2010–2019
పాప-నిరోధక తరము
April 2017 General Conference


పాప-నిరోధక తరము

పిల్లలను మీరు బోధించి, నడిపించి, మరియు ప్రేమించినప్పుడు, ధైర్యముగల, పాప-నిరోధకత గల పిల్లలను సృష్టించి, ఆయుధాలు చేపట్టడంలో మీకు సహాయపడునట్లు వ్యక్తిగత బయల్పాటును మీరు పొందగలరు.

ఒకటిన్నర సంవత్సరం క్రితం, “బోధించుటకు మరియు పాప-రహిత తరమును పెంచుటకు సహాయపడవలసిన,” 1 అవసరము గురించి అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మాట్లాడారు. “పాప-నిరోధక తరము,” వాక్యము నాలోని ఆత్మీయ తీగను లోతుగా తాకింది.

పరిశుద్ధంగా మరియు విధేయతగా జీవించుటకు ప్రయాసపడు పిల్లలను మనము గౌరవిస్తాము. ప్రపంచమంతటా అనేకమంది పిల్లల బలమును మనము ప్రత్యక్షంగా చూసాము. పలురకాల ప్రతికూల పరిస్థితులు మరియు వాతావరణములలో వాళ్ళు “నిలకడగాను మరియు స్థిరముగాను,” 2 స్థితి స్థాపకంగా నిలిచి ఉంటారు. ఈ పిల్లలు తమ దైవిక గుర్తింపును గ్రహించారు, వారి కొరకు పరలోక తండ్రి యొక్క ప్రేమను అనుభూతి చెందారు మరియు ఆయన చిత్తమునకు విధేయులగుటకు కోరుతున్నారు.

అయినప్పటికిని, “నిలకడగాను మరియు స్థిరముగాను,” నిలబడుటకు ఇబ్బందిపడుతున్న పిల్లలున్నారు మరియు వారి కోమలమైన మనస్సులు గాయపడినవి.3 వాళ్ళు అన్ని వైపుల “అపవాది యొక్క అగ్ని బాణముల,” చేత ముట్టడి చేయబడ్డారు, ఉపబలము మరియు మద్దతు అవసరమైయున్నారు. 4 క్రీస్తు నొద్దకు మన పిల్లల్ని తెచ్చుటకు మన ప్రయత్నాలందు, అడుగు వేసి, పాపమునకు వ్యతిరేకంగా యుద్ధము చేయుటకు వాళ్ళు మనకు అఖండమైన ప్రేరణగా ఉన్నారు.

దాదాపు 43 సంవత్సరాల క్రితం ఎల్డర్ బ్రూస్ ఆర్. మెఖాంకీ మాటలను వినుము:

“సంఘ సభ్యులుగా, మనము ఒక బలమైన పోరాటములో పూనుకొనియున్నాము. మనము యుద్ధములో ఉన్నాము. లూసిఫర్ కు వ్యతిరేకంగా పోరాడుటకు క్రీస్తు యొక్క హేతువులో మనము చేర్చబడ్డాము. . . .

“అన్ని వైపుల గొప్ప యుద్ధము రేగుచున్నది మరియు దురదృష్టవశాత్తు అనేక మరణాలు కలిగాయి, కొన్ని ప్రాణాంతకమైనవి, అది క్రొత్త కాదు. . .

“ఇప్పుడు ఈ యుద్ధములో తటస్థమైనది ఏదీ లేదు.” 5

పెరిగిన తీవ్రతతో నేడు యుద్ధము కొనసాగుచున్నది. యుద్ధము మనందరిని తాకును, మరియు మన పిల్లలు వ్యతిరేక శక్తులను ఎదుర్కొంటూ యుద్ధరంగములో ఉన్నారు. కావున, మన ఆత్మీయ వ్యూహ్యాలను తీవ్రతరం చేయాల్సిన అవసరత తీవ్రమగుచున్నది.

పాపనిరోధమైన వారిగా పిల్లల్ని బలపరచుట ఒక కార్యము మరియు తల్లిదండ్రులు, తాత మామ్మలు, కుటుంబ సభ్యులు, బోధకులు, మరియు నాయకులకు ఒక దీవెన. మనలో ప్రతిఒక్కరం సహాయపడాల్సిన బాధ్యతను కలిగియున్నాము. అయినప్పటికిని, తల్లిదండ్రులు తమ పిల్లలకు “పశ్చాత్తాపము, జీవముగల దేవుని యొక్క కుమారుడైన క్రీస్తునందు విశ్వాసము, బాప్తీస్మము, మరియు పరిశుద్ధాత్మ యొక్క వరము యొక్క సిద్ధాంతమును గ్రహించుట,” 6 బోధించాలని ప్రభువు ప్రత్యేకంగా ఉపదేశించాడు.

“(మన) పిల్లలు వెలుగు మరియు సత్యమునందు ఎలా పెంచగలము” 7 ప్రతీ కుటుంబము మరియు ప్రతీ బిడ్డ కొరకు వ్యక్తిగతమైనది కనుక ఆ ప్రశ్న కష్టమైనది, కాని మనకు సహాయపడునట్లు పరలోక తండ్రి సార్వత్రిక మార్గదర్శకాలను ఇచ్చెను. మన పిల్లలకు మనము ఆత్మీయంగా చికిత్స చేయు వాక్సిన్ ఇవ్వగల అత్యంత శక్తివంతమైన విధానాలలో ఆత్మ మనల్ని ప్రేరేపించును.

ప్రారంభించుటకు, ఈ బాధ్యత యొక్క ప్రాముఖ్యతను గూర్చి ఒక దర్శనము కలిగియుండుట అనివార్యమైనది. వారెవరు, వాళ్ళు ఎందుకు ఇక్కడున్నారో మన పిల్లలు చూచుటకు మనము సహాయపడకముందు మనది---వారి దైవిక గుర్తింపు మరియు ఉద్దేశమును మనము తప్పక గ్రహించాలి. వాళ్ళు ప్రేమగల పరలోక తండ్రి యొక్క కుమారులు, కుమార్తెలని మరియు వారినుండి ఆయన దివ్యమైన ఆకాంక్షలు కలిగియున్నారని ప్రశ్న లేకుండా వాళ్ళు తెలుసుకొనుటకు సహాయపడాలి.

రెండవది, పాపమును నిరోధించు వారిగా అగుటకు పశ్చాత్తాపము యొక్క సిద్ధాంతమును గ్రహించుట అనివార్యమైనది. పాప-నిరోధముగా ఉండుట, అనగా పాపము లేకుండా ఉండుట అని అర్థముకాదు, కాని అది నిరంతరము పశ్చాత్తాపపడి, అప్రమత్తంగా, ధైర్యంగా ఉండటాన్ని సూచిస్తుంది. బహుశా పాప-నిరోధముగా ఉండుట పలుమార్లు పాపమును నిరోధించుట వలన దీవెనగా వచ్చును. యాకోబు చెప్పినట్లుగా, “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్దనుండి పారిపోవును. ” 8

యౌవన యోధులు “ధైర్యము కొరకు మిక్కిలి శూరులైయుండిరి . . . ; కాని ఇదిగో అంతయు ఇదియే కాదు---వారికి అప్పగించబడిన ఏ విషయమందైనను అన్ని సమయములలో వారు సత్యమైన మనుష్యలైయుండిరి. అవును, వారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుటకు మరియు ఆయన యెదుట యథార్థముగా నడచుటకు బోధింపబడియుండిరి.” 9 ఈ యువకులు వారి దుర్దశలకు వ్యతిరేకంగా ఆయుధములుగా క్రీస్తు వంటి సుగుణములను వహిస్తూ యుద్ధమునకు వెళ్ళారు. “మనలో ప్రతిఒక్కరికి ధైర్యము కొరకు పిలుపు నిరంతరము వస్తుంది. కేవలము చిరస్మరణీయమైన ఘటనల కోసం మాత్రమే కాదు కానీ ఎక్కువ తరచుగా మనము నిర్ణయాలను చేసినప్పుడు లేక మన చుట్టూ ఉన్న పరిస్థితులకు స్పందించుటకు--- ప్రతీరోజు మన జీవితాలకు ధైర్యము అవసరమని,” 10 అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ మనకు గుర్తు చేసారు.

వ్యక్తిగతమైన అనుదిన శిష్యత్వము యొక్క నమూనాలను వారు స్థాపించినప్పుడు, మన పిల్లలు ఆత్మీయ కవచమును ధరిస్తున్నారు. బహుశా అనుదిన శిష్యత్వము యొక్క భావనను గ్రహించే పిల్లల సామర్ధ్యములను మనము తక్కువగా అంచనా వేస్తున్నాము. “చిన్న వయస్సులో ప్రారంభించుము మరియు సిద్ధపడియుండుము,” 11 అని అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ మనకు ఉపదేశించారు. పాపము నిరోధించువారిగా అగుటకు పిల్లలకు సహాయపడుటకు మూడవ ముఖ్యమైనది, లేఖనాలు, విశ్వాస ప్రమాణములు, యౌవనుల బలము కొరకు కరపత్రము, ప్రాథమిక పాటలు, కీర్తనలు, మరియు మన స్వంత వ్యక్తిగత సాక్ష్యముల నుండి---ముఖ్యమైన సువార్త సిద్ధాంతాలను మరియు సూత్రములతో ప్రేమగా వారి మనస్సులో చొప్పించుటకు చాలా చిన్న వయస్సుల నుండి ప్రారంభించుట.

ప్రార్థన, లేఖన అధ్యయనము, కుటుంబ గృహ సాయంకాలము, మరియు సబ్బాతును ఆరాధించు ఏకరీతిగల అలవాట్లు సంపూర్ణత, అంతర్గత స్థిరత్వము, మరియు బలమైన నైతిక విలువలకు---మరొక మాటలలో, ఆధ్యాత్మిక చిత్తశుద్ధికి నడిపించును. చిత్తశుద్ధి అంతా అదృశ్యమైన నేటి ప్రపంచములో, బాప్తీస్మము మరియు దేవాలయములో పరిశుద్ధ నిబంధనలు చేసి పాటించుటకు మనము వారిని సిద్ధపరచినప్పుడు, మన పిల్లలు నిజమైన చిత్తశుద్ధి ఏది, అది ఎందుకు ముఖ్యమైనది గ్రహించుటకు అర్హులు. నా సువార్తను ప్రకటించుడి బోధించినట్లుగా, “ఒడంబడికలను పాటించుట జనులను (చిన్న పిల్లలు కలిపి) పరిశుద్ధ నిబంధనలు చేసి పాటించుటకు సిద్ధపరచును.” 12

“నిబంధన పాటించుట గురించి మాట్లాడినప్పుడు, మనము మర్త్యత్వములో మన అత్యంత ప్రధాన ఉద్దేశ్యము గురించి మాట్లాడుచున్నాము,” 13 అని ఎల్డర్ జెఫ్రి ఆర్. హాల్లండ్ బోధించారు. మన పరలోకపు తండ్రితో నిబంధనలు చేసి, పాటించుటలో అసాధారణమైన శక్తి ఉన్నది. అపవాది దానిని ఎరుగును, కనుక అతడు నిబంధన చేయు భావనను అస్పష్టంగా చేసాడు.14 పిల్లలు పరిశుద్ధ నిబంధనలు చేసి, పాటించుటను గ్రహించుటకు సహాయపడుట పాప-నిరోధక తరమును సృష్టించుటలో కీలకమైనది.

నిబంధన బాట వెంబడి వారు ప్రవేశించి మరియు పురోభివృద్ధి చెందినప్పుడు, మన పిల్లలు పరిశుద్ధ నిబంధనలు చేసి, పాటించుటకు మనము ఎలా సిద్ధపరుస్తాము? పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు సాధారణమైన వాగ్దానములను పాటించుటను బోధించుట జీవితంలో తరువాత పరిశుద్ధ నిబంధనలను పాటించుటకు వారిని శక్తివంతులుగా చేయును.

ఒక సాధారణమైన మాదిరి నేను మీతో పంచుకుంటాను: కుటుంబ గృహ సాయంకాలములో ఒక తండ్రి అడిగాడు, “కుటుంబముగా మనము ఎలా ఉన్నాము?” తన అన్న కెవిన్, తనను ఎక్కువగా విసిగిస్తున్నాడని, తన భావనలను గాయపరుస్తున్నాడని ఐదు సంవత్సరాల లిజ్జి ఫిర్యాదు చేసింది. లిజ్జి చెప్పింది సరైనదని కెవిన్ అయిష్టంగా అంగీకరించాడు. తన చెల్లితో సఖ్యతగా ఉండటానికి అతడేమి చేయగలడని కెవిన్ తల్లి అతడిని అడిగింది. కెవిన్ ఆలోచించి, తాను ఒకరోజంతా విసిగించకుండా ఉంటానని లిజ్జికి వాగ్దానమిస్తానని అతడు నిర్ణయించాడు.

మరుసటి రోజు ముగింపులో, కుటుంబ ప్రార్థన కొరకు ప్రతీఒక్కరు సమావేశమైనప్పుడు, కెవిన్ తండ్రి ఎలా చేసాడని అతడిని అడిగాడు. “నాన్నా, నేను నా వాగ్దానాన్ని నిలుపుకున్నాను!” మరియు లిజ్జి సంతోషంగా అంగీకరించింది, మరియు కుటుంబము కెవిన్ ను అభినందించింది.

అతడు తన వాగ్దానాన్ని ఒకరోజు నిలుపుకుంటే, అతడు రెండు రోజులు ఎందుకు చెయ్యలేడని కెవిన్ తల్లి అతడిని అడిగింది? మరలా ప్రయత్నించుటకు కెవిన్ అంగీకరించాడు. రెండు రోజులు గడిచాయి, కెవిన్ తన వాగ్దానాన్ని విజయవంతంగా నిలుపుకున్నాడు, మరియు లిజ్జి ఇంకా ఎక్కువ కృతజ్ఞత కలిగియున్నది! తన వాగ్దానాలను చాలా బాగా ఎందుకు కాపాడుకున్నావని అతడి తండ్రి అడిగినప్పుడు, “నేను చేస్తానని చెప్పాను కనుక నా వాగ్దానమును నేను నిలుపుకున్నాను,” కెవిన్ చెప్పాడు.

చిన్నవి, విజయవంతంగా కాపాడబడిన వాగ్దానముల పరంపర చిత్తశుద్ధికి నడిపించును. వాగ్దానమును నిలుపుకొనే ఎడతెగని ఆభ్యాసము పిల్లలు తమ మొదటి నిబంధనలైన బాప్తీస్మము మరియు పరిశుద్ధాత్మ వరమును పొందుటకు ఆత్మీయ సిద్ధపాటు, అక్కడ వాళ్ళు దేవునిని సేవించుటకు మరియు ఆయన ఆజ్ఞలు పాటించుటకు నిబంధన చేస్తారు.15 వాగ్దానములు మరియు నిబంధనలు వేరుచేయలేనివి.

“దానియేలు గ్రంధములో, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు నెబుకద్నెజరు విగ్రహమును పూజించుటకు తిరస్కరించుట గురించి మనము నేర్చుకున్నాము. 16 వారు సమ్మతించని యెడల, మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారని రాజు వారికి హెచ్చరించాడు. వాళ్ళు తిరస్కరించారు:

“మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్ధుడు. …

“ఒకవేళ, ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపము.”17

“ఒకవేళ, ”ఈ మాటల అర్థమును మరియు నిబంధనలు పాటించుటలో ఎలా సంబంధిస్తాయో పరిశీలించుము. ఈ ముగ్గురు యువకులు తాము విడిపించుబడుటపై వారి విధేయతను ఆధారం చేయలేదు. వారు విడిపించబడక పోయినా, వారు చేస్తానని చెప్పారు కనుక ప్రభువుకు వారి వాగ్దానమును నిలుపుకుంటారు. మన నిబంధనలు పాటించుట ఎల్లప్పుడు మన పరిస్థితి నుండి స్వతంత్రమైనది. యౌవన యోధుల వలె ఈ ముగ్గురు యువకులు, మన పిల్లల కొరకు పాప-నిరోధకతగల అద్భుతమైన మాదిరులుగా ఉన్నారు.

ఈ మాదిరులు మన గృహాలు మరియు కుటుంబాలకు ఎలా అన్వయిస్తాయి? “వరుస వెంబడి వరుస, సూత్రము వెంబడి సూత్రము”18 చిన్నముక్కలుగా విజయాన్ని రుచి చూచుటకు పిల్లలకు మనము సహాయపడతాము. వారు తమ వాగ్దానాలను నిలుపుకొన్నప్పుడు, వారు తమ జీవితాలలో ఆత్మను అనుభవిస్తారు. “చిత్తశుద్ధి కొరకు సంపూర్ణమైన ప్రతిఫలము పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసమును కలిగియుండుట” 19 అని ఎల్డర్ జోసఫ్ బి. వర్తలిన్ బోధించారు. అప్పుడు మన పిల్లల యొక్క “విశ్వాసము దేవుని సన్నిధిలో బలమైనదగును. ”20 చిత్తశుద్ధిగల బావి నుండి బలవంతులైన పాప-నిరోధక తరము ఉద్భవించును.

సహోదర, సహోదరిలారా, ప్రతీరోజు మతపరమైన మీ ప్రవర్తన వారు చూచి, మీ వాగ్దానములు మరియు నిబంధనలు పాటించుట వారు చూచునట్లు మీ చిన్నవారిని దగ్గరగా—చాలా దగ్గరగా పట్టుకొనుము. “పిల్లలు గొప్పగా అనుకరిస్తారు, కనుక వారు అనుకరించుటకు ఏదైన గొప్పది ఇవ్వుము.” 21 వాస్తవానికి మనము వాగ్దానము ద్వారా వాగ్దానము, నిబంధన ద్వారా నిబంధన ప్రభువుకు పాప-నిరోధకమైన తరమును పెంచుటకు మరియు బోధించుటకు సహాయపడుచున్నాము.

యేసు క్రీస్తు ఈ సంఘమును నడిపిస్తున్నాడని నేను సాక్ష్యమిస్తున్నాను. రక్షకుని విధానములో పిల్లలను మీరు ప్రేమించి, నడిపించి, మరియు ప్రేమించినప్పుడు, మీరు వ్యక్తిగత బయల్పాటు పొందగలరు, అది పాప-నిరోధకమైన పిల్లలను సృష్టించి, ఆయుధమిచ్చి, ధైర్యవంతులుగా చేయటంలో మీకు సహాయపడును. మన పిల్లలు నీఫై మాటలను ప్రతి ధ్వనించాలని నా ప్రార్ధన: “పాపము యొక్క దృశ్యమునకు నేను వణకునట్లు నీవు నన్ను చేయవా?” 22 లోక పాపముల కొరకు రక్షకుడు ప్రాయశ్చిత్తము చేసాడని23— నేను సాక్ష్యమిస్తున్నాను—ఎందుకనగా ఆయన చేస్తానని చెప్పాడు, మరియు మర్త్యులమైన మనము గ్రహింపును మించి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు24--- ఎందుకనగా ఆయన చేస్తానని చెప్పాడు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.