2010–2019
మనమందరము ముందుకు త్రోసుకుని వెళదాము
ఏప్రిల్ 2018


మనమందరము ముందుకు త్రోసుకుని వెళదాము

గత రెండు రోజులు మీరు అనుభూతి చెందిన దానిని జ్ఞాపకముంచుకొని, పర్యాలోచన చేసినప్పుడు విధేయులగుటకు మీ కోరిక అధికమవుతుంది.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ చారిత్రాత్మక సమావేశము ముగింపుకు మనము చేరుకుంటుండగా ఆయన నడిపింపు మరియు ప్రేరేపించు ప్రభావము కొరకు ప్రభువుకు కృతజ్ఞత చెల్లించుటలో నేను మీతోపాటు చేరుతున్నాను. సంగీతము మనోహరమైనదిగాను బలపరచేదిగాను ఉన్నది. సందేశములు జ్ఞానవృద్ధిని కలిగించుట మాత్రమే కాదు, కానీ జీవితమును మార్చివేసేవిగా ఉన్నవి!

గంభీరమైన సమావేశములో మనము క్రొత్త ప్రథమ అధ్యక్షత్వమును ఆమోదించాము. పన్నెండుమంది అపొస్తలుల సమూహములో ఇద్దరు గొప్ప వ్యక్తులు పిలువబడ్డారు. ఎనిమిదిమంది నూతన ప్రధాన అధికార డెబ్బదులు పిలువబడ్డారు.

ఇప్పుడు ఒక ప్రియమైన కీర్తన క్రొత్తగా చేయబడిన మన తీర్మానమును, సవాలును, ముందుకు సాగమనే మన బాధ్యతను సంక్షిప్తపరుస్తుంది:

ప్రభువు యొక్క కార్యములో మనమందరము ముందుకు త్రోసుకుని వెళదాము,

జీవితము ముగించబడినప్పుడు మనము ఒక బహుమానము పొందవచ్చు;

సరైన దాని కొరకు పోరాటములో మనము ఖడ్గమును ఉపయోగిద్దాము,

సత్యము యొక్క బలమైన ఖడ్గము.

భయపడవద్దు, శత్రువు ఎగతాళి చేసినప్పటికిని;

ధైర్యముగా ఉండుము, ఏలయనగా ప్రభువు మన పక్కన ఉన్నాడు.

దుష్టుడు చెప్పే దానిని మనము లక్ష్యముంచరాదు,

కాని ప్రభువుకు మాత్రమే మనము లోబడాలి. 1

వచ్చే ఆరు నెలల కాలములో---ఈ సమావేశ సందేశాలను తరచుగా---అనేకసార్లు చదవమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీ కుటుంబ గృహ సాయంకాలములందు— మీ సువార్త బోధనయందు, కుటుంబము మరియు స్నేహితులతో మీ సంభాషణలందు, మరియు మన విశ్వాసమునకు చెందని వారితో మీ చర్చలందు కూడా ఈ సందేశములు చేర్చబడగల విధానముల కొరకు జాగ్రత్తగా వెదకండి. ప్రేమతో ఇవ్వబడినప్పుడు, ఈ సమావేశములో బోధింపబడిన సత్యములకు అనేకమంది మంచి జనులు స్పందిస్తారు. గత రెండు రోజులు మీరు అనుభూతి చెందిన దానిని జ్ఞాపకముంచుకొని, పర్యాలోచన చేసినప్పుడు విధేయులగుటకు మీ కోరిక అధికమవుతుంది.

ఈ సర్వసభ్య సమావేశము పరిచర్యలో ఒక క్రొత్త యుగము యొక్క ఆరంభమును గుర్తిస్తుంది. మనము ఒకరిపట్ల ఒకరము శ్రద్ధ తీసుకొనే విధానములో ప్రభువు కొన్ని ముఖ్యమైన సవరణలు చేసారు. సహోదరీలు, సహోదరులు---వృద్ధులు మరియు యౌవనులు ఒక క్రొత్త, పరిశుద్ధమైన విధానములో ఒకరికొకరు సేవ చేస్తారు. ప్రపంచమంతటా పురుషులు, స్త్రీలు మరియు పిల్లలను దీవించుటకు పెద్దల సమూహములు బలరపరచబడతాయి. ఉపశమన సమాజపు సహోదరీలు, తగిన నియామకము ద్వారా వారితో చేరుటకు యువ సహోదరీలకు అవకాశాలనిస్తూ తమ ప్రత్యేకమైన, ప్రేమగల విధానములో పరిచర్య చేయుటను కొనసాగిస్తారు.

ప్రపంచమునకు మన సందేశము సాధారణమైనది మరియు నిజాయితీగలది: వారి రక్షకుని వద్దకు వచ్చి పరిశుద్ధ దేవాలయము యొక్క దీవెనలు పొందాలని, శాశ్వతమైన ఆనందమును కలిగియుండాలని మరియు నిత్య జీవము కొరకు అర్హులు కావాలని తెరకు రెండువైపులా గల దేవుని పిల్లలందరిని మేము ఆహ్వానిస్తున్నాము. 2

ఉన్నత స్థితికి చేరడానికి మనమిప్పుడు చేసిన నిబంధనలు మరియు ప్రభువు యొక్క గృహములో పొందే విధులపట్ల పూర్తి విశ్వసనీయత అవసరము. ఈ సమయములో మనకు 159 పనిచేస్తున్న దేవాలయాలున్నాయి, మరిన్ని నిర్మాణములో ఉన్నాయి. విస్తరిస్తున్న సంఘ సభ్యత్వమునకు దగ్గరగా దేవాలయాలను తేవాలని మేము కోరుతున్నాము. కావున ఇప్పుడు మరో ఏడు దేవాలయాల నిర్మాణ ప్రణాళికలను ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ఆ దేవాలయాలు క్రింది ప్రాంతాలలో నిర్మించబడతాయి: సాల్టా, అర్జెంటీనా; బెంగళూరు, ఇండియా; మనాగ్వా, నికరాగ్వా; కాగయాన్ డి ఓరో, ఫిలిప్పీన్స్; లేటన్, యూటా; రిచ్మండ్, వర్జీనియా; మరియు రష్యాలో ఒక ప్రధాన నగరం, అది ఇంకా నిర్థారించబడవలసియుంది.

నా ప్రియ సహోదర సహోదరీలారా, ఈ దేవాలయ నిర్మాణములు మీ జీవితమును మార్చలేవు, కానీ దేవాలయములో గడిపే మీ సమయము నిశ్చయముగా జీవితాలను మారుస్తుంది. ఆ ఆత్మతో, దేవాలయములో మీరు ఎక్కువ సమయము గడిపేందుకు వీలుగా మీరు మానివేయగల విషయాలను గుర్తించేలా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ గృహాలలో గొప్ప సామరస్యము, ప్రేమతో మరియు మీ నిత్య కుటుంబ అనుబంధాల కోసము శ్రద్ధ తీసుకొనుటకు లోతైన కోరికతో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తునందు హెచ్చింపబడిన విశ్వాసముతో మరియు ఆయన నిజమైన శిష్యులుగా ఆయనను వెంబడించుటకు గొప్ప సామర్థ్యముతో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను.

సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కార్యములో మనము ఒడంబడిక చేసుకొన్నామని నేనిప్పుడు చేసినట్లుగా మీ స్వరము పైకెత్తుటకు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసే క్రీస్తు, ఇది ఆయన సంఘము, దీనిని ఆయన తాను అభిషేకించిన సేవకుల ద్వారా నడిపిస్తున్నారు. మీలో ప్రతిఒక్కరి కొరకు నా ప్రేమను తెలియజేస్తూ, యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. మనమందరము ముందుకు త్రోసుకుని వెళదాము కీర్తనలు, సం. 243.

  2. “దేవుని బహుమానములన్నింటిలో కన్నా గొప్పది” అని సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7 లో నిర్వచించబడింది.