2010–2019
ప్రారంభ వ్యాఖ్యాలు
అక్టోబర్ 2018


ప్రారంభపు వ్యాఖ్యలు

మన బ్రాంచి, వార్డు, మరియు స్టేకు భవనాల లోపల జరిగే దానిచేత సహకరించబడి ఇది గృహము-కేంద్రీకరించబడిన సంఘము కొరకు సమయము.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, ఈ అక్టోబరులో సంఘము యొక్క సర్వసభ్య సమావేశములో మీతో కలిసి కూడుకొనుటకు మేము ఎదురుచూసియున్నాము. మీలో ప్రతీఒక్కరిని స్వాగతించుటకు మా హృదయపూర్వకమైన స్వాగతమిచ్చుచున్నాము. మీ ఆమోదించే ప్రార్థనల కొరకు మేము లోతైన కృతజ్ఞతను కలిగియున్నాము. వాటి ప్రభావమును మేము అనుభూతి చెందాము. మీకు ధన్యవాదములు!

ఆరు నెలల క్రితం సర్వసభ్య సమావేశములో ఇవ్వబడిన ఉపదేశమును అనుసరించుటకు మీ అద్భుతమైన ప్రయత్నాల కొరకు మేము కృతజ్ఞతను కలిగియున్నాము. ప్రపంచమంతటా స్టేకు అధ్యక్షత్వములు, ఎల్డర్ల కోరములను తిరిగి ఏర్పాటు చేయుటకు అవసరమైన బయల్పాటును వెదకియున్నారు. ఆ కోరములలో పురుషులు మన సమర్పించబడిన ఉపశమన సమాజ సహోదరీలతోపాటు ఉన్నతమైన, పరిశుద్ధమైన విధానములో మన సహోదర, సహోదరీలకు పరిచర్య చేయుటకు శ్రద్ధగా పనిచేస్తున్నారు. రక్షకుని ప్రేమను మీ కుటుంబాలు, పొరుగువారు, స్నేహితులకు తెచ్చుటకు మరియు ఆయన చేసినట్లుగా వారికి పరిచర్య చేయుటకు మీ మంచితనము మరియు అసాధారణమైన ప్రయత్నముల చేత మేము ప్రేరేపించబడ్డాము.

గత ఏప్రిల్ సమావేశము నుండి, సహోదరి నెల్సన్ మరియు నేను నాలుగు ఖండాలు మరియు సముద్రము యొక్క ద్వీపాలలోని సభ్యులతో కలుసుకొన్నాము. యెరూషలేము నుండి హారెరే, విన్నిపెగ్ నుండి బాంకాక్ వరకు, మీ గొప్ప విశ్వాసమును మేము అనుభవించాము మరియు మీ సాక్ష్యముల చేత బలపరచబడ్డాము.

చెదరిపోయిన ఇశ్రాయేలును సమకూర్చుటకు సహాయపడుటకు ప్రభువు యొక్క యువ దళమును చేరిన మా యువత యొక్క సంఖ్యను బట్టి మేము మిక్కిలిగా సంతోషిస్తున్నాము.1 మీకు మా కృతజ్ఞతలు! మరియు మా ప్రపంచవ్యాప్త యువత భక్తి సమావేశములో ఇవ్వబడిన నా ఆహ్వానములను అనుసరించుటకు మీరు కొనసాగించినప్పుడు, మేము అనుసరించుటకు ఒక ప్రమాణమును మీరు ఏర్పరుస్తున్నారు. యువతైన మీరు ఎటువంటి ప్రత్యేకతను కలిగియున్నారు!

ఇటీవల సంవత్సరాలలో, సంఘము యొక్క అధ్యక్షత వహించు సలహాసభలలో మేము ప్రధానమైన ప్రశ్న గురించి మాట్లాడుకున్నాము: దేవుని పిల్లలు అందరికి, సువార్తను దాని సరళమైన స్వచ్ఛత యందు, వాటి నిత్య ప్రభావముతో విధులు, ఎలా తీసుకొనివెళ్లగలము?

కడవరి దిన పరిశుద్ధులుగా, మనము “సంఘమును” గూర్చి ఇంటిలో జరిగే దాని చేత సహకరించబడి, మన సమావేశ గృహాలలో జరిగేదానిగా ఆలోచించుటకు అలవాటుపడ్డాము. ఈ మాదిరికి మనకు ఒక సవరణ కావాలి. మన బ్రాంచి, వార్డు, మరియు స్టేకు భవనాలలోపల జరిగే దానిచేత బలపరచబడి ఇది గృహము కేంద్రీకరించబడిన సంఘము కొరకు సమయము.

ప్రపంచమంతటా సంఘము విస్తరిస్తున్నప్పుడు, అనేకమంది సభ్యులు స్వంత భవనాలు లేనిచోట---మరియు భవిష్యత్తులో చాలాకాలము ఉండబోనిచోట నివసిస్తున్నారు. అటువంటి పరిస్థితుల వలన, ఒక కుటుంబము వారి ఇంటిలో సమావేశమగుట అవసరమయ్యెనని నాకు గుర్తున్నది. తన స్వంత ఇంటిలో సంఘానికి వెళ్ళుట తనకు ఎలా ఉన్నదని ఆ తల్లిని నేను అడిగాను. “నేను దానిని ఇష్టపడుచున్నాను! అని ఆమె జవాబిచ్చింది. ప్రతీ ఆదివారము ఇక్కడ సంస్కారమును తాను దీవించాలని ఎరిగి, ఇప్పుడు నా భర్త మంచి భాషను ఉపయోగిస్తున్నాడు. ”

సంఘము చాలాకాలముగా కలిగియున్న ఉద్దేశమేదనగా, సభ్యులందరూ మన ప్రభువైన యేసు క్రీస్తునందు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు వారి విశ్వాసమును హెచ్చించుటకు సహాయపడుటకు, దేవునితో వారి నిబంధనలు చేసి, పాటించుటలో వారికి సహాయపడుటకు, మరియు వారి కుటుంబాలను, బలపరచుటకు, బంధించుటకు సహాయపడుట. నేటి చిక్కైన లోకములో, ఇది సులువైనది కాదు. అపవాది విశ్వాసముపై, మనపై మరియు మన కుటుంబాలపై తన ముట్టడిని మిక్కిలి వేగవంతం చేసాడు. ఆత్మీయంగా బ్రతికియుండుటకు, అపవాది ముట్టడులతో వ్యవహరించుటకు మనకు సహాయపడుటకు వూహ్యములు మరియు ముందుగా మనకు సహాయపడే చురుకైన ప్రణాళికలు మనకవసరము. దీనివలన మనమిప్పుడు కొన్ని సంస్థాపరమైన సవరణలు చేయాలని కోరుతున్నాము, అవి మన సభ్యులను మరియు వారి కుటుంబాలను బలపరచుటను కొనసాగించును.

అనేక సంవత్సరాలుగా, సంఘ నాయకులు సిద్ధాంతమును నేర్చుకొనుటకు, విశ్వాసమును బలపరచుటకు, మరియు గొప్ప వ్యక్తిగత ఆరాధనను పెంపొందించుటకు గృహము-కేంద్రీకరించబడిన మరియు సంఘము-బలపరచే ప్రణాళిక ద్వారా కుటుంబాలను, వ్యక్తులను బలపరచుటకు అనుసంధానించబడిన పాఠ్యప్రణాళికపై పని చేస్తున్నారు. ఇటీవల సంవత్సరాలలో సబ్బాతును పరిశుద్ధముగా ఆచరించుటకు---మరియు అది మనోహరమైనదిగా, దేవుని కొరకు మన ప్రేమ యొక్క వ్యక్తిగత చిహ్నముగా చేయుటకు మన ప్రయత్నాలు---ఇప్పుడు మేము పరిచయము చేయు సవరణల చేత మెరుగుపరచబడును.

ఈ ఉదయమున గృహములో మరియు సంఘములో సువార్త బోధన మధ్య ఒక క్రొత్త సమతుల్యతను మరియు సంబంధమును మేము ప్రకటిస్తాము. మనలో ప్రతీఒక్కరు మన వ్యక్తిగత ఆత్మీయ వృద్ధి కొరకు బాధ్యత కలిగియున్నాము. తల్లిదండ్రులు తమ పిల్లలకు సిద్ధాంతమును బోధించే ప్రధాన బాధ్యతను కలిగియున్నారని లేఖనాలు స్పష్టము చేయుచున్నవి.2 అతడు లేక ఆమె సువార్త జ్ఞానమును హెచ్చించుటకు దైవికంగా నిర్వచింపబడిన లక్ష్యములో ప్రతీ సభ్యునికి సహాయపడుటకు సంఘము బాధ్యతను కలిగియున్నది.

ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ ముఖ్యమైన సవరణలను ఇప్పుడు వివరిస్తారు. ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సలహాసభ సభ్యులందరూ ఈ సందేశమును బలపరచుటలో ఏకమయ్యారు. ఎల్డర్ కుక్ సమర్పించే ప్రణాళికలు మరియు విధానములను అభివృద్ధి చేయుటలో ప్రభావితం చేసిన ప్రభువునుండి ప్రేరేపణను మేము కృతజ్ఞతతో గుర్తిస్తున్నాము.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా. దేవుడు జీవిస్తున్నాడని నేను ఎరుగుదును! ఇది ఆయన సంఘము, దీనిని ఆయన తన వినయముగల సేవకులకు ప్రవచనము మరియు బయల్పాటు చేత నడిపిస్తున్నారని నేనెరుగుదును. ఈవిధంగా యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.