2010–2019
ప్రేరేపించబడిన పరిచర్య
ఏప్రిల్ 2018


ప్రేరేపించబడిన పరిచర్య

మనము ఇతరులకు సేవ చేయుటపై దృష్టిసారించినప్పుడు పరిశుద్ధాత్మను శ్రేష్టముగా మనము పొందుతాము. అందువలనే మనము రక్షకుని కొరకు సేవ చేసే యాజకత్వ బాధ్యతను కలిగియున్నాము.

నా ప్రియమైన సహోదరులారా, ఈ చారిత్రక సమావేశములో మీతో మాట్లాడే విశేషావకాశము కొరకు నేను కృతజ్ఞుడను. యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క 17వ అధ్యక్షునిగా అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను మనము ఆమోదించాము. ప్రతీరోజు ఆయనతో పనిచేసే దీవెన కలిగినప్పుడు, ప్రభువు యొక్క నిజమైన సంఘమును నడిపించుటకు అధ్యక్షులు నెల్సన్ పిలవబడ్డారని ఆత్మ యొక్క నిర్ధారణను నేను అనుభవించాను.

పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క సభ్యులుగా సేవ చేయుటకు ఎల్డర్ గెర్రిట్ డబ్ల్యు. గాంగ్ మరియు ఎల్డర్ యులిసెస్ సోరెస్స్‌లను ప్రభువు పిలిచారని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను వారిని ప్రేమించి, ఆమోదిస్తున్నాను. వారు, తమ పరిచర్య ద్వారా, ప్రపంచమంతటా మరియు తరములంతటా జీవితాలను దీవిస్తారు.

ఈ సమావేశము చారిత్రకమైనదనుటకు మరొక కారణమున్నది. ఆయన సంఘము కొరకు ప్రభువు యొక్క ఏర్పరచబడిన ప్రణాళికలో ప్రేరేపించబడిన ముందడగును అధ్యక్షులు నెల్సన్ ప్రకటించారు. వార్డులు మరియు స్టేకులలో యాజకత్వ కోరముల కొరకు ఒక క్రొత్త నిర్మాణమును ఆ ప్రణాళిక కలిపియున్నది, ఆవిధంగా మనము మన యాజకత్వ బాధ్యతలను సరిగా నెరవేర్చగలము. ఆ బాధ్యతలన్నీ మన తండ్రి యొక్క పిల్లల కొరకు మన యాజకత్వ శ్రద్ధతో సంబంధించినవి.

ప్రేమగల శ్రద్ధను ఇచ్చుటకు ఆయన పరిశుద్ధుల కొరకు ప్రభువు యొక్క ప్రణాళిక సంవత్సరాలుగా అనేక రూపాలను సంతరించుకొన్నది. నవూ యొక్క ప్రారంభ దినాలలో, పట్టణములోనికి బహు విస్తారముగా వస్తున్న మార్పు చెందిన మిక్కిలి పేదవారి కొరకు శ్రద్ధ తీసుకొనుటకు ఒక క్రమమైన విధానము జోసెఫ్ స్మిత్‌కు అవసరమైంది. నా ముత్తాతలలో నలుగురు వారి మధ్య ఉన్నారు—ఐరింగ్‌లు, బెన్నియన్‌లు, రామ్నిలు, మరియు స్మిత్‌లు. భూగోళ పరిధి చేత ఆ పరిశుద్ధులను శ్రద్ధ తీసుకొనుటకు ప్రవక్త ఏర్పాటు చేసాడు. ఇల్లినాయిస్‌లో ఆ పట్టణపు విభజనలు “వార్డులు” అని పిలవబడినవి.

మైదానముల గుండా పరిశుద్ధులు ప్రయాణిస్తున్నప్పుడు, ఒకరినొకరి కొరకు వారి శ్రద్ధ “కంపెనీలు” గా నిర్వహించబడింది. మా తండ్రి యొక్క ముత్తాత కాలిబాటపై ఒక కంపెనీని కలుసుకున్నప్పుడు, ఇప్పుడు ఓక్లహామాగా పిలవబడుచున్న తన మిషను నుండి తిరిగి వస్తున్నాడు. అతడు వ్యాధితో చాలా బలహీనంగా ఉన్నాడు, అతడు మరియు అతడి సహవాసి ఒక చిన్న బండిలో పడుకొనియున్నారు.

కంపెనీ యొక్క నాయకుడు ఆ నిరాధారమైన బండిలో ఎవరు ఉన్నప్పటికినీ సహాయపడుటకు ఇద్దరు యువతులను పంపాడు. వారిలో ఒకరు, స్విట్జ్‌ర్లాండ్‌లో మార్పుచెందిన యౌవన సహోదరి. అతడు ఆ పరిశుద్ధుల కంపెనీతో రక్షించబడ్డాడు. అతడు తనను కాపాడిన యువతితోపాటు సాల్ట్‌లేక్ వేలీకి మిగిలిన మార్గమంతా నడవగలుగుటకు తగినంతగా బాగుపడ్డాడు. వారు ప్రేమలో పడ్డారు మరియు వివాహము చేసుకున్నారు. అతడు నా ముత్తాత హెన్రీ ఐరింగ్, మరియు ఆమె నా ముత్తవ్వ మారియా బొమ్మిలి ఐరింగ్.

సంవత్సరాల తరువాత, ఒక ద్వీపమును దాటి ప్రయాణించుటకు కలిగే గొప్ప కష్టమును జనులు వ్యాఖ్యానించినప్పుడు, “ఓ, లేదు, అది అంత కష్టము కాదు. మేము నడుస్తుండగా, మేమిరువురము యేసు క్రీస్తు యొక్క నిజమైన సువార్తను కనుగొనుట ఎంత అద్భుతమైనదో మార్గమంతా మేము మాట్లాడుకున్నాము. అది నేను జ్ఞాపకముంచుకొనగల సంతోషకరమైన సమయము.”

అప్పటినుండి, ప్రభువు తన పరిశుద్ధులు ఒకరినొకరి కొరకు సంరక్షించుకొనుటకు సహాయపడే విధానాలలో అనేక అంశాలను ఉపయోగించాడు. ఇప్పుడు ఆయన ---అన్ని వార్డు నిర్మాణములతో సమన్వయములో పనిచేసే---వార్డు మరియు స్టేకు స్థాయిలో బలపరచబడిన మరియు ఐక్యతగా ఉన్న కోరములతో మనల్ని దీవించాడు.

నగరపాలక వార్డులు, కంపెనీలు, మరియు బలపరచబడిన కోరములు అన్నియు ప్రభువు తన పరిశుద్ధుల కొరకు శ్రద్ధ తీసుకునే విధానములో ఆయన పరిశుద్ధులు ఒకరినొకరు శ్రద్ధ తీసుకొనుటకు ఆయన ఉద్దేశములో విజయవంతంగా ఉండుటకు కనీసము రెండు విషయాలు అవసరము. వారి స్వంత ఆసక్తులకు పైగా ఒకరినొకరి కొరకు క్రీస్తు యొక్క ప్రేమను పరిశుద్ధులు అనుభవించినప్పుడు, వారు సఫలమవుతారు. లేఖనాలు దానిని “దాతృత్వము . . . క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ” (మొరోనై 7:47) అని పిలిచాయి. మరియు తాను సహాయపడుటకు ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఉత్తమమైనదని ప్రభువు ఎరిగిన దానిని తెలుసుకొనుటకు సంరక్షకుని పరిశుద్ధాత్మ నడిపించినప్పుడు వారు సఫలమవుతారు.

ఇటీవల వారములలో, సమయము తరువాత సమయము, ఈరోజు ఇక్కడ ప్రకటించబడినట్లుగా, సంఘ సభ్యులు ప్రభువు ఏమి చేయబోవుచున్నాడో ఎదోవిధంగా వారూహించినట్లుగా నా సమక్షములో చేసారు. నేను మీకు రెండు మాదిరులనిస్తాను. ఒకటి, ప్రభువు కొరకు వారి సేవలో యాజకత్వము గలవారు సాధించగల దానిని గ్రహించిన అహరోను యాజకత్వములో 14 సంవత్సరాల బోధకుని చేత సరళమైన సంస్కార సమావేశ ప్రసంగము. రెండవది, ఒక మెల్కీసెదకు యాజకత్వము గల వ్యక్తి క్రీస్తు యొక్క ప్రేమతో ఒక కుటుంబమునకు సేవ చేయుటకు ప్రేరేపించబడ్డాడు.

మొదట, నేను అక్కడున్న ఒక వార్డు సంస్కార సమావేశములో యువకుని మాటలను మీకిస్తాను. మీరు 14 సంవత్సరాల వారిగా ఉన్నప్పుడు, మీరేలా ఉన్నారో గుర్తించుటకు ప్రయత్నించుము మరియు అంత చిన్నవాడైన బాలుడు న్యాయముగా తెలుసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా అతడు చెప్పుట మీరు వింటారు:

“గత సంవత్సరము నాకు 14 వచ్చినప్పటినుండి మా వార్డులో బోధకుల కోరము సభ్యునిగా ఉండుట నాకు నిజముగా ఇష్టమైనది. ఒక బోధకుడు ఇంకా పరిచారకుని బాధ్యతలన్నీ మరియు కొన్ని క్రొత్త వాటిని కలిగియుంటాడు.

“మనలో కొందరు బోధకులు, మిగిలినవారు మరియు సంఘములో ప్రతీఒక్కరు ఎదోఒకరోజు యాజకత్వము చేత దీవించబడతారు, కనుక, ఒక బోధకుని యొక్క బాధ్యతలను గూర్చి ఎక్కువగా తెలుసుకొనుట మనందరికి ముఖ్యమైనది.

“మొదటిగా, సిద్ధాంతము మరియు నిబంధనలు 20:53 ఇలా చెప్పును, ‘బోధకుని యొక్క బాధ్యత సంఘముపై ఎల్లప్పుడు అధ్యక్షత్వము వహించుట, మరియు వారితో ఉండి వారిని బలపరచుట.’

“తరువాత, సిద్ధాంతము మరియు నిబంధనలు 20:54--55 ఇలా చెప్పును:

“‘మరియు సంఘములో ఏ పాపము ఉండకుండా చూడుము, లేక ఒకరినొకరితో కఠినత్వము, లేక అబద్ధాలాడుట, చాడీలు చెప్పుట, లేక చెడు మాట్లాడకుండా చూడుము;

“‘సంఘము తరచుగా కలిసి సమావేశమగునట్లు చూడుము, మరియు సభ్యులందరూ వారి బాధ్యతను చేయునట్లు కూడా చూడుము.’”

ఆ యువకుడు కొనసాగించాడు:

“సంఘము కొరకు శ్రద్ధ తీసుకొనుట మాత్రమే కాదు క్రీస్తు చూసినట్లుగా సంఘములోపల జనుల కొరకు కూడ శ్రద్ధ తీసుకొనుట మన బాధ్యత అని ప్రభువు మనకు చెప్పుచున్నాడు, ఎందుకనగా ఇది ఆయన సంఘము. మనము ఆజ్ఞలను పాటించుటకు ప్రయత్నిస్తున్న యెడల, ఒకరినొకరితో దయ కలిగియుండుము, మంచి స్నేహితులుగా ఉండుము, మరియు కలిసియుండుట ఆనందించుము, అప్పుడు మనము ఆత్మను మనతో కలిగియుండగలము మరియు పరలోక తండ్రి మనము చేయాలని కోరే దానిని తెలుసుకుంటాము. మనము చేయని యెడల, మన పిలుపును మనము నెరవేర్చలేము.”

అతడు చెప్పుట కొనసాగించాడు:

“ఒక బోధకుడు, సంఘము వద్ద సభ్యులను పలుకరిస్తూ, సంస్కారమును సిద్ధపరచుచు, ఇంటిలో సహాయపడుతూ, మరియు సమాధానపరచువారిగా ఉండుట ద్వారా మంచి గృహ బోధకునిగా ఉండుట ద్వారా మంచి మాదిరిని ఉంచుటకు ఎంచుకున్నప్పుడు, అతడు తన యాజకత్వమును గౌరవించుటకు మరియు తన పిలుపును నెరవేర్చుటకు ఎన్నుకుంటాడు.

“మంచి బోధకునిగా ఉండుట అనగా మనము సంఘ కార్యక్రమాలలో ఉన్నప్పుడు బాధ్యులుగా ఉండుట అని మాత్రమే అర్ధముకాదు. ‘మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము,’ (1 తిమెతి 4:12) అని అపొస్తులుడైన పౌలు బోధించాడు.

తరువాత ఆ యువకుడు చెప్పాడు:

“మనము ఎక్కడ ఉన్నప్పటికిని, లేక మనమేది చేస్తున్నప్పటికిని, అన్ని సమయములందు, మరియు అన్ని స్థలములందు నీతి యొక్క మంచి మాదిరులుగా మనము ఉండగలము.”

“మా నాన్న మరియు నేను బ్రౌన్స్‌కు గృహ బోధ చేస్తాము.1 మేము అక్కడకు వెళ్లిన ప్రతీసారి, దర్శించుట మరియు వారి గురించి తెలుసుకొనుట నాకు గొప్ప సమయముగా ఉన్నది. బ్రౌన్స్ గురించి నాకు నిజముగా ఇష్టమైన విషయము మేము అక్కడకు వెళ్లిన ప్రతీసారి, వారు వినటానికి ఇష్టపడతారు మరియు వారు ఎల్లప్పడు పంచుకోవటానికి మంచి వృత్తాంతాలను కలిగియున్నారు.”

“గృహ బోధన వలన వార్డులోని జనులను మనము బాగా ఎరిగినప్పుడు, బోధకుని మరొక బాధ్యత సంఘ సభ్యులను పలకరించుటను సులభతరము చేస్తుంది. స్వాగతించబడుటకు మరియు సంఘములో చేర్చబడినట్లు భావించుటకు జనులకు సహాయపడుట, వార్డు సభ్యులందరూ ప్రేమించబడినట్లు భావించుటకు మరియు సంస్కారమును తీసుకొనుటకు సిద్ధపడుటకు సహాయపడును.

“సంఘానికి వచ్చే సభ్యులను పలకరించిన తరువాత, బోధకులు ప్రతీవారము సంస్కారమును సిద్ధపరచుట ద్వారా సహాయపడతారు. ఈ వార్డులో సంస్కారమును సిద్ధపరచుట మరియు అందించుటను నేను నిజముగా ఆనందిస్తాను, ఎందుకనగా ప్రతీఒక్కరు భక్తిగల గౌరవముగా ఉంటారు. నేను సంస్కారమును సిద్ధపరచి అందించినప్పుడు నేను ఎల్లప్పుడు ఆత్మను అనుభవిస్తాను. ప్రతీ ఆదివారము నేను దానిని చేయగలుగుట నాకు నిజమైన దీవెన.

“సంస్కారమును అందించుట వంటి సేవను జనులు చూసి దానిని చేసినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతారు, కానీ సంస్కారమును సిద్ధపరచుట వంటి సేవ సాధారణంగా ఎవరూ గమనించబడకుండా చేయబడును. జనులు మనము సేవ చేయుట చూచుట ముఖ్యము కాదు; మనము ఆయనకు సేవ చేస్తున్నామని ప్రభువు ఎరుగుట ముఖ్యమైనది.

“బోధకులుగా, మనము మన బాధ్యతలను నెరవేర్చుట ద్వారా, ఎల్లప్పుడు సంఘమును, మన స్నేహితులను, మరియు మన కుటుంబమును బలపరచుటకు ప్రయత్నించాలి. అది ఎల్లప్పుడు సులభమైనది కాదు, కానీ ప్రభువు ‘ఆయన ఆజ్ఞాపించిన కార్యమును చేయుటకు (మనకు) మార్గము సిద్ధపరచక ఆయన ఎట్టి ఆజ్ఞలను ఇయ్యడు’ (1 నీఫై 3:7).”

ఆ యువకుడు ముగించినప్పుడు, అతడి పరిపక్వత మరియు వివేకమును బట్టి నేను ఆశ్చర్యపడుట కొనసాగించాను. “మనము (యేసు క్రీస్తును) వెంబడించుటకు ఎన్నుకొనిన యెడల మనము మంచిగా మారతామని నేను ఎరుగుదును,” అని చెప్పుట ద్వారా అతడు సంక్షిప్తపరిచాడు.

యాజకత్వ సేవ గురించి మరొక వృత్తాంతము ఒక వార్డు సంస్కార సమావేశములో ఒక నెల క్రితం చెప్పబడింది. మరల, నేను అక్కడ ఉన్నాను. ఈ సందర్భములో, అనుభవముగల ఈ మెల్కీసెదకు యాజకత్వముగల వ్యక్తి యాజకత్వ కోరములను బలపరచుటతో ప్రభువు కోరేదానిని ఖచ్చితంగా అతడు వివరిస్తున్నాడని తాను మాట్లాడినప్పుడు అతడు ఎరుగడు. అతడి వివరణ యొక్క సారాంశము ఇక్కడున్నది:

అతడు మరియు అతడి గృహ బోధనా సహవాసి ఏడు కుటుంబాలకు సేవ చేయుటకు నియమించబడ్డారు. దాదాపు వారందరికి దర్శింపబడుట ఇష్టములేదు. గృహ బోధకులు వారి అపార్ట్‌మెంట్‌లకు వెళ్లినప్పుడు, వారు తలుపు తెరవటానికి తిరస్కరించారు. వారు ఫోను చేసినప్పుడు, వారికి జవాబు రాలేదు. వారు సందేశము పంపినప్పుడు తిరిగి పోను చేయబడలేదు. పెద్ద సహవాసి చివరకు ఉత్తరము వ్రాసే పరిచర్యను అనుసరించాడు. అతడు ఒక జవాబును పొందాలనే ఆశతో పెద్ద పసుపురంగు కవర్లను ఉపయోగించసాగాడు.

ఏడు కుటుంబాలలో ఒకరు తక్కువ చురుకుదనముగల సహోదరి ఐరోపా నుండి వలస వచ్చింది. ఆమెకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు.

ఆమెను సంప్రదించుటకు అనేకసార్లు ప్రయత్నించిన తరువాత, అతడికి ఒక సందేశము వచ్చింది. గృహ బోధకులతో కలుసుకొనుటకు తనకు తీరికలేదని అతడికి ఆమె హఠాత్తుగా తెలియచేసింది. ఆమెకు రెండు ఉద్యోగాలున్నాయి మరియు అదేవిధంగా మిలటరీలో ఉన్నది. ఆమె ప్రధాన ఉద్యోగము ఒక పోలీసు అధికారిగా ఉండుట, ఆమె వృత్తిపరమైన లక్ష్యము డిటెక్టవ్‌గా ఉండుట మరియు తరువాత ఆమె తన స్వదేశానికి తిరిగి వెళ్ళి అక్కడ పనిచేయుట కొనసాగించుట.

గృహ బోధకుడు ఆమెను ఎన్నడూ తన ఇంటిలో దర్శించలేడు. అతడు కాలానుగుణంగా ఆమెకు సందేశాలను పంపాడు. ప్రతీ నెల అతడు చేతితో వ్రాసిన లేఖను, దానితోపాటు ప్రతీ బిడ్డ కొరకు సెలవు దిన కార్డును పంపాడు.

అతడికి ఏ జవాబు రాలేదు. కానీ తన గృహ బోధకులున్నారని, వారిని ఎలా సంప్రదించాలో మరియు తమ యాజకత్వ సేవలో వారు పట్టువిడవరని ఆమె ఎరుగును.

తరువాత ఒకరోజు ఆమెనుండి ఒక అత్యవసర సందేశమును అతడు పొందాడు. ఆమెకు నిరాశపూర్వకంగా సహాయము అవసరము. బిషప్పు ఎవరో ఆమెకు తెలియదు కానీ తన గృహ బోధకులను ఆమె ఎరుగును.

కొన్నిరోజులలో, ఆమె మిలటరీ శిక్షణ అభ్యాసము కొరకు నెలరోజులు రాష్ట్రమును విడిచి వెళ్లాలి. ఆమె తనతో తన పిల్లలను తీసుకొనివెళ్ళలేదు. తన పిల్లలను చూడబోయే ఆమె తల్లి, అత్యవసర వైద్యము పొందుతున్న తన భర్తను జాగ్రత్తగా చూచుటకు ఐరోపా వెళ్లింది.

ఈ తక్కువ చైతన్యముగల సహోదరికి ఐరోపా పంపుటకు తన చిన్న బిడ్డకు టిక్కెట్టు కొనుటకు డబ్బు ఉన్నది కానీ తన పన్నేండేళ్ల ఎరిక్ కొనుటకు లేవు.2 తరువాత 30 రోజులు ఎరిక్‌ను వారి ఇంటికి పంపుటకు ఎవరైన మంచి ఎల్‌డిఎస్ కుటుంబమును అతడు కనుగొనగలడా అని ఆమె తన గృహ బోధకుడిని అడిగింది!

తనకు శాయశక్తులా చేస్తానని ఆ గృహ బోధకుడు తిరిగి వ్రాసాడు. తరువాత అతడు తన యాజకత్వ నాయకులను సంప్రదించాడు. ఉపశమన సమాజ అధ్యక్షురాలిని కలిపి, వార్డు సలహాసభ యొక్క సభ్యులను సమీపించుటకు అధ్యక్షత్వము వహించు ప్రధాన యాజకుడైన బిషప్పు తన అనుమతినిచ్చాడు.

ఉపశమన సమాజ అధ్యక్షురాలు దాదాపు ఎరిక్ వయస్సున్న పిల్లలు గల ఎల్‌డిఎస్ కుటుంబాలను త్వరగా కనుగొన్నది, వారు అతడిని ఒక సమయములో ఒక వారము తీసుకుంటారు. మరుసటి నెలకల్లా, ఈ కుటుంబాలు ఎరిక్‌కు ఆహారమిచ్చారు, అప్పటికే నిండిపోయిన వారి అపార్ట్‌మెంటులు లేక చిన్న ఇండ్లలో, అతడి కొరకు గదిని కనుగొన్నారు, వారు ముందుగా ప్రణాళిక చేసుకున్న వేసవి కుటుంబ కార్యక్రమాలలో అతడిని తీసుకెళ్లారు, వారి కుటుంబ గృహ సాయంకాలములు మొదలైన వాటితో కలిపి సంఘమునకు అతడిని తీసుకొచ్చారు.

ఎరిక్ వయస్సుగల బాలురున్న కుటుంబాలు వారి పరిచారకుల కోరము సమావేశాలు మరియు ప్రోత్సహకార్యక్రమాలలో అతడిని చేర్చారు. ఈ 30-రోజుల కాలములో, తన జీవితంలో మొదటిసారి ఎరిక్ ప్రతీవారము సంఘానికి వెళ్లాడు.

అతడి తల్లి తన శిక్షణ ముగించి తిరిగి వచ్చిన తరువాత, ఎరిక్ సంఘానికి హాజరగుట కొనసాగించాడు, సాధారణంగా తన తల్లి యొక్క గృహ బోధకులతో కలిపి, అతడితో స్నేహము చేసిన నలుగురు ఎల్‌డిఎస్ కుటుంబాలతో వెళ్లాడు. తగిన కాలములో, అతడు ఒక పరిచారకునిగా నియమించబడ్డాడు మరియు సంస్కారమును క్రమముగా అందించుట ప్రారంభించాడు.

ఇప్పుడు, మనము ఎరిక్ యొక్క భవిష్యత్తులోనికి చూద్దాము. అతడు తన కుటుంబముతో తన తల్లి యొక్క స్వదేశానికి తిరిగి వెళ్లినప్పుడు సంఘములో ఒక నాయకుడు అయితే మనము ఆశ్చర్యపడము---ఇదంతా పరిశుద్ధులు ఒక బిషప్పు యొక్క నడిపింపు క్రింద ఐక్యతగా కలిసి పనిచేసి, వారి హృదయాలలోని దాతృత్వముతో సేవ చేయుట వలన మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో జరిగింది..

దేవుని రాజ్యములో రక్షించబడుటకు మనకు దాతృత్వము అవసరమని మనమెరుగుదుము. “మీరు దాతృత్వము కలిగియుంటే తప్ప, మీరు దేవుని రాజ్యమందు రక్షింపబడలేరు,” (మొరోనై 10:21; ఈథర్ 12:34 కూడా చూడుము).

మనము చేయగల సమస్తమును చేసిన తరువాత మనపై అనుగ్రహించబడే వరము దాతృత్వమని కూడా మనమెరుగుదుము. మనము “ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులైన వారందరి పైన, ఆయన ఉంచిన ఈ ప్రేమతో (మనము) నింపబడవలెనని, హృదయము యొక్క సమస్త శక్తితో ప్రార్థన చేయవలెను” (మొరోనై 7:48).

ఇతరులకు సేవ చేయుటపై మనము దృష్టిసారించినప్పుడు మనము పరిశుద్ధాత్మను శ్రేష్టముగా పొందుతామని నాకనిపిస్తున్నది. అందుకే రక్షకుని కొరకు సేవ చేయుటకు మనము యాజకత్వ దీవెనలను కలిగియున్నాము. మనము ఇతరులకు సేవ చేయుటలో పూనికొనియున్నప్పుడు, మన గురించి మనము తక్కువగా ఆలోచిస్తాము, మరియు పరిశుద్ధాత్మ మనకు త్వరగా వచ్చును మరియు దాతృత్వము యొక్క వరము మనపై అనుగ్రహింపబడాలనే మన జీవితకాల అన్వేషణలో మనకు సహాయపడును.

మన కొరకు ఆయన ప్రణాళిలో మన యాజకత్వ పరిచర్య సేవలో ఎక్కువ ప్రేరేపించబడి మరియు దాతృత్వము కలిగియుండు వారిగా అగుటకు ఇదివరకే ప్రభువు ఒక గొప్ప అడుగు ముందుకు వేయుట ప్రారంభించాడని నేను నా సాక్ష్యము చెప్పుచున్నాను. అంత ధారాళముగా ఆయన మనకిచ్చిన ఆయన ప్రేమ కొరకు నేను కృతజ్ఞుడను. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈవిధంగా నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. పేరు మార్చబడినది.

  2. పేరు మార్చబడినది.