2010–2019
రక్షణ విధులు మనకు ఆశ్చర్యకరమైన వెలుగునిస్తాయి
ఏప్రిల్ 2018


రక్షణ విధులు మనకు ఆశ్చర్యకరమైన వెలుగునిస్తాయి

ఈ రక్షణ విధులందు పాల్గొని,వాటికి సంబంధించిన నిబంధనలను గౌరవించుట, వాటిలో పాలుపంపులు పొందుట ఎప్పటికీ అంధకారమవుతున్న ఈ లోకములో ఆశ్చర్యకరమైన వెలుగు, కాపుదల మీకు లభించును.

సోదర, సోదరీలారా, నేను మీతో కలిసి, సువార్త, లేక, క్రీస్తు యొక్క సిద్ధాంతమునందు ఆనందించుచున్నాను.,

అప్పటి డెబ్బదిమందిలోని ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సన్‌ను ఒక స్నేహితుడు అడిగాడు, సమావేశ కేంద్రంలో 21000 మంది జనులముందు మాట్లాడినప్పుడు ఏ విధంగా అనుభూతి పొందావు? ఎల్డర్ ఆండర్సన్ జవాబుగా అన్నాడు, “ముందున్న 21,000 మంది నిన్ను భయపెట్టరు; కానీ నీ వెనుక కూర్చొన్న 15 సహోదరులు. ” అప్పుడు నేను నవ్వుకున్నాను, కాని, నేనిప్పుడు దానిని అనుభవిస్తున్నాను. ఈ 15మందిని ప్రవక్తలుగాను, దీర్ఘదర్శులుగాను, బయల్పాటుదారులుగా నేను ఎంతగా ప్రేమిస్తున్నాను మరియు బలపరుస్తున్నాను.

ప్రభువు అబ్రాహాముతో చెప్పియున్నాడు, అతని సంతతి, మరియు యాజకత్వము ద్వారా, భూమిమీది కుటుంబములన్నియు “సువార్త దీవెనలతో దీవించబడును, . . . . మరియు నిత్యజీవముతో కూడా l” (అబ్రహాము 2:11; 2 – 10 వచనములు కూడా చూడుము).

సువార్త, మరియు యాజకత్వము యొక్కయు వాగ్దత్తమైన దీవెనలు భూమిమీద పునరుద్ధరింపబడినవి, అప్పుడు 1842 లో, ప్రవక్త జోసెఫ్ స్మిత్, పరిమితమైన సంఖ్యలో స్త్రీ, పురుషులకు ఎండోమెంటును నెరవేర్చాడు. వారిలో ఒకరు మెర్సీ ఫీల్డింగ్ థాంప్సన్. ప్రవక్త ఆమెతో అన్నాడు, “ఈ (ఎండోమెంటు) నిన్ను చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తుంది.” 1

మిమ్మును, నన్నును ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించగల రక్షణ విధులపై ఈ రోజు నా దృష్టి సారించాలని కోరుచున్నాను.

విధులు మరియు నిబంధనలు

ట్రూ టు ద ఫెయిత్ లో మనము ఇలా చదువుతాము: “సువార్త విధి, యాజకత్వ అధికారము చేత, మన మహోన్నస్థితికి అవసరమైన విధులు . . . రక్షణ విధులని పిలవబడుచున్నవి. అవి బాప్తీస్మము, నిర్ధారణ, మెల్కీసెదకు యాజకత్వము (పురుషులకు), దేవాలయ దీవెన మరియు వివాహ బంధనము.”2

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించారు, “పునఃస్థాపించబడిన ప్రభువుయొక్క సంఘములో, రక్షణ మరియు మహోన్నత స్థితి యొక్క విధులు . . . . అధికారము కలిగియున్న పద్ధతులు, దీని ద్వారా పరలోకపు దీవెనలు మరియు శక్తులు మన వ్యక్తిగత జీవితాలలోనికి ప్రవహించగలవు.”3

నాణెమునకు రెండు ముఖములున్నట్లే, రక్షణ విధులన్నీ దేవునితో నిబంధనలతో కలిసియుండును. ఈ నిబంధనలను మనము విశ్వసనీయంగా గౌరవించిన యెడల దేవుడు మనకు దీవెనలను వాగ్దానము చేయుచున్నాడు.

ప్రవక్త అమ్యులేక్ ప్రకటించాడు, “దేవుని కలుసుకొనుటకు, . . . సిద్ధపడు సమయమైయున్నది” (ఆల్మా 34:32). మనము ఏ విధముగా సిద్ధపడగలము? యోగ్యతగా విధులను పొందుట ద్వారా. . . అధ్యక్షుడు రస్సెల్ ఎమ్. నెల్సన్ మాటలలో, మనము ”నిబంధన మార్గములో నిలిచియుండాలి,” మరియు, “ఆయనతో నిబంధనలు చేయుట ద్వారా రక్షకుని అనుసరించుటకు మీ ఒడంబడిక, తరువాత ఆ నిబంధనలను పాటించుట ప్రతి చోట పురుషులు, స్త్రీలు, మరియు పిల్లలకు లభ్యమయ్యే ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము మరియు విశేషావకాశమునకు ద్వారము తెరచును.”4

జాన్ మరియు బోన్నీ న్యూమాన్ మీలో అనేకులవలె అధ్యక్షుడు నెల్సన్ వాగ్దానం చేసిన ఆత్మీయ దీవెనలు పొందిరి. ఒక రోజు తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆదివారపు ఆరాధనకు వెళ్లి తిరిగి వచ్చాక బోన్నీ సంఘ సభ్యుడు కాని తన భర్త, జాన్‌తో, అన్నది.” ఈ విధంగా నా స్వంతంగా నేను చేయలేను. నీవు నా సంఘానికి వస్తావా లేక మనము కలిసి వెళ్లునట్లు ఒక సంఘాన్ని నీవు ఎంపిక చేస్తావో నీవు నిర్ణయించాల్సియున్నది, కానీ వారి నాన్న కూడా దేవునిని ప్రేమిస్తున్నాడని పిల్లలకు తెలియాల్సినవసరం ఉన్నది. మరుసటి ఆదివారం మరియు తరువాత ప్రతీ ఆదివారము జాన్ హాజరగుట మాత్రమే కాదు, అతడు కూడా సంవత్సరాలుగా అనేక వార్డులలో, బ్రాంచీలలో, మరియు ప్రాథమికల కొరకు పియానో వాయిస్తూ సేవ చేసాడు. జాన్‌ని కలిసే అవకాశం నాకు ఏప్రిల్ 2015 లో కలిగింది మరియు ఆ కూడికలో, మేము అతని భార్యయైన బోన్నీ యెడల అతని ప్రేమను ప్రత్యక్షపరచుటకు ఉత్తమమైన విధానము ఆమెను దేవాలయముకు తీసుకొని వెళ్ళుట అని చర్చించాము, కానీ అతడు బాప్తీస్మము పొందితే తప్ప అది జరగదు.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘమునకు 39 ఏళ్ళుగా హాజరైన తరువాత, జాన్ 2015 లో జాన్ బాప్తీస్మము పొందాడు. ఒక సంవత్సరము తరువాత, జాన్ మరియు బోన్నీ మెంఫిస్ టేన్నిస్సీ దేవాలయములో బంధింపబడ్డారు, ఆమె తన స్వంత ఎండోమెంట్‌ను పొందిన 20 సంవత్సరాల తరువాత ఇది జరిగింది. వారి 47 సంవత్సరాల కుమారుడు రాబర్ట్, తన తండ్రిని గూర్చి ఇలా అన్నాడు, “నాన్న యాజకత్వం పొందినప్పటి నుండి నిజంగాఅభివృద్ధి చెందాడు.” బోన్నీ కూడా ఇలా అన్నది. ”జాన్ ఎల్లప్పుడూ ఆనందంగాను, ఉత్సాహంగాను ఉండే వ్యక్తి, ఐతే, విధులను అంగీకరించి, తన నిబంధనలను గౌరవించడం అతడి మంచితనమును హెచ్చింప చేసింది.”

క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త బలి మరియు ఆయన మాదిరి

చాలా ఏళ్ళ క్రిందట, అధ్యక్షుడు బాయిడ్ కే. పాకర్ హెచ్చరించారు, “సువార్త విధులు లేకుండా, మంచి ప్రవర్తన మానవ జాతిని విమోచించదు, లేక మహోన్నత స్థితిని కలిగించదు.”5 వాస్తవానికి, మనం తండ్రి వద్దకు తిరిగి వెళ్ళడానికి మనకు విధులు మరియు నిబంధనలు అవసరమగుట మాత్రమే కాక ఆయన కుమారుడైన యేసు క్రీస్తు, మరియు ప్రాయశ్చిత్త బలి కూడా అవసరమైయున్నది.

క్రీస్తు యొక్క నామము ద్వారా మాత్రమే మనుష్య సంతతికి రక్షణ వచ్చునని రాజైన బెంజిమెన్ బోధించాడు (మోషైయా 3:17 చూడుము;విశ్వాస ప్రమాణములు 1:3 కూడా చూడుము).

ఆయన ప్రాయశ్చిత్తఃము ద్వారా, యేసు క్రీస్తు ఆదాము యొక్క పతనపు పర్యవసానముల నుండి మనల్ని విమోచించును మరియు మన పశ్చాత్తాపమును, చివరికి మహోన్నత స్థితిని సాధ్యము చేయును. ఆయన జీవితము ద్వారా, రక్షించే విధులు పొందుటకు ఆయన మనకు మాదిరినుంచాడు, దానిలో “దైవత్వము యొక్క శక్తి ప్రత్యక్షపరచబడెను” (సి & ని 84:20).

“నీతియావత్తు అనుసరింపబడు” ( 2 నీఫై 31:5–6), నిమిత్తము ఆయన బాప్తీస్మపు విధిని పొందిన తరువాత, సాతాను ఆయనను శోధించెను. అదేవిధముగా, మన శోధనలు బాప్తీస్మము బంధింపబడిన తరువాత గాని అంతము కావు, కాని పరిశుద్ధ విధులను పొంది వాటికి అనుబంధమైన నిబంధనలను గౌరవించుట మనము ఆశ్చర్యకరమైన వెలుగుతో నింపబడి, శోధనలను జయించుటకు, ఎదిరించుటకు శక్తిని పొందగలము.

హెచ్చరిక

ప్రవక్తయైన యెషయా ప్రకటించినట్లు కడవరి దినాలలో, “భూమి కూడ అపవిత్ర పరచబడును, . . . ఎందుకనగా వారు కట్టడను మార్చియున్నారు” (యెషయా 24:5(; సి & ని 1:15 కూడా చూడుము).

ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు కూడా ఇటువంటి హెచ్చరిక బయలుపరచబడింది, కొందరు “(ప్రభువుకు) తమ పెదవులతో దగ్గరవుతారు, . . . . (మరియు) దైవత్వపు రూపము కలిగిన, . . మానవుల ఆజ్ఞల సిద్ధాంతముల కొరకు వారు బోధించెదరు, కానీ వారు దానిలోని శక్తిని నిరాకరించుదురు” (జోసెఫ్ స్మిత్---చరిత్ర 1:19).

పౌలు కూడా హెచ్చరిస్తున్నాడు, అనేకులు: “భక్తిగల వారివలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించని వారైయుండరు, ఇట్టి వారికి విముఖడవై యుండుము (2 తిమోతి 3:5). అటువంటి వారి యొద్దనుండి తొలగిపోమ్మని నేను మరలా చెప్పుచున్నాను.

మన జీవితాలలోని అనేక ఆకర్షణలు, శోధనలు, “క్రూరమైన తోడేళ్ళవలే” (మత్తయి 7:15) వున్నాయి. నిజమైనకాపరి గొఱ్ఱెల కాపరి తన గొర్రెలను సిద్ధపరచి, కాపాడి, తోడేళ్ళు వచ్చుచున్నప్పుడు వాటిని హెచ్చరించును. జీతగాళ్ళయిన కాపరులు ఏ విధంగా మంచికాపరిని అనుసరించాలనుకుంటారోయోహాను 10:11–12 చూడుము).... మనము కూడా మన ఆత్మలకు, ఇతరుల ఆత్మలకు కాపరులము కామా? ప్రవక్తల, దీర్ఘదర్శుల, ప్రకటనకర్తల యొక్క బోధలను పొందియున్న మనము పరిశుద్ధాత్మ వరముతో, అప్రమత్తంగా ఉండి, తోడేళ్ళ జాడను కనిపెట్టగలము. దీనికి విరుద్ధంగా, మనము క్రమం లేని కాపరులమైతే, మన స్వంత ఆత్మకే కాక, ఇతరుల ఆత్మలకు కూడా క్రమములేని కాపరులవుతాము. ఆకస్మికమైనవి దుస్సంఘటనలకు దారితీయును. నమ్మకస్తులైన కాపరివలె ఉండవలెనని నేను మీలో ప్రతీఒక్కరిని ఆహ్వానించుచున్నాను.

అనుభవము మరియు సాక్ష్యము

సంస్కారము మార్గం తప్పకుండా నడుచుటకు మనకు సహాయపడే విధి, యోగ్యతగా పాల్గొనుట మిగిలిన విధులన్నిటితో సంబంధించిన నిబంధనను మనము పాటిస్తున్నామనుటకు నిదర్శనము. కొన్ని సంవత్సరాల క్రితం, నేను, నా భార్య అనిత, ఆర్కంసాస్‌లోని లిటిల్ రాక్ మిషన్‌లో సేవ చేస్తుండగా, నేను ఇద్దరు యౌవనస్తులైన మిషనరీలతో కలిసి బోధించడానికి వెళ్లాను. మేము బోధించుచున్న వారిలో ఒక సహోదరుడు అడిగాడు, “నేను మీ ప్రార్ధనా మందిరానికి వచ్చాను, మీరెందుకు, ప్రతి ఆదివారం, రొట్టెను తిని నీళ్ళు త్రాగుతారు? మా సంఘములో, ఏడాదికి రెండు సార్లు మాత్రమే, ఈస్టర్, క్రిస్మస్‌లకు మాత్రమె ఆచరిస్తాము, మరియు అది చాలా అర్ధవంతమైన పద్ధతి అని అన్నాడు.”

“తరచూ కలుసుకొని రొట్టె, ద్రాక్ష రసములో పాలుపంచుకొనవలెను” (మొరోని 6:6; సి & ని 20:75 ) అని మనము ఆజ్ఞాపించబడ్డామని మేము అతడితో పంచుకొన్నాము. మత్తయి 26 మరియు 3 నీఫై 18 నుండి మేము బిగ్గరగా చదివాము. అయినప్పటికిని, అతడు అంత అవసరము కనిపించుట లేదని జవాబిచ్చాడు.

అప్పుడు మేము అతనికి ఈ క్రింది పోలికను చెప్పాము: “నీవొక తీవ్రమైన కారు ప్రమాదానికి గురియైనట్లు ఊహించుకో. నీవు తీవ్ర గాయాలై ఆపస్మారకంగా పడియున్నావు. . . . నిన్ను అపస్మారక స్థితిలో చూసి, ఎవరో ఒకరు నిన్ను చూచి పరుగున వచ్చి ఎమర్జన్సీ నంబరు 911 కి ఫోన్ చేస్తారు. అప్పుడు నీవు చికిత్స పొంది స్పృహలోనికి వస్తావు.”

మేము ఆ సహోదరుని అడిగాము, “నీవు నీ పరిసరాలను గుర్తించినపుడు, నీకు ఎటువంటి ప్రశ్నలు కలుగుతాయి?”

అతడు అన్నాడు, “నేను ఇక్కడికి ఎలా వచ్చాను?, ఎవరు నన్ను తీసుకు వచ్చారు? నేనతనికి ప్రతిరోజూ ధన్యవాదాలు చెప్పాలనుకొనుచున్నాను. ఎందుకంటే అతడు నన్ను రక్షించాడు.”

అప్పుడు మేము అతనితో సువార్తను పంచుకున్నాము. ఏ విధంగా మన రక్షకుడు మనలను రక్షించియున్నాడో! కనుక, మనం కూడా మన రక్షకునికి ప్రతి రోజు, ప్రతి రోజు, ప్రతిరోజూ ధన్యవాదాలు చెప్పాల్సినవసరము మనకెంతగా ఉన్నది!

మేము అప్పుడు అడిగాము, “ఆయన మన కొరకు ప్రాణములు అర్పించియున్నాడని తెలిసినప్పుడు, ఆయన శరీరమునకు, రక్తమునకు, సాదృశ్యంగా రొట్టెను, నీటిని ఎంత తరచుగా తీసుకుంటావు?”

ఆతడు అన్నాడు, నాకు తెలిసింది, తెలిసింది. కాని, మరొక్క విషయం: మీ సంఘము మావలే చైతన్యవంతంగా లేదు?”

దానికి మేము స్పందించి, “ రక్షకుడైన యేసు క్రీస్తు ఆ తలుపు గుండా నడచి వస్తే ఏమి చేస్తావు?”

అతడన్నాడు, “వెంటనే, నేను మోకరిస్తాను.”

మేము అడిగాము, “కడవరి-దిన పరిశుద్దుల మందిరములోనికి వచ్చినపుడు నీకు కలిగేది అదే భావం కదా— రక్షకుని పట్ల భక్తిగల గౌరవభావం?

“నాకు అర్ధమయ్యింది, అర్ధమయ్యింది!” అని అతడు అన్నాడు.

అతడు ఈస్టరు ఆదివారం చర్చిలో కనబడ్డాడు. మరియు తిరిగి వస్తూనే ఉన్నాడు.

మనల్ని మనం ప్రశ్నించుకోవలసినదిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. “సంస్కారంతో కలిపి, ఏయే విధులు, నేను పొందాలి మరియు ఏయే నిబంధనలు నేను చేసి, ఆచరించి, గౌరవించవలసియున్నది? విధులను, వానికి సంబంధించిన నిబంధనలను గౌరవించుట వలన, ఎప్పటికీ అంధకారమగుతున్న ఈ ప్రపంచములో మీ జీవితాలకు ఆశ్చర్యకరమైన వెలుగును, కాపుదలను మీకు తెచ్చునని నేను మీకు వాగ్దానమిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 414.

  2. True to the Faith: A Gospel Reference (2004), 109; see also Handbook 2: Administering the Church (2010), 2.1.2.

  3. David A. Bednar, “Always Retain a Remission of Your Sins,” Liahona, May 2016, 60.

  4. Russell M. Nelson, “As We Go Forward Together,” Liahona, Apr. 2018, 7.

  5. Boyd K. Packer, “The Only True Church,” Ensign, Nov. 1985, 82.