2010–2019
పరిచర్య చేయుట
ఏప్రిల్ 2018


పరిచర్య చేయుట

ఇతరులను శ్రద్ధ తీసుకొనుటకు మరియు పరిచర్య చేయుటకు మేము ఒక క్రొత్తది, పరిశుద్ధమైన పద్ధతిని అమలు చేస్తున్నాము.

ఎల్డర్ గాంగ్ మరియు ఎల్డర్ సోరెస్‌, మీ విశ్వాసము యొక్క హృదయపూర్వకమైన వ్యక్తీకరణల కొరకు మీకు ధన్యవాదములు. మీకు, మీ ప్రియమైన సహవాసుల కొరకు మేము చాలా కృతజ్ఞతను కలిగియున్నాము.

ప్రియమైన సహోదరి, సహోదరిలారా, మన సభ్యులు దేవుని ఆజ్ఞలు పాటించుటకు, ప్రత్యేకంగా దేవునిని, మన పొరుగువారిని ప్రేమించుటకు మనము ఎలా సహాయపడగలమో ప్రభువునుండి నడిపింపును మనము నిరంతరము వెదకాలి.1

రక్షకుని విధానములో మన జనుల ఆత్మీయ మరియు తాత్కాలిక అవసరాలకు పరిచర్య చేయుటకు ఒక శ్రేష్టమైన విధానమును నెలలుగా మేము వెదకుచున్నాము.

మనకు తెలిసినట్లుగా గృహబోధన మరియు దర్శించు బోధనను ఆపివేయాలని మేము నిర్ణయించాము. బదులుగా, మేము ఇతరులను శ్రద్ధ తీసుకొనుటకు మరియు పరిచర్య చేయుటకు ఒక క్రొత్తది, పరిశుద్ధమైన పద్ధతిని అమలు చేస్తున్నాము. ఈ ప్రయత్నాలను మేము సాధారణంగా “పరిచర్య చేయుట” అని సూచిస్తాము.

సహోదరీల యొక్క సహజమైన వరముల చేత మరియు యాజకత్వము యొక్క సాటిలేని శక్తి చేత ప్రభావవంతమైన పరిచర్య చేయు ప్రయత్నాలు ప్రారంభించబడును. మనందరికి అపవాది యొక్క మోసపూరితమైన తంత్రముల నుండి అటువంటి భద్రత అవసరము.

పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ మరియు ఉపశమన సమాజపు ప్రధాన అధ్యక్షురాలు సహోదరి జీన్ బి. బింగమ్, నియమించబడిన యాజకత్వ సహోదరులు మరియు నియమించబడిన ఉపశమన సమాజము, యువతుల యొక్క సహోదరీలు ఇప్పుడు ప్రపంచమంతటా సంఘ సభ్యులకు సేవ చేయుట మరియు కావలికాయుటలో పనిచేస్తారు.

ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది వారి సందేశాలను సమ్మతించుటలో ఏకమైయున్నారు. కృతజ్ఞతపూర్వకంగా మరియు ప్రార్థనాపూర్వకంగా సంఘ చరిత్రలో ఈ క్రొత్త అధ్యయనమును మనము ప్రారంభించాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.