చేతి పుస్తకములు మరియు పిలుపులు
9. ఉపశమన సమాజము


“9. ఉపశమన సమాజము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“9. ఉపశమన సమాజము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
లేఖనాలు చదువుతున్న స్త్రీలు

9.

ఉపశమన సమాజము

9.1

ఉద్దేశ్యము మరియు నిర్మాణము

9.1.1

ఉద్దేశ్యము

ఉపశమన సమాజము యొక్క ఉద్దేశ్యం ఆత్మలను రక్షించడం మరియు బాధల నుండి ఉపశమనం కలిగించడం అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు.

“దాతృత్వము ఎన్నటికీ విఫలం కాదు” (1 కొరింథీయులకు 13:8) అనేది ఉపశమన సమాజము యొక్క నినాదం.

9.1.2

ఉపశమన సమాజములో సభ్యత్వం

ఒక యువతి తనకు 18 ఏళ్లు వచ్చినప్పుడు ఉపశమన సమాజమునకు హాజరుకావచ్చు. 19 ఏళ్ల వయస్సు ఉన్నా లేదా గృహము నుండి దూరంగా, అంటే విశ్వవిద్యాలయంలో చేరడానికి లేదా సువార్తసేవకు వెళ్తున్నా, ఆమె ఉపశమన సమాజములో పాల్గొనాలి.

18 ఏళ్లలోపు వివాహిత స్త్రీలు కూడా ఉపశమన సమాజములో సభ్యులు.

9.2

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనడం

9.2.1

యేసు క్రీస్తు సువార్తను జీవించడం

9.2.1.2

ఉపశమన సమాజ సమావేశాలలో సువార్త నేర్చుకోవడం

నెలలో రెండవ మరియు నాల్గవ ఆదివారాలలో సమావేశాలు జరుగుతాయి. అవి 50 నిమిషాల పాటు ఉంటాయి. ఉపశమన సమాజ అధ్యక్షత్వము ఈ సమావేశాలను ప్రణాళిక చేస్తారు. అధ్యక్షత్వములోని ఒక సభ్యురాలు నిర్వహిస్తారు.

ఉపశమన సమాజ సమావేశాలు ఇటీవలి సర్వసభ్య సమావేశము నుండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రసంగాలలోని అంశాలపై దృష్టి పెడతాయి.

9.2.1.3

ప్రోత్సాహ కార్యక్రమాలు

ఉపశమన సమాజ అధ్యక్షత్వములు ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయవచ్చు. చాలామట్టుకు ప్రోత్సాహ కార్యక్రమాలు ఆదివారాలు లేదా సోమవారం సాయంత్రాలు కాకుండా ఇతర సమయాల్లో నిర్వహించబడతాయి.

9.2.2

అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం

9.2.2.1

పరిచర్య

సహోదరీలు ఉపశమన సమాజ అధ్యక్షత్వము నుండి పరిచర్య నియామకాలను పొందుతారు. మరింత సమాచారం కోసం, 21వ అధ్యాయం చూడండి.

9.2.2.2

స్వల్పకాలిక అవసరాలు

పరిచర్య చేయు సహోదరీలు తాము సేవచేసే వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తారు. అనారోగ్యం, జననాలు, మరణాలు, ఉద్యోగం కోల్పోవడం మరియు ఇతర పరిస్థితులలో సభ్యులకు స్వల్పకాలిక సహాయం అవసరం కావచ్చు.

అవసరమైనప్పుడు, పరిచర్య చేసే సహోదరీలు సహాయం కోసం ఉపశమన సమాజ అధ్యక్షత్వమును అడుగుతారు.

9.2.2.3

దీర్ఘకాలిక అవసరాలు మరియు స్వావలంబన

బిషప్పుచేత సమన్వయపరచబడినట్లు, ఉపశమన సమాజము మరియు పెద్దల సమూహ అధ్యక్షత్వములు సభ్యులకు దీర్ఘకాలిక అవసరాలు మరియు స్వావలంబనలో సహాయం చేస్తారు.

ఉపశమన సమాజ అధ్యక్షురాలు, పెద్దల సమూహ అధ్యక్షుడు లేదా మరొక నాయకుడు స్వావలంబన ప్రణాళికను అభివృద్ధి చేయడంలో వ్యక్తికి లేదా కుటుంబానికి సహాయం చేస్తారు.

9.2.2.4

ఒక వార్డు సభ్యురాలు మరణించినప్పుడు

ఒక వార్డు సభ్యురాలు మరణించినప్పుడు, ఉపశమన సమాజము మరియు పెద్దల సమూహ అధ్యక్షత్వములు ఓదార్పు మరియు సహాయాన్ని అందిస్తారు. బిషప్పు మార్గదర్శకత్వంలో, వారు అంత్యక్రియలకు సహాయం చేయవచ్చు.

మరింత సమాచారం కోసం, 38.5.8 చూడండి.

9.2.3

సువార్తను స్వీకరించమని అందరినీ ఆహ్వానించడం

ఉపశమన సమాజ అధ్యక్షురాలు అధ్యక్షత్వములోని ఒక సభ్యురాలిని వార్డులో సభ్యుల సువార్త పరిచర్యలో సహాయం చేయడానికి నియమిస్తారు. ఆమె ఈ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి పెద్దల సమూహ అధ్యక్షత్వములో నియమించబడిన సభ్యునితో కలిసి పని చేస్తారు (23.5.1 చూడండి).

9.2.4

నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయడం

ఉపశమన సమాజ అధ్యక్షురాలు అధ్యక్షత్వములోని ఒక సభ్యురాలిని వార్డులో దేవాలయం మరియు కుటుంబ చరిత్ర కార్యమును నడిపించడానికి నియమిస్తారు. ఆమె ఈ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి పెద్దల సమూహ అధ్యక్షత్వములో నియమించబడిన సభ్యునితో కలిసి పని చేస్తారు (25.2.2 చూడండి).

9.3

ఉపశమన సమాజ నాయకులు

9.3.1

బిషప్పు

బిషప్పు సాధారణంగా ఉపశమన సమాజ అధ్యక్షురాలిని నెలవారీగా కలుస్తారు. పరిచర్య చేసే సహోదరీల సేవతో సహా రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము గురించి వారు చర్చిస్తారు.

9.3.2

ఉపశమన సమాజ అధ్యక్షత్వము

9.3.2.1

ఉపశమన సమాజ అధ్యక్షత్వమును పిలవడం

బిషప్పు ఒక స్త్రీని వార్డు ఉపశమన సమాజ అధ్యక్షురాలిగా సేవ చేయడానికి పిలుస్తారు. విభాగం తగినంత పెద్దదైతే, ఆమె తన సలహాదారులుగా పనిచేయడానికి ఒకరు లేదా ఇద్దరు స్త్రీలను అతనికి సిఫార్సు చేస్తుంది.

కొన్ని చిన్న విభాగాలలో యువతుల లేదా ప్రాథమిక అధ్యక్షురాలు ఉండకపోవచ్చు. ఈ విభాగాలలో, ఉపశమన సమాజ అధ్యక్షురాలు యువతకు మరియు పిల్లలకు సూచనలను ప్రణాళిక చేయడంలో తల్లిదండ్రులకు సహాయపడవచ్చు.

9.3.2.2

బాధ్యతలు

ఉపశమన సమాజ అధ్యక్షురాలికి క్రింది బాధ్యతలు ఉంటాయి. ఆమె సలహాదారులు ఆమెకు సహాయం చేస్తారు.

  • వార్డు సలహాసభలో సేవ చేయడం.

  • రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనడానికి ఉపశమన సమాజం యొక్క ప్రయత్నాలకు నాయకత్వం వహించడం (1వ అధ్యాయం చూడండి).

  • పరిచర్య చేసే సహోదరీల సేవను నిర్వహించడం మరియు పర్యవేక్షించడం.

  • బిషప్పు మార్గదర్శకత్వంలో, వార్డులోని పెద్దలకు ఉపదేశము చేయడం.

  • వార్డులో ఒంటరి మరియు వివాహిత వయోజన సహోదరీలను బలపరిచేందుకు ఉపశమన సమాజం యొక్క ప్రయత్నాలను సమన్వయం చేయడం.

  • ప్రతీ ఉపశమన సమాజ సభ్యురాలిని కనీసం సంవత్సరానికి ఒకసారి వ్యక్తిగతంగా కలవడం.

  • ఉపశమన సమాజ రికార్డులను, నివేదికలను మరియు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడం (LCR.ChurchofJesusChrist.org చూడండి).

9.3.2.3

అధ్యక్షత్వ సమావేశము

ఉపశమన సమాజ అధ్యక్షత్వము మరియు కార్యదర్శి క్రమం తప్పకుండా సమావేశమవుతారు. అధ్యక్షురాలు ఈ సమావేశాలను నిర్వహిస్తారు. చర్చనీయాంశముల జాబితాలో ఈ క్రింది అంశాలను జతచేయవచ్చు:

  • సహోదరీలను మరియు వారి కుటుంబాలను ఎలా బలోపేతం చేయాలో ప్రణాళిక చేయుట.

  • సువార్త పరిచర్యను, దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యమును సమన్వయం చేయుట.

  • వార్డు సలహాసభ సమావేశాల నుండి వచ్చే నియామకాలకు ప్రతిస్పందించుట.

  • పరిచర్య మౌఖికాల నుండి సమాచారాన్ని సమీక్షించుట.

  • ఉపశమన సమాజ పిలుపులు మరియు నియామకాలలో సేవ చేయడానికి సహోదరీలను పరిగణించుట.

  • ఉపశమన సమాజ సమావేశాలు మరియు ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయుట.

9.3.3

కార్యదర్శి

ఉపశమన సమాజ అధ్యక్షత్వము ఒక సహోదరిని ఉపశమన సమాజ కార్యదర్శిగా సేవ చేయడానికి సిఫార్సు చేయవచ్చు.

9.4

ఉపశమన సమాజములో పాల్గొనడానికి సిద్ధపడేలా యువతులకు సహాయం చేయడం

ఉపశమన సమాజములో పాల్గొనడానికి యువతులకు సహాయం చేయడానికి ఉపశమన సమాజ అధ్యక్షత్వము యువతులు, వారి తల్లిదండ్రులు మరియు యువతుల నాయకులతో కలిసి పనిచేస్తారు.

యువతులు మరియు ఉపశమన సమాజ సహోదరీలు అనుబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి నిరంతర అవకాశాలను కూడా నాయకులు అందిస్తారు. పరిచర్య చేసే సహోదరీలుగా కలిసి సేవ చేయడం అనుబంధాలను ఏర్పరచుకోవడానికి ఒక విలువైన మార్గం.

9.6

అదనపు మార్గదర్శకాలు మరియు విధానాలు

9.6.2

అక్షరాస్యత

అవసరతను బట్టి, ఉపశమన సమాజ అధ్యక్షత్వము బిషప్పు, పెద్దల సమూహ అధ్యక్షత్వము మరియు వార్డు సలహాసభతో కలిసి సభ్యులు చదవడం మరియు వ్రాయడం నేర్చుకోవడంలో సహాయం చేస్తారు.