లేఖనములు
లేఖనాలను ఎందుకు అధ్యయనం చేయాలి?


“లేఖనాలను ఎందుకు అధ్యయనం చేయాలి?” లేఖన అధ్యయన ఉపాయములు (2021)

“లేఖనాలను ఎందుకు అధ్యయనం చేయాలి?” లేఖన అధ్యయన ఉపాయములు

చిత్రం
నీఫైయుల మధ్య సంస్కారమును ప్రారంభిస్తున్న క్రీస్తు, ఆండ్రూ బోస్లే చేత

లేఖనాలను ఎందుకు అధ్యయనం చేయాలి?

మనం శ్రద్ధగా లేఖనాలను అధ్యయనం చేసినప్పుడు, మనం యేసు క్రీస్తుకు దగ్గరవుతాము మరియు ఆయన సువార్తను, ప్రాయశ్చిత్త త్యాగాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాము. నీఫై ప్రవక్త మనల్ని ఈ విధంగా ప్రోత్సహించారు:

“అందువలన క్రీస్తు నందు నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, దేవుని యొక్కయు మనుష్యులందరి యొక్కయు ప్రేమను కలిగియుండి మీరు శ్రద్ధగా ముందుకు సాగవలెను. కావున మీరు క్రీస్తు వాక్యమును విందారగించుచూ ముందుకుసాగి, అంతము వరకు స్థిరముగానుండిన యెడల మీరు నిత్యజీవము పొందెదరని తండ్రి సెలవిచ్చుచున్నాడు” (2 నీఫై 31:20).

చిత్రం
లేఖనాలను చదువుతున్న కుటుంబము

లేఖనాలలోని బోధనలు మన పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళడానికి మనకు సహాయపడతాయి. వ్యక్తులుగా మరియు అన్వయింపదగిన చోట కుటుంబాలుగా క్రమం తప్పక వాటిని అధ్యయనం చేయమని మన కడవరి దిన ప్రవక్తలు మనల్ని కోరారు. 1 నీఫై 19:23 లో నీఫై ఉపదేశించినట్లుగా, లేఖనాలలో ఉన్నవారి అనుభవాల నుండి నేర్చుకోవడానికి మరియు లేఖన వృత్తాంతాలను, బోధనలను నేడు మన జీవితాలకు అన్వయించడానికి వారు మనల్ని ఆహ్వానించారు. లేఖనాలను అధ్యయనం చేయమని మరియు “క్రీస్తు యొక్క మాటలను విందారగించమని” (2 Nephi 32:3) ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తలిరువురు మనల్ని ఆహ్వానించారు.

చిత్రం
లేఖనాలను చదువుతున్న వ్యక్తి

లేఖనాలను “విందారగించడం” గురించి ఈ ముఖ్య సత్యాన్ని కూడా అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు:

“విందారగించడం అనగా రుచిచూడడం కంటే అధికమైనది. విందారగించడం అనగా రుచిని ఆస్వాదించడం. లేఖనాలను సంతోషకరమైన ఆవిష్కరణ మరియు నమ్మకమైన విధేయతతో అధ్యయనం చేయడం ద్వారా మనం వాటి రుచిని ఆస్వాదిస్తాము. మనం క్రీస్తు యొక్క మాటలను విందారగించినప్పుడు, అవి ‘మెత్తని హృదయములు అను పలకలమీద’ చెక్కబడతాయి [2 కొరింథీయులు 3:3]. అవి మన స్వభావంలో అంతర్భాగమవుతాయి” (“Living by Scriptural Guidance,” Ensign, Nov. 2000, 17).

మనం స్థిరంగా వ్యక్తిగత మరియు కుటుంబ లేఖన అధ్యయనములో భాగమైనప్పుడు మనము, మన కుటుంబాలు నడిపించబడగలవు, రక్షింపబడగలవు మరియు మన కాలం యొక్క అనేక సవాళ్ళకు వ్యతిరేకంగా బలపరచబడగలవు.