2010–2019
రక్షకుడు చేసినట్లుగా పరిచర్య చేయుట
ఏప్రిల్ 2018


రక్షకుడు చేసినట్లుగా పరిచర్య చేయుట

మన నిత్య సహోదరీలు, సహోదరులకు ప్రేమతో పరిచర్య చేయుట ద్వారా మనము దేవుని కొరకు మన కృతజ్ఞతను మరియు ప్రేమను చూపెదముగాక.

దేవుని నుండి నిరంతర బయల్పాటును పొందే కాలములో జీవించుట ఎంత అద్భుతమైన దీవెన “అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని”1 మనము ఎదురుచూసి పూర్తిగా అంగీకరించినప్పుడు, అది మన కాలము యొక్క ప్రవచించబడిన సంఘటనల గుండా వచ్చింది మరియు వచ్చినప్పుడు¸రక్షకుని యొక్క రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడియుంటాము.2

మనము ఒకరినొకరితో ప్రేమగా పరిచర్య చేసుకొనుట ద్వారా ఆయన రీతిగా మారుటకు ప్రయాసపడుటకంటే ఆయనను కలుసుకొనుటకు సిద్ధపడుట ఎటువంటి ఉత్తమమైన విధానము! ఈ యుగము ఆరంభములో యేసు క్రీస్తు తన అనుచరులకు బోధించినట్లుగా, “మీరు నన్ను ప్రేమించిన యెడల, మీరు నాకు సేవ చేస్తారు.”3 ఇతరులకు మన సేవ శిష్యత్వము యొక్క నిదర్శనము, దేవుని కొరకు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కొరకు మన కృతజ్ఞత మరియు ప్రేమను రుజువు చేయును.

కొన్నిసార్లు మన పొరుగు వారికి సేవ చేస్తున్నప్పుడు “లెక్కించుటకు” మనము ఏదైన గొప్పదానిని, విరోచితమైనది చేయాలని అనుకుంటాము. అయినప్పటికిని, సాధారణమైన సేవ యొక్క చర్యలు ఇతరులపై---అదేవిధంగా మనపై శక్తివంతమైన ప్రభావమును కలిగియుండవచ్చును. రక్షకుడు ఏమి చేసాడు? ఆయన దైవికమైన ప్రాయశ్చిత్త వరములు మరియు మనము జరుపుకునే ఈ అందమైన ఈస్టరు ఆదివారమున పునరుత్థానము ద్వారా---“భూమి మీద జీవించిన మరియు ఇంకను జీవించబోవు వారిపై వేరేవ్వరూ అంత శక్తివంతమైన ప్రభావమును కలిగిలేరు.”4 కానీ ఆయన కూడ చూసి చిరునవ్వు నవ్వాడు, మాట్లాడాడు, నడిచాడు, విన్నాడు, సమయము తీసుకున్నాడు, ప్రోత్సహించాడు, బోధించాడు, ఆహారమిచ్చాడు, మరియు క్షమించాడు. ఆయన కుటుంబము, స్నేహితులు, పొరుగువారు, మరియు క్రొత్తవారికి ఒకేవిధంగా సేవ చేసాడు, మరియు ఆయన సువార్త యొక్క గొప్ప దీవెనలు ఆనందించుటకు ఆయన పరిచయస్తులను మరియు ప్రేమించువారిని ఆహ్వానించాడు. ఆ సేవ మరియు ప్రేమ యొక్క “సాధారణమైన” చర్యలు నేడు మన పరిచర్య కొరకు మాదిరిని అందించును.

మీ పరిచర్య ప్రయత్నాలలో రక్షకునికి ప్రతినిధిగా ఉండే విశేషావకాశమును మీరు కలిగియున్నప్పుడు, మిమ్మల్ని ప్రశ్నించుకొనుము, “ఈ వ్యక్తి లేక కుటుంబముతో నేను సువార్త యొక్క వెలుగును ఎలా పంచుకోగలను? నేనేమి చేయాలని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నది? ”

పరిచర్య చేయుట ప్రత్యేకించి చూపబడిన విధానాలలో ఎన్నో రకాలుగా చేయబడవచ్చు. అయితే పరిచర్య యొక్క మాదిరులేమిటి?

పరిచర్య చేయుట ఎల్డర్ల కోరము మరియు ఉపశమన సమాజపు అధ్యక్షత్వములు అప్పగించబడిన పనులను గూర్చి ప్రార్థనాపూర్వకముగా ఆలోచిస్తున్నట్లుగా కనబడుచున్నది. నాయకులు కాగితపు స్లిప్పులను ఇచ్చుట కంటే, సహోదర, సహదరీలకు స్వయంగా ఇవ్వబడినట్లుగా, వ్యక్తులు మరియు కుటుంబాలను గూర్చి ఆలోచించు రీతిగా ఉన్నది. అది నడవటానికి వెళ్లుట, ఒక రాత్రి క్రీడ కొరకు కలిసి కూడుకొనుట, సేవనిచ్చుట లేక కలిసి సేవ చేయుటగా కనబడుచున్నది. అది వ్యక్తిగతంగా లేక ఫోనులో మాట్లాడుట లేక ఆన్‌లైన్ చాటింగ్ లేక సందేశము పంపుట మరియు దర్శించుటగా కనబడుచున్నది. ఒక జన్మదిన కార్డును అందించుట, మరియు ఒక సాసరు క్రీడను ఆనందించుటగా అది కనబడుచున్నది. ఒక లేఖనమును లేక వ్యక్తికి అర్ధవంతముగా ఉండే సమావేశ ప్రసంగము నుండి ఒక వ్యాఖ్య పంచుకొనుటగా అది కనబడుచున్నది. ఒక సువార్త ప్రశ్నను చర్చించుట మరియు స్పష్టతను, శాంతిని తెచ్చుటకు సాక్ష్యమును పంచుకొనుటగా అది కనబడుచున్నది. అది ఎవరైన ఒకరి జీవితములో భాగముగా మారి, అతడు లేక ఆమె గురించి శ్రద్ధ తీసుకొనుటగా కనబడుచున్నది. అవసరతలు మరియు బలములు పరిచర్య మౌఖిక సంభాషణలో సున్నితముగా మరియు తగినట్లుగా చర్చించబడినట్లు కూడా కనబడుచున్నవి. ఒక పెద్ద అవసరతకు స్పందించుటకు వార్డు సలహాసభ క్రమపరచుచున్నట్లుగా అది కనబడుచున్నది.

ఈ రకమైన పరిచర్య ఒక సహోదరి తన భర్త కళాశాలనుండి పట్టభద్రుడగుట ప్రారంభించినప్పుడు తన ఇంటినుండి దూరముగా వెళ్లిన ఆమెను బలపరచింది. పనిచేసే ఫోను లేకుండా, చిన్నబిడ్డను సంరక్షిస్తూ ఆమె క్రొత్త ప్రదేశములో దిక్కులేనిదిగా, పూర్తిగా తప్పిపోయినట్లు మరియు ఒంటరిగా భావించింది. ముందుగా చెప్పకుండా, ఒక ఉపశమన సమాజ సహోదరి, పసిబిడ్డ కొరకు చిన్న బూట్లను తెచ్చి తలుపు వద్దకు వచ్చింది, మరియు సరకుల షాపును కనుగొనుటకు వారిని కారులో తీసుకొని వెళ్ళింది. కృతజ్ఞతగల సహోదరి తెలియజేసింది, “ఆమె నిజముగా ఇబ్బందిపడుచున్న సమయములో నాకు సహాయము మరియు సహకారమును నాకందించింది. ”

నిజమైన పరిచర్య ఆఫ్రికాలోని పెద్ద సహోదరిచేత ఉదహరించబడింది, ఆమె చాలాకాలముగా సంఘ కూడికలను హాజరుకాని సహోదరిని వెదకుటకు నియమించబడింది. ఆమె ఆ సహోదరి ఇంటికి వెళ్లినప్పుడు, ఆ స్త్రీ కొట్టబడి, దొంగిలించబడి, తినటానికి చాలా స్వల్ప ఆహారము కలిగియున్నది మరియు ఆదివారము సంఘ సమావేశాలకు తగినవని ఆమె భావించే దుస్తులు లేకుండా ఉండుట ఆమె గమనించింది. ఆమెకు పరిచర్య చేయుటకు నియమించబడిన స్త్రీ వినగల చెవిని, తన తోటలో పండిన వాటిని, చదవటానికి లేఖనాలను మరియు స్నేహమును తెచ్చింది. “తప్పిపోయిన” సహోదరి త్వరలో సంఘానికి తిరిగి వచ్చింది మరియు ఆమె ప్రేమించబడిందని మరియు విలువివ్వబడినట్లు ఎరుగును కనుక ఒక సంఘ పిలుపును కలిగియున్నది.

అటువంటి ఉపశమన సమాజ ప్రయత్నాలను పునర్వ్యివస్తీకరించిన ఎల్డర్ల కోరముతో కలిసినప్పుడు విస్మయపరచే ఫలితాలను ఇవ్వగల ఐక్యతను తెచ్చును. “ప్రతీ సభ్యుని యొక్క ఇంటిని దర్శించు” మరియు “ఎల్లప్పుడు సంఘముపై కావలి కాయుటకు, మరియు వారితో ఉండి బలపరచుటకు”5 యాజకత్వ బాధ్యతను నెరవేర్చుటకు, అదేవిధంగా నిత్య జీవము యొక్క దీవెనల కొరకు ఒకరినొకరు సిద్ధపరచుటకు సహాయపడుటకు ఉపశమన సమాజపు ఉద్దేశమును సాధించుటకు పరిచర్య చేయబడుట ఒక సమన్యయ ప్రయత్నం అగును.6 బిషప్పు యొక్క నడిపింపు క్రింద కలిసి పనిచేస్తూ, ప్రతీ వ్యక్తిని, కుటుంబమును కావలికాసి మరియు శ్రద్ధ తీసుకొనుటకు శ్రేష్టమైన విధానాలను వారు వెదకినప్పుడు, ఎల్డర్ల కోరము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు కలిసి పనిచేస్తూ, ప్రేరేపించబడగలరు.

నేను మీకు ఒక మాదిరిని ఇస్తాను. ఒక తల్లి కాన్సరుతో నిర్ధారించబడింది. త్వరలో ఆమె చికిత్స తీసుకొనసాగింది, మరియు వెంటనే ఉపశమన సమాజ సహోదరీలు భోజనములతో సరిగా సహాయపడుటకు, వైద్య నియామకములకు వెళ్లుటకు, మరియు ఇతర సహాయముతో ఎలా సరిగా సహాయపడాలో ప్రణాళిక చేసి పనిచేసారు. వారు సంతోషకరమైన సహవాసము నిస్తూ ఆమెను క్రమముగా దర్శించారు. అదే సమయములో, మెల్కీసెదకు యాజకత్వము కోరము వెంటనే పని ప్రారంభించారు. వారు రోగియైన సహోదరికి శ్రద్ధ తీసుకొనుటకు సులభతరము చేయుటకు పునర్నిర్మించబడిన ఒక పడకగది మరియు బాత్రూమును చేరుస్తూ వారు పని చేసారు. ఆ ప్రాముఖ్యమైన ప్రయత్నములో పాల్గొనుటకు యువకులు వారి చేతులు మరియు నడుములు అందించారు. మరియు యువతులు చేర్చబడ్డారు. వారు ప్రతీరోజు నమ్మకంగా కుక్కను బయటకు తీసుకెళ్లుటకు సంతోషంగా ఏర్పాటు చేసారు. సమయము గతించినప్పుడు, అవసరమైన చోట చేరుస్తూ మరియు పొందుపరచుకుంటూ, వార్డు వారి సేవను కొనసాగించింది. అది ప్రతి సభ్యుడు అతడు లేక ఆమె తనను తాను ఇచ్చివేస్తూ, సామరస్యముగా వ్యక్తిగత విధానాలలో శ్రద్ధను చూపుట బాధపడుతున్న సహోదరిని దీవించుట మాత్రమే కాదు కాని ఆమె కుటుంబ సభ్యులలో ప్రతీ ఒక్కరు దీవించబడ్డారు.

ఒక ధైర్యముగల ప్రయత్నము తరువాత, సహోదరి చివరకు కాన్సరుతో చనిపోయింది, మరియు విశ్రాంతి తీసుకొనుటకు ఉంచబడింది. పని బాగా చేసారు మరియు బాగా ముగింపబడిందని వార్డు ఊపిరి పీల్చుకొని నిట్టూర్చారా? లేదు, యువతులు ప్రతీరోజు కుక్కను బయటకు తీసుకెళ్లారు, యాజకత్వ కోరములు తండ్రి మరియు తన కుటుంబమునకు పరిచర్య చేయుట కొనసాగించారు, మరియు ఉపశమన సమాజ సహోదరీలు బలములు మరియు అవసరాలను లెక్కించుటకు ప్రేమతో చేరువగుటను కొనసాగించారు. సహోదర, సహోదరిలారా, ఇది పరిచర్య చేయుట----ఇది రక్షకుడు చేసినట్లుగా ప్రేమించుట!

ఈ ప్రేరేపించబడి ప్రకటన వలన మరొక దీవెన, 14 నుండి మరియు 18 వయస్సులుగల యువతులకు ఉపశమన సమాజ సహోదరీలకు సహవాసులుగా సేవ చేయుటకు, మెల్కీసెదకు యాజకత్వముగల సహోదరులకు పరిచర్య చేయు సహవాసులుగా అదేవయస్సుగల యువకులు సేవ చేయుటకు అవకాశమున్నది. రక్షణ కార్యములో పెద్దల ప్రక్కన వారు సేవ చేస్తున్నప్పుడు, యువత వారి ప్రత్యేక వరములను పంచుకొనగలరు మరియు ఆత్మీయంగా ఎదగగలరు. పరిచర్య పనులలో యువతను చేర్చుట పాల్గొనే సభ్యుల సంఖ్యను హెచ్చించుట ద్వారా ఇతరులకు ఉపశమన సమాజము చేరువగుట మరియు ఎల్డర్ల కోరము యొక్క శ్రద్ధను ఎక్కువ చేయగలదు.

నాకు తెలిసిన అద్భుతమైన యువతులను గూర్చి నేను ఆలోచించినప్పుడు, ఒక యువతి యొక్క ఉత్సాహము, ప్రతిభలు మరియు ఆత్మీయ సున్నితత్వము చేత దీవించబడే విశేషావకాశము కలిగియుండే ఉపశమన సమాజపు సహోదరీలను బట్టి నేను ఉత్సాహపడుచున్నాను. ఉపశమన సమాజములో వారి సహోదరీల చేత ఉపదేశింపబడి, బోధించబడి మరియు బలపరచబడుటకు యువతులు అవకాశమును కలిగియుండుటను బట్టి నేను సమానంగా సంతోషిస్తున్నాను. దేవుని రాజ్యమును నిర్మించుటలో పాల్గొనుటకు ఈ అవకాశము యువతులు సంఘ నాయకులుగా, సమాజములో, మరియు వారి కుటుంబాలలో తోడ్పడే భాగస్వాములుగా, వారి పాత్రలను నెరవేర్చుటకు వారిని బాగా సిద్ధపరచుటకు సహాయపడే మహత్తరమైన ప్రయోజనముగా ఉండును. నిన్న సహోదరి బోన్ని ఎల్. ఆస్కార్‌సన్ పంచుకొన్నట్లుగా, యువతులు “సేవ చేయుటకుకోరుచున్నారు. వారు విలువగల వారని మరియు రక్షణ కార్యములో ముఖ్యమని తెలుసుకోవాల్సిన అవసరము వారికున్నది.”7

వాస్తవానికి, ఇదివరకే యువతులు నియమించబడకుండా లేక అట్టహాసము లేకుండా ఇతరులకు పరిచర్య చేస్తున్నారు. నాకు తెలిసిన ఒక కుటుంబము వారికి ఎవరూ తెలియని క్రొత్త ప్రదేశానికి వందల మైళ్లు దాటి వచ్చారు. మొదటి వారములోపల, వారి క్రొత్త వార్డు నుండి ఒక 14 సంవత్సరాల బాలిక, ప్రాంతానికి వారు స్వాగతిస్తూ, ఒక ప్లేటులో బిస్కట్లతో వారి మెట్ల వద్ద కనబడింది. ఆమె తల్లి పరిచర్య చేయాలనే తన కుమార్తె కోరికను బలపరుస్తూ, సహాయపడుటకు సమ్మతిస్తున్నట్లుగా, ఆమె వెనుక నిలబడింది.

మరొక తల్లి తన 16 సంవత్సరాల కుమార్తె మామూలు సమయానికి ఇంటికి రాలేదని కంగారుపడింది. చివరకు బాలికి వచ్చినప్పుడు, ఆమె ఎక్కడున్నదని కాస్త విసుగ్గా ఆమెను ప్రశ్నించింది. దగ్గరలో నివసిస్తున్న విధవరాలికి ఒక పువ్వు తీసుకెళ్లానని 16 సంవత్సరాల బాలిక దాదాపు బేలగా జవాబిచ్చింది. ఆ పెద్ద సహోదరి ఒంటరిగా కనబడుట ఆమె గమనించింది మరియు ఆమెను దర్శించుటకు ప్రేరేపించబడినట్లు భావించింది. తన తల్లి యొక్క పూర్తి అనుమతితో, ఆ యువతి ఆ వృద్ధురాలైన స్త్రీని దర్శించుట కొనసాగించింది. వారు మంచి స్నేహితులయ్యారు, మరియు వారి మధురమైన సహవాసము సంవత్సరాలుగా కొనసాగింది.

ఈ యువతులలో ప్రతీఒక్కరు, మరియు వారివలే అనేకమంది, ఎవరైనా అవసరతలో ఉండుట గమనించారు మరియు దానిని తీర్చుటకు పనిచేసారు. యువతులు శ్రద్ధ తీసుకొనుటకు మరియు పంచుకొనుటకు సహజమైన కోరికను కలిగియుంటారు, పెద్ద సహోదరితో భాగస్వామ్యములో పరిచర్య చేయుట ద్వారా అది సరిగా నడిపించబడును.

మన వయస్సుతో సంబంధములేకుండా, ప్రభావవంతంగా ఎలా పరిచర్య చేయాలో ఆలోచించినప్పుడు, “(అతడికి లేక) ఆమెకు ఏది అవసరము?” సేవ చేయుటకు నిజాయితీగల కోరికతో ఆ ప్రశ్న జతపరచబడి, వ్యక్తిని పైకెత్తి మరియు బలపరచుటకు మనమేమి చేయాలో ఆత్మ చేత నడిపించబడతాము. చేర్చబడ్డారనే సాధారణమైన సూచన, సంఘము వద్ద స్వాగతించబడుట, ఆలోచనపూర్వకమైన ఈ-మెయిల్, లేక సందేశము, కష్టకాలమందు స్వయంగా సంప్రదించుట, ఒక గుంపు ప్రోత్సాహకార్యక్రమములో పాల్గొనుటకు ఆహ్వానము, లేక కష్టమైన పరిస్థితితో సహాయపడుటకు అడుగుట చేత దీవించబడిన సహోదర, సహోదరీల వృత్తాంతములను నేను విన్నాను. పరిచర్య చేయు సహోదర, సహోదరీలనుండి ఒంటరి తల్లులు, క్రొత్తగా మార్పు చెందినవారు, తక్కువ చైతన్యముగల సభ్యులు, విధవరాళ్లు మరియు భార్యను కోల్పోయినవారు, లేక ప్రయాసపడుచున్న యువతకు అదనపు ఆసక్తి మరియు ప్రాధాన్యత అవసరము కావచ్చు. ఎల్డర్ల కోరము మరియు ఉపశమన సమాజము అధ్యక్షత్వము మధ్య సమన్వయము సరైన నియామకాలను చేయుటకు అనుమతించును.

అతి ముఖ్యమైనదేమనగా, ప్రేమ ప్రేరేపణగా నిజముగా పరిచర్య చేయుట ఒక్కొక్కటిగా నెరవేర్చబడును. నిజాయితీగల పరిచర్య యొక్క విలువ, ప్రజ్ఞ, మరియు అద్భుతము ఏమనగా అది నిజముగా జీవితాలను మార్చును! మన హృదయాలు తెరవబడి, ప్రేమించుటకు సమ్మతించి, చేర్చుకొని, ప్రోత్సహించి, ఆదరించినప్పుడు, మన పరిచర్య యొక్క శక్తి ఎదురులేనిది. ప్రేమ ప్రేరేపణగా, అద్భుతాలు సంభవించును, మరియు యేసు క్రీస్తు యొక్క సువార్తకు పూర్తి ఆలింగనములోనికి మన “తప్పిపోయిన” సహోదర, సహోదరీలను తెచ్చుటకు మార్గములను మనము కనుగొనగలము.

మనము ఏమి చెయ్యాలనే విషయములో మాత్రమే కాదు కాని మనము ఎందుకు దానిని చెయ్యాలో---సమస్తమునందు రక్షకుడు మన మాదిరిగా ఉన్నాడు.8 “మన దృష్టిని పైకెత్తుటకు, మన స్వంత సమస్యలను మరచిపోవుటకు, మరియు ఇతరులను సమీపించుటకు---భూమి మీద ఆయన జీవితము మనకు ఒక ఆహ్వానముగా ఉన్నది.”9 మన సహోదర, సహోదరీలకు హృదయపూర్వకమైన పరిచర్య చేయుటకు అవకాశమును మనము అంగీకరించినప్పుడు, దేవుని యొక్క చిత్తముతో ఎక్కువ సమ్మతి కలిగి, ఎక్కువ ఆత్మీయంగా శుద్ధి చేయబడుటకు మనము దీవించబడతాము మరియు ఆయన వద్దకు తిరిగి వెళ్లుటకు ప్రతిఒక్కరికి సహాయపడుటకు ఆయన ప్రణాళికను గ్రహించగలుగుతాము. ఆయన దీవెనలను మనము త్వరగా గుర్తిస్తాము మరియు ఇతరులతో ఆ దీవెనలు పంచుకొనుటకు ఆతృతగా ఉంటాము. మన హృదయాలు మన స్వరములతో ఏకముగా పాడును:

రక్షకుడా, నేను నా సహోదరుడిని ప్రేమించనా

మీరు నన్ను ప్రేమిస్తున్నారని నేను ఎరిగినట్లుగా,

మీ యందు నా బలము, నా ధ్రువతారను కనుగొందును,

నేను మీ సేవకునిగా ఉండుటకు.

రక్షకుడా, నేను నా సహోదరుడిని ప్రేమించనా---

ప్రభువా, నేను మిమ్మల్ని అనుసరిస్తాను.10

మన నిత్య సహోదర, సహోదరీలకు, ప్రేమతో పరిచర్య చేయుట ద్వారా దేవునికి మన కృతజ్ఞతను మరియు ప్రేమను చూపెదము గాక.11 దాని ఫలితంగా, ప్రాచీన అమెరికా దేశములోని జనులు రక్షకుడు ప్రత్యక్షమైన 100 సంవత్సరాల తరువాత అనుభవించిన ఐక్యతా భావన కలుగును.

“మరియు ఇది జరిగెను, జనుల యొక్క హృదయములలో నివసించిన దేవుని యొక్క ప్రేమను బట్టి, దేశమందు ఎట్టి వివాదము లేకుండెను.

“… ఎట్టి అసూయలు, జగడములు లేవు, . . . మరియు నిశ్చయముగా దేవుని యొక్క హస్తము చేత సృష్టించబడిన జనులందరి మధ్య అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు”12

ఈ బయల్పరచబడిన మార్పులు దేవుని చేత ప్రేరేపించబడినవని, సమ్మతించు హృదయాలతో వాటిని మనము పూర్తిగా అంగీకరించినప్పుడు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తును, ఆయన రాకడలో కలుసుకొనుటకు మనము ఉత్తమంగా సిద్ధపడియుంటామని నేను సంతోషముగా నా వ్యక్తిగత సాక్ష్యమిచ్చుచున్నాను. మనము సీయోను జనులగుటకు చేరువగా ఉంటాము మరియు శిష్యత్వము యొక్క బాట వెంబడి మనము సహాయపడిన వారితో అధికమైన సంతోషమును అనుభవిస్తాము. ఆవిధంగా మనము చేయాలని యేసు క్రీస్తు నామములో, నా మనఃపూర్వకమైన, వినయముగల ప్రార్థన, ఆమేన్.