2010–2019
ఒక ప్రవక్త హృదయము
ఏప్రిల్ 2018


ఒక ప్రవక్త హృదయము

ప్రభువు యొక్క ప్రవక్త సరైన స్థానములో ఉన్నందుకు, మరియు ఆయన దైవికంగా సూచించినట్లుగ ప్రభువు కార్యము చేయబడుతున్నందుకు మనం ఆనందించగలము.

ఈ పరలోక సందర్భంలో ఈరోజు పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరితో ఉండాలని నేను మనఃపూర్వకంగా ప్రార్థించాను. గంభీరమైన సమావేశములో ఈ యుగము యొక్క 17వ ప్రవక్త ఆమోదించబడుతుండగా మనమంతా కలిసి చూసినది అత్యంత విశేషమైనది.

ఈరోజు ప్రభువు నన్ను ఏమి మాట్లాడమని కోరుతున్నారో తెలుసుకోవడానికి నేను ప్రయత్నించినప్పుడు, క్రొత్తగా పిలవబడ్డ ప్రథమ అధ్యక్షత్వముతో ఈ మధ్య జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. ఈ చర్చలో, సలహాదారులలో ఒకరు ఈ మేరకు మాటలు పంచుకున్నారు: “మన క్రొత్త ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి పిలుపుతో జరిగినదాని గొప్పతనమును, మరియు సర్వ సభ్య సమావేశంలో జరుగబోవు గంభీరమైన సమావేశపు పరిశుద్ధతను సంఘ సభ్యులు అర్థం చేసుకుంటారని నేను లోతుగా ఆశిస్తున్నాను.” ఆయన యింకా చెప్పారు, “ఇప్పటికి 10 సంవత్సరాలైంది, అనేకమందికి, ప్రత్యేకించి సంఘ యువతకు గుర్తులేదు లేక దీనిని ఇంతకుముందు అనుభవించ లేదు.”

చిత్రం
అధ్యక్షులు డేవిడ్ ఒ. మెఖే

ఇది నాకు కలిగిన అనుభవాలపై నేను ప్రతిఫలించునట్లు చేసింది. నాకు గుర్తున్న మొదటి ప్రవక్త, అధ్యక్షులు డేవిడ్ ఒ. మెఖే. ఆయన మరణించినప్పుడు నాకు 14 సంవత్సరాలు. ఆయన మరణంతో ఏదో కోల్పోయిన భావన, నా తల్లి కళ్ళలో కన్నీళ్ళు, మరియు మా మొత్తము కుటుంబము అనుభవించిన విచారము నాకు గుర్తున్నాయి. “దయచేసి అధ్యక్షులు డేవిడ్ ఒ. మెఖేను దీవించండి” అనే పదాలు చాలా సహజంగా నా పెదవుల బయటకు రావటం నాకు పలకడం గుర్తుంది, ఎంతగా అంటే ఆయన మరణం తర్వాత నా ప్రమేయం లేకుండా అవే మాటలనును ఉపయోగించుట నేను కనుగొన్నాను. ఆయన తర్వాత వచ్చే ప్రవక్తల పట్ల నా మనస్సులో, హృదయంలో అదే భావన, నమ్మకం ఉంటాయో లేదోనని నేను ఆశ్చర్యపడ్డాను. కానీ తల్లిదండ్రులు తమ పిల్లల్లో ప్రతిఒక్కరిని ప్రేమించినట్లుగా, నేను అధ్యక్షులు మెఖే తరువాత వచ్చిన అధ్యక్షులు జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్ కొరకు ప్రేమను, బంధాన్ని, సాక్ష్యాన్ని కనుగొన్నాను, మరియు ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రవక్త కొరకు కూడా: హెరాల్డ్ బి. లీ, స్పెన్సర్ డబ్ల్యు. కింబల్, ఎజ్రా టాఫ్ట్ బెన్సన్, హావార్డ్ డబ్ల్యు. హంటర్, గార్డన్ బి. హింక్లీ, థామస్ ఎస్. మాన్సన్ మరియు నేడు, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి కొరకు. ప్రతి ప్రవక్తను పైకెత్తబడిన చేతితో---పైకెత్తబడిన హృదయంతో నేను పూర్తిగా ఆమోదించాను.

మన ప్రియమైన ప్రవక్తలలో ప్రతిఒక్కరు మరణించినప్పుడు, విచారము మరియు కోల్పోయినట్లు భావించడం సహజం. కానీ భూమిపైన జీవించియున్న ప్రవక్త పిలుపు మరియు ఆమోదించుట: పునఃస్థాపన యొక్క గొప్ప దీవెనలలో ఒకదానిని మనం అనుభవించినప్పుడు వచ్చే ఆనందం మరియు నిరీక్షణల చేత మన విచారము తగ్గించబడుతుంది.

చివరికి, గత 90 రోజులకు పైగా గమనించినట్లుగాఈ దైవిక విధానము గురించి నేను మాట్లాడతాను. దీనిని నేను నాలుగు భాగాలుగా వర్ణిస్తాను: మొదటిది, మన ప్రియమైన ప్రవక్త మరణము మరియు ప్రథమ అధ్యక్షత్వము రద్దు చేయబడును; రెండవది, క్రొత్త ప్రథమ అధ్యక్షత్వము పునర్నిర్మించబడే వరకు వేచియుండు కాలము; మూడవది, క్రొత్త ప్రవక్తను పిలుచుట; మరియు నాల్గవది, గంభీరమైన సమావేశములో క్రొత్త ప్రవక్తను మరియు ప్రథమ అధ్యక్షత్వమును ఆమోదించుట.

ప్రవక్త యొక్క మరణము

చిత్రం
అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్

యొక్క అంత్య క్రియలు

చిత్రం
అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్

మన ప్రియ ప్రవక్తయైన థామస్ ఎస్. మాన్సన్ 2018, జనవరి 2వ తేదీన తెరకు మరొకవైపుకు పయనించారు. ఆయన శాశ్వతంగా మన హృదయాల్లో స్థానము కలిగియుంటారు. అధ్యక్షులు మాన్సన్ గారు మరణించినప్పుడు అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ పంచుకున్న భావాలు సరిగ్గా మన భావాలను వర్ణిస్తాయి: “రక్షకుని వలే ఆయన జీవితంలో చెప్పుకోదగిన సుగుణమేమనగా బీదవారిని, రోగులను---ప్రపంచవ్యాప్తంగా అందరిని చేరుకోవడంలో ఆయన చూపిన వ్యక్తిగత శ్రద్ధ.”1

అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ గారు ఇలా వివరించారు:

“ఒక తార దిచ్చక్రము నుండి క్రిందికి రాలినప్పుడు, మరొకటి దృశ్యములోనికి వచ్చును, మరియు మరణము జీవమును పుట్టిస్తుంది.

“ప్రభువు యొక్క కార్యమునకు అంతము లేదు. ఒక శక్తివంతమైన నాయకుడు మరణించినప్పుడు కూడా, కనీసం ఒక్క క్షణం పాటు సంఘము నాయకత్వము లేకుండా ఉండలేదు, ఆయన రాజ్యానికి ఇచ్చిన దయగల దేవుడికి కృతజ్ఞతలు. ఆ విధంగానే ఇంతకుముందు జరిగింది . . . ఈ యుగములో ఇంతకుముందు, జనులు గౌరవంతో సమాధిని మూసివేసి, తమ కన్నీళ్ళను ఆపుకొని, భవిష్యత్తు వైపు చూసారు.”2

అపొస్తలుల స్వల్ప విరామము

ఒక ప్రవక్త మరణించినప్పటి నుండి మరల ప్రథమ అధ్యక్షత్వము ఏర్పాటు చేయబడేవరకు గల కాలాన్ని “అపొస్తలుల స్వల్ప విరామము”గా సూచించబడింది. ఈ సమయంలో, కోరము అధ్యక్షుని నాయకత్వం క్రింద పన్నెండుమంది అపొస్తలులు కలిసికట్టుగా సంఘ నాయకత్వమును నిర్వహించు తాళపు చెవులను కలిగియుంటారు. అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ ఇలా బోధించారు, “సంఘములో ఎల్లప్పుడూ ఒక ప్రతినిధి ఉంటారు మరియు ఒకవేళ మరణము లేక ఇతర కారణము చేత సంఘ అధ్యక్షత్వము తీసివేయబడినట్లయితే, మరల ఒక అధ్యక్షత్వము ఏర్పాటు చేయబడేంతవరకు పన్నెండుమంది అపొస్తలులే సంఘ ప్రతినిధిగా ఉంటారు.”3

చిత్రం
పన్నెండుమంది అపొస్తలుల కూటమి

ఇటీవల ఏర్పడ్డ స్వల్ప విరామ సమయము 2018, జనవరి 2వ తేదీన అధ్యక్షులు మాన్సన్ గారి మరణంతో ఆరంభమై 12 రోజుల తర్వాత 2018, జనవరి 14వ తేదీ ఆదివారం నాడు ముగిసింది. ఆ సబ్బాతు ఉదయమున, సీనియర్ అపొస్తలుడు మరియు పన్నెండుమంది కూటమి యొక్క అధ్యక్షుడైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ అధ్యక్షత్వము వహించు ఆధ్వర్యంలో సాల్ట్‌లేక్ దేవాలయపు పైగదిలో పన్నెండుమంది కూటమి ఉపవాసము మరియు ప్రార్థనాత్మతో కలుసుకొనిరి.

ఒక క్రొత్త ప్రవక్త యొక్క పిలుపు

ఈ పరిశుద్ధ, జ్ఞాపకముంచుకోదగిన సమావేశంలో ఐకమత్యంతో కలిసికట్టుగా స్థిరమైన పద్ధతిని అనుసరిస్తూ, దీర్ఘకాల అనుభవాన్ని బట్టి సహోదరులు అర్థచంద్రాకారంలో 13 కుర్చీలలో కూర్చొని, ముందుగా ప్రథమ అధ్యక్షత్వము యొక్క ఏర్పాటును ఆమోదించడానికి, తర్వాత అధ్యక్షులు రస్సెల్ మారియన్ నెల్సన్ గారిని యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘాధ్యక్షునిగా ఆమోదించడానికి చేతులు పైకెత్తారు. ఈ ఆమోదము తర్వాత పన్నెండుమంది కోరము ఒక వృత్తముగా నిలబడి, అధ్యక్షులు నెల్సన్ గారి తలపై చేతులుంచి, తరువాతి అత్యంత సీనియర్ అపొస్తలుని స్వరముతో ఆయనను నిర్థారించి, ప్రత్యేకపరిచారు.

తరువాత అధ్యక్షులు నెల్సన్ తన సలహాదారులుగా, అధ్యక్షులు డాల్లిన్ హార్రిస్ ఓక్స్, అధ్యక్షులు హెన్రీ బెన్నియన్ ఐరింగ్, పన్నెండుమంది అపొస్తలుల కూటమి యొక్క అధ్యక్షునిగా అధ్యక్షులు ఓక్స్, పన్నెండుమంది అపోస్తులుల కోరము యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా అధ్యక్షులు మెల్విన్ రస్సెల్ బల్లార్డ్ పేర్లు చెప్పారు. అదే విధమైన ఆమోదపు ఓటు తర్వాత, ఈ సహోదరులలో ప్రతిఒక్కరు తమ సంబంధిత స్థానాలకు అధ్యక్షులు నెల్సన్ గారిచేత ప్రత్యేకపరచబడ్డారు. ఆత్మ యొక్క కుమ్మరింపుతో, అది ఒక లోతైన పరిశుద్ధ అనుభవంగా ఉన్నది. మేము తీవ్రంగా ప్రార్థించినట్లు, ప్రభువు యొక్క చిత్తము ఆరోజు కార్యక్రమాలు మరియు సంఘటనలలో శక్తివంతంగా ప్రత్యక్షపరచబడిందని నేను నా సంపూర్ణమైన సాక్ష్యమిస్తున్నాను.

చిత్రం
ప్రథమ అధ్యక్షత్వము

అధ్యక్షులు నెల్సన నియమించబడి మరియు ప్రథమ అధ్యక్షత్వము యొక్క పునర్నిర్మాణముతో అపొస్తలుల స్వల్ప విరామము ముగిసింది, మరియు భూమిపై ప్రభువు యొక్క రాజ్య నిర్వహణలో, ఒక్క క్షణం కూడా అంతరాయం కలుగకుండా, విశేషంగా క్రొత్తగా ఏర్పాటు చేయబడ్డ ప్రథమ అధ్యక్షత్వము పనిచేయనారంభించింది.

గంభీరమైన సమావేశము

ఈ ఉదయం, అన్నిసంగతులు సక్రమముగా, సంఘమందు ఉమ్మడి అంగీకారముతో, విశ్వాస సహితమైన ప్రార్థనతో జరగాలని సిద్ధాంతము మరియు నిబంధనలులో సంక్షిప్తపరచబడినట్లు లేఖనములలో ఆజ్ఞాపించబడిన ప్రకారము దైవిక విధానము పూర్తయింది: “విశ్వాసము యొక్క ప్రార్థన ద్వారా, సంఘములో ఉమ్మడి సమ్మతి చేత మరియు అన్ని విషయములు క్రమములో జరపబడాలి,”4 మరియు “సంఘము యొక్క నమ్మకము, విశ్వాసము, ప్రార్థనలచేత బలపరచబడిన ముగ్గురు అధ్యక్షత్వము వహించు ప్రధాన యాజకులు, . . . సంఘము యొక్క అధ్యక్షత్వ కూటమిని ఏర్పరుస్తారు.”5

ఈ రోజు మనం పాల్గొన్న దానికి ముందు జరిగిన దానిని ఎల్డర్ డేవిడ్  బి. హైట్ వివరించారు:

“అత్యంత పరిశుద్ధ సందర్భములో---పరలోక విషయాలపై పనిచేయుటకు ఒక గంభీరమైన సమావేశములో--- మేము పాల్గొన్నాము మరియు సాక్ష్యమిస్తున్నాము. పూర్వకాలములలో మాదిరిగానే, ప్రభువు యొక్క ఆత్మ తమపై కుమ్మరింపబడాలని ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధులు అధిక ఉపవాస ప్రార్థనలు చేసారు, ఈ ఉదయం ఈ సందర్భంలో . . . అది అత్యధికంగా ప్రత్యక్షపరచబడింది.

“పరిశుద్ధులు ప్రథమ అధ్యక్షత్వపు నడిపింపు క్రింద సమావేశమైనప్పుడు, గంభీరమైన సమావేశములో, పేరుకు తగినట్లే ఒక పరిశుద్ధమైన, ప్రశాంతమైన, భక్తిగల సందర్భమును సూచించును.”6

సహోదర సహోదరీలారా, ప్రభువు యొక్క ప్రతినిధి, దేవుని యొక్క ప్రవక్త సరైన స్థానములో ఉన్నారని, మరియు ప్రభువు దైవికంగా సూచించినన విధానములో ఆయన కార్యము చేయబడుతున్నందుకు ఆయన సంతోషిస్తున్నాడని మనము ఆనందించగలము---“హోసన్నా!” అని ఎలుగెత్తి చెప్పగలము.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్

దైవికంగా నిర్థారించబడిన విధానము, దైవికంగా మరొక ప్రవక్త పిలవబడడానికి దారితీస్తుంది. అధ్యక్షులు మాన్సన్ గారు ఈ భూమిపై నివసించిన అద్భుత వ్యక్తులలో ఒకరైనట్లుగానే, అధ్యక్షులు నెల్సన్ గారు కూడా అద్భుతమైనవారు. ఈసమయంలో మనల్ని నడిపించడానికి ఆయన లోతుగా సిద్ధపరచబడి, ప్రభువు చేత ప్రత్యేకంగా శిక్షణనివ్వబడ్డారు. మన ప్రియమైన, సమర్పించబడిన ప్రవక్తగా---ఈ చివరి యుగములో సంఘము యొక్క 17వ అధ్యక్షునిగా ఇప్పుడు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారిని కలిగియుండడం గొప్ప దీవెన.

చిత్రం
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్

అధ్యక్షులు నెల్సన్ నిజంగా విశేషమైన వ్యక్తి. ఆయన మా కోరము అధ్యక్షునిగా ఉన్నప్పుడు, రెండు సంవత్సరాలకు పైగా పన్నెండుమంది కూటమిలో సేవచేసే విశేషాధికారము నాకు కలిగింది. నేను ఆయనతో పాటు ప్రయాణించాను మరియు ఆయన శక్తిని చూసి ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఆయన వేగం అందుకోవడానికి త్వరగా పరుగెత్తాలి! మొత్తంగా, ఆయన తన జీవితకాలంలో 133 దేశాలు సందర్శించారు.

ఆయన అందరినీ, పిల్లల్ని పెద్దల్ని ఆదరిస్తారు. ఆయనకి ప్రతిఒక్కరు తెలుసున్నట్లుగా కనబడును, మరియు ప్రత్యేకించి పేర్లను గుర్తుపెట్టుకోవడం ఆయనకున్న వరం. ఆయనను ఎరిగిన వారందరు, తాము ఆయనకు చాలా ఇష్టమైనవారిగా భావిస్తారు. మనలో ప్రతీఒక్కరితో ఆవిధంగా ఉన్నది ---ఎందుకంటే ప్రతిఒక్కరి కొరకు ఆయన చూపే నిజమైన ప్రేమ, శ్రద్ధ అలాంటివి.

అధ్యక్షులు నెల్సన్‌తో నా ప్రధాన సహవాసము సంఘానికి సంబంధించిన పాత్రలలో ఉన్నది, అయినప్పటికీ ప్రధాన అధికారిగా పిలవబడడానికి ముందు అధ్యక్షులు నెల్సన్ గారి వృత్తిపరమైన జీవితం గురించి కూడా నాకు తెలుసు. మీలో చాలామందికి తెలిసినట్లుగా అధ్యక్షులు నెల్సన్ గారు ప్రపంచ ప్రఖ్యాత గుండె శస్త్రచికిత్స నిపుణుడు, ఆయన వైద్యవృత్తిని ఆరంభించిన తొలిరోజుల్లో, గుండె—ఊపిరితిత్తుల యంత్రాన్ని వృద్ధిచేసిన వారిలో అగ్రగాముడు. 1951లో, మానవునిపై గుండె--ఊపిరితిత్తుల బైపాస్ ఉపయోగించి చేసిన మొట్టమొదటి ఓపెన్ హార్ట్ శస్త్ర చికిత్సకు సహకరించిన పరిశోధన జట్టులో ఆయన ఉన్నారు. అధ్యక్షులు కింబల్ ప్రవక్తగా కావడానికి కొంతకాలం ముందు అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్‌కు అధ్యక్షులు నెల్సన్ గుండె శస్త్రచికిత్స చేసారు.

చిత్రం
ఒక సర్జన్‌గా అధ్యక్షులు నెల్సన్

ఆసక్తికరంగా, 34 సంవత్సరాల క్రితం, అధ్యక్షులు నెల్సన్ పన్నెండుమందికి పిలవబడినప్పుడు, గుండెలను బలపరచి బాగుచేసే వృత్తిపరమైన  వైద్యవృత్తి ముగిసిపోయి, ఆయన మాటలు మరియు జ్ఞానము, సేవ, ప్రేమ యొక్క క్రియల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పైకెత్తబడి బాగు చేయబడ్డ లెక్కలేనన్ని పదుల వేలమంది హృదయాలను బలపరచి బాగుచేయడానికి సమర్పించబడిన అపోస్తులునిగా పరిచర్య ప్రారంభమైంది .

చిత్రం
ఒక అపోస్తులునిగా అధ్యక్షులు నెల్సన్
చిత్రం
అధ్యక్షులు నెల్సన్ సభ్యులను పలకరించుట
చిత్రం
మనుమనితో అధ్యక్షులు నెల్సన్

క్రీస్తువంటి హృదయము

అనుదిన అభ్యాసంలో క్రీస్తువంటి హృదయము గురించి నేను ఆలోచించినప్పుడు, నేను అధ్యక్షులు నెల్సన్‌ను చూస్తాను. ఆయన కంటే ఎక్కువగా ఈ లక్షణానికి మాదిరిగా ఉన్నవారెవరిని నేను కలవలేదు. అధ్యక్షులు నెల్సన్ యొక్క క్రీస్తువంటి హృదయపు ప్రత్యక్షతలను ప్రత్యక్షంగా గమనించే స్థానములో ఉన్నందుకు నాకు అసాధారణమైన శిక్షణ.

అక్టోబరు 2015లో నేను పన్నెండుమందిలో పిలువబడిన కొద్ది వారాల్లోనే, అధ్యక్షులు నెల్సన్ యొక్క వృత్తిపరమైన గత జీవితం గురించి కొంత తెలుసుకొనే అవకాశం కలిగింది నాకు. ఆయన కార్డియో థొరాసిక్ సర్జరీ అవార్డును పొందిన కార్యక్రమానికి వెళ్ళడానికి నేను ఆహ్వానించబడ్డాను. నేను అక్కడ ప్రవేశించినప్పుడు, అనేక సంవత్సరాల క్రితం వైద్యునిగా, సర్జనుగా అధ్యక్షులు నెల్సన్ చేసిన పనిని గుర్తించి, గౌరవించడానికి వచ్చిన అనేకమంది నిపుణులను చూసి నేను విస్మయము చెందాను.

ఆ సాయంత్రము, తన వైద్య విశిష్టతకు అధ్యక్షులు నెల్సన్ అత్యుత్తమ సహకారమునకు అనేకమంది నిపుణులు లేచి నిలబడి తమ గౌరవాన్ని, అభినందనలను వ్యక్తపరిచారు. సమర్పకులలో ప్రతిఒక్కరు అధ్యక్షులు నెల్సన్ గారి వివిధ విజయాలను విశేషంగా వర్ణిస్తుండగా, నేను నా ప్రక్కన కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మరింత ఆకర్షించబడ్డాను. నేనెవరో అతనికి తెలియదు, కానీ అధ్యక్షులు నెల్సన్ గారు, 1955లో వైద్య కళాశాలలో గుండె కుహరపు శస్త్ర చికిత్స రెసిడెన్సీ కార్యక్రమ సంచాలకుడైన డా. . నెల్సన్‌గా అతనికి తెలుసు.

ఈ వ్యక్తి అధ్యక్షులు నెల్సన్ పూర్వ విద్యార్థి. అతడు అనేక జ్ఞాపకాలను పంచుకున్నాడు. అన్నిటికన్నా ఆసక్తికరమైనది, అధ్యక్షులు నెల్సన్ బోధనా శైలి గురించి అతని వర్ణన, అది ఆయనకు విస్తారమైన పరిమాణములో ఖ్యాతిని తెచ్చిందని అతడు చెప్పాడు. గుండె శస్త్రచికిత్సకు సంబంధించిన బోధనలో అధికము ఆపరేషను గదిలోనే చెప్పబడుతుందని అతడు వివరించాడు. అక్కడ, పరిశోధనా తరగతిగా బోధకుని సమక్షంలో విద్యార్థులు గమనిస్తూ, శస్త్రచికిత్సను నిర్వహించేవారు. కొద్దిమంది బోధకుల సమక్షంలో ఆపరేషను గది వాతావరణం గందరగోళంగా, పోటీతత్వంతో, ఒత్తిడితో, స్వార్థంతో నిండియుండేదని, అతడు చెప్పాడు. అది కష్టతరమైన వాతావరణమని, కొన్నిసార్లు కించపరిచేలా కూడా ఉంటుందని అతడు చెప్పాడు. దాని ఫలితంగా, జరిగిన దానిబట్టి వారి భవిష్యత్తు నిర్ణయించబడుతుందని విద్యార్థులు భావించేవారు.

తరువాత అతడు అధ్యక్షులు నెల్సన్ యొక్క ఆపరేషను గదిలో ఉండే ప్రత్యేక వాతావరణం గురించి వివరించాడు. అది ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, మర్యాదపూర్వకంగా ఉండేది. విద్యార్థులు లోతైన గౌరవంగా చూడబడేవారు. అయితే, ఒక విధానం చేసి చూపబడిన తర్వాత, ప్రతి విద్యార్థి నుండి ఉన్నతస్థాయి ప్రమాణపు పనితనాన్ని ఆశించేవారు డా. నెల్సన్. తర్వాత, డా. నెల్సన్ ఆపరేషను గదినుండి ఎంతమంది బాగుపడ్డ రోగులు మరియు గొప్ప వైద్యులు వచ్చారో ఈ వ్యక్తి వివరించాడు.

ఇది నాకు ఏ మాత్రం ఆశ్చర్యము కలిగించలేదు. ఇదే నేను ప్రత్యక్షంగా గమనించాను, మరియు దీని ద్వారా పన్నెండుమంది కూటమిలో నిజముగా దీవించబడ్డాను. ఒక విధంగా నేను కూడా ఆయన దగ్గర “శిక్షణలో ఉన్న విద్యార్థుల్లో” ఒకడిగా ఉన్నట్లు భావిస్తున్నాను.

ఇతరులకు బోధించడంలో, అనుకూలమైన, గౌరవంగా, మరియు పైకెత్తు విధానములో సరిదిద్దడంలో అధ్యక్షులు నెల్సన్ అరుదైన ప్రత్యేక విధానం కలిగియున్నారు. క్రీస్తువంటి హృదయం మూర్తీభవించిన వ్యక్తిగా ఆయన మనందరికీ ఒక మాదిరి. ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా, మన ప్రవర్తన, మన హృదయాలు యేసు క్రీస్తు యొక్క సువార్త సూత్రాలకు అనుగుణంగా ఉండగలవని ఆయన నుండి మనం నేర్చుకోగలం.

ఇప్పుడు మన ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఆమోదించే గొప్ప దీవెనను మనం కలిగియున్నాము. ఒక విద్యార్థిగా, తండ్రిగా, ప్రొఫెసరుగా, భర్తగా, వైద్యుడిగా, యాజకత్వపు నాయకునిగా, తాతగా మరియు అపోస్తులునిగా తన జీవితమంతా ఆయన అనేక పాత్రలను గొప్పగా పోషించారు. ఈ పాత్రలను ఆయన అప్పుడు నెరవేర్చారు---ప్రవక్త హృదయంతో---- ఆ విధంగా కొనసాగిస్తారు.

సహోదర, సహోదరిలారా, ఈరోజు గంభీరమైన సమావేశములో మనము చూచి, పాల్గొన్నది అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సమస్త మానవాళి కొరకు ప్రభువు యొక్క జీవిస్తున్న స్వరమని నా సాక్ష్యమునకు నడిపించును. తండ్రియైన దేవుని గూర్చి, యేసు క్రీస్తును గూర్చి, మరియు మన రక్షకుడు మరియు విమోచకునిగా ఆయన పాత్రను గూర్చి నా సాక్ష్యమును కూడా నేను చేర్చుతున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.