లేఖనములు
నమూనా 1


అబ్రాహాము గ్రంథము నుండి ఒక ప్రతి

సంఖ్య 1

చిత్రం
నమూనా 1

వివరణ

చిత్రము 1. ప్రభువు దూత.

చిత్రము 2. బలిపీఠముపై అబ్రాహాము కట్టివేయబడుట.

చిత్రము 3. విగ్రహారాధికుడైన ఎల్కానా యాజకుడు అబ్రాహామును బలిచ్చుటకు ప్రయత్నించుట.

చిత్రము 4. ఎల్కానా, లిబ్నా, మహమక్రా, కోరాషు మరియు ఫరో దేవతల యెదుట నిలువబెట్టబడి విగ్రహారాధికులైన యాజకులచేత కట్టబడిన బలిపీఠము.

చిత్రము 5. విగ్రహారాధ్య దేవతయైన ఎల్కానా.

చిత్రము 6. విగ్రహారాధ్య దేవతయైన లిబ్నా.

చిత్రము 7. విగ్రహారాధ్య దేవతయైన మహమక్రా.

చిత్రము 8. విగ్రహారాధ్య దేవతయైన కోరాషు.

చిత్రము 9. విగ్రహారాధ్య దేవతయైన ఫరో.

చిత్రము 10. ఐగుప్తులో అబ్రాహాము.

చిత్రము 11. ఐగుప్తీయులు గ్రహించిన విధముగా ఆకాశవిశాల స్తంభములను సూచించుటకు ఉద్దేశించబడినది.

చిత్రము 12. రౌకీయాంగ్ అనగా విశాలము లేదా మన తలలపైనున్న ఆకాశము; కానీ ఈ సందర్భములో, ఈ అంశమునకు సంబంధించి ఐగుప్తీయులు హెబ్రీ పదమైన షౌమయీమ్‌కు సమానార్థముగల షౌమౌ—ఎత్తుగానుండుట, పరలోకము అను అర్థములో వాడిరి.