2010–2019
ఆయన మీతో చెప్పునది చేయుడి
April 2017 General Conference


ఆయన మీతో చెప్పునది చేయుడి

“(దేవుడు) మనతో చెప్పునది” చేయుటకు మనము నిర్ణయించినప్పుడు, దేవుని చిత్తముతో మన దైనందిన ప్రవర్తనను సర్దుబాటు చేయుటకు మనము నిజముగా ఒడంబడిక చేస్తున్నాము.

ఆయన యొక్క మొదట నమోదు చేయబడిన అద్భుతమును రక్షకుడు గలిలయ యొక్క కానాలో వివాహ విందు వద్ద నెరవేర్చాడు. ఆయన తల్లి, మరియ, అదేవిధంగా ఆయన శిష్యులు అక్కడున్నారు. విందు సఫలత కొరకు కొంత బాధ్యతను స్పష్టంగా మరియ భావించింది. వేడుక యందు, ఒక సమస్య కలిగింది—వివాహ ఆతిధ్యమిచ్చువారి యొద్ద ద్రాక్షరసము అయిపోయింది. మరియ ఆందోళన చెంది, యేసు వద్దకు వెళ్ళింది. వారు క్లుప్తంగా మాట్లాడుకున్నారు, తరువాత మరియ సేవకుల వైపు తిరిగి, చెప్పింది:

“ఆయన మీతో చెప్పునది చేయుడి.

“(ఈ బానలు త్రాగే నీరు నిల్వచేయటానికి ఉపయోగించేవారు కానీ యూదుల శుద్దీకరణాచార కొరకు ఉపయోగించబడినవి) . . . ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను.

“యేసు—ఆ బానలు నీళ్ళతో నింపుడని (సేవకులకు) చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి.

“అప్పుడాయన వారితో—మీరిప్పుడు, ముంచి విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి.

“ఆ ద్రాక్షారసమైన ఆ నీళ్ళు రుచి చూచినప్పుడు, ఆ విందు ప్రధాని,” విందులో చివరి వరకు మంచి ద్రాక్షరసము ఇవ్వబడిందని ఆశ్చర్యము వ్యక్తపరిచాడు. 1

నీళ్ళను ద్రాక్షరసముగా మార్చటం దేవుని శక్తి యొక్క నిరూపణ---అది ఒక అద్భుతము కనుక మనము సాధారణంగా ఈ సంఘటనను గుర్తుంచుకుంటాము. అది ఒక ముఖ్యమైన సందేశము, కాని యోహాను వృత్తాంతములో మరొక ముఖ్యమైన సందేశమున్నది. మరియ “ఒక అమూల్యమైన మరియు ఎన్నుకొనబడిన పాత్ర,” 2 దేవుని యొక్క కుమారునికి జన్మనిచ్చి, పోషించి, మరియు పెంచుటకు దేవుని చేత పిలవబడింది. భూమిమీద ఎవరికంటె ఎక్కువగా ఆయన గురించి ఆమె ఎరుగును. ఆయన అద్భుతమైన జననము గురించి సత్యమును ఆమె ఎరుగును. ఆయన పాపరహితుడు అని మరియు “ఇతరుల వలె మాట్లాడలేదు, లేక ఆయన బోధింపబడలేదు, ఏలయనగా ఏ వ్యక్తి ఆయనకు బోధింపనవసరం లేదు,” 3 అని ఆమె ఎరుగును. వివాహ విందు కొరకు ద్రాక్షారసమును అందించుట వ్యక్తిగతంగా చూసినది కలిపి, సమస్యలకు పరిష్కరించు ఆయన అసాధారణమైన సామర్ధ్యమును ఆమె ఎరుగును. ఆయన తల్లిగా, ఆమె ఆయనయందు మరియు ఆయన దైవిక శక్తియందు స్థిరమైన విశ్వాసమును కలిగియున్నది. సేవకులకు ఆమె సాధారణమైన, సూటియైన సూచన షరతులు, అర్హతలు, హద్దులను కలిగిలేదు: “ఆయన మీతో చెప్పునది చేయుడి.”

గబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమైనప్పుడు, ఆమె యువతిగా ఉన్నది. మొదట ఆమె “దయాప్రాప్తురాలా,” “నీకు శుభము. . . ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను” ఆ మాటకు ఆమె “బహుగా తొందరపడి—ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండెను.” మరియు గబ్రియేలు దూత ఆమెను భయపడవద్దని—తాను తెచ్చిన వార్త మంచిదని గబ్రియేలు అభయమిచ్చాడు. ఆమె “గొప్పవాడైన సర్వోన్నతుని కుమారుని, . . . (తన) గర్భమున ధరించి” మరియు “ఒక కుమారుని కనును. . . (ఆయన) యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును.”

“నేను పురుషుని ఎరుగనిదాననే, యిదేలాగు జరుగును,” అని మరియ బిగ్గరగా ఆలోచించింది.

“దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు,” అని క్లుప్తంగా, రూఢిపరుస్తూ దూత ఆమెకు వివరించాడు.

ప్రత్యేకతలు తెలుసుకోకుండా మరియు నిస్సందేహంగా తన జీవితానికి చిక్కులు గురించి లెక్కలేనన్ని ప్రశ్నలు ఉన్నప్పటికిని, దేవుడు అడిగినది చేయుటకు తాను సిద్ధంగా ఉన్నానని మరియ సవినయంగా స్పందించింది. ఆయన ఆమెనుండి ఎందుకు అడుగుచున్నాడు లేక విషయాలు ఎలా జరుగుతాయో ఖచ్చితంగా గ్రహించనప్పటికిని ఆమె తనను తాను ఒడంబడిక చేసుకున్నది. ముందున్న దాని గురించి స్వల్ప జ్ఞానముతో, షరతులు లేకుండా మరియు ముందుగా ఆమె దేవుని చిత్తమును అంగీకరించింది. 4 దేవునియందు సరళమైన నమ్మకముతో, మరియ అన్నది, “ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక.” 5

“(దేవుడు) మనతో చెప్పునది,” చేయుటకు మనము నిర్ణయించినప్పుడు, దేవుని చిత్తముతో మన అనుదిన ప్రవర్తనను సర్దుకోవటానికి మనము ఆతృతగా ఒడంబడిక చేసుకుంటాము. లేఖనాలు చదువుట, క్రమముగా ఉపవాసము చేయుట, మరియు నిజమైన ఉద్దేశముతో ప్రార్థన చేయుట వంటి సాధారణమైన విశ్వాసపూరిత క్రియలు మర్త్యత్వము యొక్క డిమాండ్లను ఎదుర్కొనుటకు ఆత్మీయ సామర్ధ్యమును బలోపేతం చేస్తాయి. కాలక్రమేణా, విశ్వాసము యొక్క సాధారణమైన అలవాట్లు అద్భుతమైన ఫలితాలకు నడిపిస్తాయి. అవి మన విశ్వాసమును విత్తనము నుండి మన జీవితాలలో మేలు కొరకు శక్తివంతమైన శక్తిగా మారుస్తాయి. తరువాత, మన మార్గములో సవాళ్ళు కలిగినప్పుడు, క్రీస్తునందు వేరుపడియుండుట, మన ఆత్మల కొరకు స్థిరత్వమునిచ్చును. దేవుడు మన బలహీనతలను తీరానికి తెచ్చి, మన సంతోషాలను హెచ్చించి, మరియు “(మనకు) మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునట్లు,” 6 చేయును.

కొన్ని సంవత్సరాల క్రితం, తన వార్డు సభ్యులకు సలహా ఇస్తూ, ప్రతీవారము గంటలు గడుపుతున్న యువ బిషప్పుతో నేను మాట్లాడాను. అతను ఒక పరిశీలించదగిన గమనింపు చేసాడు. తన వార్డు సభ్యులు ఎదుర్కొన్న సమస్యలు, ప్రతీచోటా—సంఘ సభ్యుల చేత ఎదుర్కొనబడుచున్నవేనని అతను చెప్పాడు, అవి---సంతోషకరమైన వివాహమును ఎలా స్థాపించాలి; పని, కుటుంబము, మరియు సంఘ బాధ్యతలను సమీకరించుటలో ఇబ్బందులు; బుద్ధి వాక్యముతో, ఒక ఉద్యోగముతో, లేక అశ్లీలచిత్రములతో సవాళ్ళు; లేక సంఘ నియమము లేక వారికి అర్ధము కాని చరిత్రకు చెందిన ప్రశ్నగురించి సమాధానమును పొందుటకు ఇబ్బందిపడుట.

వార్డు సభ్యులకు అతని సలహా చాలా తరచుగా విశ్వాసము యొక్క సాధారణమైన ఆచరణలకు తిరిగి వెళ్ళుటను కలిగియున్నది, అవి అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ సలహా ఇచ్చినట్లుగా, ప్రతీరోజు మోర్మన్ గ్రంధమును చదువుట,---దశమ భాగము చెల్లించుట మరియు సంఘములో అంకితభావముతో సేవ చేయుట. అయినప్పటికిని, తరచుగా అతనికి వారిచ్చే స్పందన సంశయములో ఒకటి. “బిషప్పు, నేను మీతో అంగీకరించను. అవన్నీ చేయటానికి మంచి విషయాలని మనందరికి తెలుసు. సంఘములో అన్ని సమయాలలో ఆ విషయాలను మనము మాట్లాడతాము. కాని మీరు నన్ను అర్థము చేసుకోవటం లేదని నేను అనుకుంటున్నాను. వీటిని చేయుట నేను ఎదుర్కొన్న సమస్యలతో ఏ సంబంధాన్ని కలిగియున్నది?”

ఇది న్యాయమైన ప్రశ్న. “చిన్న మరియు సాధారణమైన వస్తువులను,” 7— చేయుటను గూర్చి ఉద్దేశపూర్వకంగా ఉండి---స్వల్ప విధానాలలో విధేయులగుచున్నవారు---విధేయత దానికదే వాస్తవమైన క్రియలను మరియు వాస్తవానికి, వారికి పూర్తిగా సంబంధములేనిదిగా కనబడు వాటిని దాటి వెళ్ళుటకు విశ్వాసము మరియు బలముతో దీవించబడుచున్నారని కాలక్రమేణా, ఆ యౌవన బిషప్పు, నేను గమనించాము. ముఖ్యమైన అనుదిన చర్యలలో విధేయత మరియు మనము ఎదుర్కొను పెద్ద చిక్కైన సమస్యలకు పరిష్కారముల మధ్య సంబంధమును చూచుట కష్టమైనదిగా కనబడవచ్చు. కానీ అవన్నీ సంబంధము కలిగియున్నవి. నా అభిప్రాయములో, ప్రతీరోజు విశ్వాసము యొక్క అలవాట్లు సరిగా చేయుట, జీవితపు కష్టాలకు వ్యతిరేకంగా మనల్ని మనం బలపరచుకొనుటకు ఏకైక శ్రేష్టమైన విధానము. విశ్వాసము యొక్క స్వల్ప క్రియలు, అవి ముఖ్యమైనవి కానివిగా, లేక మనల్ని విసిగించు ప్రత్యేక సమస్యలు నుండి పూర్తిగా సంబంధము లేనివిగా కనబడినప్పటికిని, మనము చేయు సమస్తములో మనల్ని దీవించును.

నయమానును పరిగణించుము, “సిరియా . . . దండుకు సైన్యాధిపతి,” మరియు “మహా పరాక్రమశాలి,” మరియు ఒక కుష్ఠరోగి. ఒక పరిచారకురాలు ఇశ్రాయేలులో ప్రవక్త నయమానును స్వస్థపరచగలడని చెప్పింది, కనుక అతడు సేవకులు, సైనికుల రక్షణ దళముతో మరియు ఇశ్రాయేలుకు బహుమానములతో ప్రయాణించి, చివరకు ఎలీషా ఇంటికి చేరాడు. ఎలీషా కాకుండా, ఎలీషా సేవకుడు “యొర్దాను నదికి పోయి యేడు మారులు స్నానము చేయుము,” అన్న యజమాని ఆజ్ఞను నయమానుకు తెలిపాడు. ఒక సాధారణమైన విషయము. ఈ సాధారణమైన ఔషద చికిత్స ఆ మహా పరాక్రమశాలిని, చాలా తర్కవిరుద్ధమైనది, సరళమైనది, లేక అతడి గౌరవమును తగ్గించేదిగా గాయపరచియుండవచ్చు, ఆలాగున అతడు సూచన కేవలం కోపం తెప్పించేదిగా కనుగొన్నాడు. కనీసము, ఎలీషా యొక్క సూచన నయమానుకు అర్ధవంతమైనదిగా కనబడలేదు, “అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయెను.”

కాని నయమాను సేవకులు అతడిని నెమ్మదిగా సమీపించారు, మరియు ఎలీషా “యేదైన గొప్ప కార్యము,” చేయమని అతడిని అడిగిన యెడల, అతడు చేసియుండేవాడని గమనించారు. అతడు స్వల్పమైన, పని చేయమని మాత్రమే అడగబడ్డాడు కనుక ఎందుకో అతడు గ్రహించనప్పటికిని, అతడు చేయవద్దా అని గమనించారు. నయమాను తన స్పందనను తిరిగి ఆలోచించాడు, బహుశా సంశయముగా, కానీ విధేయతగా, “పోయి. . . యొర్దానులో ఏడు మారులు మునుగగా,” అద్భుతరీతిలో స్వస్థపరచబడ్డాడు. 8

విధేయత యొక్క కొన్ని ప్రతిఫలాలు త్వరగా వస్తాయి, మిగిలినవి మనము పరీక్షించబడిన తరువాత మాత్రమే వస్తాయి. అమూల్యమైన ముత్యములో, బలులు అర్పించుటకు ఆజ్ఞలను పాటించుటలో ఆదాము యొక్క అవిరామ శ్రద్ధ గురించి మనము చదివాము. ఆదాము ఎందుకు బలులు అర్పిస్తున్నాడని దూత చేత అడగబడినప్పుడు, “నాకు తెలియదు,” “ప్రభువు నాకు ఆజ్ఞాపించాడు,” అని అతడు జవాబిచ్చాడు. అతడు అర్పించు బలులు “తండ్రి యొక్క అద్వితీయుని యొక్క త్యాగమును పోలియున్నది,” అని దూత వివరించింది. కాని ఆ బలులు ఎందుకు అర్పించాలో తెలియకుండా “అనేక రోజులుగా,” ప్రభువుకు విధేయుడగుటకు తన నిబద్ధతను ఆదాము చూపిన తరువాత మాత్రమే, ఆ వివరణ వచ్చెను. 9

ఆయన సువార్తకు మన స్థిరమైన విధేయత మరియు సంఘమునకు యదార్ధత కొరకు దేవుడు మనల్ని ఎల్లప్పుడు దీవించును, కాని ఆయన ముందుగా ఆవిధంగా చేయుటకు ఆయన కాలపట్టికను మనకు అరుదుగా చూపిస్తాడు. ఆరంభం నుండి మొత్తము చిత్రాన్ని ఆయన మనకు చూపించడు. అక్కడే విశ్వాసము, నిరీక్షణ, మరియు ప్రభువుయందు నమ్మకము వచ్చును.

ఆయనను భరించి—ఆయనను నమ్మి మరియు ఆయనను వెంబడించాలని దేవుడు మనల్ని అడుగుతున్నారు. “మీరు చూడనందుకు, వివాదమాడవద్దని” ఆయన మనల్ని వేడుకుంటున్నారు. మనము సులభమైన జవాబులు లేక శీఘ్రపరిష్కారమునే ఆశించరాదని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నారు. సహించుటకు ఆ పరీక్ష ఎంత కష్టమైనది లేక జవాబు ఎంత నిదానముగా వచ్చినప్పటికిని, “(మన) విశ్వాసము యొక్క పరీక్ష,” కాలమందు మనము స్థిరముగా ఉన్నప్పుడు విషయాలు జరుగుతాయి. 10 నేను “అంధ విధేయత,” 11 గురించి మాట్లాడుటలేదు, కాని ప్రభువు యొక్క పరిపూర్ణమైన ప్రేమ మరియు పరిపూర్ణమైన సమయమునందు ఆలోచనాపూర్వకమైన విశ్వాసము గురించి మాట్లాడుతున్నాను.

మన విశ్వాసము యొక్క పరీక్ష ఎల్లప్పుడు విశ్వాసము యొక్క సాధారణమైన దైనందిన ఆచరణలకు యదార్ధముగా నిలిచియుండుటను కలిపియున్నది. తరువాత, తరువాత మాత్రమే మనము ఆపేక్షిస్తున్న దైవిక స్పందనను మనము పొందుతామని ఆయన వాగ్దానమిచ్చాడు. ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా అని తెలుసుకోవాలని డిమాండు చేయకుండా ఆయన అడిగిన దానికి మన సమ్మతిని రుజువు చేసిన తరువాత మాత్రమే మనము “(మన) విశ్వాసము, (మన) శ్రద్ధ, మరియు సహనము, దీర్ఘ శాంతము యొక్క ప్రతిఫలములను పొందుతాము.” 12 నిజమైన విధేయత దేవుని ఆజ్ఞలను షరతులు లేకుండా మరియు ముందుగా అంగీకరించును. 13

ప్రతీరోజు, ఉద్దేశపూర్వకంగా లేక మరొకవిధంగా, “(మనము) ఎవరిని సేవిస్తామో,” 14 మనమందరము ఎన్నుకుంటాము. విశ్వాసముగా సమర్పణగల అనుదిన చర్యలు చేయుటకు పూనుకొనుట ద్వారా, ప్రభువుకు సేవ చేయుటకు మన తీర్మానమును రుజువు చేస్తాము. ప్రభువు మన మార్గములను15 నడిపిస్తానని వాగ్దానమిచ్చాడు, కాని ఆయన దానిని చేయుటకు, ఆయనే “మార్గము,” 16 కనుక ఆయన మార్గము ఎరుగునని నమ్ముతూ, మనము నడవాలి. మనము మన స్వంత బానలను అంచుల వరకు నింపాలి. మనము ఆయనను నమ్మి, వెంబడించినప్పుడు, నీళ్ళ నుండి ద్రాక్షారసము వలె, మన జీవితాలు మార్చబడతాయి. మరొకవిధంగా ఎప్పటికీ కాలేకపోయిన దానికంటే ఎక్కువగా, ఉత్తమంగా మనము ఏదైన కాగలము. ప్రభువుయందు నమ్మకముంచుము, మరియు “ఆయన మీతో చెప్పు దానిని, చేయుడి,” యేసు క్రీస్తు నామములో, ఆమేన్.