2010–2019
ఒక గొప్ప కార్యమునకు పునాదిని వేయుట
అక్టోబర్ 2018


ఒక గొప్ప కార్యమునకు పునాదిని వేయుట

మన గృహాలలో స్థాపించే సంప్రదాయముల ద్వారా, బోధించబడిన పాఠములు చిన్నవి, సాధారణమైనవి అయినప్పటికిని, నేటి ప్రపంచములో హెచ్చైన ప్రాముఖ్యతను కలిగియున్నవి.

సీయోనులో తల్లిదండ్రులుగా మన పాత్రలో, మన పిల్లలు యేసు క్రీస్తు యొక్క సువార్త వెలుగు, ఆనందము, మరియు సత్యములకు ఒడంబడికను మరియు బలమైన కోరికను పొందుటకు సహాయపడుటకు మనము పరిశుద్ధమైన బాధ్యతను కలిగియున్నాము. మన పిల్లల్ని పెంచుతున్నప్పుడు, మనము మన గృహాలలో సంప్రదాయములను స్థాపిస్తాము మరియు మన కుటుంబ అనుబంధముల లోపల సంభాషణ మరియు ప్రవర్తన యొక్క మాదిరులను ఏర్పరుస్తాము. ఆ విషయాలను చేయుట ద్వారా, మనము స్థాపించే సంప్రదాయములు మన పిల్లలలో బలమైన, సందేహించని లక్షణాలను స్థాపించాలి, అవి జీవితపు సవాళ్లను ఎదిరించుటకు వారికి బలమునిచ్చును.

అనేక సంవత్సరాలుగా మా కుటుంబము ఈశాన్య యూటాలో యుంటిహ కొండలపైగా విడిది చేసే వార్షిక సంప్రదాయమును ఆనందించాము. మేము రాతి దుమ్ము రోడ్డుపై, 20 మైళ్లు (32 కిమీ) ప్రయాణించి, ఎత్తైన బాగా నిటారైన గోడలతో, అందమైన పచ్చని లోయ వద్దకు చేరుకుంటాము, మరియు దాని గుండా చల్లని, స్పష్టమైన నీటితో నిండిన ఒక నది ప్రవహించును. ప్రతీ సంవత్సరము, మా పిల్లలు మరియు మనుమల హృదయాలలో సువార్త సిద్ధాంతము మరియు సంప్రదాయముల విలువను పునరావృతము చేయాలని ఆశిస్తూ, సూసన్ మరియు నేను మా ఆరుగురు కుమారులలో ప్రతీఒక్కరిని మరియు వారి కుటుంబాలను క్రీస్తు-కేంద్రీకరించబడిన గృహము యొక్క పునాదిలో ముఖ్యమైన అంశమని వారు భావించు విషయముపై ఒక క్లుప్తమైన సందేశమును సిద్ధపరచమని అడిగాము. తరువాత మేము ఒక ఏకాంత ప్రదేశములో కుటుంబ భక్తి కూడిక కొరకు సమావేశమవుతాము, మరియు ప్రతీఒక్కరు వారి సందేశమును సమర్పిస్తారు.

చిత్రం
రాళ్ళపై వ్రాసిన సందేశాలు

ఈ సంవత్సరము, మా మనుమలు వారి సందేశ విషయమును, రాళ్లపై వ్రాసారు, మరియు ఒక సంతోషకరమైన జీవితమును స్థాపించిన ఒక నిశ్చయమైన పునాదిని సూచిస్తూ, ఒకటి తరువాత ఒకటిగా, ప్రక్క ప్రక్కగా వాటిని సమాధి చేసారు. వారి ఆరు సందేశములన్నిటి మధ్య చేర్చబడినది, మారని నిత్య సత్యము, ఆ పునాది యొక్క మూలరాయి యేసు క్రీస్తు.

యెషయా మాటలలో, “ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు---సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే, అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన రాయి.” 1 యేసు క్రీస్తు సీయోను యొక్క పునాదిలో అమూల్యమైన తలరాయి. ఆయనే ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు బయల్పరిచాడు: “కాబట్టి, మేలు చేయుటలో అలసిపోవద్దు, ఏలయనగా, మీరు ఒక గొప్ప కార్యము యొక్క పునాదిని వేయుచున్నారు. మరియు చిన్న విషయాల నుండి గొప్పవి కలుగును.”2

మన గృహాలలో మనము స్థాపించే సంప్రదాయముల ద్వారా నేర్పబడిన పాఠములు, చిన్నవి, సాధారణమైనవి అయినప్పటికిని, నేటి ప్రపంచములో మిక్కిలి ముఖ్యమైనవి. అవి స్థాపించబడినప్పుడు, మన పిల్లల జీవితాలలో ఒక గొప్ప కార్యమును నెరవేర్చగల చిన్నవి, సాధారణమైన విషయములేవి?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇటీవల కెనడా, టొరంటా దగ్గర పెద్ద సమూహముతో ప్రసంగించారు మరియు మన పిల్లలకు బోధించుటకు తల్లిదండ్రులుగా మనము కలిగియున్న పరిశుద్ధమైన బాధ్యతను గూర్చి తీవ్రముగా జ్ఞాపకము చేసారు. గుర్తించబడిన ముఖ్యమైన బాధ్యతల మధ్య, మనము సంస్కారమును ఎందుకు తీసుకుంటున్నాము, నిబంధనలో జన్మించుట యొక్క ప్రాముఖ్యత, మరియు గోత్రజనకుని దీవెన కొరకు సిద్ధపడుట, దీవెన పొందుట యొక్క ప్రాముఖ్యతను గూర్చి మన పిల్లలు గ్రహించుటకు బోధించాల్సిన బాధ్యతలను తల్లిదండ్రులు కలిగియున్నారని అధ్యక్షులు నెల్సన్ నొక్కి చెప్పారు. ఒక కుటుంబముగా కలిసి లేఖనాలు చదువుటను నడిపించమని ఆయన తల్లిదండ్రులను ప్రోత్సహించారు.3 ఈ ప్రయత్నాల ద్వారా, మన గృహాలను “విశ్వాస మందిరాలుగా”4 చేయమని మన ప్రియమైన ప్రవక్త మనల్ని ప్రేరేపిస్తున్నారు.

మోర్మన్ గ్రంథములో, ఈనస్ తన తండ్రి యొక్క మాదిరి కొరకు తాను భావించిన లోతైన కృతజ్ఞతను వ్రాసెను, అతడు “తన భాషలో (అతడికి) మరియు ప్రభువు యొక్క శిక్షణ మరియు ఉపదేశములో కూడ బోధించెను.” గొప్ప భావావేశముతో ఈనస్ ఆశ్చర్యపడ్డాడు, “దాని నిమిత్తము నా దేవుని యొక్క నామము దీవించబడునుగాక.” 5

మా వివాహము జరిగి 35 సంవత్సరాలుపైగా మా గృహములో మేము గమనించిన చిన్న మరియు సాధారణమైన సంప్రదాయములను నేను ఆనందిస్తున్నాను. మా సంప్రదాయములలో అనేకము యుక్తిగలవి కాని అర్ధవంతమైనవి. ఉదాహరణకు:

  • నేను ఇంటికి దూరముగా ఉన్న సాయంత్రములందు, అక్కడున్న మా పెద్ద కుమారుడు కుటుంబమును లేఖన అధ్యయనము మరియు కుటుంబ ప్రార్థన యందు నడిపించుటను అడగకుండా బాధ్యత వహిస్తాడని నేను ఎల్లప్పుడు ఎరుగుదును.6

  • మరొక సంప్రదాయము---“నేను నిన్ను ప్రేమిస్తున్నాను,” అని చెప్పకుండా మేము ఎన్నడూ మా యింటిని విడిచి వెళ్లము లేక టెలిఫోను సంభాషణను ముగించము.

  • మా కుమారులతో వ్యక్తిగత ముఖాముఖి సంభాషణలను క్రమంగా జరుపుటకు సమయాన్ని తీసుకొనుట ద్వారా మా జీవితాలు దీవించబడినవి. ఒక సంభాషణయందు, మా కుమారుడిని, ఒక మిషను సేవను చేయుటకు అతడి కోరికలను మరియు సిద్ధపాటును గురించి నేను అడిగాను. కొంత చర్చ తరువాత, క్షణము సేపు ఆలోచనాపూర్వకంగా మౌనం వహించిన తరువాత, అతడు ముందుకు వంగి, ఆలోచనాపూర్వకంగా ప్రకటించాడు, “నాన్నా, నేను చిన్నవానిగా ఉన్నప్పుడు, మనము తండ్రితో ముఖాముఖి సంభాషణలు ప్రారంభించాము గుర్తుందా?” “అవును,” అని నేను చెప్పాను. “మంచిది,” “అప్పుడు నేను ఒక మిషను సేవ చేస్తానని నేను మీకు వాగ్దానము చేసాను, మరియు మీరు, అమ్మ పెద్దవారైన తరువాత ఒక మిషను సేవ చేస్తామని మీరు నాకు మాటిచ్చారు.” తరువాత కాసేపు ఆగి, “సేవ చేయకుండా ఏదైన సమస్య మిమ్మల్ని ఆపివేస్తుందా---ఎందుకనగా నేను సహాయపడగలను?”

ఏకరీతిగల, ఆరోగ్యవంతమైన కుటుంబ సంప్రదాయములు ప్రార్థన, లేఖన పఠనము, కుటుంబ గృహ సాయంకాలము, మరియు సంఘ సమావేశాలకు హాజరగుట వంటివి, చిన్నవిగా, సాధారణమైనవిగా కనబడినప్పుటికిని, ప్రేమ, గౌరవము, ఐక్యత, మరియు భద్రతగల సంప్రదాయమును సృష్టించును. ఈ ప్రయత్నములను చేర్చు ఆత్మయందు, మన పిల్లలు మన కాలములోని లోకసంబంధమైన సంప్రదాయములలో చాలా అంతర్గతంగా ఉన్న అపవాది యొక్క మండుతున్న బాణములనుండి కాపాడబడతారు.

హీలమన్ తన కుమారునికిచ్చిన తెలివైన సలహాను గూర్చి మనము జ్ఞాపకము చేయబడ్డాము: “జ్ఞాపకముంచుకొనుడి, అపవాది అతని బలమైన గాలులను, అవును సుడిగాలి యందు అతని బాణములను ముందుకు పంపునప్పుడు, అవును అతని సమస్త వడగళ్లు మరియు అతని బలమైన గాలివాన మీ పైన కొట్టునప్పుడు, మనుష్యులు వారు కట్టిన పడిపోని ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది, మీరు కట్టబడిన బండను బట్టి, ఆ దౌర్భాగ్యపు అఘాథము మరియు అంతములేని శ్రమకు మిమ్ములను క్రిందికి లాగుకొని పోవుటకు అది మీపైన ఏ శక్తి కలిగియుండకుండునట్లు మీరు మీ పునాదిని కట్టవలయును. అది దేవుని యొక్క కుమారుడు క్రీస్తే, మన విమోచకుని యొక్క బండపైన అయ్యున్నదని జ్ఞాపకముంచుకొనుడి.”7

సంవత్సరాల క్రితం, ఒక యౌవన బిషప్పుగా సేవ చేయుచుండగా, ఒక మంచి పెద్ద వ్యక్తి నన్ను కలుసుకోవాలని అడిగాడు. అతడు సంఘమునుండి తన నిష్క్రమణను మరియు తన బాల్యములో ఉన్నప్పుడు, తన తల్లిదండ్రుల యొక్క నీతిగల సంప్రదాయములను వివరించాడు. లోకము ఇచ్చే క్షణికానందము మధ్య, శాశ్వతమైన ఆనందమును వ్యర్ధముగా వెదకుంచుండగా, తన జీవితకాలములో అతడు అనుభవించిన హృదయవేదనను అతడు వివరించాడు. ఇప్పుడు, అతడి జీవితంలో తదుపరి సంవత్సరాలలో, అతడు దేవుని యొక్క ఆత్మ తన బాల్యములోని పాఠములు, సంప్రదాయములు, భావనలు, మరియు ఆత్మీయ భద్రతకు తిరిగి అతడిని నడిపిస్తూ పట్టువదలని మెల్లని భావనలను అతడు అనుభూతి చెందాడు, అతడు తన తల్లిదండ్రుల యొక్క సంప్రదాయముల కొరకు కృతజ్ఞతను వ్యక్తపరిచాడు, మరియు ఆధునిక-దిన మాటలలో, అతడు ఈనస్ యొక్క ప్రకటనను ప్రతిధ్వనించాడు: “దాని నిమిత్తము నా దేవుని యొక్క నామము దీవించబడునుగాక.”

నా అనుభవములో, ఈ ప్రియమైన వ్యక్తి సువార్తకు తిరిగి వచ్చుట అనేకమంది యొక్క స్వభావము మరియు కొంతకాలము విడిచివెళ్లి, వారి బాల్యములోని బోధనలు మరియు సంప్రదాయములకు తిరిగి వచ్చు దేవుని యొక్క పిల్లల మధ్య పునరావృతం చేయబడింది. ఆ క్షణములందు, తల్లిదండ్రులకు ఉపదేశించిన సామెతల రచయత యొక్క జ్ఞానమును మనము ప్రత్యక్షంగా చూసాము, “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము: వాడు పెద్దవాడైనప్పుడు, దానినుండి తొలగిపోడు.”8

పిల్లలను పెంచుతుండగా, ప్రతీ తల్లి, తండ్రి నిరాశగల క్షణములను మరియు తీర్మానము, బలము యొక్క వేర్వేరు స్థాయిలను, ఎదుర్కొంటారు. అయినప్పటికినీ, తల్లిదండ్రులు పిల్లలకు నిశ్చయముగా, ప్రేమగా బోధించుట మరియు మార్గము వెంబడి వారికి సహాయపడుటకు శాయశక్తులా చేయుట ద్వారా విశ్వాసమును సాధన చేసినప్పుడు, వారు తమ పిల్లల హృదయాలు మరియు మనస్సుల లోపల విత్తనాలు నాటబడి వేరుపడినవనే గొప్ప నిరీక్షణను వారు పొందుతారు.

నిరంతర బోధన కొరకు ప్రధానమైన అవసరతను మోషే బాగా గ్రహించాడు. అతడు ఉపదేశించాడు, “నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనునప్పుడును, లేచునప్పుడును, వాటిని గూర్చి మాటలాడవలెను.”9

కుటుంబ ప్రార్థన యందు, మన పిల్లల ప్రక్కన మనము మోకరిస్తున్నాము, అర్ధవంతమైన కుటుంబ లేఖన పఠనమును జరుపుటకు మన ప్రయత్నాల ద్వారా మనము వారి కొరకు శ్రద్ధ వహిస్తున్నాము, కుటుంబ గృహ సాయంకాలములో మనము కలిసి పాల్గొన్నప్పుడు, మనము ఓపికతో, ప్రేమతో శ్రద్ధ వహిస్తున్నాము, మరియు మనము వ్యక్తిగతంగా ప్రార్థిస్తుండగా వారి కొరకు చింతిస్తాము. ఓహ్, మనము వారికి బోధించు సరైన సూత్రములను మన పిల్లలు అంగీకరించాలని మనము ఎంతగా అకాంక్షిస్తాము.

లేఖనాలు చదువుట లేక కుటుంబ గృహ సాయంకాలము లేక పరస్పర సమావేశానికి మరియు మిగిలిన సంఘ సమావేశాలకు హాజరగుటకు ప్రయాసపడుచుండగా, మన బోధన మధ్య మన పిల్లలు “ప్రతీది గ్రహిస్తారా” అన్నది చింతించుటకు తక్కువ ప్రాముఖ్యత గలదని నేను నమ్ముచున్నాను. ఆ క్షణములందు ఆ కార్యక్రమాల ప్రాముఖ్యతను వారు గ్రహిస్తున్నారా అన్నది తక్కువ ప్రాముఖ్యత గలది, మరియు ఎక్కువ ప్రాముఖ్యత గలది తల్లిదండ్రులుగా మనము శ్రద్ధగా జీవించుటకు, బోధించుటకు, ఉపదేశించుటకు మరియు యేసు క్రీస్తు యొక్క సువార్త చేత ప్రేరేపించబడిన అంచనాలను స్థాపించమనే ప్రభువు యొక్క సలహాను అనుసరించుటకు తగినంత విశ్వాసమును మనము సాధన చేస్తున్నామా. అది మన విశ్వాసము చేత ప్రేరేపించబడిన ఒక ప్రయత్నము---ఏదో ఒకరోజు వారి బాల్యములో మనము వారికి బోధించిన సూత్రములను వారు అంగీకరించి, జీవిస్తారని మన నమ్మకము.

మనము మాట్లాడు విషయాలు, మనము ప్రకటించి, బోధించు విషయాలు మన మధ్య సంభవించు విషయాలను తీర్మానించును. క్రీస్తు యొక్క సిద్ధాంతములను బోధించు ఆరోగ్యవంతమైన సంప్రదాయములను మనము స్థాపించినప్పుడు, పరిశుద్ధాత్మ మన సందేశము యొక్క యధార్ధతను గూర్చి సాక్ష్యమిచ్చును మరియు మార్గము వెంబడి మన ప్రయత్నముల చేత మన పిల్లల హృదయాలలో లోతుగా నాటబడిన సువార్త యొక్క విత్తనాలను పెంచి పోషించును. ఆలాగున యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.