2010–2019
ఆయన అనుదిన మార్గదర్శక హస్తము
April 2017 General Conference


ఆయన అనుదిన మార్గదర్శక హస్తము

మీకు, నాకు ఏమి అవసరమో ఇతరుల కంటే ఎక్కువగా పరలోక తండ్రికి తెలుసు.

పరలోక తండ్రి యొక్క పిల్లలను నడిపించుటలో అత్యంత ప్రియమైన సాధనాలలో ఒకటి నీతిమంతులైన తాత మామ్మలు. మా తండ్రిగారి తల్లి ఇటువంటి ఒక మహిళ. నేను చిన్నప్పుడు ఒక సందర్భంలో, నా తండ్రి నన్ను సరిదిద్దుతున్నప్పుడు జరిగింది. ఈ దిద్దుబాటు గమనించిన, మా నానమ్మ, “మోంటే, నీవు అతనిని చాలా కఠినంగా సరిచేస్తున్నావని నా నమ్మకం.”

నా తండ్రి బదులిచ్చారు, “అమ్మా, నాకు ఇష్టమైనట్టు నా పిల్లల్ని నేను సరిద్దిదుతాను.”

మరియు “నేను అలాగే చేస్తాను, ” అని మా తెలివిగల నానమ్మ మృదువుగా చెప్పింది.

నా తండ్రి ఆ రోజు తన తల్లి చెప్పిన తెలివైన ఉపదేశము విన్నాడని నేను నిశ్చయముగా చెప్పగలను.

నడిపింపు గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనందరికి తెలిసిన మరియు ప్రేమించు కీర్తన “నేను దేవుని యొక్క బిడ్డను, ” గురించి ఆలోచిస్తాము. పల్లవిలో కొన్ని “నన్ను నడిపింపుము, నాకు దారిచూపుము, నా ప్రక్కన నడువుము, దారి కనుగొనుటలో నాకు సహాయము చేయుము.” 1

ఇటీవల వరకు, ఆ పల్లవి తల్లిదండ్రులకు దివ్యమైన నడిపింపు అని నేను అర్థంచేసుకున్నాను. ఈ పదాలను ఆలోచిస్తున్నప్పుడు, అవి నడిపింపు కలిగియుండగా, అక్కడ చాలా ఎక్కువ అర్థం ఉన్నదని నేను గ్రహించాను. వ్యక్తిగతంగా, మనలో ప్రతి ఒక్కరము ప్రతీరోజూ మమ్మల్ని నడిపించుము, మాకు దారిచూపుము, మా పక్కన నడవమని పరలోక తండ్రిని వేడుకుంటున్నాము.

అధ్యక్షులు డిటర్  ఎఫ్. ఉక్ డార్ఫ్ వివరించారు: “మన పరలోకమందున్న తండ్రికి ఇతరుల కంటే ఎక్కువగా తన పిల్లలకు ఏమి అవసరమో తెలుసు. ఆయన వద్దకు తిరిగి వెళ్ళుటకు మన మార్గముపై మనకు సహాయపడుటకు మనకు అద్భుతమైన భౌతిక మరియు ఆత్మీయ వనరులను మనకిస్తూ, ప్రతీ మలుపులో మనకు సహాయపడుట ఆయన కార్యము మరియు మహిమ.”2

ఆ మాటలు వినండి: మీకు, నాకు ఏమి అవసరమో ఇతరుల కంటే ఎక్కువగా పరలోక తండ్రికి తెలుసు. ఫలితంగా, ఆయన మనలో ప్రతి ఒక్కరికి సరిపోయే ఒక వ్యక్తిగత సంరక్షణ ప్యాకేజీని అభివృద్ధి చేసారు. ఇందులో చాలా భాగాలున్నాయి. అది ఆయన కుమారుడు మరియు ప్రాయశ్చిత్తఃము, పరిశుద్ధాత్మ, ఆజ్ఞలు, లేఖనాలు, ప్రార్థన, ప్రవక్తలు, అపొస్తలులు, తల్లిదండ్రులు, తాత మామ్మలు, స్థానిక సంఘ నాయకులు మరియు అనేకమంది ఇతరులను కలిపియున్నది-- ఏదో ఒక రోజు ఆయన దగ్గరకు తిరిగివెళ్లి జీవించడానికి ఇవన్నీ మనకు సహాయపడతాయి.

ఈ రోజు ఒక ప్రియమైన తండ్రి నడిపించి, మార్గము చూపి, మరియు నాతో, నా కుటుంబము ప్రక్కన నడుస్తున్నారని గుర్తించుటకు సంరక్షణా ప్యాకేజీలో కొన్ని భాగాలను నేను పంచుకోవచ్చా? నా ప్రార్థనేమిటంటే మీలో ప్రతీఒక్కరు, పరలోక తండ్రి నడిపింపును, దారి చూపుటను మరియు మీ పక్కనుండి నడిచిన అనుభవాలను గుర్తిస్తారని, మరియు ఈ జ్ఞానంతో, మీరు ఎన్నడూ ఒంటరిగా లేరని తెలుసుకొని, మీరు విశ్వాసంతో ముందుకుసాగుతారని నా ప్రార్థన.

పరలోక తండ్రి యొక్క ఆజ్ఞలు సంరక్షణ ప్యాకేజిలో ముఖ్య భాగాలు. ఆల్మా ప్రకటించినట్లు “దుర్మార్గము ఎన్నడును సంతోషము కాలేదు.”3 ప్రేమగల దిద్దుబాటు లేకుండా అనుచితమైన ప్రవర్తనను సహించుట తప్పు కనికరము మరియు వాస్తవానికి దుర్మార్గము ఆనందమనే సాధారణ భావనను బలపరచవచ్చు. లేమనీయుడైన శామ్యూల్ ప్రతికూల భావనను స్పష్టముగా ఎదుర్కొన్నాడు: “మీరు దుర్ణితి చేయుట యందు అనందమును వెదకియున్నారు, ఆ సంగతి మన గొప్ప మరియు నిత్య అధిపతియందున్న ఆ నీతి యొక్క స్వభావమునకు వ్యతిరేకమైయున్నది.”4

ఆయన ప్రవక్తల ద్వారా, పరలోకపు తండ్రి నీతియే సంతోషమని మనకు నిరంతరం గుర్తుచేస్తున్నారు. ఉదాహరణకు, రాజైన బెంజమిన్, పరలోక తండ్రి గూర్చి చెప్పిన “ఆయన మిమ్ములను ఆజ్ఞాపించినట్లుగా మీరు చేయవలెనని ఆయన కోరుచున్నాడు; కాబట్టి మీరు దీనిని చేసిన యడల ఆయన వెంటనే ఆశీర్వదించును.”5 మరొక కీర్తన నుండి అదేవిధమైన జ్ఞాపకము వచ్చును:

ఆజ్ఞలను పాటించుము; ఆజ్ఞలను పాటించుము!

దీనిలో భద్రతా ఉంది; దీనిలో శాంతి ఉంది.

ఆయన దీవెనలను పంపును. 6

నా 14 వ పుట్టినరోజు దగ్గరలో, ఈ దీవెనలలో కొన్నిటిని గూర్చి నేను నేర్చుకున్నాను. నేను నా తల్లిదండ్రులలో వేరే ప్రవర్తనను నేను గమనించాను. నేను గమనించిన దానిగురించి, నేను అడిగాను, “మనము దేవుని సేవకు వెళ్తున్నామా?” నా తల్లి ముఖము మీద ఆశ్చర్యం నా అనుమానాన్ని ధ్రువీకరించాయి. తరువాత, ఒక కుటుంబ సలహాసభలో, మా తల్లిదండ్రులకు ఒక మిషన్ పై అధ్యక్షత్వము వహించుటకు పిలవబడ్డారని నా తోబుట్టువులు, నేను తెలుసుకున్నాము.

మేము వయోమింగ్ లో ఒక అందమైన క్షేత్రంలో నివసించాము. నా దృక్పథంలో, జీవితం పరిపూర్ణoగా ఉన్నది. నేను స్కూలు నుండి ఇంటికి వచ్చి, నా పనులను పూర్తి చేసి, మరియు వేటకు వెళ్ళుట, చేపలు పట్టడము, లేదా నా కుక్క తో అన్వేషించడం.

త్వరలోనే పిలుపు గురించి తెలుసుకున్న తర్వాత, నేను నా కుక్క, బ్లూను వదులుకోవాల్సి ఉంటుందని గ్రహించాను. నేను మా నాన్నను కలిసి, నేను బ్లూను ఏమి చెయ్యాలని అడిగాను. నేను దేవుని కోరుచున్న అన్యాయమును నొక్కిచెప్పాలని అనుకున్నాను. నేను ఎప్పుడూ ఈ సమాధానమును మర్చిపోను. ఆయన చెప్పారు, “నాకు ఖచ్చితంగా తెలియదు. అతనిని మనతో తీసుకొనివెళ్ళలేకపోవచ్చు, బహుశా నీవు పరలోక తండ్రిని అడుగు.”అది నేను ఊహించిన సమాదానము కాదు.

నేను మోర్మన్ గ్రంథము చదవడం మొదలుపెట్టాను. నేను నా కుక్కను వదిలివేయ్యాలా అని తెలుసుకొనుటకు నేను మనపూర్వకంగా ప్రార్ధించాను; నా సమాధానం ఒక క్షణం లో రాలేదు; బదులుగా, ఒక నిర్దిష్ట ఆలోచన నా మనస్సు చొచ్చుకుపోయిoది: “మీ తల్లిదండ్రులకు భారంగా ఉండకు. ఒక భారముగా ఉండకు. నేను మీ తల్లిదండ్రులను పిలిచాను. ”

పరలోక తండ్రికి ఏమి అవసరమో నాకు తెలుసు. ఆ జ్ఞానము నా కుక్కను వదులుకునే బాధను తగ్గించలేదు. అయినప్పటికిని, చిన్న త్యాగము ద్వారా, నా హృదయము మృదువుగా చేయబడింది మరియు పరలోక తండ్రి యొక్క చిత్తమును వెదకుటలో నేను శాంతిని కనుగొన్నాను.

లేఖనాలు, ప్రార్థన, పరిశుద్దాత్మ, మరియు తన పిల్లలకు ప్రధానమైన సువార్త బోధకునిగా తన పాత్రను హత్తుకొన్న యోగ్యతగల భూలోక తండ్రి ద్వారా నేను కనుగొన్న దీవెనలు మరియు సంతోషము కొరకు నా పరలోక తండ్రికి నేను కృతజ్ఞతలను తెలుపుచున్నాను. వారు నన్ను నడిపించారు, నాకు మార్గము చూపారు, మరియు ముఖ్యంగా నేను కష్టమైనవి చేయాల్చి వచ్చిన్నపుడు---- మార్గము కనుగొనడానికి నా పక్కన నడిచి సహాయం చేస్తున్నారు.

నేను చెప్పిన సంరక్షణ ప్యాకేజీలోని భాగాలను కలిగియుండుటకు అదనముగా, మనలో ప్రతిఒక్కరం నడిపించుటకు మరియు మనకు దారి చూపుటకు ఒక యాజకత్వ నాయకునితో దీవించబడ్డాము.

అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ చెప్పారు: “బిషప్సులు ప్రేరేపించబడ్డారు! మనలో ప్రతి ఒక్కరికి నాయకుల నుండి సలహాను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి స్వేచ్ఛ కలిగియున్నాము, కానీ వేదికపైన లేదా వ్యక్తిగతంగా మీ బిషప్పు ఇచ్చిన సలహాను ఎన్నుడూ నిర్లక్ష్యము చేయవద్దు.”7

ఈ పురుషులు ప్రభువుకు ప్రతినిధులుగా ఉండుటకు ప్రయాసపడతారు. మనము యౌవనులము లేదా ముసలివారిగా ఉన్నప్పుడు, సమస్తము కోల్పోయామని ఆలోచించాలని సాతాను కోరినప్పుడు, మనల్ని నడిపించటానికి బిషప్పులున్నారు. అవిధేయతను గూర్చి ఒప్పుకొనుట లేదా భయంకరమైన తప్పులనుండి అమాయకుల బాధపడుట గురించి బిషప్పులతో సంభాషించేటప్పుడు, ఒక ఉమ్మడి విషయము కనుగొన్నాను. బిషప్పు వ్యక్తి కొరకు తక్షణమే పరలోక తండ్రి యొక్క ప్రేమను మరియు అతడు లేక ఆమె ఇంటికి దారిని కనుగొనినప్పుడు, అతడు లేక ఆమె ప్రక్కన నడుచుటకు కోరికను వ్యక్తపరుస్తాడు.

బహుశా పరలోక తండ్రి యొక్క గొప్ప సంరక్షణ పార్సిలు లో భాగంగా ఈ పదాలు వివరించబడతాయి: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను.”8

మనము తప్పక చేయవలసిన దానిని మనందరికి బోధించుటకు, మనము అనుకరించుటకు తప్పక ప్రయత్నించాల్సిన పరిపూర్ణమైన మాదిరిని ఇచ్చుట ద్వారా యేసు క్రీస్తు మార్గమును నడిపించారు. ఆయన చాపబడిన చేతులతో, నన్ను వెంబడించమని మనల్ని వేడుకొనుచున్నాడు. 9 మరియు మనమందరము అయినట్లుగా, మనము విఫలమైనప్పుడు, ఆయన గుర్తుచేసారు, “ఇదిగో, దేవుడైన నేను, అందరికొరకు వీటన్నటిని అనుభవించాను. వారు పశ్చాత్తాపపడిన యెడల వారు బాధపడనవసరం లేదు.”10

ఎటువంటి అద్భుతమైన బహుమతి! పశ్చాత్తాపం ఒక శిక్ష కాదు; ఇది ఒక ఆధిక్యత. ఇది మనల్ని నడిపించుటకు మరియు మార్గము చూపించుటకు విశేషావకాశం. పశ్చాత్తాపం తప్ప మరిదేనిని మనము బోధించరాదని లేఖనాలు ప్రకటించుటలో ఆశ్చర్యములేదు. 11

పరలోక తండ్రి అనేక వనరులను కలిగియున్నారు, కానీ ఆయన తరచుగా ఒకరికి సహాయం చేయడానికి మరొక వ్యక్తిని ఉపయోగిస్తారు. ప్రతీరోజు ఆయన మనకు నడిపించు, దారి చూపు, మరియు అవసరతలో ఉన్నవారి ప్రక్కన నడుచుటకు అవకాశాలు కల్పిస్తారు. రక్షకుని యొక్క మాదిరిని మనము తప్పక అనుసరించాలి. మనము కుడా పరలోక తండ్రి యొక్క కార్యములో నిమగ్నమవ్వాలి.

యువకులు సాధారణ అధ్యక్షత్వమునుండి, యువకులను నడిపించి, దారి చూపి, మరియు వారి ప్రక్కన నడుచుటలో పరలోక తండ్రి కొరకు తల్లిదండ్రులు మరియు నాయకులు పని చేసినప్పుడు వారు దీవించబడతారని మాకు తెలుసు. ఇతరుల కొరకు పరలోక తండ్రి యొక్క సంరక్షణ పార్సిలులో భాగమగుటకు మనకు సహాయపడు మూడు సూత్రములు12:

మొదట, యువతతో ఉండుము. అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఈ విషయాన్ని నొక్కిచెప్పుతున్నారు: “అక్కడ మనము చేయగల కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి కావచ్చు. సిద్ధాంతమును మనము బోధించుటలో మాటలను ఉపయోగించుట కంటే ఎక్కువ శక్తివంతమైనది, సిద్ధాంతమును జీవించుటలో మన మాదిరులు.”13 యువతను నడిపించుటకు వారితో ఉండాలి. సమర్పించబడిన సమయము ప్రేమ యొక్క వ్యక్తీకరణ, అది మాట, మాదిరి ద్వారా బోధించుటకు మనల్ని అనుమతించును.

రెండవది, నిజంగా యువతకు నడిపించుటకు, మనము వారిని పరలోకముతో సంబంధము కలుగచేయాలి. ప్రతీఒక్కరు ఒంటరిగా నిలబడవలసిన సమయము వస్తుంది. అన్ని సమయాల్లో మరియు అన్ని ప్రదేశాల్లో నడిపించుటకు పరలోక తండ్రి మాత్రమే అక్కడ ఉండగలరు. పరలోక తండ్రి నడిపింపును ఎలా వెదకాలో మన యువత తప్పక తెలుసుకోవాలి.

మూడవది, మనము యువతను తప్పక నడిపించనివ్వాలి. నడవటం నేర్చుకుంటున్న ఒక పసివాని చేతిని పట్టుకొనే ప్రేమగల తల్లిదండ్రుల వలె, యువత అభివృద్ధి చెందుటకు బదులుగా మనము విడిచిపెట్టాలి. యువత నడిపించనిచ్చుటకు సహనము మరియు ప్రేమ అవసరము. అది కష్టమైనది మరియు మనకై మనం చేసేదానికంటె ఎక్కువ సమయము పడుతుంది. మార్గము వెంబడి వారు తొట్రిల్లవచ్చు, కానీ మనము వారి ప్రక్కన నడుస్తాము.

సహోదర, సహోదరిలారా, మన జీవితాలలో నడిపింపు యొక్క దీవెనలు దూరముగా లేక కొదువుగా ఉన్నట్లు కనబడవచ్చు. అటువంటి దుఃఖసమయాలలో, ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ వాగ్దానమిచ్చారు: “మీ వాగ్ధానమును అతి ముఖ్యమైనదిగా మరియు మీ విధేయత ఖచ్చితమైనదిగా ఉండనియ్యుము. అప్పుడు మీ అవసరత ప్రకారము, సందేహించకుండా, విశ్వాసమునందు మీరు అడగవచ్చు. మీరు పని చేసి మరియు గమనించినప్పుడు దేవుడు బలపరచును. ఆయన స్వంత సమయంలో మరియు విధానంలో మీకు తన చేతులు ముందుకు చాచి, ‘నేను ఇక్కడ వున్నాను,’”14 అని చెప్పును.

అటువంటి ఒక సమయంలో, నేను ఒక క్లిష్ట పరిస్థితికి పరిష్కారం కనుగొనడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలము స్థిరమైన మరియు హృదయపూర్వక ప్రార్థన ద్వారా పరలోక తండ్రి యొక్క సలహా కోరాను. పరలోక తండ్రి నిజాయతీగల ప్రార్థనలన్నిటికి న్యాయముగా జవాబిస్తారని నాకు తెలుసు. అయనప్పటికిని ఒకరోజు అటువంటి నిరాశకు చేరుకుని, నేను దేవాలయమునకు ఒక ప్రశ్నతో హాజరైయ్యను: “పరలోక తండ్రి, మీరు నిజంగా శ్రద్ధ చూపుతారా?”

ఆరోజు నేను లోగాన్ యూటా దేవాలయము వెనుక బాగానికి దగ్గరగా ఉన్నవెయింటిగ్ గదిలో కుర్చున్నప్పుడు, నాకు ఆశ్చర్యం కలిగించునట్లు, దేవాలయ అధ్యక్షులు, మా కుటుంబ సన్నిహితులు వాన్ జె. ఫీథర్ స్టోన్ గదిలో ప్రవేశించారు. ఆయన సమూహము యెదుట నిలబడి అందరికి స్వాగతమిచ్చారు. ఆయన దేవాలయ పోషకుల మధ్య నన్ను గమనించి, అయన మాటలను ఆపి, నా కళ్ళులోకి చూసి, తరువాత చెప్పారు, “బ్రదర్ బ్రౌగ్, ఈరోజు దేవాలయములో మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉన్నది. ”

ఆ సాధారణమైన క్షణము యొక్క భావనను నేను ఎన్నడూ మరిచిపోను. ఆ పలకరింపులో-—పరలోక తండ్రి తన చేతులు చాపి స్వాగతించి, “నేను ఇక్కడున్నాను,” అన్నట్లున్నది.

పరలోక తండ్రి నిజముగా శ్రద్ధ తీసుకొనును మరియు ప్రతీ బిడ్డ ప్రార్ధన విని, జవాబిచ్చును.15 ప్రభువు యొక్క సమయములో నా ప్రార్థనలకు జవాబు వస్తాయని ఆయన బిడ్డలలో ఒకరిగా నాకు తెలుసు. ఆ అనుభవం ద్వారా, మనం దేవుని యొక్క పిల్లలమని, ఆయన మనల్ని ఇక్కడకి పంపారని, ఆవిధంగా ఆయన సన్నిధిని అనుభూతి చెందుటకు మరియు ఏదో ఒక రోజు తిరిగి ఆయనతో జీవించడానికి ఆయన మనల్ని ఇక్కడ పంపారని ఎప్పటికంటే ఎక్కువగా నేను గ్రహించాను.

పరలోక తండ్రి మనల్ని నడిపించి, మనకు దారి చూపిస్తారని, మరియు మన ప్రక్కన నడుస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను. మనము ఆయన కుమారుడిని అనుసరించి మరియు ఆయన సేవకులైన అపోస్తులులు, ప్రవక్తల మాటలు వినినప్పుడు, మనము నిత్య జీవితానికి మార్గము కనుగొంటాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.