చేతి పుస్తకములు మరియు పిలుపులు
8. పెద్దల సమూహము


“8. పెద్దల సమూహము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“8. పెద్దల సమూహము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
మాట్లాడుకుంటున్న పురుషులు

8.

పెద్దల సమూహము

8.1

ఉద్దేశ్యము మరియు నిర్మాణము

8.1.1

ఉద్దేశ్యము

18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న యోగ్యులైన పురుషులు మెల్కీసెదెకు యాజకత్వమును పొందవచ్చు మరియు ఎల్డర్ స్థానానికి నియమించబడవచ్చు. ఆ స్థానానికి నియమించబడిన ఒక వ్యక్తి దేవుడి పనిని నెరవేర్చడంలో ఆయనకు సహాయం చేయడానికి పవిత్రమైన నిబంధనలోకి ప్రవేశిస్తాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:33–44 చూడండి).

8.1.2

పెద్దల సమూహములో సభ్యత్వం

ప్రతి వార్డుకు పెద్దల సమూహము ఉంటుంది. ఇది క్రింది సోదరులను కలిగి ఉంటుంది:

  • వార్డులోని పెద్దలందరూ.

  • వార్డులోని కాబోయే పెద్దలందరూ (8.4 చూడండి).

  • ప్రస్తుతం స్టేకు అధ్యక్షత్వములో, బిషప్రిక్కులో, ఉన్నత సలహామండలిలో లేదా గోత్రజనకునిగా సేవచేస్తున్న వారు మినహా వార్డులోని ప్రధాన యాజకులందరూ.

ఒక యువకుడు ఇంకా ఎల్డర్‌గా నియమించబడనప్పటికీ, అతను 18 ఏళ్ళు నిండిన తర్వాత పెద్దల సమూహపు సమావేశాలకు హాజరుకావడం ప్రారంభించవచ్చు. 19 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు లేదా గృహము నుండి దూరంగా, అంటే విశ్వవిద్యాలయంలో చేరడానికి లేదా సువార్తసేవకు వెళ్తున్నప్పుడు, అతను యోగ్యుడైనట్లయితే ఎల్డర్‌గా నియమించబడాలి.

18 ఏళ్ళలోపు వివాహిత పురుషులు కాబోయే పెద్దలు మరియు పెద్దల సమూహ సభ్యులు కూడా.

8.2

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనడం

8.2.1

యేసు క్రీస్తు సువార్తను జీవించడం

8.2.1.2

సమూహ సమావేశాలలో సువార్త నేర్చుకోవడం

నెలలో రెండవ మరియు నాల్గవ ఆదివారాలలో సమావేశాలు జరుగుతాయి. అవి 50 నిమిషాల పాటు ఉంటాయి. పెద్దల సమూహ అధ్యక్షత్వము ఈ సమావేశాలను ప్రణాళిక చేస్తారు. అధ్యక్షత్వములోని ఒక సభ్యుడు నిర్వహిస్తారు.

సమూహ సమావేశాలు ఇటీవలి సర్వసభ్య సమావేశము నుండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రసంగాలలోని అంశాలపై దృష్టి పెడతాయి.

8.2.1.3

ప్రోత్సాహ కార్యక్రమాలు

పెద్దల సమూహ అధ్యక్షత్వములు ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయవచ్చు. చాలా ప్రోత్సాహ కార్యక్రమాలు ఆదివారం లేదా సోమవారం సాయంత్రం కాకుండా ఇతర సమయాల్లో నిర్వహించబడతాయి.

8.2.2

అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం

8.2.2.1

పరిచర్య

పెద్దల సమూహ సభ్యులు సమూహ అధ్యక్షత్వము నుండి పరిచర్య నియామకాలను పొందుతారు. మరింత సమాచారం కోసం, 21వ అధ్యాయం చూడండి.

8.2.2.2

స్వల్పకాలిక అవసరాలు

పరిచర్య చేసే సహోదరులు తాము సేవచేసే వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తారు. అనారోగ్యం, జననాలు, మరణాలు, ఉద్యోగం కోల్పోవడం మరియు ఇతర పరిస్థితులలో సభ్యులకు స్వల్పకాలిక సహాయం అవసరం కావచ్చు.

అవసరమైనప్పుడు, పరిచర్య చేసే సహోదరులు సహాయం కోసం పెద్దల సమూహ అధ్యక్షత్వమును అడుగుతారు.

8.2.2.3

దీర్ఘకాలిక అవసరాలు మరియు స్వావలంబన

బిషప్పుచేత సమన్వయపరచబడినట్లుగా, పెద్దల సమూహం మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు సభ్యులకు దీర్ఘకాలిక అవసరాలు మరియు స్వావలంబనలో సహాయం చేస్తాయి.

పెద్దల సమూహ అధ్యక్షుడు, ఉపశమన సమాజ అధ్యక్షురాలు లేదా మరొక నాయకుడు స్వావలంబన ప్రణాళికను అభివృద్ధి చేయడంలో ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి సహాయం చేస్తారు. పరిచర్య చేసే సహోదరులు లేదా సహోదరీలు కూడా ప్రణాళికలో సహాయం చేయవచ్చు.

8.2.2.4

ఒక వార్డు సభ్యుడు మరణించినప్పుడు

ఒక వార్డు సభ్యుడు మరణించినప్పుడు, పెద్దల సమూహం మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు ఓదార్పు మరియు సహాయాన్ని అందిస్తాయి. బిషప్పు మార్గదర్శకత్వంలో, వారు అంత్యక్రియలకు సహాయం చేయవచ్చు.

మరింత సమాచారం కోసం, 38.5.8 చూడండి.

8.2.3

సువార్తను స్వీకరించమని అందరినీ ఆహ్వానించడం

పెద్దల సమూహ అధ్యక్షుడు అధ్యక్షత్వములోని ఒక సభ్యుడిని వార్డులో సభ్యుల సువార్త పరిచర్యలో సహాయం చేయడానికి నియమిస్తాడు. అతను ఈ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఉపశమన సమాజ అధ్యక్షత్వములో నియమించబడిన సభ్యురాలితో కలిసి పని చేస్తాడు.

23.5.1 మరియు 23.5.3 చూడండి.

8.2.4

నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయడం

పెద్దల సమూహ అధ్యక్షుడు అధ్యక్షత్వములోని ఒక సభ్యుడిని వార్డులో దేవాలయం మరియు కుటుంబ చరిత్ర కార్యమును నడిపించడానికి నియమిస్తాడు. అతను ఈ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఉపశమన సమాజ అధ్యక్షత్వములో నియమించబడిన సభ్యురాలితో కలిసి పని చేస్తాడు.

25.2.2 చూడండి.

8.3

పెద్దల సమూహ నాయకులు

8.3.1

స్టేకు అధ్యక్షత్వము మరియు బిషప్పు

పెద్దల సమూహ అధ్యక్షుడు నేరుగా స్టేకు అధ్యక్షత్వము క్రింద పని చేస్తారు. అతను తన బాధ్యతల గురించి దిశానిర్దేశం కొరకు మరియు నివేదించడానికి అధ్యక్షత్వములోని సభ్యునితో క్రమం తప్పకుండా సమావేశమవుతాడు.

పెద్దల సమూహ అధ్యక్షుడు వార్డులో అధ్యక్షత్వము వహించు అధికారి అయిన బిషప్పు నుండి కూడా మార్గదర్శకత్వాన్ని పొందుతారు. వారు క్రమం తప్పకుండా కలుసుకుంటారు.

8.3.2

ప్రధాన సలహాదారుడు

ప్రతీ పెద్దల సమూహంలో వారికి ప్రాతినిధ్యం వహించడానికి స్టేకు అధ్యక్షత్వము ఒక ప్రధాన సలహాదారుని నియమిస్తుంది. అతని బాధ్యతలు 6.5 లో వివరించబడ్డాయి.

8.3.3

పెద్దల సమూహ అధ్యక్షత్వము

8.3.3.1

పెద్దల సమూహ అధ్యక్షత్వమును పిలవడం

బిషప్పుతో సంప్రదింపులు జరిపిన తర్వాత, స్టేకు అధ్యక్షుడు పెద్దల సమూహ అధ్యక్షునిగా సేవచేయడానికి ఒక ఎల్డర్‌ను లేదా ప్రధాన యాజకుడిని పిలుస్తారు.

విభాగం తగినంత పెద్దదైతే, తన సలహాదారులుగా సేవ చేయడానికి పెద్దల సమూహ అధ్యక్షుడు ఒకరు లేదా ఇద్దరు ఎల్డర్లను లేదా ప్రధాన యాజకులను స్టేకు అధ్యక్షునికి సిఫార్సు చేస్తారు.

8.3.3.2

బాధ్యతలు

పెద్దల సమూహ అధ్యక్షుడికి క్రింది బాధ్యతలు ఉంటాయి. అతని సలహాదారులు అతనికి సహాయం చేస్తారు.

  • వార్డు సలహాసభలో సేవ చేస్తారు.

  • రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనడానికి సమూహం యొక్క ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తారు.(1వ అధ్యాయం చూడండి).

  • పరిచర్య చేసే సహోదరుల సేవను వ్యవస్థీకరిస్తారు మరియు పర్యవేక్షిస్తారు.

  • బిషప్పు మార్గదర్శకత్వంలో, వార్డులోని వయోజన సభ్యులతో ఆలోచన చేస్తారు.

  • అవివాహిత మరియు వివాహిత యువకులైన సహోదరులను బలపరిచేందుకు పెద్దల సమూహం యొక్క ప్రయత్నాలను సమన్వయం చేస్తారు.

  • ప్రతీ సమూహ సభ్యునితో కనీసం సంవత్సరానికి ఒకసారి వ్యక్తిగతంగా కలుస్తారు.

  • సమూహ సభ్యులకు వారి యాజకత్వ విధులను బోధిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:89 చూడండి). ఇందులో విధులు మరియు దీవెనలు నిర్వహించడంలో వారి యాజకత్వాన్ని ఎలా ఉపయోగించాలో వారికి బోధించడం కూడా ఉంది.

  • సమూహ రికార్డులను, నివేదికలను మరియు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తారు (LCR.ChurchofJesusChrist.org చూడండి).

8.3.3.3

అధ్యక్షత్వ సమావేశము

పెద్దల సమూహ అధ్యక్షత్వము మరియు కార్యదర్శి క్రమం తప్పకుండా సమావేశమవుతారు. అధ్యక్షుడు ఈ సమావేశాలను నిర్వహిస్తాడు. సమూహమునకు నియమించబడిన ప్రధాన సలహాదారుడు నియమితకాలములలో హాజరవుతారు.

చర్చనీయాంశముల జాబితాలో ఈ క్రింది అంశాలను జతచేయవచ్చు:

  • సమూహ సభ్యులను (కాబోయే పెద్దలతో సహా) మరియు వారి కుటుంబాలను ఎలా బలోపేతం చేయాలో ప్రణాళిక చేయుట.

  • సువార్త పరిచర్యను, దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యమును సమన్వయం చేయుట.

  • వార్డు సలహాసభ సమావేశాల నుండి వచ్చిన నియామకాలకు ప్రతిస్పందించుట.

  • పరిచర్య మౌఖికాల నుండి సమాచారాన్ని సమీక్షించుట.

  • పిలుపులు మరియు నియామకాలలో సేవ చేయడానికి సహోదరులను పరిగణించుట.

  • సమూహ సమావేశాలు మరియు ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయుట.

8.3.4

కార్యదర్శి

బిషప్పు ఆమోదంతో, పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుడు, సమూహ సభ్యుడొకరిని సమూహ కార్యదర్శిగా పిలవవచ్చు.

8.4

మెల్కీసెదెకు యాజకత్వమును పొందడానికి సిద్ధపడేందుకు కాబోయే పెద్దలకు సహాయం చేయుట.

కాబోయే పెద్ద అంటే మెల్కీసెదెకు యాజకత్వమును పొందని మరియు (1) 19 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న లేదా (2) 19 కంటే తక్కువ వయస్సు గలిగి, వివాహితుడైన పురుష సంఘ సభ్యుడు.

మెల్కీసెదెకు యాజకత్వమును పొందడానికి సిద్ధపడేందుకు కాబోయే పెద్దలకు సహాయం చేయడం సమూహ అధ్యక్షత్వము యొక్క అత్యధిక ప్రాధాన్యతలలో ఒకటి.