2010–2019
ఏకమనస్సుతో
ఏప్రిల్ 2018


ఏకమనస్సుతో

మన శ్రేష్టమైన గమ్యమును చేరుకొనుటకు బదులుగా, మనకు ఒకరినొకరు అవసరం, మరియు మనము ఏకము కావాల్సినవసరమున్నది.

భూమి మీద మిక్కిలి అసాధారణమైన జీవులలో మోనార్క్ సీతాకోకచిలుక. నా భర్త కుటుంబముతో క్రిస్టమస్ గడపాటానికి మెక్సికోకు ప్రయాణములో, మేము సీతాకోకచిలుకల ఆశ్రయమును సందర్శించాము, అక్కడ మిలియన్ల మోనార్క్ సీతాకోకచిలుకలు శీతాకాలమును గడుపుతాయి. అటువంటి ఆకట్టుకునే దృశ్యమును చూచుట మరియు దేవుని యొక్క సృష్టిని రుజువు చేయు దైవిక శాసనములకు ఐక్యత మరియు విధేయత యొక్క మాదిరిపై మేము ప్రతిఫలించుట కు ఆహ్లదకరమైనది.1

చిత్రం
మోనార్క్ సీతాకోకచిలుక
చిత్రం
సీతాకోకచిలుకల గుంపు

మోనార్క్ సీతాకోకచిలుకలు నిపుణులైన నావికులు. అవి తాము వెళ్లవలసిన దిశను కనుగొనుటకు సూర్యుని స్థానమును ఉపయోగిస్తాయి. ప్రతీ వసంతకాలము, అవి మెక్సికో నుండి కెనడా వేల మైళ్ళు ప్రయాణం చేస్తాయి, మరియు ప్రతీ శరత్కాలము అవి అదే మెక్సికోలోని పరిశుద్ధమైన దేవదారు వృక్షాలుగల అడవికి తిరిగి వెళతాయి.2 అవి ప్రతీ సంవత్సరము, ఒకసారి ఒక చిన్న రెక్క కొట్టుకుంటూ దీనిని చేస్తాయి. వాటి ప్రయాణమందు, అవి రాత్రియందు చలినుండి మరియు వేటాడే జంతువులనుండి తమను తాము కాపాడుకొనుటకు చెట్లపై గుంపుగా కూడుకుంటాయి.3

చిత్రం
సీతాకోకచిలుకల చిత్రదర్శిని
చిత్రం
సీతాకోకచిలుకల రెండవ చిత్రదర్శిని

సీతాకోకచిలుకల గుంపు చిత్రదర్శినిగా (ఐకమత్యముతో పనిచేసే జనుల గుంపు) పిలవబడింది.4 అది ఒక అందమైన దృశ్యముకాదా? ఉమ్మడి లక్ష్యము కొరకు ఐకమత్యముతో పనిచేసే గుంపులో (చిత్రదర్శిని) ప్రతీ సీతాకోక చిలుక ప్రత్యేకమైనది మరియు భిన్నమైనది, అయినప్పటికిని, బలహీనంగా కనబడే ఈ జీవులు బ్రతుకుటకు, ప్రయాణించుటకు, ఫలించుటకు, మరియు పిప్పొడిని వ్యాపింపచేస్తూ, ఒక దానినుండి మరొక పువ్వు వద్దకు వెళ్లినప్పుడు జీవితమును వ్యాపింపచేయుటకు సామర్ధ్యముతో ప్రేమగల సృష్టికర్తచేత రూపొందించబడినవి. ప్రతీ సీతాకోకచిలుక ప్రత్యేకమైనది అయినప్పటికినీ, ప్రపంచము ఎక్కువ అందమైనదిగా మరియు ఫలవంతమైన స్థలముగా చేయుటకు అవి కలిసి పని చేస్తాయి.

మోనార్క్ సీతాకోకచిలుకల వలే, మనము మన పరలోక తల్లి తండ్రులతో తిరిగి కలుసుకొనేచోట మన పరలోక గృహానికి తిరుగు ప్రయాణముపై ఉన్నాము.5 సీతాకోకచిలుకల వలే, మనము దైవిక లక్షణాలను కలిగియున్నాము అది “(మన) సృష్టి యొక్క పరిమాణమును (నింపుటకు)”6 బదులుగా మనము జీవితముగుండా ప్రయాణించుటకు అనుమతించును. వాటి వలే, మనము మన హృదయాలను కలిసి అల్లిన యెడల,7 “కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను సమకూర్చినట్లు” 8 ప్రభువు మనల్ని కాపాడును, మరియు మనల్ని ఒక అందమైన చిత్రదర్శినిగా చేయును.

బాలబాలికలు, యువతీ యువకులు, సహోదర, సహోదరీలారా, మనము ఈ ప్రయాణములో కలిసియున్నాము. మన శ్రేష్టమైన గమ్యమును చేరుకొనుటకు బదులుగా, మనకు ఒకరినొకరం అవసరము, మరియు మనము ఏకము కావాల్సినవసరమున్నది. “ఒకటిగా ఉండుము, మీరు ఒకటిగా ఉండని యెడల మీరు నా వారు కాదు,”9 అని ప్రభువు ఆజ్ఞాపించాడు.

యేసు క్రీస్తు తండ్రితో ఐకమత్యమునకు అంతిమ మాదిరి. “కుమారుని యొక్క చిత్తము తండ్రి యొక్క చిత్తమందు ఉపసంహరించబడుటతో,”10 వారు ఉద్దేశమునందు, ప్రేమనందు, మరియు పనులందు ఏకమై ఉన్నారు.

తండ్రితో ప్రభువు యొక్క పరిపూర్ణమైన మాదిరిని మనము అనుసరించి మరియు వారితో, ఒకరినొకరితో మరింత ఐకమత్యముగా ఎలా ఉండగలము?

ఒక ప్రేరేపించబడిన మాదిరి అపొస్తులుల కార్యములు 1:14లో కనుగొనబడింది. “(పురుషులు) కొందరు స్త్రీలతో ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి,”11 అని మనము చదువుతాము.

“ఏక మనస్సుతో” వాక్యము అపొస్తులుల కార్యములలో అనేకసార్లు కనబడుట ముఖ్యమైనదని నేను అనుకుంటున్నాను, అక్కడ మనము ఆయన పునరుత్థానునిగా పరలోకమునకు ఆరోహణమైన వెంటనే, యేసు క్రీస్తు యొక్క అనుచరులు చేసిన దాని గురించి, వారి ప్రయత్నముల వలన వారు పొందిన దీవెనలను గూర్చి చదువుతాము. ప్రభువు వారిని దర్శించి, వారికి పరిచర్య చేసిన సమయములో అమెరికా ద్వీపములోని విశ్వాసుల మధ్య అదేవిధమైన మాదిరిని మనము కనుగొంటాము. “ఏక మనస్సుతో” అనగా అంగీకారమునందు, ఐకమత్యమునందు, మరియు అందరూ కలిసి పని చేయుట అని అర్ధము.

రెండు చోట్లా విశ్వాసులైన పరిశుద్ధులు ఐకమత్యముతో చేసిన వాటిలో కొన్ని విషయాలు వారు యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చారు, దేవుని వాక్యమును చదివారు, మరియు ప్రేమతో ఒకరినొకరు పరిచర్య చేసుకున్నారు.12

ప్రభువు యొక్క అనుచరులు ఉద్దేశమునందు, ప్రేమయందు, మరియు క్రియలందు ఏకముగా ఉంటారు. వారెవరో వారికి తెలుసు, వారేమి చేయాలో వారికి తెలుసు, దేవుని కొరకు మరియు ఒకరినొకరి కొరకు ప్రేమతో వారు దానిని చేసారు. వారు ఏకమనస్సుతో ముందుకు కదులుచూ, అద్భుతమైన చిత్రదర్శినిలో భాగముగా ఉన్నారు.

వారు పొందిన దీవెనలలో కొన్ని, వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, వారి మధ్య అద్భుతాలు జరిగినవి, సంఘము వృద్ధి చెందెను మరియు జనుల మధ్య వివాదము లేదు, మరియు అన్ని విషయాలందు ప్రభువు వారిని దీవించెను.13

వారు అంత ఐకమత్యముగా ఉండటానికి కారణము వారు ప్రభువును వ్యక్తిగతంగా ఎరుగుదురని మనము ఊహించవచ్చు. వారు ఆయనకు చాలా దగ్గరగా ఉన్నారు, మరియు ఆయన దైవిక మిషను గురించి, ఆయన నెరవేర్చిన అద్భుతాలు, మరియు ఆయన పునరుత్థానము గురించి వారు ప్రత్యేక సాక్షులుగా ఉన్నారు. వారు ఆయన చేతులు మరియు పాదముల గురుతులను చూసారు మరియు తాకారు. ఆయన వాగ్దానము చేయబడిన మెస్సయా, లోక రక్షకుడని నిశ్చయముగా వారు ఎరుగుదురు. “ఆయన సమస్త స్వస్థత, సమాధానము, మరియు నిత్య అభివృద్ధికి ఆధారము”14 అని వారు ఎరుగుదురు.

మన రక్షకుని మన భౌతిక నేత్రములతో మనము చూడనప్పటికి, ఆయన జీవిస్తున్నాడని మనము ఎరుగుదుము. మనము ఆయనకు దగ్గరైనప్పుడు, ఆయన దైవిక మిషను గురించి పరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తిగత సాక్ష్యమును పొందుటకు మనము వెదకినప్పుడు, మన ఉద్దేశమును గూర్చి మనము సరిగా గ్రహిస్తాము; దేవుని యొక్క ప్రేమ మన హృదయాలలో నివసించును;15 మన కుటుంబాలు, వార్డులు, మరియు సమాజములలో చిత్రదర్శినిలో ఒకటిగా ఉండుటకు తీర్మానము కలిగియుంటాము; మరియు “క్రొత్తవి, మేలైన విధానాలలో” మనము ఒకరినొకరము పరిచర్య చేసుకుంటాము.”16

అవసరతలో ఉన్న వారిని సమీపించుటకు ఆత్మ చేత నడిపించబడి దేవుని యొక్క పిల్లలు కలిసి పనిచేసినప్పుడు అద్భుతాలు జరుగును.

చిత్రం
కాపాడువారితో వీధి నిండియున్నది

విపత్తులు సంభవించినప్పుడు జనుల మధ్య చూపబడిన పొరుగువారి ప్రేమగల అనేక వృత్తాంతాలను మనము విన్నాము. ఉదాహరణకు, గత సంవత్సరము హాస్టన్ పట్టణమును భారీ వరద తాకినప్పుడు, జనులు వారి స్వంత అవసరాలను మరచిపోయి, విడిపించుటకు వెళ్ళారు. ఒక ఎల్డర్ల కోరము అధ్యక్షుడు సమాజమునకు సహాయము కొరకు అడిగాడు, మరియు 77 అడుగుల పడవలను వెంటనే ఏర్పాటు చేయబడ్డాయి. బాధింపబడిన పొరుగు ప్రాంతాలకు కాపాడువారు వెళ్ళారు మరియు మొత్తము కుటుంబాలు మన సమావేశ గృహాలలో ఒకదాని వద్దకు తరలించబడ్డారు, అక్కడ వారు ఆశ్రయమును, అత్యవసరమైన సహాయమును పొందారు. సభ్యులు మరియు సభ్యులు కానివారు ఒకే ఉద్దేశముతో కలిసి పనిచేసారు.

చిత్రం
మిషనరీలు స్పానిష్ బోధించుట

చిలి, శాంటియాగోలో, ఉపశమన సమాజము అధ్యక్షురాలు హాయిటీ నుండి వచ్చిన తన సమాజములోని వలసదారులకు సహాయపడాలనే కోరిక కలిగియున్నది. తన యాజకత్వ నాయకులతో కలిసి ఆలోచించి, ఆమె మరియు ఇతర నాయకులు వలసదారులకు తమ కొత్త గృహములో బాగా కలిసిపోవుటకు వారికి సహాయపడుటలో, వారికి స్పానిష్ తరగతులను ఇచ్చే ఆలోచనతో ముందుకు వచ్చారు. ప్రతీ శనివారము, మిషనరీలు వారి ఆతృతగల విద్యార్ధులతో కలిసి సమావేశమయ్యారు. ఏకమనస్సుతో సేవ చేయుచున్న భిన్నత్వములుగల నేపథ్యముల నుండి ఆ భవనములో ఐకమత్యముగల భావన జనుల యొక్క ఒక ప్రేరేపించబడిన మాదిరిగా ఉన్నది.

చిత్రం
మెక్సికోలో స్వచ్ఛంధ సేవకులు

మెక్సికోలో, వందలమంది సభ్యులు రెండు ప్రధాన భూకంపముల తరువాత బ్రదికినవారికి సహాయపడుటకు గంటల కొలది ప్రయాణించారు. వారు సాధనాలు, యంత్రములు, మరియు పొరుగువారి కొరకు ప్రేమతో వచ్చారు. స్వచ్ఛంద సేవకులు మా సమావేశ గృహాలలో ఒకదానిలో సమావేశమై, సూచనల కొరకు ఎదురుచూస్తున్నారు, “క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ”17 ప్రత్యక్షపరచబడుట పట్టణ మేయరు ఇక్స్టాన్ చూసినప్పుడు, అతడు కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.

ప్రతీ నెల మన యాజకత్వ కోరములు మరియు ఉపశమన సమాజములలో కలిసి ఆలోచన చేసినప్పుడు ప్రభువు ఇప్పుడు మనకు అవకాశమిస్తున్నాడు, కనుక మనమందరము మన వార్డు లేక బ్రాంచి చిత్రదర్శినిలో ఎక్కువ చురుకుగా పాల్గొనగలము---అక్కడ మనమందరము తగియుంటాము మరియు అక్కడ మనమందరము అవసరము.

మన మార్గములలో ప్రతీ ఒక్కటి భిన్నమైనది, అయినప్పటికినీ, మనము కలిసి పనిచేస్తాము. మన మార్గము మనమేమి చేసాము లేక మనము ఎక్కడ ఉన్నామన్నది కాదు; అది ఐకమత్యమునందు మనమెక్కడికి వెళుతున్నాము మరియు మనమేమి కాగలము అనేదానిగూర్చినది. పరిశుద్ధాత్మ చేత మనము కలిసి ఆలోచన చేసినప్పుడు, మనమెక్కడ ఉన్నాము మరియు మనము ఎక్కడ ఉండాల్సిన అవసరమున్నదో చూడగలము. మన సహజ నేత్రాలతో చూడలేని ఒక దర్శనమును పరిశుద్ధాత్మ మనకిచ్చును, ఎందుకనగా, “బయల్పాటు మన మధ్య చెదరియున్నది,”18 మరియు బయల్పాటును కలిపి ఉంచినప్పుడు, మనము ఎక్కువగా చూడగలము.

మనము ఐకమత్యముతో పనిచేసినప్పుడు, మన ఉద్దేశము ప్రభువు యొక్క చిత్తము కొరకు వెదకి చేయుటగా ఉండాలి; దేవుని కొరకు మరియు మన పొరుగువాని కొరకు మనము అనుభూతి చెందే మన ప్రోత్సాహముగా ప్రేమ ఉండాలి;19 మరియు మన గొప్ప కోరిక “శ్రద్ధగా పనిచేయుట”20 గా ఉండాలి, ఆవిధంగా మనము మన రక్షకుని యొక్క మహిమకరమైన రాక కొరకు మార్గమును సిద్ధపరచగలము. ఆవిధంగా మనము చేయగల ఏకైక విధానము “ఏక మనస్సుతో” చేయుట.

మోనార్క్ సీతాకోకచిలుకల వలే, కలిసి మన ప్రయాణమును కొనసాగిద్దాము, మనలో ప్రతిఒక్కరితో మన స్వంత లక్షణాలు మరియు తోడ్పాటులతో, దీనిని మిక్కిలి అందమైన మరియు ఫలవంతమైన లోకముగా చేయుటకు పనిచేస్తూ---ఒకసారి ఒక్కొక్క మెట్టుతో దేవుని యొక్క ఆజ్ఞలతో ఐకమత్యముగా పనిచేద్దాము.

ఆయన నామములో మనము సమావేశమైనప్పుడు, ఆయన మన మధ్యలో ఉంటానని మన ప్రభువైన యేసు క్రీస్తు మనకు వాగ్దానము చేసాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు.21 ఆయన జీవిస్తున్నాడని, మరియు ఈరోజు వలే ఒక అందమైన వసంతకాల ఉదయమును ఆయన పునరుత్థానము చెందాడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన చక్రవర్తులందరిపైగా చక్రవర్తి, “రాజులకు రాజు, మరియు ప్రభువులకు ప్రభువు.”22

మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు, తండ్రి మరియు ఆయన అద్వితీయ కుమారునియందు ఏకమగుదుముగాక, యేసు క్రీస్తు నామములో ఇది నా వినయముగల ప్రార్థన.

వివరణలు

  1. అబ్రహాము 3:26; 4:7, 9–12, 15, 18, 21, 24–25 చూడుము.

  2. మోనార్క్ సీతాకోకచిలుకల గురించి ఒక ఆసక్తికరమైన విషయము, కెనడాకు ఉత్తరదిశగా ప్రయాణించుటకు మూడు తరములు పట్టును. అయినప్పటికిని, “ఉత్తమమైన తరము” మెక్సికోకు దక్షిణదిశగా మొత్తము ప్రయాణము చేసి, అక్కడ శీతాకాలము గడుపును, మరియు తిరిగి ఉత్తరమునకు మొదట అంకమును చేస్తాయి (See “Flight of the Butterflies” [video, 2012]; “‘Flight’: A Few Million Little Creatures That Could,” WBUR News, Sept. 28, 2012, wbur.org.)

  3. See “Why Do Monarchs Form Overnight Roosts during Fall Migration?” learner.org/jnorth/tm/monarch/sl/17/text.html.

  4. See “What Is a Group of Butterflies Called?” amazingbutterflies.com/frequentlyaskedquestions.htm; see also “kaleidoscope,” merriam-webster.com. Kaleidoscope comes from the Greek kalos (“beautiful”) and eidos (“form”).

  5. See “The Family: A Proclamation to the World,” Liahona, May 2017, 145.

  6. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:19; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:25; కూడా చూడుము.

  7. మోషైయా 18:21 చూడుము.

  8. 3 నీఫై 10:4.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 38:27.

  10. మోషైయా 15:7 చూడుము.

  11. అపొస్తులుల కార్యములు 1:14; వివరణ చేర్చబడింది.

  12. యెరూషలేములోని పరిశుద్ధులు చేసిన కొన్ని విషయాలు: ఒక క్రొత్త అపొస్తులుని ఎన్నుకొనిరి మరియు “మంచి పేరు పొందిన యేడుగురు మనుష్యులను” ఏర్పరచుకొనిరి మరియు వారిని బలపరిచారు (అపొస్తులుల కార్యములు 1:26 ; 6:3–5 చూడుము); పెంతుకోస్తు దినమున కలిసి సమావేశమైరి (అపొస్తులుల కార్యములు 2:1 చూడుము); యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చిరి ( అపొస్తులుల కార్యములు 2:22–36; 3:13–26; 4:10, 33; 5:42 చూడుము); జనులను పశ్చాత్తాపపడమని ఆహ్వానించి వారికి బాప్తీస్మమిచ్నెను (అపొస్తులుల కార్యములు 2:38–41 చూడుము); సహవాసము, రొట్టెను విరచుట మరియు ప్రార్థనలో కొనసాగారు ( అపొస్తులుల కార్యములు 2:42 చూడుము)); (అపొస్తులుల కార్యములు 2:44–46; 4:34–35 చూడుము)); దేవాలయమునకు హాజరయ్యెను (అపొస్తులుల కార్యములు 2:46 చూడుము)); “వారు ఆనందముతోను మరియు నిష్కటమైన హృదయముతో” ఆహారము పుచ్చుకొనుచుండిరి ( అపొస్తులుల కార్యములు 2:46 చూడుము); దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందెను ( అపొస్తులుల కార్యములు 2:47) చూడుము); విశ్వాసమునకు లోబడిరి ( అపొస్తులుల కార్యములు 6:7 చూడుము)); వారు తమను తాము ప్రార్థనయందును “వాక్యపరిచర్యయందును ఎడతెగకయుండిరి” ( అపొస్తులుల కార్యములు 6:4 చూడుము). అమెరికా ఖండముపై పరిశుద్ధులు చేసిన విషయాలు: క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించారు 3 నీఫై 28:23 చూడుము); క్రీస్తు యొక్క సంఘమును స్థాపించెను (4 నీఫై 1:1 చూడుము); జనులకు బాప్తీస్మమిచ్చెను (4 నీఫై 1:1 చూడుము); ప్రతీఒక్కరూ న్యాయబుద్ధితో వ్యవహరించారు ( 4 నీఫై 1:2); అన్ని విషయాలను ఉమ్మడిగా కలిగియుండిరి (4 నీఫై 1:3 చూడుము); పట్టణాలను తిరిగి నిర్మించారు (4 నీఫై 1:7–9 చూడుము); వివాహము చేసుకొనిరి (4  నీఫై 1:11 చూడుము); ప్రభువు నుండి వారు పొందిన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనిరి (4 నీఫై 1:12 చూడుము); ఉపవాసము మరియు ప్రార్థనయందు కొనసాగించారు (4 నీఫై 1:12 చూడుము); ప్రార్థించుటకు మరియు ప్రభువు యొక్క వాక్యమును వినుటకు తరచుగా కలిసి సమావేశమయ్యారు (4 నీఫై 1:12 చూడుము).

  13. యెరూషలోములో పరిశుద్ధులు పొందిన కొన్ని దీవెనలు: పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు( అపొస్తులుల కార్యములు 2:44–46; 4:34–35 చూడుము)); వారు భాషలు మరియు ప్రవచన వరమును పొందిరి మరియు దేవుని యొక్క అద్భుతమైన కార్యములను మాట్లాడారు (Acts 2:4–18 చూడుము); అపొస్తులుల చేత అనేక అద్భుతాలు మరియు సూచనలు చేయబడినవి ( అపొస్తులుల కార్యములు 2:43); అద్భుతకార్యములు సంభవించెను ( అపొస్తులుల కార్యములు 3:1–10; 5:18–19; 6:8, 15 చూడుము); ఎక్కువమంది జనులు సంఘములో చేరారు ( అపొస్తులుల కార్యములు 2:47; 5:14 చూడుము). అమెరికాలో పరిశుద్ధులు పొందిన కొన్ని దీవెనలు: జనులు ప్రభువుకు మార్పు చెందారు (3 నీఫై 28:23; 4 నీఫై 1:2 చూడుము); ఒక తరము ఆశీర్వదించబడెను (3 నీఫై 28:23 చూడుము); వారి మధ్య వివాదములు మరియు తగవులు లేవు (4 నీఫై 1:2, 13, 15, 18 చూడుము); గొప్పవారు మరియు పేదవారు లేరు (4 నీఫై 1:3 చూడుము); “వారందరు స్వతంత్రులుగా మరియు పరలోకపు బహుమానమందు పాలి భాగస్తులుగా చేయబడిరి” (4 నీఫై 1:3); దేశములో సమాధానముండెను (4 నీఫై 1:4); గొప్ప అద్భుతములు జరిగెను (4 నీఫై 1:5, 13 చూడుము); ప్రభువు వారిని మిక్కిలిగా వర్ధిల్లచేసెను (4 నీఫై 1:7, 18 చూడుము); వారు బలముగా పెరిగిరి, మిక్కిలి వేగంగా వృద్ధి చెందిరి, మరియు మిక్కిలి సుందరమైన మరియు ఆహ్లాదకరమైన జనులైరి (4 నీఫై 1:10 చూడుము); ప్రభువు వారితో చేసిన వాగ్దానముల సమూహమును బట్టి ఆశీర్వదించబడిరి (4  నీఫై 1:11 చూడుము); “జనుల యొక్క హృదయములలో నివసించిన దేవుని యొక్క ప్రేమను బట్టి, దేశమందు ఎట్టి వివాదము లేకుండెను” (4 నీఫై 1:15 చూడుము); “ఎట్టి అసూయలు, జగడములు, అల్లర్లు, లేక జారత్వములు, లేక అబద్ధములు, లేక హత్యలు, లేక ఏవిధమైన కాముకత్వము లేక యుండెను, మరియు నిశ్చయముగా, దేవుని యొక్క హస్తము చేత సృష్టించబడిన జనుల మధ్య అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేదు” (4 నీఫై 1:16); “ఏ దొంగలు లేక హంతకులు అక్కడ లేరు, లేక లేమనీయులు లేరు, లేక ఏ విధమైన ఈయులు లేరు. కానీ వారు ఒక్కటిగా క్రీస్తు యొక్క సంతానము మరియు దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా ఉండిరి” (4 నీఫై 1:17); వారి పనులన్నిటిలో ప్రభువు వారిని ఆశీర్వదించెను (4 నీఫై 1:18 చూడుము).

  14. Jean B. Bingham, “That Your Joy Might Be Full,” Liahona, Nov. 2017, 85.

  15. 4 నీఫై 1:15 చూడుము.

  16. Jeffrey R. Holland, “Emissaries to the Church,” Liahona, Nov. 2016, 62.

  17. మొరోనై 7:47.

  18. Neil L. Andersen, in “Auxiliary Panels Use New Training Library,” Liahona, Apr. 2011, 76.

  19. మత్తయి 22:37–40 చూడుము.

  20. జేకబ్ 5:61.

  21. Matthew 18:20 చూడుము.

  22. 1 తిమోతి 6:15.