లేఖనములు
సువార్త గ్రంథాలయ యాప్‌ను ఉపయోగించుటకు ఉపాయములు


“సువార్త గ్రంథాలయ యాప్‌ను ఉపయోగించుటకు ఉపాయములు,” లేఖన అధ్యయన ఉపాయములు (2021)

“సువార్త గ్రంథాలయ యాప్‌ను ఉపయోగించుటకు ఉపాయములు,” లేఖన అధ్యయన ఉపాయములు

చిత్రం
టాబ్లెట్‌ను వీక్షిస్తున్న స్త్రీ మరియు బిడ్డ

సువార్త గ్రంథాలయ యాప్‌ను ఉపయోగించుటకు ఉపాయములు

వినండి

లేఖనములను అధ్యయనం చేయడానికి గల ఉత్తమమైన మార్గాలలో ఒకటి రికార్డింగులను వినుట. దీనిని మీరు మీ ఇంటిలో లేదా ఎక్కడైనా చేయవచ్చు. మీరు వివిధ వేగాలలో మరియు విభిన్న భాషలలో కూడా వినవచ్చు.

అంశాలవారీగా అధ్యయనం చేయండి

శోధన క్రియను ఉపయోగించడం, ఆ తర్వాత తగిన శోధన ఫలితాలను పునర్వీక్షించడం ద్వారా ఒక అంశానికి సంబంధించిన లేఖనాలను మీరు కనుగొనవచ్చు. ఒక అంశానికి సంబంధించి ముఖ్యమైన లేఖనాలను అందించే సువార్త అంశాలు ప్రచురణను కూడా మీరు ఉపయోగించవచ్చు.

అంశాలవారీగా క్రమపరచండి

“ట్యాగ్‌లు” మరియు “నోట్‌బుక్‌లు” ఉపయోగించి అంశాలవారీగా మీరు విషయాన్ని క్రమపరచవచ్చు. మీరు ఒక ప్రసంగం లేదా పాఠం కొరకు సిద్ధపడుతున్నప్పుడు ఈ అంశాలు ఉపయోగపడగలవు.

రంగులద్దండి

ఒక భాగాన్ని ఎంచుకొని, ఆ తర్వాత ఒక శైలిని ఎంచుకోవడం ద్వారా మీరు మీ లేఖనాలలో రంగులద్దవచ్చు లేదా దానిని గుర్తించవచ్చు. శైలి అనేది విభిన్న రంగులు మరియు ఒక క్రిందిగీత లేదా రంగులద్దే కలయిక కావచ్చు.

సంబంధాలను సృష్టించండి

లేఖనాలు, సర్వసభ్య సమావేశ సందేశాలు మరియు ఇతర విషయాల మధ్య మీరు సంబంధాలను సృష్టించవచ్చు. మీరు గుర్తుచేసుకోవడానికి మరియు మీరు తయారు చేసిన సంధానాలను త్వరగా చేరుకోవడానికి ఇది సహాయపడగలదు.

నిర్వచనాల కొరకు చూడండి

ఒక పదాన్ని ఎంచుకొని, “నిర్వచించు” మీటను నొక్కడం ద్వారా సులువుగా మీరు లఖనాలలో ఆ పదం యొక్క నిర్వచనాన్ని చూడవచ్చు.

బుక్‌మార్క్‌లను మరియు స్క్రీన్‌లను ఉపయోగించండి

నిర్దిష్టమైన ప్రదేశాలను మరియు స్క్రీన్‌లను గుర్తించడానికి బుక్‌మార్క్‌‌లను ఉపయోగించడం ద్వారా ఎంచుకున్న విషయానికి మీరు త్వరగా తిరిగి రావచ్చు. బుక్‌మార్క్‌‌లను ఉపయోగించడం ఒకే సమయంలో వివిధ అధ్యాయాలు మరియు ఇతర విషయాలను తెరిచి ఉంచడానికి మిమ్మల్ని అనుమతించగలదు.

కాలపట్టికను నిర్ణయించండి

లేఖనాలను అధ్యయనం చేయడంలో మీ పురోగతిని గుర్తించడానికి మీకు సహాయపడేలా ఒక అధ్యయన ప్రణాళికను మీరు తయారుచేయవచ్చు. మీ అధ్యయన లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడడానికి మీరు జ్ఞాపికలను కూడా పెట్టుకోవచ్చు. రండి, నన్ను అనుసరించండి కాలపట్టికను అనుసరించడానికి లేదా వ్యక్తిగతంగా మోర్మన్ గ్రంథాన్ని చదవడానికి ఒక కాలపట్టిక మీకు సహాయపడగలదు.