2010–2019
అవసరమైన ప్రతిదానిని పొందుటకు సిద్ధపడుము
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


అవసరమైన ప్రతిదానిని పొందుటకు సిద్ధపడుము

పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్తను నేర్చుకొనుటకు మరియు ప్రేమించుటకు మన వ్యక్తిగత బాధ్యతను నెరవేర్చుటకు మనము ప్రయాసపడినప్పుడు దీవెనలు వచ్చునని నేను సాక్ష్యమిస్తున్నాను.

ఇటీవల సర్వసభ్య సమావేశాలలో ప్రకటించబడిన సవరణల యొక్క పరంపర చేత రుజువు చేయబడినట్లుగా, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క కార్యక్రమాలు మరియు ప్రోత్సాహకార్యక్రమాలు ఎప్పటికంటే ఎక్కువ గృహము కేంద్రీకరించబడినవిగా మరియు సంఘము బలపరచబడినవిగా అగుచున్నవి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు సలహా ఇచ్చారు: “ఇంకా చాలా అధికము రాబోవుచున్నవి. … మీ విటమిన్ మాత్రలు తీసుకోండి. మీరు విశ్రాంతి తీసుకొండి. ఇది ఉత్సాహము కలిగించబోవుచున్నది.”1

ప్రభువు యొక్క సంఘములో కొనసాగుచున్న సవరణలు యొక్క కొన్ని ప్రధాన ఫలితాలను మనము కలిసి ఆలోచించినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క సహాయము కొరకు నేను ప్రార్థిస్తున్నాను మరియు ఆహ్వానిస్తున్నాను.

గృహ-కేంద్రిత సంఘ-సహకార సువార్త అభ్యాసము

ఈమధ్య జరిగిన యాజకత్వ నాయకత్వ సమావేశములో, ఎల్డర్ క్రైయిగ్ సి. క్రిస్టెన్‌సన్ నా సహవాసిగా ఉన్నారు, మరియు ఆయన గృహ-కేంద్రిత సంఘ-సహకారముగా మారే సూత్రమును నొక్కి చెప్పుటకు రెండు సాధారణమైన ప్రశ్నలను ఉపయోగించారు. ఆదివారము సంఘ సమావేశముల తరువాత మన ఇండ్లకు వెళ్ళి, “ఈ రోజు సంఘములో మీరు రక్షకుడు మరియు ఆయన సువార్త గురించి ఏమి నేర్చుకున్నారు?” అడుగుటకు బదులుగా మన సంఘ సమావేశాలందు మనమిలా అడగాలి, “ఈ వారము మీ ఇంటిలో మీరు రక్షకుడు మరియు ఆయన సువార్త గురించి మీరేమి నేర్చుకున్నారు?” సరైన సబ్బాతు దిన ఆచరణ, క్రొత్త పాఠ్య ప్రణాళిక, మరియు సరిచేయబడిన సమావేశ ప్రణాళిక, అన్నీ మనము మన గృహాలలో మరియు సంఘములో రెండిటిలో సువార్తను నేర్చుకొనుటకు మనకు సహాయపడతాయి.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రతీ సభ్యుడు ప్రభువు యొక్క బోధనలను నేర్చుకొనుటకు మరియు జీవించుటకు, రక్షణ మరియు ఉన్నత స్థితి యొక్క విధులను సరైన అధికారము ద్వారా పొందుటకు ఒక వ్యక్తిగత బాధ్యతను కలిగియున్నారు. మనము తెలుసుకోవాల్సిన సమస్తమును మనము బోధించుటకు లేక చెప్పుటకు, సమర్పించబడిన శిష్యులగుటకు తెలుసుకోవాల్సిన దానిని, చేయాల్సిన దానిని మరియు అంతము వరకు సాహసముగా సహించుటకు సంఘము ఒక నిర్మాణముగా మనము ఆశించరాదు.2 మేలుగా, మన వ్యక్తిగత బాధ్యత ఏదనగా మనము నేర్చుకోవాల్సిన దానిని నేర్చుకొనుట, మనము జీవించాలని మనకు తెలిసినట్లుగా జీవించుట, మరియు బోధకుడు మనము కావాలని కోరినట్లుగా మారుట. నేర్చుకొనుటకు, జీవించుటకు, మరియు మారుటకు మన గృహాలు అంతిమ వేదికగా ఉన్నాయి.

ఒక బిడ్డగా, జోసెఫ్ స్మిత్ తన కుటుంబము నుండి దేవుని గురించి నేర్చుకున్నాడు. తన కొరకు దేవుని చిత్తమును కనుగొనుటకు అతడి ప్రయత్నాలు అనేక వైవిధ్యమైన క్రైస్తవ మతశాఖల మధ్య సత్యమును వెదకుటకు, లేఖనాలను శ్రద్ధగా ధ్యానించుటకు, మరియు దేవునికి నిజాయితీగా ప్రార్థించునట్లు చేసాయి. తండ్రి మరియు కుమారుడు ప్రత్యక్షమైన తరువాత వెంటనే పరిశుద్ధ వనము నుండి యౌవనుడైన జోసెఫ్ స్మిత్ తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతడు తన తల్లితో మొదట మాట్లాడాడు. అతడు “చలి మంట ప్రదేశము వద్ద ఆనుకొన్నప్పుడు, (అతడి) తల్లి విషయమేమిటని అడిగింది. (జోసెఫ్) జవాబిచ్చాడు, ‘ఏమీ కాదు, అంతా బాగానే వుంది—నేను బాగానే ఉన్నాను. తరువాత (అతడు) (తన) తల్లితో చెప్పాడు, ‘నా అంతట నేను తెలుసుకున్నాను.’”3 జోసెఫ్ యొక్క అనుభవము మనలో ప్రతీఒక్కరం అనుకరించగల శక్తివంతమైన మాదిరిని మనకిచ్చును. మనము కూడ మనకై మనము నేర్చుకోవాల్సినవసరమున్నది.

పరలోక తండ్రి తన పిల్లల కొరకైన ప్రణాళిక యొక్క ప్రబలమైన ఉద్దేశము ఆయన వలే ఎక్కువగా మారుట. ఆ ప్రకారము, ఆయన మనము ఎదిగి, అభివృద్ధి చెందుటకు ఆవశ్యకమైన అవకాశాలను మనకు అందించెను. నేర్చుకొనుటకు మన ఒడంబడిక మరియు సత్యము ప్రకారము జీవించుట ఎప్పటికీ ఎక్కువగా కలవరము చెందిన దుష్టమైన “కల్లోలము”4 నిండిన లోకములో అత్యధికంగా ముఖ్యమైనది. మనము కేవలము సంఘ సమావేశాలకు హాజరై, కార్యక్రమాలలో పాల్గొని, తద్వారా, “ఆపద్దినమందు ఎదిరించుటకు”5 సమస్త ఆత్మీయ బలమును మరియు భద్రతను పొందుటకు మనము ఆశించరాదు.

“తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమ మరియు నీతియందు పెంచు పరిశుద్ధమైన బాధ్యతను కలిగియున్నారు.”6 ప్రేరేపించబడిన సంఘ నాయకులు, బోధకులు, మరియు ప్రోత్సాహకార్యక్రమాలు ఆత్మీయంగా ఎదుగుటకు వ్యక్తులు మరియు కుటుంబ ప్రయత్నాలకు సహాయపడును. నిబంధన మార్గముపై ముందుకు త్రోసుకొని వెళ్ళుటకు మనందరికి సహాయము అవసరమైనప్పటికినీ, ఆత్మీయ బలము మరియు పట్టుదలను వృద్ధి చేయుట మనలో ప్రతీఒక్కరిపై ఆధారపడియున్నది.

ప్రవక్త లీహై కుమారుడు నీఫై, తన తండ్రి జీవవృక్షమును గూర్చిన దర్శనములో నేర్చుకొన్న సంగతులను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తనకై తాను చూచి, విని, మరియు తెలుసుకోవాలని ఎలా కోరాడో జ్ఞాపకము చేసుకొనుము. నీఫైకు స్పష్టముగా అవసరమయ్యెను మరియు అతడి “మంచి తల్లిదండ్రుల”7 యొక్క మాదిరి మరియు బోధనల చేత దీవించబడ్డాడు. అయినప్పటికినీ, జోసెఫ్ స్మిత్ వలే, అతడు తనకై తాను సత్యమును నేర్చుకొని, తెలుసుకోవాలని ఆపేక్షించాడు.

యేసు క్రీస్తు మరియు ఆయన పునఃస్థాపించబడిన సువార్త గురించి మీకు లేక నాకు తెలిసినదంతా, ఇతరులు మనకు బోధించి లేక చెప్పుచున్నది అయితే, ఆయన, ఆయన మహిమకరమైన కడవరి దిన కార్యమును గూర్చి మన సాక్ష్యము ఇసుకపై నిర్మించబడినదగును.8 మనము ప్రేమించి, నమ్మిన వారిని కూడా—ఇతర జనుల నుండి సువార్త వెలుగు మరియు జ్ఞానమును అప్పుగా తేలేము లేక పూర్తిగా ఆధారపడలేము.

ముఖ్యముగా, ప్రతీ కడవరి-దిన పరిశుద్ధుడు అతడు లేక ఆమె తనకైతాను “లోకములోనికి మన రాకయందు దేవుని యొక్క ప్రణాళికలు మరియు ఉద్దేశములను”9 గ్రహించాల్సినవసరమున్నదని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించాడు.

“ఆదాము దినముల నుండి దేవునితో మానవుని అనుబంధము మరియు భవిష్యత్తులో దూతలపై వ్రాయబడిన సమస్తమును మనము చదివి గ్రహించగలమా, దాని గురించి మనకు చాలా స్వల్పము తెలియును. ఇతరుల యొక్క అనుభవమును లేక వారికి ఇవ్వబడిన బయల్పాటు చదువుట, మన స్థితి మరియు దేవునితో నిజమైన అనుబంధమును గూర్చి విస్తారమైన దర్శనమును మనకు ఎన్నడూ ఇవ్వలేదు. ఈ సంగతులను గూర్చిన జ్ఞానము, ఆ ఉద్దేశము కొరకు నియమించబడిన దేవుని యొక్క విధుల ద్వారా అనుభవము ద్వారా మాత్రమే పొందబడును.10

వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఈ గొప్ప ఆత్మీయ ఉద్దేశమును నెరవేర్పుకు సహాయపడుట, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల కార్యక్రమాలు మరియు ప్రోత్సాహకార్యక్రమాలు కాలముల సంపూర్ణత యొక్క యుగమైన ఈ ప్రత్యేక కాలములో ఎక్కువగా గృహము కేంద్రీకరించబడిన మరియు సంఘము సహకరించేవిగా మారుటకు ప్రధాన కారణాలలో ఒకటి.

గృహ-కేంద్రిత సంఘ-సహకర అభ్యాసము ఫలితాలు

సువార్త అభ్యసించుటకు మరింతగా గృహ-కేంద్రిత సంఘ-సహకరముగా ఎక్కువగా మారుట యొక్క ముఖ్యమైన సూచనలను నేను మీకు సంక్షిప్తపరుస్తాను.

మన గృహాలలో అంతిమ మిషనరీ శిక్షణా కేంద్రమున్నది; రెండవ మిషనరీ శిక్షణా కేంద్రములు ప్రోవో, మనీలా, మెక్సికో సిటీ, మరియు ఇతర ప్రదేశాలలో ఉన్నవి. మన మిక్కిలిగా నిర్ధేశించు సబ్బాతు పాఠశాల తరగతులు మన వ్యక్తిగత మరియు కుటుంబ అధ్యయనము మన నివాస స్థలములలో ఉండాలి; సహాయకరమైనది కానీ రెండవ సబ్బాతు బడి తరగతులు మన సమావేశ గృహాలలో జరపబడును.

కుటుంబ చరిత్ర కేంద్రములు ఇప్పుడు మన గృహాలలో ఉన్నాయి. మన కుటుంబ చరిత్ర పరిశోధనా కార్యము కొరకు అనుబంధ సహాయము మన సమావేశ గృహాలలో కూడ లభ్యమవుతాయి

అవసరమైన దేవాలయ సిద్ధపాటు తరగతులు మన గృహాలలో జరుగును; ముఖ్యమైనవి కాని రెండవ దేవాలయ సిద్ధపాటు తరగతులు మన సమావేశ గృహాలలో కూడా అప్పుడప్పుడు జరపబడవచ్చు.

మన గృహాలను పరిశుద్ద స్థలములుగా చేయుట, అక్కడ మనము “పరిశుద్ధ స్థలములలో నిలబడగలుగుట”11 ఈ కడవరి దినాలలో ఆవశ్యకమైనది. గృహ-కేంద్రిత సంఘ-సహకార అభ్యాసము నేడు మన ఆత్మీయ బలము మరియు భద్రతకు ముఖ్యమైనట్లుగా, అది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ముఖ్యమైనది.

గృహ-కేంద్రిత సంఘ-సహకార అభ్యాసము మరియు దేవాలయ సిద్ధపాటు

“గృహ-కేంద్రిత సంఘ-సహకార” సూత్రము ప్రభువు యొక్క మందిరములో పరిశుద్ధ విధులను మరియు నిబంధనలను పొందుటకు మన వ్యక్తిగత సిద్ధపాటు మరియు యోగ్యతకు ఎలా అన్వయిస్తుందో దయచేసి ఆలోచించుము.

వాస్తవానికి, దేవాలయ సిద్ధపాటు మన గృహాలలో ఎక్కువ ప్రభావవంతమైనది. కానీ దేవాలయము అనుభవము గురించి, దేవాలయము వెలుపల ఏదీ సరిగా చెప్పాలో లేక చెప్పకూడదో అనేకమంది సంఘ సభ్యులు అనిశ్చయముగా ఉన్నారు.

అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ ఈ అనిశ్చయత ఎందుకున్నదో వివరించారు.

“దేవాలయము పరిశుద్ధమైన స్థలము, మరియు దేవాలయములోని విధులు పరిశుద్ధమైన స్వభావమును కలిగియున్నవి. దాని యొక్క పరిశుద్ధమైన స్వభావము వలన, మనము కొన్నిసార్లు మన పిల్లలు మరియు మనుమలకు దేవాలయము గూర్చి ఏదైనా చెప్పుటకు అయిష్టముగా ఉన్నాము.

“పర్యవసానంగా, అనేకమంది దేవాలయమునకు వెళ్ళుటకు ఒక నిజమైన కోరికను వృద్ధి చేయరు, లేక వారు వెళ్లిప్పుడు, వారి ప్రవేశించిన బాధ్యతలు మరియు నిబంధనల కొరకు సిద్ధపడుటకు, ఎక్కువ నేపథ్యము లేకుండా ఆవిధంగా చేస్తారు.

సరైన అవగాహన లేక నేపథ్యము మన యువత దేవాలయము కొరకు సిద్ధపడుటకు అపరిమితంగా సహాయపడునని నేను నమ్ముచున్నాను … [మరియు] అబ్రహాము తనవి వెదకినట్లుగా వారి యాజకత్వ దీవెనలు వెదకుటకు ఒక కోరికను వారిలో పెంచును”12 అని నేను నమ్ముచున్నాను.

రెండు ముఖ్యమైన సూచనలు అధ్యక్షులు బెన్సన్ చేత నొక్కిచెప్పబడిన సరైన అవగాహనను సాధించుటకు మనకు సహాయపడగలవు.

మార్గదర్శక సూచన#1. మనము ప్రభువును ప్రేమిస్తున్నాము కనుక, ఆయన పరిశుద్ధ మందిరమును గూర్చి మనము ఎల్లపుడు భక్తిగల గౌరవముతో మాట్లాడాలి. పరిశుద్ధ దేవాలయ ఆచారములందు మనము పొందు నిబంధనలతో సంబంధించిన ప్రత్యేక చిహ్నములను వివరించరాదు లేక తెలియచేయరాదు. దేవాలయములో మనము బయల్పరచరాదని మనము ప్రత్యేకంగా వాగ్దనము చేసిన పరిశుద్ధ సమాచారమును మనము చర్చించరాదు.

మార్గదర్శక సూచన#2. దేవాలయము ప్రభువు యొక్క మందిరము. దేవాలయములో సమస్తము మన రక్షకుడైన, యేసు క్రీస్తును సూచించును. దేవాలయ విధులు మరియు నిబంధనలతో సంబంధించిన సిద్ధాంతము మరియు సూత్రముల యొక్క ప్రధాన ఉద్దేశములను మనము చర్చించవచ్చు.

అధ్యక్షులు హవార్డ్ డబ్లూ. హంటర్ ఇలా ఉపదేశించెను: “దేవాలయములో మనకు కలిగిన ఆత్మీయ భావనలను మన పిల్లలతో మనము పంచుకుందాము. మరియు ప్రభువు యొక్క మందిరము యొక్క ఉద్దేశములను గూర్చి యుక్తముగా చెప్పగల సంగతులను మనము వారికి మరింత మనఃపూర్వకంగా, మరింత సౌకర్యంగా బోదిద్ధాము.”13

ప్రవక్త జోసెఫ్ స్మిత్ నుండి అధ్యక్షుల రస్సెల్ ఎమ్. నెల్సన్ వరకు తరములంతటా, దేవాలయ విధులు మరియు నిబంధనల సిద్ధాంతపరమైన ఉద్దేశములు సంఘ నాయకుల చేత విస్తారముగా బోధింపబడినవి.14 వనరుల యొక్క సమృద్ధియైన సరఫరా ముద్రణ, ఆడియో, వీడియో, మరియు ఇతరములు విధులు, ఎండోమెంట్లు గురించి నేర్చుకొనుటకు మనకు సహాయపడతాయి.15 విధేయత యొక్క చట్టము, సువార్త యొక్క చట్టము, పవిత్రత యొక్క చట్టము, మరియు సమర్పణ చట్టమును పాటించుటకు నిబంధనలను పొందుట మరియు గౌరవించుట ద్వారా రక్షకుని అనుసరించుట గురించి కూడా సమాచారము లభ్యమగును.16 temples.ChurchofJesusChrist.org వద్ద లభ్యమయ్యే శ్రేష్టమైన వనరులతో సంఘ సభ్యులందరు పరిచయము కలిగియుండాలి.

చిత్రం
temples.churchofjesuschrist.org

దేవాలయ ఆచారముల పరిశుద్ధ స్వభావము మరియు సంఘము చేత ప్రచురించబడిన దేవాలయములను గూర్చిన, ఖచ్చితమైన, సరైన, మరియు ప్రజలకు లభ్యమయ్యే విలువై సమాచారమునకు మధ్య ముఖ్యమైన సమతుల్యతను అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నొక్కి చెప్పారు. ఆయన ఇలా వివరించారు: “‘అభిషేకించు,’ ‘నిబంధన,’ ‘త్యాగములు,’ మరియు ‘దేవాలయము,’ వంటి దేవాలయమునకు సంబంధించిన విషయాలను లేఖనములలో చదవమని … సభ్యులను నేను సిఫారసు చేస్తున్నాను. ఒకరు నిర్గామకాండము, అధ్యాయములు 26–29, మరియు లేవీకాండము, అధ్యాయము 8 చదువుటకు కోరవచ్చు. పాత నిబంధన, అదేవిధంగా, మోషే మరియు అమూల్యమైన ముత్యములో అబ్రహాము గ్రంథములు, దేవాలయ కార్యము యొక్క పురాతనత్వము మరియు దాని విధుల యొక్క సహించే స్వభావమును తెలియచేయును.”17

చిత్రం
పరిశుద్థ దేవాలయ వస్త్ర వీడియో

కనుక, మీ కుమారుడు లేక కుమార్తై, ఇలా అడిగారనుకోండి, “దేవాలయములో విచిత్రమైన దుస్తులు వేసుకుంటారని స్కూలు వద్ద ఎవరో చెప్పారు. ” అది సరైనదేనా?” “Sacred Temple Clothing,” శీర్షిక గల క్లుప్త వీడియో temples.churchofjesuschrist.org వద్ద లభ్యమగును. ప్రాచీన కాలముల నుండి పురుషులు, స్త్రీలు దేవునికి తమ సమర్పణ యొక్క అంతరంగిక భావాలను వ్యక్తపరచుటకు పరిశుద్ధ సంగీతమును, భిన్నమైన ప్రార్థనా రూపములు, చిహ్నపూర్వకమైన మతపరమైన దుస్తులు, సంజ్ఞలు, మరియు వైదిక క్రియలను ఎలా హత్తుకున్నారో వివరించును. కాబట్టి, ముఖ్యమైన సూచన మరియు వీడియో వంటి అసాధారణమైన వనరుల ద్వారా మహిమకరమైన దేవాలయ దీవెనల కొరకు గృహ-కేంద్రిత సిద్ధపాటును సంఘము బలపరచును. ఎక్కువగా ఉపయోగపడే సమాచారము మీకు లభ్యమగును.18

ప్రభువు ఆత్మ యొక్క దీనత్వమునందు నడుచుటకు మనము ప్రయాసపడినప్పుడు,19 పరిశుద్ధ దేవాలయ విధులు మరియు నిబంధనలను గూర్చి చర్చించుటకు సరైనది, మరియు సరైనది కాని దానిమధ్య అవసరమైన సమతుల్యతను గ్రహించుటకు మరియు సాధించుటకు మనము దీవించబడతాము.

వాగ్దానము మరియు సాక్ష్యము

మీ సువార్త శిక్షణ గృహము కేంద్రీకరించబడిన మరియు సంఘము సహాయమివ్వబడినదిగా మారినదా అని మీలో కొందరు ఆశ్చర్యపడుతున్నారని నేను అనుకుంటున్నాను. బహుశా, మీ ఇంటిలో మీరు ఒక్కరే సంఘ సభ్యులైతే, లేక సహకరించని సహవాసిని కలిగియుంటే, లేక ఒంటరి తల్లి లేక తండ్రి, లేక ఒంటరిగా జీవిస్తున్నా, లేక విడాకులు పొందిన కడవరి-దిన పరిశుద్ధులు అయితే, మరియు ఈ సూత్రములు మీకు ఎలా అన్వయిస్తాయో మీరు ప్రశ్నలను కలిగియుండవచ్చు. “దీనిని మనము చేయగలమా?” అని ప్రశ్నిస్తూ ఒకరినొకరు చూసుకునే ఒక భర్త మరియు భార్య మీరు కావచ్చు.

అవును, మీరు దానిని చేయగలరు! సాధ్యపరచు దీవెనలు మీ జీవితంలోనికి ప్రవహించునని మరియు స్పష్టమగునని నేను వాగ్దానము చేయుచున్నాను. ద్వారములు తెరవబడును. వెలుగు ప్రకాశించును. శ్రద్ధగా మరియు ఓపికగా పట్టుదలతో ఉండుటకు మీ సామర్ధ్యము హెచ్చించబడును.

పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్తను నేర్చుకొనుటకు మరియు ప్రేమించుటకు మన వ్యక్తిగత బాధ్యతను నెరవేర్చుటకు మనము ప్రయాసపడినప్పుడు, నష్టమును భర్తీ చేయు దీవెనలు వచ్చునని నేను సాక్ష్యమిస్తున్నాను. మనము నిజముగా “అవసరమైన ప్రతీదానిని పొందుటకు సిద్ధపడియుండగలము,”20 ఆవిధంగా నేను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వాగ్దానమిస్తున్నాను మరియు సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.