2010–2019
నేడు మీరు కోరుకొనుడి
అక్టోబర్ 2018


నేడు మీరు కోరుకొనుడి

సజీవుడైన దేవుని ఎన్నుకొనుట మరియు ఆయన కార్యములో చేరుట మీద మన నిత్యానందము యొక్క పరిధి ఆధారపడియున్నది.

మేరీ పాపిన్స్ అనే ఆంగ్ల దాది పాత్ర కల్పిత కథలలో విలక్షణమైనది—ఆమె మంత్ర శక్తి కలది. 1 ఆమె ఎడ్వార్డియన్ లండన్‌లోని 17వ నెంబరు షెర్రీ ట్రీ వీధిలో, కష్టాలలో ఉన్న బ్యాంక్ కుటుంబమునకు సహాయము చేయుటకు తూర్పు గాలిని వీచేలా చేసింది. ఆమెకు జేన్, మరియు మైఖేల్ అనే పిల్లలు అప్పగింపబడ్డారు. ఆమె వారిని క్రమశిక్షణతోనైనా, కానీ దయగా చూచేది, ఆమె మాంత్రిక ప్రభావంతో వారికి విలువైన పాఠాలు నేర్పించడం ప్రారంభించింది.

జేన్ మరియు మైఖేల్ గమనించదగినంత అభివృద్ధిని సాధించారు, కానీ మేరీ తాను ముందుకు సాగవలసిన సమయం వచ్చిందని నిశ్చయించుకున్నది. ఆ నాటకంలో, పొగ గొట్టం శుభ్రం చేసే పాత్ర ధారి, బెర్ట్, మేరీ యొక్క స్నేహితుడు ఆమెను వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. “కానీ వాళ్ళు మంచి పిల్లలు, మేరీ” అంటూ అతడు వాదిస్తాడు.

అందుకు మేరీ ఇలా జవాబిచ్చింది, “లేకపోతే నేను మాత్రం వాళ్ళ గురించి శ్రమ పడతానా? కానీ, నేను వారికి సహాయపడటానికి వారు అనుమతించని యెడల, నేను వారికి సహాయము చేయలేను, పైగా అన్నీ తెలుసు అనుకునే బిడ్డకు నేర్పడం కంటే కష్టతరమైనది మరొకటి లేదు.”

“తరువాత?” అంటాడు బెర్ట్.

“కనుక, సహాయము లేకుండా వారు ఎక్కువ నేర్చుకోవాలి,”2 అని మేరీ సమాధానమిస్తుంది.

సహోదర సహోదరీలారా, జేన్ మరియు మైఖేల్ బ్యాంక్స్ వలెనే, మనము కూడా శ్రమ తీసుకోదగిన “మంచి పిల్లలము. ” మన పరలోక తండ్రి మనకు సహాయము చేయుటకును, దీవించుటకును కోరుచున్నారు, కానీ మనము ఎల్లప్పుడూ ఆయనను చేయనివ్వము. కొన్నిసార్లు, మనకు ముందే అంతా తెలిసినట్లు ప్రవర్తిస్తాము. మనం కూడా “మన తరువాత భూలోక జీవితమును” మన స్వంతగా చేయాల్సిన అవసరం వచ్చును. అందుచేతనే పరలోక గృహము, మర్త్యత్వమునకు ముందు నుండి భూమి మీదకు వచ్చియున్నాము. మన “భూలోక జీవితం” ఎంపికలను చేయుటను కలిగియున్నది.

మన పరలోక తండ్రి యొక్క లక్ష్యము తన బిడ్డలు సరైన దానిని చేయునట్లు చేయుట కాదు; ఆయన బిడ్డలు సరైనదానిని చేయుటకు ఎన్నుకొని మరియు చివరకు ఆయనవలే కావలని ఆయన కోరుచున్నాడు. ఆయన కేవలము మనము విధేయులుగా ఉండాలని కోరినట్లయితే, మన ప్రవర్తనలను ప్రభావితం చేయడానికి ఆయన తక్షణమే బహుమతులు మరియు శిక్షను ఉపయోగించేవారు.

కాని దేవుడు తన బిడ్డలు సిలేస్టియల్ గదులలో ఆయన కాలి చెప్పులు కొరుకుతూ ఉండని కేవలం శిక్షణ పొందిన విధేయతగల పెంపుడు జంతువులవలె ఉండాలనే ఆసక్తిని కలిగిలేడు.3 లేదు, దేవుడు తన పిల్లలు ఆత్మీయంగా పెరిగి పెద్దవారై కుటుంబ వ్యవహారములో ఆయనను చేరాలని కోరుచున్నారు.

మనము దేవుని రాజ్యమునకు వారసులము అగునట్లు ఆయన ఒక ప్రణాళికను, ఆయన వలే మారుటకు, ఆయనకు కలిగిన జీవితమును కలిగియుండుటకు, మరియు ఆయన సన్నిధిలో సకుటుంబ సమేతంగా శాశ్వతంగా జీవించుటకు మనల్ని నడిపించు నిబంధన మార్గమును ఆయన స్థాపించియున్నారు.4 వ్యక్తిగత ఎంపిక, అప్పుడు—ఇప్పుడు—ఆయన ప్రణాళికకు ముఖ్యమైనది, దానిని మనం మర్త్యత్వమునకు ముందు ఉనికిలో నేర్చుకున్నాము. ఆ ప్రణాళికను మనం అంగీకరించి భూమిమీదకు వచ్చుటకు ఎన్నుకున్నాము.

మనము విశ్వాసమును అభ్యసించుట మరియు మన స్వతంత్రతను సరిగా ఉపయోగించుటను నేర్చుకొన్నామని నిశ్చయపరచుటకు, మనము దేవుని ప్రణాళిక గుర్తుంచుకోకుండునట్లు మన మనస్సులపైగా మరపు అనే తెరతో మూయబడినది. ఆ తెర లేకుండా, దేవుని యొక్క ఉద్దేశ్యములు సాధించబడవు, ఎందుకనగా మనము అభివృద్ధి చెందము మరియు ఆయన కోరిన విధంగా ఆయనకు నమ్మకమైన వారసులము కాలేము.

లీహై ప్రవక్త ఇలా అన్నారు: “అందువలన, ప్రభువైన దేవుడు నరునికి అతడు తను తాను నిర్వహించుకొనుటకు ఇచ్చెను. ఇప్పుడు, నరుడు ఒకదాని చేత లేక రెండవ దాని చేత ఆకర్షింపబడితే తప్ప అతడు తనను తాను నిర్వహించుకొనలేడు.”5 ఎంచుకొనుటకు, ప్రధానమైన స్థాయిలో, తండ్రి యొక్క ప్రధమ కుమారుడైన యేసు క్రీస్తు ఒక వైపున ప్రాతినిధ్యం వహించుచున్నారు. మరొకవైపు స్వతంత్రతను నాశనముచేసి, అధికారమును దక్కించుకొనుటకు కోరుచున్న లూసిఫరు అను సాతాను ప్రాతినిధ్యం వహించుచున్నాడు.6

యేసు క్రీస్తు యందు, “మనము తండ్రి తరపున ఉత్తరవాదిగా” 7 ఉన్నారు. ఆయన ప్రాయశ్చిత్త బలి ముగిసిన తరువాత, యేసు “ఆయన నరుల యొక్క సంతానముపైన కలిగిన కనికరము యొక్క ఆయన హక్కులను . . . తండ్రి నుండి అడిగి పొందుటకు క్రీస్తు పరలోకములోనికి ఆరోహణుడైయున్నాడు.” మరియు, ఆయన కనికరము యొక్క హక్కులను అడిగి పొందియుండి, “ఆయన మనుష్యుల సంతానము యొక్క హేతువును వాదించును.”8

మన తరపున తండ్రితో క్రీస్తు యొక్క వ్యాజ్యము మనకు వ్యతిరేకమైనది కాదు. తన చిత్తము తండ్రి యొక్క చిత్తమందు ఉపసంహరించబడుటకు,9 అనుమతించిన యేసు క్రీస్తు, ఆ తండ్రి కోరిన దానికి వ్యతిరేకంగా దేనిని బలపరచడు. పరలోక తండ్రి మన విజయాలను నిస్సందేహంగా మెచ్చుకొని, అనుమతిని తెలుపును.

క్రీస్తు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తఃము చేసియున్నారనియు, ఎవరును దేవుని కృప నుండి తీసివేయబడరని ఆయన యొక్క న్యాయవాదత్వము ద్వారా కొంతవరకు మనకు జ్ఞాపకము చేయబడును.10 యేసు క్రీస్తునందు విశ్వాసముంచి, పశ్చాత్తాపపడి, బాప్తీస్మము పొంది, మరియు సమాధానపడుటకు నడిపించు ప్రక్రియ---అంతము వరకు సహించు వారిని —11—రక్షకుడు క్షమించును, స్వస్థపరచును, మన పక్షముగా వాదించును. ఆయన మనకు సహాయకుడు, ఓదార్చువాడు, మరియు మధ్యవర్తి—దేవునితో మన సయోద్యను బలపరచుటకు మరియు గుర్తించి, మన తరపు మధ్యవర్తిగా నిలిచి దేవునితో సఖ్యత చేకూర్చును.12

అందుకు పూర్తి విరుద్ధముగా లూసిఫరు నిందించువాడును, నేరారోపణ చేయువాడునై యున్నాడు. ప్రకటనకారుడైన యోహాను, లూసిఫరు యొక్క అంతిమ పరాజయమును వర్ణించియున్నాడు: “మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని—రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు.”13

లూసిఫరే ఈ ఫిర్యాది. అతడు మర్త్యత్వమునకు ముందు లోకములో మనకు వ్యతిరేకంగా మాట్లాడాడు, మరియు ఈ జీవితంలో కూడా మనలను విమర్శించుట కొనసాగిస్తున్నాడు. అతడు మనల్ని ఈడ్చుకొనిపోవుటకు చూచుచున్నాడు. మనము అంతులేని శ్రమను అనుభవించాలని అతడు కోరుతున్నాడు. అతడే మనము తగియుండమని, మనము సరిపోమని, ఒక తప్పు నుండి బయటపడలేమని, మనకు చెప్పును. అతడే అంతిమ హింసకుడును, మనము కృంగియుండగా ఇంకా పరిస్థితిని అధ్వానంగా చేయును.

లూసిఫరు కనుక ఒక చిన్నారికి నడక నేర్పుచున్నట్లయితే ఆ చిన్నారి అడుగు తడబడినప్పుడు అతడు వానిపై కేకలు వేసి, శిక్షించి, ఆ ప్రయత్నమును మానివేయమని చెప్పును. లూసిఫరు యొక్క విధానములు--- చివరకు, ఎల్లప్పుడు నిరాశ, నిస్పృహలను తెచ్చున. ఈ అబద్ధాలకు తండ్రి అసత్యమును హెచ్చించును 14 మరియు కుతంత్రములతో మనలను మోసగించి చెదరగొట్టును, “ఏలయనగా మనుష్యులందరూ తనవలెనే భ్రష్టులు కావలెనని అతడు కోరుచున్నాడు.”15

క్రీస్తు ఒక చిన్నారికి నడక నేర్పుచున్నట్లయితే ఆ చిన్నారి అడుగు తడబడినప్పుడు, ఆయన ఆ బిడ్డ లేచి నిలబడుటకు సహాయము చేసి ముందుకు నడచుటకు ప్రోత్సహించును.16 క్రీస్తు సహాయకుడు మరియు ఆదరణ కర్త. ఆయన మార్గములు --- చివరకు, ఎల్లప్పుడు ఆనందమును, నిరీక్షణను తెచ్చును.

దేవుని ప్రణాళిక మనకు సూచనలను కలిగియున్నది, అవి లేఖనాలలో ఆజ్ఞలుగా సూచించబడినవి. ఈ ఆజ్ఞలు, మనలను విధేయులుగా ఉండుటకు శిక్షణ ఇచ్చుటకు మాత్రమే ఉద్దేశించబడినవి గానీ, వినోదాత్మకమైనవి లేక ఏకపక్షంగా విధించబడిన నియమములు కావు. అవి మనము దైవత్వ లక్షణాలను పెంపొందించుకొనుటకు, మన పరలోక తండ్రి యొద్దకు తిరిగి చేరుకొనుటకు, శాశ్వతమైన సంతోషమును పొందుటకు అవి జతపరచబడియున్నవి. ఆయన ఆజ్ఞలకు విధేయత గుడ్డిదికాదు; మనము బుద్ధిపూర్వకంగా దేవునిని, మరియు ఇంటికి ఆయన మార్గమును ఎంచుకొనగలము. ఆదాము, హవ్వలకు “దేవుడు విమోచనా ప్రణాళికను తెలియచేసిన తరువాత వారికి ఆజ్ఞలను అనుగ్రహించిన విధానములోనే”17 మనకును అదే మాదిరిగా ఉన్నది. మనము నిబంధన మార్గములో నుండవలెనని దేవుడు కోరినప్పటికీ, ఆయన మనకు ఎన్నుకునే గౌరవమునిచ్చుచున్నారు.

వాస్తవానికి, దేవుడు ఆయన బిడ్డలు ప్రతి ఒక్కరు అతడు లేక ఆమె తమకై తాము ఎన్నుకోవాలని కోరును, ఆశించును, మరియు నడిపించును. ఆయన మనలను నిర్భంధించడు. స్వతంత్రత అనే వరము ద్వారా దేవుడు తన బిడ్డలు “తమను తాము నిర్వహించుకొనుటకు (అనుమతించును) నిర్వహించబడుటకు కాదు.”18 మనము మార్గములో ఉండుటకు, లేక లేకుండుటకు అది మనల్ని అనుమతించును. మనము విధేయులగుటకు నిర్భంధించబడనట్లుగా, అవిధేయులగుటకు మనము నిర్భంధించబడము, మన సహకారము లేకుండా ఎవరునూ మనలను దారి తప్పించలేరు. (ఒకరి స్వతంత్రత ఉల్లంఘించిబడిన దానితో ఇది పోల్చి పొరబడరాదు. వారు దారి తప్పలేదు. వారు బాధితులు. వారు దేవుని యొక్క జ్ఞానమును, ప్రేమను, కనికరమును పొందుతారు.)

కాని మనము దారి తప్పినప్పుడు, దేవుడు విచారించును, ఎందుకనగా ఇది చివరకు, తగ్గించబడిన సంతోషమునకు మరియు పోగొట్టుకొనబడిన దీవెనలకు దారితీయునని ఆయనకు ఎల్లప్పుడు తెలియును. లేఖనములందు, దారితప్పుట అనగా పాపముగా సూచించబడినది, మరియు దాని ఫలితముగా తగ్గించబడిన సంతోషమునకు మరియు పోగొట్టుకొనబడిన దీవెనలు శిక్షగా పిలవబడింది. ఈ భావనలో, దేవుడు మనల్ని శిక్షించలేదు; శిక్ష అనేది మన స్వంత ఎంపికలు పర్యవసానమే, ఆయనది కాదు.

మనం దారితప్పియున్నామని కనుగొన్నప్పుడు, మనం అలానే ఉండిపోవచ్చును, లేక యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా, మనము మన అడుగులు వెనుకకు మరల్చుకొని తిరిగి దారిలోనికి రావచ్చును. లేఖనములలో, మార్చుకొనుటకు, బాటకు తిరిగి వచ్చుటకు నిర్ణయించుకునే ప్రక్రియ పశ్చాత్తాపముగా సూచించబడింది. పశ్చాత్తాపపడుటకు విఫలమగుట అనగా, మనలను మనము దేవుడు అనుగ్రహించు దీవెనలకు అనర్హులనుగా చేసుకొనుటకు ఎంచుకొనుట. మనము “పొందబోయే దానిని అనుభవించుటకు (మనము) అంగీకరించని యెడల,” మనము “(మన) పూర్వ స్థితికి తిరిగి వచ్చి . . . మనము పొందుటకు అంగీకరించిన దానిని ఆనందించుటకు . . . తిరిగి వెళతాము”19— అది మన ఎంపిక, దేవునిది కాదు.

మనం ఎన్నిసార్లు దారితప్పినను, ఎంత దూరం వెళ్ళినప్పటికిని, మనం మార్చుకోవటానికి నిర్ణయించిన మరుక్షణం, తిరిగి వెళ్ళుటకు దేవుడు మనకు సహాయపడును.20 దేవుని దృష్టిలో మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి, క్రీస్తునందు ధృఢ సంకల్పముతో ముందుకు త్రోసుకొనిపోవుచూ, తిరిగి బాటపై ఉండుట, మనము ఎన్నడూ తప్పిపోనట్లు ఉండును.21 రక్షకుడు మన పాపముల కొరకు చెల్లించెను మరియు తగ్గించబడిన సంతోషము మరియు దీవెనలనుండి మనల్ని స్వతంత్రులుగా చేయును. ఇది లేఖనములలో క్షమాపణగా పేర్కొనబడినది. బాప్తీస్మము తరువాత, సభ్యులందరూ దారి తప్పి—వైదొలగుతుంటారు—మనలో కొందరైతే దూకేస్తారు కూడా. కాబట్టి, యేసు క్రీస్తునందు విశ్వాసమును అభ్యసించుట, పశ్చాత్తాపపడుట, ఆయన నుండి సహాయమును పొందుట, మరియు క్షమాపణ పొందుట అనునవి ఒక్కసారి జరుగు సంఘటనలు కాదు, కాని తరచు పునరావృతమయ్యే జీవితకాల ప్రక్రియలు. ఆవిధంగా మనము “అంతము వరకు సహిస్తాము.”22

మనము ఎవరిని సేవించుదుమో కోరుకొనుట అవసరము.23 సజీవుడైన దేవుని ఎన్నుకొని, మరియు ఆయన కార్యములో ఆయనతో చేరుటపై మన నిత్యానందము యొక్క పరిధి ఆధారపడియున్నది. మన స్వంతముగా “తరువాతవి చేయుటకు” మనము శ్రమించినపుడు, మన స్వతంత్రతను సరిగా ఉపయోగించుటను సాధన చేస్తాము. ఉపశమన సమాజపు ప్రధాన అధ్యక్షురాళ్ళలో ఇరువురు చెప్పినట్లుగా, మనము “అన్నివేళల దిద్దుబాటు మరియు మెచ్చుకొనుట అవసరమైన పసిబిడ్డలుగా”24 ఉండరాదు. లేదు, మనల్ని మనం నియంత్రించుకొను పరిపక్వతగల పెద్దవారము కావాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు.

తండ్రి యొక్క రాజ్యమునకు వారసులమగుటకు, ఏకైక మార్గము తండ్రి యొక్క ప్రణాళికను అనుసరించుటకు ఎన్నుకొనుట; అప్పుడు మాత్రమే మనము ఆయన చిత్తమునకు వ్యతిరేకమైన దేదియు అడగమని ఆయన మనల్ని నమ్మును.25 కాని, “అన్నీ తెలుసుని అనుకునే పిల్లలకు నేర్పడం కంటే కష్టమైనది మరేదీ లేదు” అని మనం జ్ఞాపకముంచుకోవాలి. కనుక ప్రభువు మార్గములలో ప్రభువు చేత మరియు ఆయన సేవకుల చేత శిక్షణ పొందుటకు మనం సుముఖంగా ఉండాల్సినవసరమున్నది. మనము పరలోక తండ్రి యొక్క ప్రియమైన బిడ్డలమని, “శ్రమ తీసుకొనుటకు” విలువైనవారమని, “మన స్వంతముగా” అనగా అర్ధం “ఒంటరిగా” ఎన్నడూ కాదని మనము నమ్మవలెను.26

మోర్మన్ గ్రంథ ప్రవక్త చెప్పినట్లుగా, నేను అతడితో చెప్పుచున్నాను:

“కాబట్టి, మీ హృదయములను ఉత్సాహపరచుకొనుడి, మరియు నిత్య మరణము యొక్క మార్గమును, లేదా నిత్యజీవము యొక్క మార్గమును కోరుకొనుటకు — మిమ్ములను మీరు నిర్వహించుకొనుటకు మీరు స్వతంత్రులై యున్నారని జ్ఞాపకముంచుకొనుడి.

“కాబట్టి, నా ప్రియమైన సహోదరులారా (మరియు సహోదరిలారా), మిమ్ములను అపవాది యొక్క చిత్తమునకు కాక దేవుని చిత్తమునకు నమాధానపరచుకొనుడి … ; మరియు మీరు దేవునితో సమాధానపడిన తరువాత, అది కేవలము దేవుని కృప యందు మరియు ద్వారానే మీరు రక్షింపబడితిరని జ్ఞాపకముంచుకొనుడి.”27

కనుక, క్రీస్తునందు విశ్వాసమును కోరుకొనుడి; పశ్చాత్తాపమును కోరుకొనుడి; బాప్తీస్మమును కోరుకొనుడి, మరియు పరిశుద్ధాత్మను పొందుడి; అంతస్సాక్షిగా సిద్ధపడి యోగ్యులుగా సంస్కారములో పాల్గొనుటకు కోరుకొనుడి; దేవాలయములో నిబంధనలు చేసుకొనుటకు కోరుకొనుడి; సజీవుడైన దేవునికి, మరియు ఆయన బిడ్డలకు సేవ చేయుటకు కోరుకొనుడి. మన ఎంపికలు మనము ఎవరమో, ఎవరము కాగలమో తీర్మానించును.

జేకబ్ యొక్క మిగిలిన దీవెనతో నేను ముగించుచున్నాను: “మీరు దేవుని యొక్క శాశ్వత రాజ్యములోనికి చేర్చుకొనబడునట్లు, దేవుడు. . . . ప్రాయశ్చిత్తము యొక్క శక్తి ద్వారా నిత్యమరణము నుండి కూడా మిమ్ములను లేపును గాక.”28 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.