2010–2019
రాజ్యములకు మన వెలుగు ఒక ప్రమాణముగా ఉండనియ్యుము
April 2017 General Conference


రాజ్యములకు మన వెలుగు ఒక ప్రమాణముగా ఉండనియ్యుము

రక్షకుని యొక్క సువార్త మరియు ఆయన పునస్థాపించబడిన సంఘము రాజ్యముల కొరకు గొప్ప ప్రమాణము యొక్క భాగముగా ఉండుటకు మన వెలుగు కొరకు అనేక అవకాశాలను మనకిచ్చును.

సంవత్సరాల క్రితం, నేను సెమినరీ బోధకునిగా సేవ చేస్తుండగా, సహవాసులలో ఒకరు క్రింద ప్రశ్నపై ప్రతిఫలించమని తన విద్యార్ధులను అడగటం నేను విన్నాను: రక్షకుని దినములో మీరు జీవించిన యెడల, ఆయనను అనుసరించిన శిష్యులలో ఒకరిగా, మీరెందుకు ఆయనను అనుసరించారని అనుకుంటున్నారు? ఈరోజు రక్షకుని అనుసరించి, ఆయన శిష్యులుగా ఉండుటకు ప్రయాసపడువారు బహుశా అప్పుడు కూడా అలా చేసియుండవచ్చనే ముగింపుకు వారు సమీపించారు.

అప్పటినుండి, ఆ ప్రశ్న మరియు వారి ముగింపుపై నేను ప్రతిఫలించాను. కొండమీద ప్రసంగములో క్రింద విషయము చెప్పినప్పుడు, రక్షకుడు స్వయంగా చెప్పుట విని నేను ఏవిధంగా భావించియుందును, నేను తరచుగా ఆశ్చర్యపడ్డాను:

“మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండమీదనుండి పట్టణము మరుగైయుండనేరదు.

“మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు.

“మనుష్యులు మీ సత్ర్కియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” (మత్తయి 5:14–16).

రక్షకుని యొక్క స్వరమును విని మీరేలా భావించియుండెవారో మీరూహించగలరా? వాస్తవానికి, మనము ఊహించనవసరం లేదు. ప్రభువు యొక్క స్వరము వినుట మనకు స్థిరమైన అనుభవముగా మారింది, ఎందుకనగా, మనము ఆయన సేవకుల స్వరమును విన్నప్పుడు, అది ఒకేవిధంగా ఉన్నది.

1838లో, కొండమీద ప్రసంగములో ఇవ్వబడిన దానిని పోలిన సందేశములో, ప్రభువు ప్రవక్త జోసఫ్ స్మిత్ ద్వారా దీనిని ప్రకటించాడు:

“ఆవిధంగా, నా సంఘము యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము అని పిలవబడును.

“మీ అందరితో నిశ్చయముగా చెప్పుచున్నాను: పైకి లెమ్ము, ప్రకాశించుము, రాజ్యములకు మీ వెలుగు ఒక ప్రమాణముగా ఉండనియ్యుము” (సి మరియు ని 115:4–5().

మన దినములు చాలా అసాధారణమైనవి అవి యెషయా ప్రవక్తకు దర్శనములో కూడా చూపబడినది; అతడు కూడా యేసు క్రీస్తు యొక్క సంఘ పునస్థాపన దినము మరియు దాని ఉద్దేశము గురించి ప్రవచించాడు, “జనములను పిలచుటకు ఆయన యొక్క ధ్వజమును నిలువబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును, భూమి యొక్క నాలుగు దిగంతములనుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును” (యెషయా 11:12().

లేఖన భావములో, ఒక ధ్వజము, లేక ఒక ప్రమాణము, దాని చుట్టూ ఒక ఏకాభిప్రాయమునందు సమావేశమగుట. ప్రాచీన కాలములలో, ఒక ధ్వజము యుద్ధములోని సైనికుల కొరకు కూడుకొను బిందువుగా ఉపయోగపడెను. చిహ్నాత్మకంగా చెప్పాలంటే, మోర్మన్ గ్రంథము మరియు యేసు క్రీస్తు యొక్క పునస్థాపించబడిన సంఘము సమస్త రాజ్యములకు ప్రమాణములుగా ఉన్నవి (See Guide to the Scriptures, “Ensign,” scriptures.lds.org.).

నిస్సందేహంగా, ఈ కడవరి దినాలలో గొప్ప ప్రమాణాలలో ఒకటి ఈ అద్భుతమైన సర్వసభ్య సమావేశము, ఇక్కడ మన పరలోక తండ్రి యొక్క గొప్ప కార్యము మరియు ప్రణాళిక “నరుని యొక్క అమర్త్యత్వము మరియు నిత్య జీవమును తెచ్చుట” (మోషే 1:39) ఎడతెగక ప్రకటించబడుచున్నది.

కడవరి దిన పరిశుద్ధులుగా మనము “దేవుడు బయల్పరచిన సర్వము, ఇప్పుడు దేవుడు బయల్పరచుచున్నది, మరియు ఇంకను దేవుని రాజ్యమునకు సంబంధించిన అనేక గొప్ప, ముఖ్యమైన విషయాలు ఆయన బయల్పరచబోతున్నాడని మనము నమ్ముచున్నాము” (విశ్వాస ప్రమాణములు 1:9) అన్న వాస్తవానికి గొప్ప సాక్ష్యాలలో ఒకటి నిరంతరము జరపబడుచున్న సర్వ సభ్య సమావేశము.

రాజ్యములకు ప్రమాణముగా ఉండునట్లు నిరంతరము మనము చేయాల్సిన దానిని అధ్యక్షులు థామస్  ఎస్. మాన్సన్ ద్వారా ప్రభువు బయల్పరచినది ఏమిటి? సీయోనును నిర్మించుట మరియు ఇశ్రాయేలును సమకూర్చు ఈ మిక్కిలి అద్భుతమైన క్షణములో చేయబడవలసిన ముఖ్యమైనవి కొన్ని ఏమిటి?

ప్రభువు ఎల్లప్పుడు తన చిత్తమును “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఇచట కొంచెము, అచ్చట కొంచెము;” (2 నీఫై 28:30). మనకు బయల్పరచును, కాబట్టి వాటి సరళమైన, పునరావృత స్వభావము వలన స్వల్ప విషయాలుగా కనబడు వాటిచేత మనము ఆశ్చర్యపడరాదు, ఏలయనగా “నా సూక్తులను ఆలకించువారు మరియు నా సలహాకు చెవియొగ్గువారు ధన్యులు, ఏలయనగా వారు జ్ఞానమును నేర్చుకొందురు; ఏలయనగా పుచ్చుకొను వానికి నేను మరి ఎక్కువ ఇచ్చెదను” (2 నీఫై 28:30).

“ఆజ్ఞ వెంబడి, ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము, ఇచట కొంచెము, అచ్చట కొంచెము” నేర్చుకొనుట ద్వారా మరియు మన నాయకుల సలహాకు చెవియొగ్గుట ద్వారా, మనము మన దీపములకు నూనెను కలిగియుంటామని, అది మనల్ని ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా ఇతరులకు వెలుగిచ్చుటకు మనకు సాధ్యపరుచునని నేను సాక్ష్యమిస్తున్నాను.

మనము చేయాల్సినవి అనేక విషయాలుండగా, ఇతరులకు వెలుగు మరియు ధ్వజముగా ఉండుటకు, క్రింది మూడు విషయాలపై దృష్టిసారించాలని నేను కోరుతున్నాను: సబ్బాతు దినమును ఆచరించుట; తెరకు రెండు వైపుల రక్షణ కార్యమును త్వరపరచుట; మరియు రక్షకుని విధానములో బోధించుట.

మనము మాట్లాడుతున్న వెలుగు, సంఘములో అదేవిధంగా ఇంటిలో, సబ్బాతు దినమును ఆచరించుటకు మనమిచ్చు సమర్పణ నుండి వచ్చును; అదే వెలుగు లోకమునుండి మచ్చలేనివారిగా మనల్ని మనం ఉంచుకొన్నప్పుడు వృద్ధిచెందును; అదే వెలుగు, ఆయన పరిశుద్ధ దినమున మన సంస్కారములను అర్పించుట నుండి మరియు మహోన్నతునికి మన సమర్పణలను చెల్లించుట వచ్చును, ఇవన్నీ ఆయన ఆత్మను ఎల్లప్పుడు మనతో కలిగియుండుటకు మనకు సాధ్యపరచును. గత అక్టోబరు సర్వసభ్య సమావేశములో అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ మాట్లాడిన క్షమాపణ భావనతో మనము తిరిగి వెళ్ళినప్పుడు వృద్ధిచెందు వెలుగు, గోచరమగును: “మనము లెక్కించగల దీవెలన్నిటిలో, మిక్కిలి గొప్పది, మనము సంస్కారము తీసుకొన్నప్పుడు వచ్చు క్షమాపణా భావన. పాపమునుండి మనము ఎవరి అంతములేని త్యాగము శుద్ధి చేయబడుటను సాధ్యపరచిందో ఆ రక్షకుని కొరకు గొప్ప ప్రేమ మరియు ప్రశంసను భావిస్తాము” అని ఆయన అన్నారు (“Gratitude on the Sabbath Day, Liahona, Nov. 2016, 100).

మనము సబ్బాతు దినమును పరిశుద్ధముగా ఆచరించి మరియు సంస్కారమును తీసుకొన్నప్పుడు, మనము శుద్ధి చేయబడుట మాత్రమే కాదు కాని మన వెలుగు కూడా ప్రకాశవంతంగా ఎదుగును.

మన పూర్వీకుల పేర్లను వెదకుటకు, వారి పేర్లను దేవాలయమునకు తీసుకొనివెళ్లుటకు, మన కుటుంబము మరియు ఇతరులు అదేవిధంగా చేయుటకు బోధించుటకు సమయాన్ని అంకితమిచ్చి, సమర్పించినప్పుడు కూడా మన వెలుగు వృద్ధిచెందును.

తెరకు ఇరువైపుల ఉన్న ఇరువురి పరిశుద్ధులతో మనము పంచుకొను పరిశుద్ధ దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము, ప్రభువు యొక్క దేవాలయములు నిర్మించబడినప్పుడు, ఎప్పటికంటె ఎక్కువగా ముందుకు సాగుచున్నది. ఇప్పుడు దేవాలయములు తమ స్వంత కుటుంబ పేర్లుగల కార్డులతో వచ్చు కుటుంబ గుంపులు కొరకు ప్రత్యేక షెడ్యూలు చేసాయి, మా పిల్లలు, మనుమలతో కలిసి దేవాలయములో మేము సేవ చేసినప్పుడు, నా భార్య, నాకు సంతోషకరమైన అనుభవాలు కలిగాయి.

మనము పేర్లను కనుగొని, దేవాలయమునకు తీసుకొనివెళ్ళి, అదేవిధంగా ఇతరులు ఎలా చేయాలో బోధించినప్పుడు, కలిసి మనము ఒక ధ్వజము లేక ప్రమాణముగా ప్రకాశిస్తున్నాము.

రక్షకుడు బోధించినట్లుగా బోధించుట నేర్చుకొనుట మనము లేచి, ప్రకాశించుటకు మరొక విధానము. రక్షకుని విధానములో ఎలా బోధించాలో నేర్చుకొన్న ప్రతీఒక్కరితోపాటు నేను ఆనందిస్తున్నాను. క్రొత్త నిబంధన చేతి పుస్తకము యొక్క ముఖ చిత్రము నుండి చదవటానికి నన్ను అనుమతించుము: “ప్రతీ సువార్త బోధకుని---ప్రతీ తల్లి, తండ్రి, అధికారికంగా పిలవబడిన ప్రతీ బోధకుడు, ప్రతీ గృహ బోధకుడు, మరియు క్రీస్తు యొక్క ప్రతీ అనుచరుల, యొక్క లక్ష్యము--- ఆత్మ ద్వారా, . . . సువార్త యొక్క శుద్ధమైన సిద్ధాంతమును బోధించుట, దేవుని యొక్క పిల్లలు రక్షకునియందు వారి విశ్వాసమును కట్టుటకు మరియు ఆయన వలె ఎక్కువగా మారుటకు సహాయపడుట” (Teaching in the Savior’s Way} [2016]).

ఇప్పుడు, రక్షకుని విధానములో ఎలా బోధించాలో వారు నేర్చుకున్నప్పుడు, వేలమంది మన విశ్వాసులైన బోధకులు వెలుగును పైకెత్తుచున్నారు. ఈ భావనలో, క్రొత్త బోధకుని సలహాసభ సమావేశము క్రీస్తు యొక్క సిద్ధాంత ప్రమాణము చుట్టూ విద్యార్ధులు కలుసుకొన్నప్పుడు, లేచి, ప్రకాశించుటకు ఒక విధానము, ఏలయనగా “రక్షకుడు బోధించినట్లుగా బోధించుటకు ముఖ్యమైనది, రక్షకుడు జీవించినట్లుగా జీవించుట” (Teaching in the Savior’s Way, 4).

ఆయన విధానములో మనమందరం బోధించి మరియు నేర్చుకొని, ఆయన వలె ఎక్కువగా మారినప్పుడు, మన వెలుగు కాంతివంతంగా ప్రకాశించును, దాచబడదు, మరియు రక్షకుని యొక్క వెలుగు కొరకు వెదకు వారికి ఒక ప్రమాణముగా మారును.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, మనము మన వెలుగును దాచరాదు మరియు దాయకూడదు. కొండపైన పట్టణము వలె లేక దీపస్తంభము మీద దీపమువలె మన వెలుగు ప్రకాశించాలని మన రక్షకుడు మనకు ఆజ్ఞాపించాడు. మనమావిధంగా చేసినప్పుడు, మన పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తాము. రక్షకుని యొక్క సువార్త మరియు ఆయన పునస్థాపించిన సంఘము మన వెలుగు రాజ్యములకు గొప్ప ప్రమాణము యొక్క భాగముగా ఉండుటకు మనకు అనేక అవకాశాలనిచ్చును.

యేసు క్రీస్తు మనము ప్రతిఫలించాల్సిన వెలుగు అని నేను సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.