లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 13


13వ ప్రకరణము

1829 మే 15న, పెన్సిల్వేనియాలోని హార్మొని సమీపములో సస్క్వెహెన్నా నది ఒడ్డున అహరోను యాజకత్వమునకు జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీల నియామకమును వివరించు జోసెఫ్ స్మిత్ చరిత్రలో ఒక సంగ్రహము. ఆ నియామకము ఒక దేవదూత చేతుల మీదుగా జరిగెను, ఆ వ్యక్తి తననుతాను యోహానుగా పరిచయము చేసుకొనెను, అతడే క్రొత్త నిబంధనలో బాప్తిస్మమిచ్చు యోహానుగా పిలువబడెను. మెల్కీసెదెకు యాజకత్వముగా పిలువబడిన ఉన్నత యాజకత్వపు తాళపుచెవులు కలిగియున్న పేతురు, యాకోబు, యోహానుల ఆజ్ఞననుసరించి పనిచేయుచున్నానని ఆ దేవదూత వివరించెను. తగిన సమయములో ఈ ఉన్నత యాజకత్వము వారికి అనుగ్రహించబడునని జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు వాగ్దానము చేయబడెను. (ప్రకరణము 27:7–8, 12 చూడుము.)

అహరోను యాజకత్వపు తాళపుచెవులు, శక్తులు ఇవ్వబడినవి.

1 నా తోటి సేవకులైన మీపై, మెస్సీయ నామములో నేను అహరోను యాజకత్వమును అనుగ్రహించుచున్నాను, ఇది దేవదూతల పరిచర్య యొక్కయు, పశ్చాత్తాప సువార్త యొక్కయు, పాపక్షమాపణ కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మము యొక్కయు తాళపుచెవులను కలిగియున్నది; లేవి కుమారులు తిరిగి నీతితో ప్రభువుకు ఒక అర్పణను అర్పించు వరకు ఇది ఎన్నటికీ భూమిపై నుండి తీసివేయబడదు.