2010–2019
మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క శిష్యునిగా మారుట
April 2017 General Conference


మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క శిష్యునిగా మారుట

క్రీస్తునందు విశ్వాసము ద్వారా వచ్చు లక్షణాల కూటమి ఈ చివరి రోజుల్లో బలంగా నిలబడటానికి అవసరము.

మన ప్రభువైన ఏసు క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండడమంటే అర్థమేమిటి? ఒక శిష్యుడు, బాప్తీస్మము పొంది మరియు అతను లేదా ఆమెపై రక్షకుని నామమును తీసుకొని, అయనను అనుసరించడానికి సమ్మతించువాడు. ఒక పని నేర్చుకొనే వ్యక్తి అతడు లేక ఆమె యజమానిగా మారడానికి ప్రయత్నిస్తున్నట్లుగా, శిష్యుడు మర్త్యత్వములో ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనలా మారటానికి ప్రయత్నిస్తాడు.

చాలా మంది శిష్యుడు అన్న పదం విన్నప్పుడు మరియు దాని అర్థం “అనుచరుడు” మాత్రమేనని ఆలోచిస్తారు. అయితే నిజమైన శిష్యరికం అనేది ఆ స్థితిలో వుండటం. ఇది అధ్యయనం మరియు వ్యక్తిగత లక్షణాల జాబితా అన్వయించుట కంటే ఎక్కువ సూచిస్తుంది. శిష్యులు అలా జీవిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క లక్షణాలు వారి జీవనరాలలోకి అల్లుకొని, ఆధ్యాత్మిక వస్త్రము వలె వుండును.

రక్షకుని యొక్క శిష్యుడిగా మారలంటే అపోస్తులుడైన పేతురు యొక్క ఆహ్వానం వినండి:

“ఆ హేతువుచేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును;

జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని;

భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు, దయను అమర్చుకొనుడి.”1

మీరు చూసినట్లుగా, వ్యక్తిగత శిష్యరికం యొక్క ఆధ్యాత్మిక వస్త్రము నేయుటకు ఒక దారపు పోగు కంటే ఎక్కువ అవసరం. రక్షకుని దినములో, చాలా మంది వారి జీవితాలలో ఏదో ఒకటి లేక మరో కోణంలో నీతిగలవారిగా చెప్పుకునేవారు. నేను ఏదయితే ఎంపిక చేసిన విధేయత అని పిలిచానో దానిని వారు సాధన చేశారు. ఉదాహరణకు, వారు సబ్బాతున పని చేయటం నుండి ఆపివేయలనే ఆజ్ఞ పాటించారు, అయినప్పటికిని ఆ పరిశుద్ధ దినమున స్వస్థపరిచినందుకు రక్షకుని విమర్శించారు.2 వారు పేదలకు ఇచ్చారు కానీ వారికి ఎక్కువైనది మాత్రమే---వారికోసం అవసరం లేని దానిని వారు దానమిచ్చారు.3 వారు ఉపవాసమున్నారు కానీ దుఖముఖాలతో ఉన్నారు.4 వారు ప్రార్ధించారు కానీ మనుషులకు కనబడునట్లు మాత్రమే. 5 యేసు అన్నారు: “వారు తమ పెదవులతో నాకు దగ్గరగా వచ్చెదరు, కానీ వారి హృదయాలు నాకు దూరముగా ఉన్నాయి.”6 అటువంటి పురుషులు మరియు స్త్రీలు ఒక నిర్దిష్ట లక్షణం లేదా చర్యను సాధించుటపై దృష్టి పెడతారు కానీ వారి హృదయాలలో ఆయన ఉన్నట్లుగా ఆవశ్యముగా లేరు.

వీరి గురించి, యేసు ప్రకటించాడు:

“ఆ దినమందు అనేకులు నన్ను చూచి---ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?

“అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.”7

వాటిని మనము గ్రహించినట్లుగా, రక్షకుని యొక్క లక్షణాలు, అనుసరించాల్సిన లేఖనం లేదా గుర్తించాల్సిన జాబితా కాదు. అవి ఒకదానితోఒకటి అల్లుకొనే లక్షణాలు, ఒకదానికి మరొకటి జోడించి వున్నాయి, అవి మనలో పరస్పరం అభివృద్ధి చెందుతాయి. ఇతర మాటల్లో, మనము క్రీస్తువంటి లక్షణాలు కలిగియుండకుండా మరియు ఇతరులను ప్రభావితం చేయకుండా వాటిని పొందలేము. ఒక లక్షణం బలపడినట్లుగా, అలాగే అనేకమైనవి బలపడును.

2 పేతురులో మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు  4 లో, ప్రభువైన ఏసు క్రీస్తునందు విశ్వాసము పునాది అని మనము నేర్చుకున్నాము. మన విధేయత ద్వారా---చేయుటకు మనల్ని నడిపించే దాని ద్వారా మన విశ్వాసమును మనము కొలుస్తాము. “మీరు నాయందు విశ్వాసము కలిగిన యెడల, ” ప్రభువు వాగ్దానం చేసారు, “నా యందు ప్రయోజనకరమైన ఏ సంగతినైనను చేయుటకు మీరు శక్తి కలిగియుందురు. ”8 విశ్వాసము ఒక ఉత్ప్రేరకం. క్రియలు లేకుండా, నీతిగా జీవించకుండా, మన విశ్వాసం శిష్యరికంను ఉత్తేజపరచుటకు శక్తిలేనిది. నిజానికి, విశ్వాసము మృతము.9

కాబట్టి, పేతురు వివరించినట్లుగా, “మీ విశ్వాసమునకు సద్గుణమును చేర్చుము. ” ఈ సద్గుణము, లైంగిక పరిశుద్ధత కంటె ఎక్కువైనది. ఇది మనస్సు మరియు శరీరంలో శుభ్రత మరియు పరిశుద్ధత. సద్గుణము శక్తి కూడా. మనము సువార్తను విశ్వాసంగా జీవించినప్పుడు, మన ప్రతీ ఆలోచన, భావన, మరియు చర్య సద్గుణము కలిగియుండుటకు మనము శక్తి కలిగియుంటాము. మన మనస్సులు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలకు మరియు క్రీస్తు యొక్క వెలుగుకు అనుకూలంగా మారతాయి. 10 మనం చెప్పే మాటలోనే కాదు మరియు చేసే పనుల్లో, మనమెవరమో అనుదానిలో కూడా క్రీస్తును మనము రూపొందించుకుంటాము.

పేతురు కొనసాగించాడు, “[మీ] సద్గుణమునందు జ్ఞానమును చేర్చుము. ” మనము సద్గుణమైన జీవితాలను జీవించినప్పుడు, మనము ఒక ప్రత్యేక విధానములో పరలోక తండ్రిని మరియు ఆయన కుమారుని తెలుసుకుంటాము. “ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన యెడల, ఆ బోధను, వాడు తెలిసికొనును. ”11 ఈ జ్ఞానం వ్యక్తిగత సాక్షము, వ్యక్తిగత అనుభవం నుండి కలిగినది. ఆ జ్ఞానం మనల్ని రూపాంతరము చేయును, ఆవిధంగా మన “వెలుగు [ఆయన] వెలుగుతో హత్తుకొనును” మరియు మన “సద్గుణము [ఆయన] సద్గుణమును ప్రేమించును.”12 మనము నీతిగా జీవించుట ద్వారా, మన ప్రయాణము “నేను నమ్ముతున్నాను” నుండి “నాకు తెలుసు” అనే మహిమకరమైన గమ్యానికి చేరుకుంటాము.

“జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును,” చేర్చమని పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఒక ఆశానిగ్రహము గల శిష్యులుగా, మనము ఒక సమతుల్యమైన మరియు స్థిరమైన విధంగా సువార్తను జీవిస్తాము. మనము “ [మనకు కలిగిన] బలం కంటే వేగంగా పరుగెత్తము. ” 13 మర్త్యత్వము యొక్క శుద్ధిచేయు సవాళ్లు ద్వారా మనము ప్రతీరోజు ముందుకు వెళ్తాము, అడ్డగింపబడము.

ఈ విధంగా నిగ్రహంగా ఉండుట, మనము ప్రభువుయందు సహనము మరియు విశ్వాసమును అభివృద్ధి చేస్తాము. అది మన స్వంత సహజ నేత్రాలతో చూడలేనప్పటికీ, మన జీవితాల కోసం ఆయన రూపకల్పన చేసిన దానిపై మనము ఆధారపడగలము. 14 అందువలన, మనము “నిశ్చలముగా ఉండి మరియు [ఆయన] దేవుడని తెలుసుకోవాలి.”15 కష్టము యొక్క తుఫానులతో ఎదుర్కొన్నప్పుడు, “ఈ అనుభవం నుండి మీరు నన్ను ఏమి నేర్చుకోవాలని కోరుతున్నారు? ” మన హృదయాలలో అయన ప్రణాళిక మరియు ఉద్దేశ్యములతో, మనము అన్ని విషయాలను సహించుట మాత్రమే కాదు, కాని వాటిని సహనముతో, బాగా సహిస్తాము. 16

ఈ సహనము భక్తికి నడిపించునని పేతురు బోధించును. తండ్రి తన పిల్లలమైన మనతో సహనముగా ఉన్నట్లుగా, మనము ఒకరినొకరితో మరియు మనతో సహనంగా ఉండాలి. మనము ఇతరుల స్వతంత్రతయందు మరియు వారు “వరుస వెంబడి వరుస”17 ఎదుగు వరకు, “పరిపూర్ణ దినము వరకు మిక్కిలి కాంతివంతంగా”18 అగువరకు అది వారికిచ్చు అవకాశమునందు సంతోషిస్తాము. భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు, దయను అమర్చుకొనుడి.

ఆశానిగ్రహము నుండి సహనానికి, మరియు సహనము నుండి భక్తికి, మన స్వభావాలు మారును. మనము సహోదర ప్రేమ పొందుతాము, అది నిజమైన శిష్యుల యొక్క ముఖ్య లక్షణం. ఒక మంచి సమరయుని వలే, ఎవరైతే అవసరతలో ఉన్నారో, వారు మన స్నేహితుల గుంపులో లేనప్పటికిని వారికి సేవ చేయుటకు మనము మార్గములను దాటతాము. 19 మనల్ని శపించువారిని మనము దీవిస్తాము. మనల్ని హింసించువారికి మేలు చేయుము. 20 ఏ గుణమైన మరింత దైవికమైన లేదా క్రీస్తువంటి లక్షణమేదైనా ఉన్నదా?

మన రక్షకుని యొక్క శిష్యులగుటకు మనము చేసే ప్రయత్నాలు, ఆయన నిజమైన ప్రేమను “కలిగియుండే” వరకు చేర్చబడతాయని నేను సాక్ష్యమిస్తున్నాను. 21 ఈ ప్రేమ క్రీస్తు యొక్క శిష్యుడిగా నిర్వచించే లక్షణం:

“మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.

“ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసముగల వాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్ధుడను.”22

విశ్వాసము, నిరీక్షణ, మరియు దాతృత్వము దేవుని కార్యము కొరకు మనల్ని అర్హులను చేయును.23 “ఇప్పుడు ఈ మూడు. . . శాశ్వతంగా నిలిచియుండును; కానీ వీటిలో దాతృత్వము గొప్పది.”24

సహోదర, సహోదరిలారా, గతంలో కంటే ఇప్పుడు, ఎక్కువగా మనము “పాక్షిక సమయ శిష్యునిగా”! ఉండలేము. మనము ఒకటి ఒకటి లేదా రెండు సిద్ధాంత కోణాల్లో శిష్యునిగా ఉండకూడదు. ఈ రోజు మనము మాట్లాడిన దానితో కలిపి--- క్రీస్తునందు విశ్వాసము ద్వారా వచ్చు లక్షణాల కూటమి ఈ చివరి రోజుల్లో బలంగా నిలబడటానికి అన్నీ అవసరము.

యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా ఉండటానికి మనము నిజాయతీగా ప్రయాసపడినప్పుడు, ఈ లక్షణాలు అంతర్గతంగా అల్లుకొనబడి, జతపరచబడి, మరియు మనలో పరస్పరము బలపరచబడును. మన శత్రువులపై మనం చూపే దయ మరియు మన స్నేహితులకు పై చూపు దయ మధ్య అసమానతలేదు. మనము ఇతరులను గమనించినప్పుడు, లేదా ఇతరులు చూడనప్పుడు కూడా నిజాయతీగా ఉండాలి. మన లోపల గదిలో ఉన్నట్లుగా మనము బయట దేవునికి సమర్పించబడినట్లుగా ఉంటాము.

ప్రతీ ఒక్కరు రక్షకుని యొక్క శిష్యులు అవ్వగలరని నేను సాక్ష్యమిస్తున్నాను. శిష్యరికం వయస్సు, లింగభేదము, లేదా జాతి మూలము, లేక పిలుపు చేత నియంత్రించబడలేదు. మన వ్యక్తిగత శిష్యత్వము ద్వారా, కడవరి దిన పరిశుద్ధులుగా, మనము ప్రపంచవ్యాప్తంగా మన సహోదర, సహోదరీలను దీవించడానికి ఒక సామూహిక బలం నిర్మించాలి. పూర్ణ శ్రద్ధతో ఆయన శిష్యులుగా ఉండుటకు, మనల్ని మనము తిరిగి ఒడంబడిక చేసుకొనుటకు ఇప్పుడే సమయము.

సహోదరి, సహోదరులారా, మనమందరం మన రక్షకుని యొక్క శిష్యులుగా పిలవబడ్డాము. ఈ సమావేశము దీనిని ప్రారంభించుటకు అవకాశము “పూర్వకాలములందువలే మీ సంపూర్ణ హృదయముతో (ఆయన) యొద్దకు రండి,”25 ఇది ఆయన సంఘము. ఆయన జీవిస్తున్నారని నేను నా ప్రత్యేక సాక్షమిస్తున్నాను. సమర్పించబడిన మరియు సాహసముగల శిష్యులగుటకు మన నిత్య తపనయందు ఆయన మనల్ని దీవించును గాక. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.