2010–2019
పరివర్తనలో మోర్మన్ గ్రంధము యొక్క పాత్ర
అక్టోబర్ 2018


పరివర్తనలో మోర్మన్ గ్రంధము యొక్క పాత్ర

చివరిసారిగా మనం ఇశ్రాయేలీయులను సమకూర్చుతున్నాము, మార్చుటకు అత్యంత శక్తివంతమైన సాధనాలలో ఒకటైన మోర్మన్ గ్రంధముతో ఆవిధంగా చేస్తున్నాము.

నేడు అనేకమంది దేవుని యొక్క వాస్తవమును ఆయనతో మన అనుబంధమును గూర్చి ఆశ్చర్యపడుచున్నారు. అనేకమందికి ఆయన గొప్ప సంతోషము యొక్క ప్రణాళికను గూర్చి కాస్త లేదా అస్సలు తెలియదు. 30 సంవత్సరాల క్రితం, అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్, “నేటి లోకములో … అనేకులు రక్షకుని దైవత్వాన్ని నిరాకరిస్తున్నారు. ఆయన అద్భుతమైన జననము, ఆయన పరిపూర్ణమైన జీవితము, ఆయన మహిమకరమైన పునరుత్థానము యొక్క వాస్తవమును గూర్చి ప్రశ్నిస్తున్నారు.”1 అని గమనించారు.

మన కాలములో, ప్రశ్నలు మన రక్షకునిపై మాత్రమే కాదు ఆయన ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఆయన పునఃస్థాపించిన ఆయన సంఘమైన---యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘముపై కూడా కేంద్రీకరించబడినవి. ఈ ప్రశ్నలు తరచుగా రక్షకుని యొక్క సంఘ చరిత్ర, బోధనలు, లేక ఆచరణలపై దృష్టిసారించును.

మోర్మన్ గ్రంధము సాక్ష్యమందు ఎదుగుటకు మనకు సహాయపడును

నా సువార్తను ప్రకటించుడి నుండి: “(పరలోక తండ్రి, ఆయన సంతోషప్రణాళిక గురించిన) మన జ్ఞానము ఆధునిక ప్రవక్తలు ----జోసెఫ్ స్మిత్, అతని వారసులు--- నుండి వచ్చిందని దేవుని నుండి ప్రత్యక్ష బయల్పాటును వారు పొందారని జ్ఞాపకముంచుకొండి. కాబట్టి, ఎవరైన జవాబివ్వాల్సిన మొదటి ప్రశ్న, జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్తా, కాదా అని, అతడు లేక ఆమె మోర్మన్ గ్రంధము గురించి చదివి, ప్రార్థించుట ద్వారా ఈ ప్రశ్నకు జవాబివ్వగలరు.”2 అని మనం చదువుతాము.

మోర్మన్ గ్రంధము: యేసు క్రీస్తు యొక్క మరియొక సాక్ష్యమును ప్రార్థనాపూర్వకంగా అధ్యయనము చేయుట ద్వారా, జోసెఫ్ స్మిత్ ప్రవక్త యొక్క దైవిక పిలుపు గురించి నా సాక్ష్యము బలపరచబడింది. మోర్మన్ గ్రంధము యధార్ధతను గూర్చి తెలుసుకొనుటకు నేను మొరోనై ఆహ్వానమును అమలు చేసాను, “నిత్యుడగు తండ్రియైన దేవునిని, క్రీస్తు యొక్క నామమందు అడుగవలెను.”3 అది సత్యమని నేనెరుగుదునని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆ జ్ఞానము నాకు వచ్చినట్లే “పరిశుద్ధాత్మ శక్తి ద్వారా,”4 మీకు కూడా వచ్చును.

మోర్మన్ గ్రంధము యొక్క పీఠిక వివరించును: “ఎవరైతే పరిశుద్ధాత్మ నుండి (మోర్మన్ గ్రంధమును గూర్చి) ఈ దైవిక సాక్ష్యమును పొందుదురో, వారు అదే శక్తి ద్వారా యేసు క్రీస్తు లోక రక్షకుడని, జోసెఫ్ స్మిత్ కడవరి దినాలలో ఆయన యొక్క ప్రకటనకారుడని, ప్రవక్తయని, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము మెస్సియా యొక్క రెండవ రాకడకు సిద్ధపాటుగా భూమిపైన మరియొకసారి స్థాపించబడిన ప్రభువు యొక్క రాజ్యమని కూడా తెలుసు కొందురు. ”5

చీలీకి యౌవన మిషనరీగా వెళ్తున్నప్పుడు, నేను మోర్మన్ గ్రంధము యొక్క పరివర్తన శక్తిని గూర్చి జీవితమును-మార్చు పాఠమును నేర్చుకున్నాను. శ్రీ. గొంజాలిజ్ ---తన సంఘములో అనేక సంవత్సరాలుగా గౌరవనీయమైన స్థానములో సేవ చేసాడు. అతడు వేదాంతములో ఒక పట్టభద్రత కలిగియుండి, విస్తారమైన మతపరమైన శిక్షణను పొందాడు. అతడు తన బైబిలు నైపుణ్యమును గూర్చి చాలా గర్వించాడు. అతడు మతపరమైన పండితుడని మాకు స్పష్టమైనది.

పెరూ, లీమాలో అతడి స్వగ్రామములో యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల మిషనరీలు తమ కార్యమును గూర్చి వారు వెళ్ళునప్పుడు అతడు బాగా ఎరిగియున్నాడు. బైబిలులో వారికి తాను నేర్పించిగలుగునట్లు వారిని కలుసుకోవాలని అతడు ఎల్లప్పుడూ కోరాడు.

ఒకరోజు, దాదాపు పరలోకము నుండి ఒక వరముగా, అతడు అనుకున్నట్లుగా, ఇద్దరు మిషనరీలు అతడిని వీధిలో ఆపి, అతడి ఇంటికి వచ్చి అతడితో లేఖనాలు పంచుకోవచ్చా అని అడిగారు. ఇది అతడి కలను నిజము చేసింది! అతడి ప్రార్థనలు జవాబివ్వబడినవి. చివరకు, అతడు ఈ తప్పుగా నడిపించబడిన యౌవనులను సరి చేయగలడు. లేఖనాలను చర్చించుటకు వారు తన ఇంటికి వచ్చుట తాను ఆనందిస్తున్నానని అతడు వారికి చెప్పాడు

అతడు తనకు నియమించబడిన సమయము కోసం ఎదురుచూడసాగాడు. వారి నమ్మకాలు తప్పని రుజువుచేయుటకు బైబిలును ఉపయోగించుటకు అతడు సిద్ధముగా ఉన్నాడు. వారి బోధనలలో తప్పులను బైబిలు స్పష్టముగా, స్ఫుటముగా చూపునని అతడు నమ్మకంగా ఉన్నాడు. నియమించబడిన రాత్రి వచ్చింది, మిషనరీలు తలుపు తట్టారు. అతడు ఉద్రేకంగా ఉన్నాడు. అతడు ఎదురు చూసిన సమయము చివరికి వచ్చింది.

అతడు తలుపు తెరిచి, మిషనరీలను తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. మిషనరీలలో ఒకరు అతడికి నీలిరంగు పుస్తకాన్ని ఇచ్చి, అది దేవుని వాక్యమును కలిగియున్నదని అతడు ఎరుగునని నిజాయితీగల సాక్ష్యాన్ని చెప్పాడు. రెండవ మిషనరీ కూడా ఆ గ్రంధమును గూర్చి, జోసెఫ్ స్మిత్ అను పేరుగల దేవుని ఆధునిక ప్రవక్త చేత అది అనువదించబడిందని, అది క్రీస్తును గూర్చి బోధిస్తుందని తన శక్తివంతమైన సాక్ష్యాన్ని చేర్చాడు. మిషనరీలు అతడి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు.

శ్రీ. గొంజాలిజ్ చాలా నిరాశ చెందాడు. కానీ అతడు గ్రంథమును తెరచి, అతడు దాని పేజీలను త్రిప్పసాగాడు. అతడు మొదటి పేజీని చదివాడు. పేజీలను ఒకదాని తర్వాత ఒకటిగా అతడు చదవసాగాడు, మరుసటి రోజు సాయంత్రము వరకు చదువుతూనే ఉన్నాడు. అతడు గ్రంథము మొత్తం చదివాడు, అది సత్యమని అతడు ఎరుగెను. తానేమి చేయాలో అతడు ఎరుగెను. అతడు మిషనరీలను పిలిచి, పాఠములను విన్నాడు, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యుడగుటకు తాను ఎరిగిన జీవితమును వదిలివేసాడు.

ఆ మంచి వ్యక్తి యూటా ప్రోవోలో నా ఎమ్‌టిసి బోధకుడు. సహోదరుడు గొంజాలెజ్ పరివర్తన వృత్తాంతము, మోర్మన్ గ్రంధము యొక్క శక్తి నాపై గొప్ప ప్రభావం కలిగించింది.

నేను చీలీ చేరుకున్నప్పుడు, మా మిషను అధ్యక్షుడు, అధ్యక్షుడు రాయ్డెన్ జె. గ్లెడ్, మమ్మల్ని ప్రతీవారము జోసెఫ్ స్మిత్-చరిత్రలో వ్రాయబడిన జోసెఫ్ స్మిత్ ప్రవక్త యొక్క సాక్ష్యాన్ని చదవమని ఆహ్వానించాడు. మొదటి దర్శనాన్ని గూర్చిన సాక్ష్యము, సువార్తను గూర్చిన మా స్వంత సాక్ష్యానికి, మోర్మన్ గ్రంధమును గూర్చిన మా సాక్ష్యానికి సంబంధము కలిగియున్నదని ఆయన మాకు బోధించాడు.

ఆయన ఆహ్వానమును నేను గంభీరముగా తీసుకున్నాను. నేను మొదటి దర్శన వృత్తాంతములను చదివాను; నేను మోర్మన్ గ్రంధాన్ని చదివాను. మొరోనై సూచించినట్లుగా ప్రార్ధించాను, మోర్మన్ గ్రంధము సత్యమా అని “నిత్యుడగు తండ్రియైన దేవునిని, క్రీస్తు నామమందు” 6 అడిగాను. మోర్మన్ గ్రంధము “భూమిపైయున్న మరేయితర గ్రంథము కన్నను మిక్కిలి ఖచ్చితమైనదని, మన మతము యొక్క ప్రధాన రాయని, ఒక మనుష్యుడు ఏ ఇతర గ్రంథము కన్నను దీని యొక్క సూక్తులననుసరించిన యెడల దేవునికి చేరువగునని”7 ప్రవక్త జోసెఫ్ స్మిత్ చెప్పినట్లుగా మోర్మన్ గ్రంధమును నేను ఎరుగుదునని ఈ రోజు సాక్ష్యమిస్తున్నాను. జోసెఫ్ స్మిత్: “మోర్మన్ గ్రంధాన్ని, బయల్పాటులను తీసివేస్తే, ఇంక మన మతము ఎక్కడున్నది? మనకు ఏదీ ఉండదు.”8

వ్యక్తిగత పరివర్తన

మనం ఎవరం అనుదానిని, మోర్మన్ గ్రంధము యొక్క ఉద్దేశాలను మనం బాగా గ్రహించినప్పుడు, మన పరివర్తన లోతైనదై మరింత నిశ్చయమైనదగును. దేవునితో మనం చేసిన నిబంధనలను పాటించుటకు మన ఒడంబడికయందు మనం బలపరచబడతాము.

మోర్మన్ గ్రంధము యొక్క ముఖ్యమైన ఉద్దేశము చెదరగొట్టబడిన ఇశ్రాయేలీయులను సమకూర్చుట. ఈ సమకూర్చుట దేవుని పిల్లలందరు నిబంధన బాటలోనికి ప్రవేశించుటకు అవకాశాన్ని ఇచ్చును, ఆ నిబంధనలు గౌరవించుట ద్వారా, తండ్రి సన్నిధికి తిరిగి వెళతారు. మనం పశ్చాత్తాపమును బోధించి, మార్పు చెందిన వారికి బాప్తీస్మము ఇచ్చినప్పుడు, మనం ఇశ్రాయేలును సమకూర్చుతున్నాము.

మోర్మన్ గ్రంధము ఇశ్రాయేలు సంతతికి 108 అన్వయాలను కలిగియున్నది. మోర్మన్ గ్రంధము ఆరంభములో, నీఫై బోధించాడు, “ఎందుకనగా నా ఉద్దేశము యొక్క పరిపూర్ణత, నేను మానవులను అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుని వద్దకు వచ్చి, రక్షింపబడుడని ఒప్పించుటయే.”9 అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, పాత నిబంధన దేవుడు యేసు క్రీస్తే. ఆయన సువార్తను జీవించుట ద్వారా మనం క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు మనం రక్షించబడతాము.

తరువాత, నీఫై వ్రాసెను:

“అవును, నా తండ్రి అన్యులను గూర్చి కూడా ఎంతో పలికెను, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి వారు ఒక ఒలీవ చెట్టుతో పోల్చబడవలెనని, దాని కొమ్మలు త్రుంచి వేయబడి భూముఖమంతట చెదరగొట్టబడవలెనని …

“మరియు ఇశ్రాయేలు వంశస్థులు చెదిరిపోయిన తరువాత వారు తిరిగి ఒకటిగా సమకూర్చబడవలెనని; లేక ఇతర మాటలలో, అన్యులు సువార్త యొక్క సంపూర్ణతను పొందిన తరువాత, ఆ ఒలీవ చెట్టు యొక్క ప్రకృతిసిద్ధమైన కొమ్మలు, లేక ఇశ్రాయేలు వంశస్థుల శేషములు తిరిగి అంటుగట్టబడవలెనని, లేదా నిజమైన మెస్సీయ, వారి ప్రభువు, వారి విమోచకుని యొక్క జ్ఞానమునకు రావలెను,”10 అని పలికెను

ఆవిధంగా, మోర్మన్ గ్రంధము ముగింపులో, మొరోనై ప్రవక్త ఇలా చెప్పుచూ మన నిబంధనలను గూర్చి మనకు జ్ఞాపకము చేయును, “నీవు ఇక ఏ మాత్రము బంగపడకుండునట్లు, ఓ ఇశ్రాయేలు యొక్క వంశమా, నిత్యుడైన తండ్రి యొక్క నిబంధనలు ఆయన నీతో చేసినవి నెరవేరగలవు.” 11

నిత్య తండ్రి యొక్క నిబంధనలు

మొరోనై చేత సూచించబడిన “నిత్య తండ్రి యొక్క నిబంధనలు” ఏవి? మనం అబ్రహాము గ్రంధములో ఇలా చదువుతాము:

“నా పేరు యెహోవా, నేను ఆది నుండి అంతము వరకు ఎరుగుదును; కాబట్టి నా హస్తము మీ పై ఉండును.”

“నేను నిన్ను గొప్ప జనముగా చేతును, లెక్కకు మించి నిన్ను నేను ఆశీర్వదించెదను, సమస్త దేశముల మధ్య నీ పేరును గొప్పగా చేసెదను, నీ తరువాత నీ సంతానమునకు నీవు ఆశీర్వాదముగా ఉండెదవు, వారి హస్తములలో వారు ఈ పరిచర్యను, యాజకత్వమును సమస్త రాజ్యములకు వహిస్తారు.” 12

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇటీవల ప్రపంచవ్యాప్త ప్రసారములో బోధించారు, “ఇవి నిశ్చయముగా కడవరి దినాలు, ప్రభువు ఇశ్రాయేలును సమకూర్చు తన కార్యమును త్వరపరచుచున్నాడు. ఆ సమకూర్చుట నేడు భూమి మీద జరుగుతున్న అత్యంత ముఖ్యమైన విషయము. గొప్పతనములో, ప్రాముఖ్యతలో, ఘనతలో పోల్చదగినది ఏదీ లేదు. మీరు ఎన్నుకొనిన యెడల, మీరు కోరిన యెడల, మీరు దానిలో అధిక భాగము కాగలరు. మీరు ఏదైన గొప్పదానిలో, ఏదైన మహోన్నతమైన దానిలో, ఏదైన ఘనమైన దానిలో మీరు అధికభాగము కాగలరు!

సమకూర్చుట గురించి మనం మాట్లాడినప్పుడు, మనం ఈ ప్రధానమైన సత్యమును మాత్రమే చెప్తున్నాము: తెరకు ఇరువైపుల, మన పరలోక తండ్రి పిల్లలలో ప్రతీఒక్కరు, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త సిద్ధాంతమును వినుటకు అర్హులుగా ఉన్నారు. వారు అధికంగా తెలుసుకోవాలో లేదో వారికివారే నిర్ణయించుకోవాలి.”13

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా మనం చేసేది అదే: మనం యేసు క్రీస్తు సువార్తను గూర్చి ఒక అవగాహనను---ఒక మార్పును లోకమునకు తెచ్చుటకు కోరుచున్నాము. మనం “కడవరి-దినములో సమకూర్చువారము.”14 మన మిషను స్పష్టమైనది. సహోదరీ, సహోదరులారా, మోర్మన్ గ్రంధము సత్యమని తెలుసుకొనుటకు మొరోనై వాగ్దానమును హృదయములోనికి తీసుకొని, ప్రార్థించి, జవాబును పొంది, వాస్తవానికి, అతి ముఖ్యముగా లోకములో ఇతరులతో ఆ జ్ఞానమును పంచుకొన్నవారిగా మనం తెలియబడాలి.

పరివర్తనలో మోర్మన్ గ్రంధము యొక్క పాత్ర

మోర్మన్ గ్రంధము యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ సువార్తను కలిగియున్నది.15 అది తండ్రి యొక్క నిబంధనల వద్దకు మనల్ని నడిపించును, దానిని నిలుపుకొనిన యెడల, ఆయన మిక్కిలి గొప్ప వరమైన నిత్య జీవమును మనకు హామీగా ఇస్తుంది.16 మోర్మన్ గ్రంధము పరలోక తండ్రి యొక్క కుమారులు, కుమార్తెలందరి పరివర్తనకు ప్రధానరాయి.

అధ్యక్షులు నెల్సన్ నుండి వ్యాఖ్యానిస్తూ: “మీరు . . . మోర్మన్ గ్రంధమునుండి ప్రతీరోజు చదివిన యెడల, మీరు సమకూర్చు సిద్ధాంతమును, యేసు క్రీస్తు, ఆయన ప్రాయశ్చిత్తము, మరియు బైబిలులో కనబడని ఆయన సంపూర్ణ సువార్తను గూర్చి నేర్చుకుంటారు. మోర్మన్ గ్రంధము ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో ప్రధానమైనది. వాస్తవానికి, మోర్మన్ గ్రంధము లేని యెడల, ఇశ్రాయేలును సమకూర్చు వాగ్దానము సంభవించదు.” 17

వాగ్దాన దీవెనలను గూర్చి ఆయన నీఫైయులకు బోధించిన రక్షకుని మాటలతో నేను ముగిస్తాను: “మీరు ప్రవక్తల పిల్లలైయున్నారు; మరియు మీరు ఇశ్రాయేలు వంశము వారైయున్నారు, మీకు అబ్రాహాముతో, నీ సంతానమందు భూమి యొక్క సమస్త జనములు ఆశీర్వదింపబడునని చెప్పుచూ, మీ తండ్రులతో తండ్రి చేసిన నిబంధన జనులైయున్నారు. ”18

మనం దేవుని కుమారులము, కుమార్తెలము, అబ్రహాము సంతానము, ఇశ్రాయేలు వంశమని నేను సాక్ష్యమిస్తున్నాను. మనం చివరిసారిగా ఇశ్రాయేలీయులను సమకూర్చుతున్నాము, ప్రభువు ఆత్మతో జతపరచబడి, పరివర్తన చెందుటకు మిక్కిలి శక్తివంతమైన సాధనమైనటువంటి మోర్మన్ గ్రంధముతో దానిని చేస్తున్నాము. మనం దేవుని యొక్క ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి చేత నడిపించబడుచున్నాము, ఆయన మన కాలములో ఇశ్రాయేలీయులను సమకూర్చుటను నడిపిస్తున్నారు. అది నా జీవితమును మార్చివేసింది. అది మీ జీవితము మార్చగలదని మొరోనై మరియు అనేక యుగముల ప్రవక్తల వలే యేసు క్రీస్తు నామములో నేను మీకు వాగ్దానము చేయుచున్నాను. 19 ఆమేన్.

వివరణలు

  1. Teachings of Presidents of the Church: Ezra Taft Benson (2014), 129.

  2. What Is the Role of the Book of Mormon?” Preach My Gospel: A Guide to Missionary Service, rev. ed. (2018), lds.org/manual/missionary.

  3. మొరోనై 10:4.

  4. మొరోనై 10:4.

  5. మోర్మన్ గ్రంధము యొక్క పీఠిక.

  6. మొరోనై 10:4.

  7. మోర్మన్ గ్రంధము యొక్క పీఠిక.

  8. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 196.

  9. 1 నీఫై 6:4.

  10. 1 నీఫై 10:12, 14.

  11. మొరోనై 10:31.

  12. అబ్రహాము 2:8–9.

  13. Russell M. Nelson, “Hope of Israel” (worldwide youth devotional, June 3, 2018), 4, HopeofIsrael.lds.org.

  14. జేకబ్ 5:72 చూడుము.

  15. అధ్యక్షులు ఎజ్రాటాఫ్ట్ బెన్సన్ బోధించారు: “మోర్మన్ గ్రంధము ‘యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ సువార్తను’(సి మరియు ని 20:9) కలిగియున్నది. అనగా అది బయల్పరచబడిన ప్రతీ బోధన, సిద్ధాంతమును కలిగియున్నదని దాని అర్ధము కాదు. బదులుగా, దాని అర్ధము మోర్మన్ గ్రంధములో మన రక్షణకు అవసరమైన ఆ సిద్ధాంతముల సంపూర్ణతను మనం కనుగొంటాము. అవి స్పష్టముగా మరియు సరళముగా బోధింపబడినవి ఆవిధంగా పిల్లలు కూడ రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధానములను నేర్చుకోగలరు” (Teachings: Ezra Taft Benson, 131).

  16. సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7 చూడుము.

  17. Russell M. Nelson, “Hope of Israel,” 7.

  18. 3 నీఫై 20:25.

  19. See, for example, Henry B. Eyring, “The Book of Mormon Will Change Your Life,” Liahona, Feb. 2004, 12–16.