించే అవకాశాలను మీ బిడ్డకు ఇవ్వండి. అతని లేదా ఆమె నమ్మకాలను ఇతరులతో పంచుకోవడాన్ని కూడా మీ బిడ్డ సాధన చేయవచ్చు. ఉదాహరణకు, “మోర్మన్ గ్రంథము గురించి ఎన్నడూ వినని వారికి దానిని మనం ఎలా పరిచయం చేస్తాము?” లేదా “క్రైస్తవుడు కాని ఒకరికి రక్షకుని అవసరం గురించి మనం ఎలా వివరిస్తాము?” వంటి ప్రశ్నలను మీరు చర్చించవచ్చు.

  • జనులతో మాట్లాడడాన్ని సౌకర్యంగా భావించడానికి మీ బిడ్డకు సహాయపడండి. ఒక సంభాషణను మొదలుపెట్టడానికి గల కొన్ని మంచి విధానాలేవి? ఇతరులు చెప్పేదానిని ఎలా వినాలి, వారి హృదయాలలో ఉన్నదానిని ఎలా గ్రహించాలి మరియు వారి జీవితాలను దీవించగల సువార్త సత్యాలను ఎలా పంచుకోవాలి అని నేర్చుకోవడానికి మీ బిడ్డను ప్రోత్సహించండి.

  • మీ బిడ్డ ఇతర సంప్రదాయాలు మరియు విశ్వాసాల గురించి తెలుసుకోవడానికి అవకాశాల కొరకు చూడండి. ఇతరుల నమ్మకాలలో ఉన్న మంచిని, నిజమైన సూత్రాలను గుర్తించి, గౌరవించడానికి అతడు లేదా ఆమెకు సహాయపడండి.

దేవాలయానికి వెళ్ళుట—ముద్ర

దేవాలయంలో, ఒక భర్త మరియు భార్య నిత్యత్వము కొరకు వివాహమాడగలరు. ఇది ముద్ర అని పిలువబడే విధిలో జరుగుతుంది. మీ కుమారుడు లేదా కుమార్తె కొరకు ఈ విధి చాలా సంవత్సరాల దూరంలో ఉన్నప్పటికీ, ఆ సంవత్సరాలలో కలిసి మీరు చేసే చిన్న, సరళమైన, స్థిరమైన విషయాలు ఈ అద్భుతమైన దీవెన కొరకు సిద్ధపడేందుకు అతడు లేదా ఆమెకు సహాయపడగలవు.

topics.ChurchofJesusChrist.org.

  • కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” కలిసి చదవండి ChurchofJesusChrist.org. ఈ ప్రకటన కుటుంబ జీవితంలో సంతోషము గురించి మరియు విజయవంతమైన వివాహాల గురించి ఏమి బోధిస్తుంది? మీ బిడ్డతో కలిసి అధ్యయనం చేయడానికి ఈ ప్రకటనలో జాబితా చేయబడిన సూత్రాలలో ఒకదానిని ఎంపిక చేయండి. ఆ సూత్రానికి సంబంధించిన లేఖనాల కొరకు మీరు లేఖనదీపికలో చూడవచ్చు. మీ కుటుంబంలో ఆ సూత్రాన్ని ఇంకా పూర్తిగా అన్వయించడానికి కూడా మీరు లక్ష్యాలను ఏర్పరచుకోవచ్చు. మీరు మీ లక్ష్యాలపై పని చేస్తున్నప్పుడు, ఆ సూత్రమును జీవించడం కుటుంబ జీవితంపై కలిగియున్న ప్రభావాన్ని కలిసి చర్చించండి.

  • మీకు వివాహమైనట్లయితే, ఒక జంటగా మీరు బాగా చేస్తున్నారని భావిస్తున్న విషయాలు, మీరు నేర్చుకుంటున్న విషయాలు మరియు మెరుగుపరచుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్న విధానాల గురించి బాహాటంగా మీ బిడ్డతో చెప్పండి. మీరు మరియు మీ భాగస్వామి దేవాలయంలో ముద్రింపబడినట్లయితే, మీరు ఒకరితో ఒకరు మరియు ప్రభువుతో చేసిన మీ నిబంధనలను పాటించడానికి ఎలా ప్రయాసపడుతున్నారో మాదిరి ద్వారా మీ బిడ్డకు చూపండి. పరలోక తండ్రిని మరియు రక్షకుడిని మీ అనుబంధానికి కేంద్రంగా చేయడానికి మీరు ఎలా ప్రయాసపడుతున్నారో మరియు వారు మీకు ఎలా సహాయపడుతున్నారో మీ బిడ్డకు చెప్పండి.

  • కుటుంబ నిర్ణయాలు చేయవలసి వచ్చినప్పుడు, కుటుంబ సలహాసభలు మరియు చర్చలు జరపండి. కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలు విని మరియు విలువివ్వబడేలా చూడండి. విషయాలను అందరూ ఒకే విధంగా చూడనప్పుడు కూడా, కుటుంబ అనుబంధాలలో ఆరోగ్యకరమైన సంభాషణను, దయను ప్రదర్శించే అవకాశంగా ఈ చర్చలను ఉపయోగించండి.

  • కుటుంబంలో అభిప్రాయభేదం లేదా వివాదం ఉన్నప్పుడు, సహనము మరియు దయను ప్రదర్శించండి. వివాదాన్ని క్రీస్తు వంటి విధానాలలో పరిష్కరించడం సంతోషకరమైన వివాహం కొరకు సిద్ధపడేందుకు అతడు లేదా ఆమెకు ఎలా సహాయపడగలదో చూడడానికి మీ బిడ్డకు సహాయపడండి. కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 121:41–42 చదవండి మరియు ఈ వచనాలలోని సూత్రాలు వివాహానికి ఎలా అన్వయించబడగలవో అనేదాని గురించి మాట్లాడండి.