2010–2019
ఒక కాపరి అగుట
అక్టోబర్ 2018


ఒక కాపరిగా అగుట

మీరు పరిచర్య చేయువారు మిమ్మల్ని ఒక స్నేహితురాలిగా చూస్తారని, వారు మీలో ఒక విజేతను, అంతరంగికుని కలిగియున్నారని గ్రహిస్తారని నేనాశిస్తున్నాను.

ఇటీవల, నేను చీలీలో కలిసిన ఒక ప్రాథమిక బిడ్డ నాకు నవ్వు తెప్పించాడు. “హలో,” “నా పేరు డేవిడ్. నా గురించి మీరు సర్వసభ్య సమావేశములో మాట్లాడతారా?” అని అడిగాడు

మౌన క్షణాలలో, నేను డేవిడ్ యొక్క ఊహించని పలకరింపును గూర్చి ఆలోచించాను. మనమందరం గుర్తించబడాలని కోరతాము. మనం ముఖ్యమైనవారము కావాలని, జ్ఞాపకముంచుకోబడాలని, ప్రేమించబడాలని కోరతాము.

సహోదరీ, సహోదరులారా, మీలో ప్రతీఒక్కరు ముఖ్యమైనవారు. సర్వసభ్య సమావేశములో మీ గురించి మాట్లాడకపోయినా, రక్షకుడు మిమ్మల్ని జ్ఞాపకముంచుకుని, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అది సత్యమా అని మీరు ఆశ్చర్యపడిన యెడల, ఆయన “(తన) అరచేతుల మీద (మిమ్మల్ని) చెక్కుకున్నాడు” 1 అని మీరు ధ్యానించాలి.

రక్షకుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని, ఆయన కొరకు మన ప్రేమను ఎలా చూపగలమని మనం ఆశ్చర్యపడవచ్చు.

రక్షకుడు పేతురును, “నీవు నన్ను ప్రేమించుచున్నావా … ?” అని అడిగారు.

పేతురు ఇలా జవాబిచ్చాడు, “అవును ప్రభువా; నేను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువనెను. నా గొఱ్ఱెలను మేపుమని ఆయన అతనితో చెప్పెను.”

నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అని రెండవసారి, మూడవసారి అదే ప్రశ్నను అడిగినప్పుడు, పేతురు వ్యసనపడినప్పటికీ, తన ప్రేమను ధృవీకరించాడు: “ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువనెను. నా గొఱ్ఱెలను మేపుము అని యేసు అతనితో చెప్పెను.”2

పేతురు క్రీస్తు యొక్క ప్రేమగల అనుచరుడని ఇదివరకే రుజువు చేసుకోలేదా? సముద్ర తీరముపై వారి మొదటి సంఘర్షణ నుండి, అతడు రక్షకుని అనుసరించుటకు “వెంటనే” తన చేపల వలలను విడిచిపెట్టి,3 మనుష్యులను పట్టు నిజమైన జాలరిగా మారెను. అతడు రక్షకుని వ్యక్తిగత పరిచర్యయందు ఆయనకు సహాయపడుతూ, యేసు క్రీస్తు సువార్తను ఇతరులకు బోధించుటకు సహాయపడెను.

కాని ఇప్పుడు పేతురు ప్రక్కన ఇకముందు తాను ఉండనని ఎరిగిన పునరుత్థానుడైన ప్రభువు, అతడు ఎప్పుడు, ఎలా సేవ చేయాలో అతడికి చూపిస్తున్నాడు. రక్షకుడు లేనప్పుడు, పేతురు ఆత్మనుండి నడిపింపును వెదకి, తన స్వంత బయల్పాటును పొందాలి, తరువాత అమలు చేయుటకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగియుండాలి. ఆయన గొఱ్ఱెలపై దృష్టితో, అక్కడ ఆయన ఉంటే ఏమి చేస్తాడో దానిని అతడు చేయాలని రక్షకుడు పేతురును కోరాడు. ఒక కాపరిగా మారమని ఆయన పేతురును అడిగాడు.

గత ఏప్రిల్ లో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఒక పరిశుద్ధమైన విధానంలో మన తండ్రి గొఱ్ఱెలను మేపుటకు, పరిచర్య ద్వారా దానిని చేయుటకు ఒక ఆహ్వానమిచ్చారు. 4

ఈ ఆహ్వానాన్ని సమర్ధవంతంగా అంగీకరించుటకు, మనం ఒక కాపరి వంటి హృదయాన్ని అభివృద్ది చేసుకొని ప్రభువు గొఱ్ఱెల అవసరాలను గ్రహించాలి. ప్రభువు, ఆయన ప్రవక్త మనల్ని కోరినట్లుగా కాపరులుగా మనం ఎలా కాగలము?

అన్ని ప్రశ్నలవలే, మనం మనకు మాదిరియైన మన రక్షకుడు, మంచి కాపరియైన యేసు క్రీస్తు వైపు చూడగలము. రక్షకుని గొఱ్ఱెలు తెలియబడి, లెక్కించబడెను; అవి కావలికాయబడెను; అవి దేవుని మందలోనికి సమాకూర్చబడెను.

తెలియబడి, లెక్కించబడెను

రక్షకుని మాదిరిని అనుసరించుటకు మనం ప్రయాసపడినప్పుడు, మొదట మనం, ఆయన గొఱ్ఱెలను తెలుసుకోవాలి, లెక్కించాలి. మనం నిర్ధిష్టమైన వ్యక్తులను, కుటుంబాలను కాచుటకు నియమించబడ్డాం, ఆవిధంగా ప్రభువు యొక్క మందంతా లెక్కించబడుటకు, ఏ ఒక్కరూ మరచిపోబడలేదని మనం నిశ్చయంగా ఉండవచ్చును. అయినప్పటికినీ, లెక్కించుట నిజముగా సంఖ్యలను గూర్చినది కాదు; అది ప్రతీ వ్యక్తి ఆయన కొరకు సేవ చేయు వారి ద్వారా రక్షకుని ప్రేమను అనుభూతి చెందుటకు నిశ్చయించబడింది. ఆవిధంగా, అందరూ పరలోకమందున్న తండ్రి వారిని ఎరిగియున్నారని గుర్తించగలరు.

చిత్రం
గొఱ్ఱెతో రక్షకుడు

ఇటీవల నేను ఒక యువతిని కలిసాను, ఆమె తనకంటే ఐదుసార్లు పెద్ద వయస్సుగల సహోదరికి పరిచర్య చేయుటకు నియమించబడినది. కలిసి, సంగీతమంటే వారిద్దరికీ ఇష్టమని కనుగొన్నారు. ఈ యువతి దర్శించినప్పుడు, వారు కలిసి పాటలను పాడుకుని, వారికి ఇష్టమైనవి వారు పంచుకునేవారు. వారి ఇరువురి జీవితాలను దీవించు స్నేహాన్ని వారు నిర్మిస్తున్నారు.

మీరు పరిచర్య చేయువారు మిమ్మల్ని ఒక స్నేహితురాలిగా చూస్తారని, మీలో ఒక విజేతను, అంతరంగికురాలిని కలిగియున్నారని---వారి పరిస్థితులను తెలుసుకొను ఒకరిగా, వారి ఆశలు, ఆకాంక్షలందు వారికి సహాయపడు వారిగా గ్రహిస్తారని నేనాశిస్తున్నాను.

ఇటీవల నాకు, నా సహవాసికి సరిగా తెలియని ఒక సహోదరికి పరిచర్య చేయుటకు నేను నియమించబడ్డాను. నా 16-సంవత్సరాల పరిచర్య సహవాసి జెస్‌తో నేను సంప్రదించినప్పుడు, ఆమె తెలివిగా “మనం ఆమెను తెలుసుకోవాల్సినవసరమున్నదని” సూచించింది.

చిత్రం
సహోదరి కార్డన్ మరియు ఆమె పరిచర్య చేయు సహవాసి

మేము వెంటనే ఒక సెల్ఫీ ఫోటోను, ఒక పరిచయపు సందేశాన్ని పంపాలని నిర్ణయించాము. నేను ఫోను పట్టుకున్నాను, ఫోటో తీయటానికి జెస్ బటన్‌ని నొక్కింది. నేను నా సహవాసి మా మొదటి పరిచర్య చేయు అవకాశాన్ని వినియోగించాం.

మేము మొదటిసారి దర్శించినప్పుడు, ఆమె తరఫున మేము ప్రార్థించవలసింది ఏదైనా ఉన్నాదా అని ఆ సహోదరిని అడిగాము. ఆమె ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిగత సవాలును మాతో పంచుకొని మమ్మల్ని ప్రార్థన చెయ్యమని చెప్పింది. ఆమె నిజాయితీ, నమ్మకము తక్షణమైన ప్రేమ బంధాన్ని తెచ్చింది. నా అనుదిన ప్రార్థనలలో ఆమెను జ్ఞాపకము చేసుకొనుట ఎటువంటి ప్రియమైన విశేషావకాశము.

మీరు ప్రార్థించినప్పుడు, మీరు పరిచర్య చేయు వారి కొరకు యేసు క్రీస్తు కలిగిన ప్రేమను మీరనుభవిస్తారు. ఆ ప్రేమను వారితో పంచుకొండి. మీ ద్వారా---ఆయన ప్రేమను అనుభూతి చెందుటకు వారికి సహాయపడుట కంటే ఆయన గొఱ్ఱెలను మేపు మంచి విధానం ఇంకేముంది?

కావలి కాయబడెను

కాపరి వంటి హృదయాన్ని అభివృద్ధి చేయుటకు రెండవ విధానం ఆయన గొఱ్ఱెలను కావలి కాయుట. కడవరి-దిన పరిశుద్ధులుగా, మనం మారగలం, సరిచేయగలం, మరమ్మత్తు చేయగలం, దాదాపు దేనినైనా తిరిగి నిర్మించగలం. మనం ఒక అవసరతను సహాయహస్తంతో లేదా ఒక ప్లేటు బిస్కట్లతో త్వరగా తీర్చగలం. కాని ఇంకా ఏమైనా చేయగలమా?

మనం వారిని ప్రేమతో కావలి కాస్తున్నామని--- సహాయపడుటకు ఎలాంటి చర్యనైనా తీసుకుంటామని మన గొఱ్ఱెలకు తెలుసా?

?మత్తయి 25 లో మనమిలా చదువుతాము:

“నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పునాది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి … :

“నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం నిచ్చిరి: దప్పిగొంటిని, నాకు దాహం తీర్చిరి: పరదేశినైయుంటిని నన్ను చేర్చుకొంటిరి: …

“అందుకు నీతిమంతులు---ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?

“ఎప్పుడు పరదేశివై యుండుట చూచి, నిన్ను చేర్చుకొంటిమి?”5 అని సమాధానమిచ్చెదరు.

సహోదర, సహోదరిలారా, ఇందులో ముఖ్యమైన మాట చూచెను. నీతిమంతులు అవసరతలో ఉన్నవారిని చూసారు ఎందుకనగా వారు కావలికాస్తున్నారు, గమనిస్తున్నారు. సహాయపడుటకు, ఓదార్చుటకు, వేడుక చేసుకొనుటకు, కలగనుటకు మనము కూడ శ్రద్ధ కలిగియుండగలము. మనం చేసినప్పుడు, మనం కూడ మత్తయిలోని వాగ్దానమును పొందగలము: “మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికి మీరు చేసితిరి గనుక … , నాకు చేసితిరి.” 6

చిత్రం
రక్షకుడు గొఱ్ఱెను శ్రద్ధ తీసుకొనుట

మేము జాన్ అనే పిలిచే ఒక స్నేహితుడు---ఇతరుల యొక్క స్వల్పంగా కనబడే అవసరతను మనం చూచినప్పుడు ఏమి జరుగుతుందో పంచుకున్నాడు: “మా వార్డులో ఒక సహోదరి ఆత్మహత్యాయత్నం చేసింది. రెండు నెలల తరువాత, ఈ బాధాకరమైన అనుభవం తరువాత మాట్లాడుటకు నా కోరములోని ఎవరూ ఆమె భర్తను సమీపించలేదని నేను కనుగొన్నాను. విచారకరంగా, నేను కూడ ఏమీ చేయలేదు. చివరికి, నేను భర్తను మధ్యాహ్నాభోజనానికి రమ్మని అడిగాను. అతడు బిడియస్తుడు, మితభాషి. అయినప్పటికినీ, ‘మీ భార్య ఆత్మహత్యకు ప్రయత్నించడం మీకు చాలా కష్టముగా ఉండియుండవచ్చు. దాని గురించి మీరు మాట్లాడటానికి ఇష్టపడతారా?’ అని నేను అడగ్గా అతడు గట్టిగా ఏడ్చాడు. మేము మృదువుగా, సన్నిహితంగా మాట్లాడుకున్నాం, మరియు కొన్ని నిముషాలలో అసాధారణమైన సన్నిహితత్వాన్ని, నమ్మకాన్ని వృద్ధి చేసాము.”

జాన్, “మన ధోరణి కేవలము బ్రౌనీలను తీసుకొని వెళ్లుటకంటే నిజాయితీగా, ప్రేమతో ఆ క్షణములో వారితో ఎలా నడవాలో గుర్తించుట అని నేను అనుకుంటున్నాను” 7 అని చెప్పాడు.

మన గొఱ్ఱెలు గాయపడుతుండవచ్చు, తప్పిపోవచ్చు, లేక ఇష్టపూర్వకంగా దారితప్పవచ్చు; వారి కాపరిగా, మనం వారి అవసరతను చూచు మొదటి వారిగా ఉండాలి. మనం విమర్శించకుండా వినగలం, ప్రేమించగలం, నిరీక్షణను ఇవ్వగలం, పరిశుద్ధాత్మ యొక్క వివేచించు నడిపింపుతో సహాయపడగలము.

సహోదరీ, సహోదరులారా, మీరు చేసే ప్రేరేపించబడిన స్వల్పమైన దయగల క్రియల వలన లోకము మరింత నిరీక్షణతో నింపబడి, సంతోషముగా ఉన్నది. ఆయన ప్రేమను ఎలా తెలపాలో, మీరు పరిచర్య చేయువారి అవసరతలను చూచుటకు ప్రభువు నడిపింపును మీరు వెదకినప్పుడు, మీ కన్నులు తెరవబడును. మీకు అప్పగించబడిన పరిశుద్ధ పరిచర్య ప్రేరేపణకు దైవిక హక్కును మీకిచ్చును. విశ్వాసముతో ఆ ప్రేరేపణను మీరు వెదకగలరు.

దేవుని మందలోనికి సమకూర్చబడుట

మూడవది, మన గొఱ్ఱెలు దేవుని మందలోనికి సమకూర్చబడాలని మనం కోరతాం. ఆవిధంగా చేయుటకు, నిబంధన బాటలో మన గొఱ్ఱెలు ఎక్కడ ఉన్నవో మనం పరిశీలించి, వారి విశ్వాస ప్రయాణంలో వారితో నడచుటకు సమ్మతించాలి. వారి హృదయాలను తెలుసుకొనుటకు, వారిని రక్షకుని వైపు నడిపించుటకు పరిశుద్ధ విశేషావకాశము మనది.

చిత్రం
మంచి కాపరిని గొఱ్ఱె అనుసరించుట

ఫీజీలోని సహోదరి జోస్విని నిబంధన మార్గంలో ముందుకు చూచుట కష్టముగా ఉండెను. ఆమె స్నేహితురాలు జోస్విని లేఖనాలను సరిగా చూడలేక ప్రయాసపడుతున్నదని గమనించింది. ఆమె జోస్వినికి క్రొత్త కళ్లద్దాలను ఇచ్చింది, మోర్మన్ గ్రంథములో యేసు క్రీస్తును గూర్చి ప్రస్తావించబడిన ప్రతీ చోటా గుర్తించుటకు ప్రకాశవంతమైన పసుపు రంగు పెన్సిల్ ఇచ్చింది. పరిచర్య చేయుటకు సాధారణమైన కోరికతో ప్రారంభించి, లేఖనము అధ్యయనము చేయుటకు సహాయపడుట వలన దాని ఫలితము, జోస్విని బాప్తీస్మము పొందిన 28 సంవత్సరాల తరువాత మొదటిసారి దేవాలయమునకు హాజరగుచున్నది.

చిత్రం
సహోదరి జోస్విని
చిత్రం
దేవాలయము వద్ద సహోదరి జోస్విని

మన గొఱ్ఱెలు బలమైనవైనా లేక బలహీనమైనవైనా, సంతోషంలో లేక వేదనలో ఉన్నప్పటికినీ, ఏ ఒక్కరూ ఒంటరిగా నడవకుండా మనం శ్రద్ధ తీసుకోవాలి. వారు ఆత్మీయంగా ఎక్కడ ఉన్నప్పటిని మనం వారిని ప్రేమించి, సహకారము, ప్రోత్సాహమిచ్చి, ముందుకు సాగటానికి ప్రోత్సహించగలము. వారి హృదయాలను గ్రహించుటకు మనం ప్రార్ధించి, వెదకినప్పుడు, పరలోక తండ్రి మనల్ని నడిపించును, ఆయన ఆత్మ మనతో వెళ్ళునని నేను సాక్ష్యమిస్తున్నాను. వారి ముందు ఆయన వెళ్లినప్పుడు “(వారి) చుట్టూ దేవదూతలుగా,” ఉండే అవకాశమును మనం కలిగియుంటాము. 8

చిత్రం
తన గొఱ్ఱెలతో మంచి కాపరి

ఆయన గొఱ్ఱలను మేపమని ఆయన చేసినట్లుగా ఆయన మందలను కావలికాయుమని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రతీ రాజ్యము, ప్రతీ దేశమునకు కాపరులుగా ఉండమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. (అవును, ఎల్డర్ ఉక్‌డార్ఫ్, జర్మన్ షెపార్డ్‌లను మేము ప్రేమిస్తున్నాము, మాకవసరము). మరియు ఆ హేతువులో చేరమని ఆయన తన యౌవనులను కోరుచున్నారు.

మన యువత మన బలమైన కాపరులు కాగలరు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పినట్లుగా, వారు “ఈ లోకమునకు ప్రభువు ఎప్పటికీ పంపిన వారందరిలో శ్రేష్టమైన వారు.” వారు “ఘనమైన ఆత్మలు,” రక్షకుని అనుసరించు “మన శ్రేష్టమైన ఆటగాళ్ళు.”9 ఆయన గొఱ్ఱెల కొరకు వారు శ్రద్ధ తీసుకొన్నప్పుడు అటువంటి కాపరులు తెచ్చు శక్తిని మీరు ఊహించగలరా? ఈ యువతతో ప్రక్కప్రక్కను పరిచర్య చేయుట, మనము అద్భుతాలను చూస్తాము.

యువతీ, యువకులారా, మీరు మాకవసరము. పరిచర్య చేయుట మీకు అప్పగించబడని యెడల, మీ ఉపశమన సమాజము లేక ఎల్డర్ల కోరం అధ్యక్షునితో మాట్లాడండి. ఆయన గొఱ్ఱెలు తెలియబడి, లెక్కించబడెనని, కావలికాయబడెనని, దేవుని మందలోనికి సమకూర్చబడినవని నిశ్చయించుటకు మీ సమ్మతియందు వారు ఆనందిస్తారు.

ఆ రోజు వచ్చినప్పడు ఆయన మందను పోషించి, మన ప్రియమైన రక్షకుని పాదాల వద్ద మనం మోకరించినప్పుడు, పేతురు చేసినట్లుగా: “అవును, ప్రభువా; నేను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు.”10 ఇవి, మీ గొఱ్ఱెలు, ప్రేమించబడి,క్షేమముగా, గృహానికి చేరుకున్నాయి, అని మనం జవాబివ్వగలమని యేసుక్రీస్తు నామంలో ప్రార్ధిస్తున్నాను, ఆమేన్.