2010–2019
పరిశుద్ధాత్మను మీ మార్గదర్శిగా తీసుకొనుము
ఏప్రిల్ 2018


పరిశుద్ధాత్మను మీ మార్గదర్శిగా తీసుకొనుము

యేసు క్రీస్తునందు వారి విశ్వాసముంచు వారికి ఎటువంటి సాటిలేని వరము లభిస్తుందో కదా. ఆ వరము పరిశుద్ధాత్మ.

ఈ ఈస్టరు దినమున, మన ఆలోచనలు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము వైపు మరియు ఖాళీ సమాధి వైపు మరలును, అది మరొకవిధంగా ప్రతీ విశ్వాసికి ఓటమిపైగా క్రీస్తు యొక్క విజయమునందు నిరీక్షణను ఇచ్చును. దేవుడు “మృతులలోనుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును,” 1 అని అపోస్తులుడైన పౌలుతో పాటు నేను నమ్ముచున్నాను.

జీవింపజేయుట అనగా, బ్రతికించుట అని అర్ధము. ఆయన పునరుత్థానము యొక్క శక్తి ద్వారా క్రీస్తు మన శరీరాలకు జీవము తెచ్చినట్లుగా, ఆయన మనల్ని కూడ జీవింపచేయును, లేక ఆత్మీయ మరణమునుండి మనల్ని బ్రతికించును.2 మోషే గ్రంథములో, ఆదాము ఈ రకమైన జీవమివ్వబడుటను గూర్చి మనము చదివాము. “(ఆదాము) బాప్తీస్మము పొందాడు, మరియు దేవుని యొక్క ఆత్మ అతడిపై దిగి వచ్చెను, మరియు ఆవిధంగా అతడు ఆత్మ చేత జన్మించాడు, మరియు లోపలి మనుష్యుడు బ్రతికింపబడెను.”3

యేసు క్రీస్తునందు వారి విశ్వాసముంచు వారికి ఎటువంటి సాటిలేని వరము లభిస్తుందో కదా. ఆ వరము పరిశుద్ధాత్మ “క్రీస్తునందు జీవము” అని క్రొత్త నిబంధన పిలుచు దానిని మనకిచ్చును.4 కాని కొన్నిసార్లు మనము అటువంటి వరమును తప్పదని అంగీకరిస్తున్నామా?

సహోదర, సహోదరిలారా, క్రింది అనుభవములో రుజువు చేయబడినట్లుగా, “పరిశుద్ధాత్మను (మన) … మార్గదర్శిగా కలిగియుండుట” 5 ఒక అసాధారణమైన విశేషావకాశము.

చిత్రం
ఎనైసైన్ ఫ్రాంక్ బ్లైర్

కొరియా యుద్ధకాలములో, ఎనైసైన్ ఫ్రాంక్ బ్లైర్ జపాన్‌లో దళాల రవాణా నౌక స్థావరములో పనిచేసాడు. 6 నౌక ఒక అధికారిక గురువును కలిగియుండేంత పెద్దగా లేదు, కనుక నౌకాధికారి ఆ యువకుడు విశ్వాసము మరియు నియమముగల వ్యక్తిగా మొత్తము సిబ్బందిచేత అత్యున్నతంగా గౌరవించబడుట గమనించి సహోదరుడు బ్లైర్‌ను నౌక యొక్క అనధికారిక గురువుగా ఉండమని అడిగాడు.

చిత్రం
ఎనైసైన్ బ్లైర్

ఎనైసైన్ బ్లైర్ వ్రాసాడు: “మా నౌక పెద్ద తుఫానులో చిక్కుకున్నది. అలలు దాదాపు 45 అడుగులకు పైగా ఎత్తుగా ఉన్నవి. నేను కావలికాస్తున్నాను. . . ఆ సమయమందు మా మూడు యంత్రములు పనిచేయటం ఆగిపోయాయి మరియు నౌక మధ్యలో పగుళ్లు తెలియచేయబడింది. మాకు రెండు యంత్రములు మిగిలాయి, వాటిలో ఒకటి సగము విద్యుత్ వద్ద మాత్రమే పనిచేస్తుంది. మేము తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నాము.”

ఎనైసైన్ బ్లైర్ తన పహారా ముగించాడు మరియు నౌకాధికారి తన తలుపు తట్టుచుండగా నిద్రకు ఉపక్రమిస్తున్నాడు. “ఈ నౌక కోసం దయచేసి నీవు ప్రార్థన చేస్తావా?” అని అతడు అడిగాడు. అవును, ఆవిధంగా చేయుటకు ఎనైసైన్ బ్లైర్ అంగీకరించాడు.

ఆ క్షణములో, ఎనైసైన్ బ్లైర్ “పరలోక తండ్రీ, దయచేసి మా నౌకను దీవించుము మరియు మమ్మల్ని క్షేమంగా ఉంచుము,” అని ప్రార్థించి మరియు తరువాత నిద్రపోవచ్చు. బదులుగా, అతడు నౌక యొక్క భద్రతను నిశ్చయపరచుటకు సహాయపడుటకు తాను చేయగలదేమైనా ఉన్నదా తెలుసుకోవాలని ప్రార్థన చేసాడు. సహోదరుడు బ్లైర్ ప్రార్థనకు జవాబుగా, వంతెన మీదకు వెళ్లి, నౌకాధికారితో మాట్లాడి, ఎక్కువగా తెలుసుకోమని పరిశుద్ధాత్మ అతడిని ప్రేరేపించింది. నౌక యొక్క మిగిలిన యంత్రములను ఎంత వేగంగా నడిపించాలో నిర్ణయించుటకు అతడు ప్రయత్నిస్తున్నాడు. మరలా ప్రార్థించుటకు ఎనైసైన్ బ్లైర్ తన గదిలోనికి తిరిగి వెళ్లాడు.

“యంత్రములతో ఉన్న సమస్యను పరిష్కరించుటకు సహాయపడుటకు నేనేమి చేయగలను?” అతడు ప్రార్థించాడు.

జవాబుగా, అతడు నౌక చుట్టూ నడిచి, ఎక్కువ సమాచారము సేకరించుటకు గమనించాల్సిన అవసరమున్నదని పరిశుద్ధాత్మ మెల్లగా చెప్పింది. అతడు నౌకాధికారి దగ్గరకు తిరిగి వెళ్ళాడు మరియు ఓడ పైభాగము చుట్టూ నడవటానికి అనుమతి అడిగాడు. అప్పుడు, అతడు తన నడుము చుట్టూ, లైఫ్‌లైన్ కట్టి, తుఫానులో బయటకు వెళ్ళాడు.

ఓడ వెనుక భాగంలో నిలబడి, ఒక అల ఓడపై భాగమును తాకినప్పుడు, అవి నీటి బయటకు వచ్చినప్పుడు భారీ చోదకాలను అతడు గమనించాడు. ఒకటి మాత్రమే పూర్తిగా పనిచేస్తుంది, మరియు అది చాలా వేగంగా తిరుగుతున్నది. ఈ గమనికల తరువాత, ఎనైసైన్ బ్లైర్ మరలా ప్రార్థించాడు. మిగిలిన మంచి యంత్రము చాలా ఎక్కువ ఒత్తిడి క్రింద ఉన్నదని దాని వేగము తగ్గించాలని అతడు స్పష్టమైన జవాబును పొందాడు. కనుక అతడు నౌకాధికారి వద్దకు తిరిగి వెళ్లి, ఆ సిఫారసు చేసాడు. దానికి వ్యతిరేకంగా, తుఫానును అధిగమించుటకు బదులుగా మంచి యంత్రము యొక్క వేగమును వారు హెచ్చించాలని ఓడ ఇంజనీరు సూచించాడని అతడికి చెప్పుతూ--నౌకాధికారి ఆశ్చర్యపడ్డాడు. అయినప్పటికిని, నౌకాధికారి ఎనైసైన్ బ్లైర్‌ యొక్క సూచనను అనుసరించుటకు ఎన్నుకొని, యంత్రము వేగమును తగ్గించాడు. తెల్లవారేసరికి, ఓడ క్షేమంగా నెమ్మదియైన నీటిపైన ఉన్నది.

కేవలము రెండు గంటల తరువాత, మంచి యంత్రము మొత్తానికి పనిచేయటం మానేసింది. మిగిలిన యంత్రములో సగము విద్యుచ్ఛక్తితో, నౌక నెమ్మదిగా ఓడరేవుకు చేరుకోగలిగింది.

“మనము చేసినట్లుగా, యంత్రము వేగము తగ్గించియుండకపోతే, మనము తుఫాను మధ్యలో నష్టపోయేవారము” నౌకాధికారి ఎనైసైన్ బ్లైర్‌తో చెప్పాడు.

ఈ యంత్రము లేకుండా, ఏవిధంగాను ఓడను నడపలేరు. ఓడ తలక్రిందులై, మునిగిపోయి ఉండేది. నౌకాధికారి యౌవన ఎల్‌డిఎస్ అధికారికి ధన్యవాదాలు తెలిపాడు మరియు ఎనైసైన్ బ్లైర్‌ యొక్క ఆత్మీయ భావనలను అనుసరించుట, ఓడను మరియు దాని సిబ్బందిని కాపాడిందని తాను నమ్మానని చెప్పాడు.

ఇప్పుడు, ఈ వృత్తాంతము చాలా నాటకీయమైనది. బహుశా మనము అటువంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనలేకపోయినప్పటికినీ, ఈ వృత్తాంతము మనముఆత్మ యొక్క నడిపింపును ఎక్కువ తరచుగా ఎలా పొందగలమనే ముఖ్యమైన సూచనలను కలిగియున్నది.

మొదట, బయల్పాటు విషయానికి వస్తే, పరలోకపు ప్రేరేపణ పొందుటకు మనల్ని అనుమతించు విధానములో మన జీవితాలను మనము జీవించాలి. ఎనైసైన్ బ్లైర్‌ పరిశుద్ధమైన, విశ్వసనీయమైన జీవితమును జీవిస్తున్నాడు. అతడు విధేయుడు కాకపోతే, తన ఓడ యొక్క భద్రత కోసం అతడు ప్రార్థించుటకు మరియు అటువంటి ప్రత్యేకమైన నడిపింపును పొందుటకు అవసరమైన ఆత్మీయ విశ్వాసము కలిగియుండేవాడుకాదు. మనము ప్రతిఒక్కరం, ఆయన చేత నడిపించబడుటకు బదులుగా దేవుని యొక్క ఆజ్ఞలతో మన జీవితాలను ఒకే కూటమిలో చేర్చుటకు ప్రయత్నించాలి.

కొన్నిసార్లు మనము యోగ్యతగాలేము కనుక పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలను పొందము. స్పష్టమైన సంభాషణను మరలా సంపాదించుటకు విధానము పశ్చాత్తాపము మరియు విధేయత. పశ్చాత్తాపము అనే పాతనిబంధన మాటకు అర్ధము “మరలుట” లేక “పూర్తిగా మరలుట.”7 మీరు దేవుని నుండి దూరముగా భావించినప్పుడు, మీరు పాపము నుండి మరలుటకు నిర్ణయమును మాత్రమే చేయాలి మరియు రక్షకుని ఎదుర్కొని, అక్కడ తన బాహువులు చాచి, ఆయన మీకోసం వేచియుండుటను కనుగొంటారు. ఆయన మిమ్మల్ని నడిపించుటకు ఆతృతగా ఉన్నాడు, మరియు ఆ నడిపింపును తిరిగి పొందుట నుండి మీరు కేవలము ప్రార్థన చేయాల్సినవసరమున్నది.8

రెండవది, ఎనైసైన్ బ్లైర్‌ తన సమస్యను పరిష్కరించమని మాత్రమే ప్రభువును అడగలేదు. పరిష్కారములో భాగముగా ఉండుటకు తానేమి చేయగలనని అతడు అడిగాడు. అదేవిధంగా మనము “ప్రభువా, పరిష్కారములో భాగముగా ఉండుటకు నేనేమి చేయగలను?” అని అడగాలి. ప్రార్థనలో మన సమస్యలను వరసగా చెప్పి, వాటిని పరిష్కరించమని ప్రభువును అడుగుటకు బదులుగా,  మనము ప్రభువు యొక్క సహాయమును పొందుటకు ఎక్కువ చురుకైన విధానాలను వెదకాలి మరియు ఆత్మ యొక్క నడిపింపు ప్రకారము చేయుటకు ఒడంబడిక చేయాలి.

ఎనైసైన్ బ్లైర్‌ వృత్తాంతములో మూడవ ముఖ్యమైన పాఠమున్నది. ముందు సందర్భాలలో ఆత్మనుండి నడిపింపును పొందని యెడల అటువంటి ప్రశాంతమైన నమ్మికతో అతడు ప్రార్థించేవాడా? చాలాకాలము దానిని ఉపయోగించకుండా, తుఫాను వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వరమును వెదకుట సరైన సమయము కాదు. పూర్తి కాల-సమయము మిషనరీగా కలిపి, ఈ యువకుడు ఇదివరకు అనేకసార్లు అదే మాదిరిని అనుసరించాడని స్పష్టమగుచున్నది. మన జీవితము సాఫీగా ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మను మార్గదర్శిగా తీసుకోవాల్సిన అవసరమున్నది, ఫలితంగా మనము మిక్కిలి కష్టాలలో ఉన్నప్పుడు ఆయన స్వరము మనకు స్పష్టముగా ఉండును.

మనము ఆత్మనుండి అనుదిన నడిపింపును ఆశించరాదని కొందరు అనుకొనవచ్చు ఎందుకనగా “(దేవుడు) అన్ని విషయాలందు ఆజ్ఞాపించుట తెలివైనది కాదు,” లేనియెడల మనము సోమరులైన సేవకులమవుతాము.9 అయినప్పటికిని, ఈ లేఖనము కొందరు పూర్వపు మిషనరీలు వారంతటవారే పొందాల్సిన బయల్పాటును పొందమని జోసెఫ్ స్మిత్‌ను అడిగిన వారికివ్వబడింది. ముందు వచనములో, “వారంతటవారు మరియు నా మధ్య ఆలోచన చేసినప్పుడు” 10 ప్రభువు వారితో మిషను ప్రాంతమునకు రమ్మని చెప్పాడు .

ఈ మిషనరీలు వారి ప్రయాణ ఏర్పాట్లును గూర్చి ప్రత్యేక బయల్పాటును కోరారు. వ్యక్తిగత విషయాలందు వారింకను తమ స్వంత నడిపింపును వెదకుట నేర్చుకొనలేదు. ప్రభువు ఈ స్వభావమును సోమరితనము అన్నాడు. పూర్వపు సంఘ సభ్యులు ఒక నిజమైన ప్రవక్తను కలిగియుండుటకు చాలా సంతోషించియుండవచ్చు, ఆలాగున వారంతటవారు బయల్పాటును ఎలా పొందాలో నేర్చుకొనుటకు విఫలమయ్యే అపాయములో ఉన్నారు. ఆత్మీయంగా తనపై ఆధారపడివారిగా ఉండుట ఒకరు స్వంత జీవితం కొరకు ఆయన ఆత్మ ద్వారా ప్రభువు యొక్క స్వరమును వినుట.

“నీ పనులన్నిటిలో ప్రభువుతో ఆలోచన చేయుము” అని ఆల్మా తన కుమారునికి సలహా ఇచ్చాడు.”11 ఈ విధంగా జీవించుటకు---మనము తరచుగా పిలిచే “ఆత్మ చేత జీవించుట” ---ఒక ఉన్నతమైన విశేషావకాశము. అది ప్రశాంతమైన భావనను మరియు నిశ్చయతను, అదేవిధంగా ప్రేమ, సంతోషము, మరియు సమాధానము వంటి ఆత్మ యొక్క ఫలాలను తెచ్చును.12

బయల్పాటును పొందుటకు ఎనైసైన్ బ్లైర్‌ యొక్క సామర్ధ్యము రేగుచున్న తుఫాను నుండి అతడిని మరియు అతడి ఓడ సహవాసులను రక్షించింది. ఈరోజు ఇతర విధాలైన తుఫానులు తీవ్రమగుచున్నది. మోర్మన్ గ్రంథము యొక్క జీవవృక్షము ఉపమానము13 అటువంటి లోకములో ఆత్మీయ భద్రతను ఎలా సాధించాలో శక్తివంతమైన రూపమునిచ్చును. దేవుని యొక్క మార్గమునకు తిరిగి నడుస్తున్న సంఘ సభ్యులకు ఆత్మీయ నాశనమును తెచ్చుటకు లేచిన అంధకారము యొక్క పొగమంచు గురించి ఈ దర్శనము చెప్పును.14

చిత్రం
లీహై యొక్క కల

ఈ దృశ్యమును ఆలోచించుటలో, విస్తారమైన జన సమూహములు ప్రయాణిస్తూ, కొందరు ఇనుప దండమును వారి చేతులతో గట్టిగా పట్టుకొనుటను నా మనోనేత్రములో నేను చూస్తున్నాను, కానీ అనేకమంది ఇతరులు కేవలము వారిముందున్న జనుల అడుగులను అనుసరిస్తున్నారు. ఈ తరువాత విధానమునకు కాస్త ఆలోచన లేక ప్రయత్నము అవసరము. కేవలము ఇతరులు చేయుచున్నది మరియు ఆలోచిస్తున్నదానిని మీరు చేయవచ్చు. ఇది తక్కువ శ్రమలున్నప్పుడు, బాగానే పనిచేస్తుంది. కానీ మోసపు తుఫానులు మరియు అబద్ధపు పొగమంచులు హెచ్చరిక లేకుండా లేచును. ఈ పరిస్థితులలో, పరిశుద్ధాత్మ యొక్క స్వరముతో పరిచయము కలిగియుండుట ఆత్మీయ జీవితము మరియు మరణమునకు సంబంధించిన విషయము.

“దేవుని వాక్యమును ఆలకించి మరియు . . .దానిని గట్టిగా పట్టుకొనియుండు వారెన్నడూ . . . నశించరు అంతేకాకుండా శోధనలు మరియు వారిని నాశనమునకు నడిపించునట్లు అపవాది యొక్క అగ్ని బాణములు వారిని అంధత్వమునకు జయించలేవు.”15

మార్గములో మీ ముందున్న వ్యక్తుల అడుగులను అనుసరించుట సరిపోదు. కేవలము ఇతరులు చేస్తున్నది మరియు ఆలోచిస్తున్న దానిని మనము చేయలేము; మనము నడిపించబడే జీవితమును జీవించాలి. మనలో ప్రతిఒక్కరము మన స్వంత చేతిని ఇనుప దండముపై వేసియుంచాలి. అప్పుడు ఆయన “(మనల్ని) చేతితో నడిపించును, మరియు (మన) ప్రార్థనలకు జవాబిచ్చును”16 అని తెలుసుకొనుచూ, మనము ప్రభువు వద్దకు వినయపూర్వకమైన విశ్వాసముతో వెళ్లెదము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.