2010–2019
దృఢసంకల్పము కలిగియుండుము మరియు పూర్తిగా కట్టుబడియుండుము
April 2017 General Conference


దృఢసంకల్పము కలిగియుండుము మరియు పూర్తిగా కట్టుబడియుండుము

గొప్ప నిరీక్షణ మరియు విశ్వాసముతో ఎదురుచూస్తూ, అవసరమైతే మన మార్గమును తిరిగి మార్చుకొందుముగాక. సాహసముగా ఉండుట ద్వారా “దృఢసంకల్పము కలిగి” పూర్తిగా “కట్టుబడియుందుము గాక. ”

కొన్ని సంవత్సరముల క్రితం మా చిన్న మనవరాలు నా వద్దకు పరిగెత్తుకుని వచ్చి ఉత్సాహముతో ఇలా ప్రకటించింది. “తాతయ్య, తాతయ్య ఈరోజు నేను నా సాకర్ ఆటలో మొత్తము మూడు గోల్స్ అన్నీ పూర్తిచేశాను! ”

“అది గొప్ప విషయము శారా! ” అని నేను ఉత్సాహంగా సమాధానమిచ్చాను.

ఆమె తల్లి నా వైపు చూసి హాస్యస్పదముగా అన్నది, “ఆ స్కోరు రె౦డు ఒకటి పాయి౦ట్లు.”

నేను ఎవరు గెలిచారు అని అడిగే ధైర్యము చేయలేదు!

సర్వ సభ్య సమావేశము పరివర్తనము, బయల్పాటు మరియు కొన్నిసార్లు తిరిగి మార్గమువైపు వచ్చే సమయము.

ఒక వాహనములు అద్దెకు ఇచ్చే వ్యాపార సంస్థ వారి యొద్ద ఎన్నడును దారితప్పిపోవద్దు, అని పిలవబడిన జిపిఎస్ సాధనమున్నది. మీరు చేరవలసిన గమ్యమునకు ఒకసారి ఉంచాక మీరు తప్పు మలుపు తిరిగితే, నడిపించే స్వరము, “నీవు మూర్ఖుడివి!” అని చెప్పదు. బదులుగా, చాలా మృదువైన స్వరములో, “మార్గమును తిరిగి లెక్కించబడుతున్నది----సాధ్యమైనప్పుడు, యధావిధిగా యు మలుపు త్రిప్పుము!” అని చెప్పును.

యెహెజ్కేలు గ్రంధము లో ఈ అద్భుతమైన వాగ్దానమును మనము చదువుతాము:

“అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన యెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును. ”

“అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు.” 1

ఎంతటి అద్భుతమైన వాగ్దానము, కానీ వాగ్దానము పొందుటకు దీనికి రెండుక్రియలు పూర్తి చేయుట అవసరము. అన్నిటి నుండి మరలుము; అన్నిటిని అనుసరించుము; అప్పుడు అన్ని క్షమించబడును. దీనికి పూర్తి నిబద్ధులైయుండుట అవసరము.

వాల్ స్ట్రీట్ జర్నల్లోచెప్పిన వ్యక్తివలే మనము ఉండకూడదు, అతడు ఒక కవరును డబ్బుతో నింపి దానిలో ఒక అజ్ఞాత ఉత్తరం రాసి ఇంటర్నల్ రెవెన్యూ సేవకు పంపించెను, దానిలో ఇలా ఉన్నది, “ప్రియమైన ఐఆర్ఎస్: నేను బకాయి ఉన్న గత పన్నులకు దయచేసి డబ్బు తీసుకొనుము. గమనిక. ఈ డబ్బు పంపిన తరువాత కూడా ఒకవేళ నా మనస్సాక్షి నన్ను కలవరపెడితే, నేను మిగిలింది కూడా పంపిస్తాను. ”2

మన జీవితాలను మనము ఇలా జీవించము.! మనము తీర్పును తప్పించుకొనుటకు మనము చేయగలది మొత్తము చెల్లించాల్సిన చోట, కనీసము ఇస్తే సరిపోతుంది అని చూడకూడదు. ప్రభువుకు సమ్మతించు హృదయము మరియు మనస్సు అవసరము.3 మన పూర్ణ హృదయము! మనము బాప్తీస్మము పొందినప్పుడు, సగము మనస్సుతో కాకుండా సంపూర్ణముగా రక్షకుని వెంబడించుటకు మన వాగ్దానము యొక్క చిహ్నముగా మనము పూర్తిగా ముంచబడతాము. మనము పూర్తిగా కట్టుబడి ఉన్నప్పుడు మరియు “అన్నిటిని,” ఇచ్చినప్పుడు, దేవుడు తన శక్తిని ప్రత్యక్షపరచును మరియు మనల్ని దీవించును.4 మనము నులివెచ్చగా లేక కేవలము సగము ఒడంబడిక చేసినప్పుడు, దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలు పొందుటకు విఫలమవుతాము. 5

అనేక సంవత్సరముల క్రితము, నేను స్కౌట్ లను ఎడారిలో శిబిరాలకు తీసుకునివెళ్ళాను. వారు చేసిన పెద్ద మంట వద్ద వారు పడుకున్నారు, మరియు అందరిలాంటి మంచి స్కౌట్ నాయకుడిలాగా నేను కూడా నా ట్రక్ వెనుక భాగములో పడుకున్నాను. ఉదయాన్నే, నేను లేచి కూర్చోని శిబిరాల వైపు చూసాను, అతడిని పౌల్ అని పిలుస్తాను, అతను ప్రత్యేకంగా రాత్రి నిద్రపోనట్లుగా కనిపిస్తున్నాడు. ఎలా నిద్రపోయావని నేను అడిగినప్పుడు, అతడు “అంత మంచిగా కాదు” అని సమధానమిచ్చాడు.

ఎందుకు అని నేను అడిగినప్పుడు అతను, “నాకు చలిగా ఉన్నది; మంట ఆగిపోయింది. ”

నేను ఇలా జవాబిచ్చాను, “అవును, మంటలు అలానే ఆరిపోతాయి. నీవు పడుకునే సంచి వెచ్చగా లేదా?

జవాబులేదు.

అప్పుడు మిగిలిన స్కౌట్ లలో ఒకరు బిగ్గరగా వివరించాడు, “అతడు పడుకునే సంచిని వాడలేదు. ”

ఆశ్చర్యపడుతూ నేను అడిగాను, “పౌల్ ఎందుకు వాడలేదు? ”

నిశబ్దం---తరువాత చివరికి ఇబ్బందిపడిన జవాబు వచ్చింది: “అవును, నేను పడుకునే సంచిని విప్పకుండా ఉండినట్లైతే మరలా దాన్ని మడతపెట్టవలసిన పని ఉండదని నేను అనుకున్నాను.”

నిజమైన కథ: అయిదు నిమిషాల పనిని చేయకుండా ప్రయత్నించాడు కనుక అతడు కొన్ని గంటలు చలిలో ఉన్నాడు. మనము ఇలా ఆలోచించవచ్చు, “ఎంత మూర్ఖత్వము! ఎప్పుడైన ఎవరు ఆలా చేస్తారు?” సరే, ఇంకా చాలా అపాయకరమైన విధానాలలో మనము దానిని అన్ని సమయాలలో చేస్తాము. మనము ఎప్పుడైతే నిజాయితీగా ప్రార్థనచేసి, చదివి, మరియు మనఃపూర్వకంగా సువార్తను ప్రతిరోజూ జీవించుటకు సమయాన్ని తీసుకోనప్పుడు, మన ఆత్మీయ నిద్ర సంచులను తెరవటానికి మనము తిరస్కరిస్తున్నాము; మంట ఆగిపోవడమే మాత్రమే కాదు కాని మనము భద్రత లేనివారిగా ఉంటాము మరియు ఆత్మీయంగా చల్లగా అవుతాము.

మన నిబంధనలతో మనము తృప్తి చెంది సాధ్యమైన అపాయములను గ్రహించనప్పుడు, మనము పర్యవసానములకు బాధ్యులము. “మన గురించి మనము జాగ్రత్త వహించి, నిత్య జీవపు మాటలను శ్రద్ధగా లక్ష్యముంచమని, ”6 ప్రభువు మనకు ఉపదేశించారు. “మనము ఆయనను ఆలకించని యెడల ఆయన రక్తము మనల్ని శుద్ధీకరించదు”7 అని ఇంకను ఆయన ప్రకటించాడు.

వాస్తవములో, సగము ఇవ్వటం కంటే “పూర్తిగా కట్టుబడియుండుట” ఎక్కువ సులువైనది. మనము సగము ఇచ్చి లేక అసలు ఏమి ఇవ్వనప్పుడు,స్టార్ వార్స్ భాషా శైలిలో చెప్పినట్లుగా “సరైనది కానిది ఏదో ఉన్నది.” మనము దేవుని చిత్తముతో ఏకీభవించము మరియు అందువలన సంతోషము యొక్క వైఖరితో ఏకీభవించము.8 యెషయా ఇలా చెప్పెను:

“భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను, మైలను పైకి వేయును.

“దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.”9

అదృష్టవశాత్తూ, మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నను లేక మనము ఎక్కడ ఉండినప్పటికిని, రక్షకుని చేరలేనంత దూరములో మనము లేము, ఆయన ఇలా చెప్పెను: “కాబట్టి, పశ్చాత్తాపము పొంది మరియు చిన్న పిల్లవానివలే నా యొద్దకు వచ్చు వానిని నేను చేర్చుకొందును, ఏలయనగా దేవుని యొక్క రాజ్యము అట్టివారిది. ఇదిగో అట్టివారి కొరకు నేను ప్రాణము పెట్టియున్నాను మరియు దానిని తిరిగి పైకి తీసుకొనియున్నాను. ”10

మనము నిరంతరము పశ్చాత్తాపపడి, ప్రభువు మీద ఆధారపడినప్పుడు, జీవితపు అనుభవము నుండి కలిగిన జ్ఞానముతో సంపన్నులై, ఒక చిన్న బిడ్డ యొక్క దీనమనస్సు మరియు విశ్వాసమును11 కలిగియుండుటకు మనము మరలినప్పుడు, మనము బలమును పొందుతాము. యోబు ఇలా ప్రకటించెను, “అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ” 12 “నా బలము పదిమంది యొక్క బలము, ఎందుకనగా నా హృదయము స్వచ్ఛమైనది, ”13 ఇలా వ్రాసింది టెన్నిసన్ అనే ఆంగ్ల కవి. “పరిశుద్ధ స్థలములలో నిలబడుము మరియు కదలకుము, ” 14 అని ప్రభువు సలహా ఇచ్చారు.

మా పెద్ద కుమారుడు జస్టిన్ 19 సంవత్సరాల వయస్సులో ఒక జీవితకాలపు వ్యాధితో పోరాడిన తరువాత చనిపోయాడు. అతడు చనిపోకముందు, ఒక సంస్కార సమావేశ ప్రసంగములో, అతడు తనకు అర్ధవంతమైన ఒక కథను పంచుకున్నాడు, ఒక తండ్రి మరియు తన చిన్న కుమారుడు ఒక బొమ్మల షాపుకు వెళ్ళారు, అక్కడ మనషి రూపములో ఉన్న గాలితో నింపబడిన పంచింగ్ బాగ్ ఉన్నది. ఆ బాలుడు ఆ గాలి మనిషిని గుద్దాడు, అది పడిపోయి, ప్రతీ గుద్దు తర్వాత వెంటనే ఆ బొమ్మ యధాస్థానానికి వచ్చింది. అ గాలి మనిషి తిరిగి ఎందుకు యధాస్థానానికి వస్తున్నాడని తండ్రి తన చిన్న కుమారుని అడిగాడు. ఆ బాలుడు ఒక నిముషము ఆలోచించి, చెప్పాడు, “నాకు తెలియదు. బయటి వ్యక్తి పడిపోయనా లోపలి వ్యక్తి నిలబడియుండుట వలన కావచ్చని నేను అనుకుంటున్నాను.” “కట్టుబడియుండుటకు,” బదులుగా “ఏమీ వచ్చినా” 15మనము దృఢసంకల్పముతో ఉండాలి.

శరీరములోని మన ముళ్ళు తీసివేయుటకు లేక భరించే శక్తి కొరకు మనము ప్రభువు కొరకు కనిపెట్టుకొనియున్నప్పుడు మనము లోపల నిలబడతాము.16 అవి వ్యాధి, వైకల్యము, మానసిక రుగ్మత, ప్రియమైన వారి మరణము, మరియు అనేక ఇతర సమస్యల ముళ్లు కావచ్చు.

మనము కిందకి వడలిన చేతులు బలపరచినప్పుడు మనము లోపల నిలబడతాము. దుష్టులకు మరియు మంచిని చెడు, చెడును మంచి17 అని పిలచి, “నీతిమంతులను వాని నీతి నిమిత్తము శిక్షించుచూ, ”18 వెలుగుతో ఎక్కువ అసౌకర్యంగా మారుతున్న లౌకిక ప్రపంచమునకు వ్యతిరేకంగా సత్యమును కాపాడినప్పుడు మనము దృఢసంకల్పముతో ఉన్నాము.

స్వచ్ఛమైన మనస్సాక్షి, పరిశుద్ధాత్మ నుండి బలపరచే మరియు ఓదార్చే అభయము, మరియు సమస్త మర్త్య జ్ఞానము మించిన నిత్య అవలోకనము వలన కష్టాలు ఉన్నప్పటికిని దృఢసంకల్పము కలిగియుండుట సాధ్యము.19 మన మర్త్యత్వమునకు ముందులోకములో, మర్త్యత్వమును అనుభవించు అవకాశమును బట్టి మనము ఆనందముతో కేకలు వేసాము.20 మన పరలోక తండ్రి యొక్క ప్రణాళికను ధైర్యముగా కాపాడువారిగా ఉండుటకు మనము ఉత్సాహముగా నిర్ణయము తీసుకున్నప్పుడు మనము కట్టుబడియున్నాము. నిర్ణయము తీసుకొని, మరలా ఆయన ప్రణాళికను కాపాడుటకు ఇది సమయము!

నా 97-ఏళ్ళ వయస్సుగల తండ్రి ఈ మధ్యకాలంలోనే చనిపోయారు. ఎప్పుడైనా ఎవరైనా ఆయనను ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు, ఆయన స్థిరమైన జవాబు. “1–10 స్కేలు లోపల, నేను దాదావు 25!” ఈ ప్రియమైన వ్యక్తి నిలబడలేక లేక కూర్చోలేనప్పుడు మరియు మాట్లాడుట కష్టముగా ఉన్నప్పుడు కూడా ఆయన జవాబు మాత్రం ఒక్కటే ఉండేది. ఆయన ఎల్లప్పుడు లోపల నిలబడియున్నాడు.

మా నాన్నకు 90 సంవత్సరాల వయస్సప్పుడు, మేము విమానాశ్రయములో ఉన్నాము మరియు నేను వెళ్లి ఆయనకి వీల్ చైర్ తీసుకొనిరానా అని అడిగాను. ఆయన “వద్దు, గ్యారీ--నేను ముసలివాడను అయినప్పుడు తీసుకోవచ్చు” అన్నారు. ఆయనింకా ఇలా అన్నారు, “నడవటానికి నేను విసుగుచెందితే, నేను ఎల్లప్పుడు పరుగెత్తగలను.” మనము ప్రస్తుతము నడుస్తున్న విధానము “కట్టుబడియున్నవారిగా” మనము లేని యెడల, అప్పుడు, మనము పరుగెత్తాలి; మన మార్గమును మార్చుకోవాలి. మనమింకను యు—మలుపు త్రిప్పాల్సినవసరమున్నది. మనము ఎక్కువ ఏకదృష్టితో అధ్యయనము చేయాలి, ఎక్కువ అత్రుతగా ప్రార్థించాలి, లేక మనము నిజముగా ముఖ్యమైన విషయాలను హత్తుకొనులాగున కొన్ని అనవసరమైన విషయాలను వదిలేయాలి. మా నాన్న దీనిని గ్రహించారు.

చిత్రం
నౌకాదళములో ఎల్డర్ సాబిన్ యొక్క తండ్రి

రెండవ ప్రపంచ యుద్ధ సమయములో ఆయన నౌకాదళములో ఉన్నప్పుడు, ఆ గొప్ప మరియు విశాలమైన భవనంలో21 ఉన్నవారు ఆయన యొక్క సిద్ధాంతాలను ఎగతాళి చేసారు, కానీ ఆయన ఓడ సహవాసులు ఇద్దరు, డేల్ మాడక్స్ మరియు డాన్ డేవిడ్ సన్ గమనించారు మరియు ఎగతాళి చేయలేదు. “సాబిన్, నీవు అందరికంటే అంత భిన్నంగా ఎందుకు ఉన్నావు? నీవు ఉన్నతమైన నైతిక విలువలు కలిగియున్నావు, నీవు త్రాగవు, పొగ త్రాగవు, లేక ఒట్టు పెట్టుకోవు, కానీ నీవు శాంతముగా మరియు సంతోషముగా ఉన్నట్లుగా కనబడతావు.”

మా తండ్రిగారి పట్ల వారి అనుకూల ముద్ర, వారు మోర్మన్ల గురించి బోధింపబడిన దానికి పోలికలేదు, మరియు మా నాన్న తన ఇద్దర సహవాసులకు బోధించి బాప్తీస్మమివ్వగలిగారు. డేల్ యొక్క తల్లిదండ్రులు చాలా మనస్తాపం చెందారు మరియు అతడు సంఘములో చేరిన యెడల అతడు తన ప్రియురాలు మేరీ ఆలివ్ ను కోల్పోతాడని హెచ్చరించారు, కానీ అతడి మనవితో ఆమె మిషనరీలను కలుసుకొన్నది మరియు బాప్తీస్మము పొందింది.

యుద్ధము ముగింపు దగ్గరలో, అధ్యక్షులు హీబర్ జె. గ్రాంట్ కొందరి వివాహితులైన పురుషులను కలిపి, మిషనరీల కొరకు పిలిచారు. 1946లో, డేల్ మరియు అతడి భార్య మేరీ ఆలీవ్, తమ మొదటి బిడ్డ కొరకు ఎదురుచూస్తున్నప్పటికిని, డేల్ సేవ చేయాలని నిర్ణయించారు. చివరకు వారికి తొమ్మిదిమంది పిల్లలు---ముగ్గురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు కలిగారు. తొమ్మిది మంది మిషను సేవ చేసారు, తరువాత డేల్ మరియు మేరీ తమ స్వంతంగా మూడు మిషను సేవలు చేసారు. డజన్ల మనుమలు కూడ సేవ చేసారు. వారి కొడుకులలో ఇద్దరు, జాన్ మరియు మాథ్యూ మాడక్స్, అదేవిధంగా మాథ్యూ యొక్క అల్లుడు, రయాన్, ప్రస్తుతము టాబర్నాకిల్ గాయకబృందములో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు మాడక్స్ కుటుంబము 144 మంది మరియు “కట్టుబడియున్న” వారికి అద్భుతమైన మాదిరులు.

చిత్రం
టాబర్నాకిల్ గాయకబృందములో మాడక్స్ కుటుంబ సభ్యులు

మా నాన్న కాగితములను చూస్తుండగా, మరొక ఓడ సహవాసి, డాన్ డేవిడ్ సన్ యొక్క ఐదుగురు కుమార్తెలలో ఒకరైన జెన్నిఫర్ రిచర్డ్స్ నుండి ఒక లేఖను చూసాను. ఆమె ఇలా వ్రాసింది: “మీ నీతి మా జీవితాలను మార్చివేసింది. సంఘము లేకుండా మా జీవితాలు ఏమిటో గ్రహించుట కష్టము. మా నాన్న సువార్తను ప్రేమిస్తూనే చివరి వరకు దానిని జీవించుటకు ప్రయత్నిస్తూ చనిపోయారు. ”22

లోపల నిలబడి ఉండుట వలన ప్రతీవ్యక్తి కలిగియుండగల మంచి కొరకైన ప్రభావమును కొలవటం కష్టమైనది. మా నాన్న మరియు అతడి ఇద్దరు ఓడ సహవాసులు గొప్ప, విశాలమైన భవనములో ఎగతాళిగా వేలు చూపిస్తున్న వారి మాటలను వినుటకు తిరస్కరించారు.23 తోటివారి ఒత్తిడి కంటె సృష్టికర్తను అనుసరించుట మంచిదని వారికి తెలుసు.

అపోస్తులుడైన పౌలు తిమోతికి చెప్పుచున్నప్పుడు అతడు మన కాలమును వర్ణించియుండవచ్చు, “కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, నిష్ ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.”24 నేడు లోకములో చాలా “నిష్ ప్రయోజనమైన ముచ్చట్లు” ఉన్నవి. గొప్ప మరియు విశాలమైన భవనంలో జరిగే సంభాషణ.25 తరచుగా ఇది దుష్టత్వమును న్యాయమని ఒప్పించుట లేక జనులు సువార్త నుండి తమను తాము త్వరగా దూరపరచుకొన్నప్పుడు, దానికదే ప్రత్యక్షపరచబడు హేతుబద్ధీకరణ రూపముగా కనబడును. ఇది కొన్నిసార్లు “కట్టుబడియుండు” వారిగా ఉండుటకు అవసరమైనది చేయని వారినుండి వచ్చును మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా ప్రకృతి సంబంధియైన మనుష్యుని వెంబడించుటకు ఎక్కువగా ఇష్టపడతారు.

కృతజ్ఞతాపూర్వకంగా, విశ్వాసులకు అది ఎలా ముగింపబడునో మనకు తెలుసు. మనము “కట్టుబడి” యున్నప్పుడు, “దేవుని ప్రేమించిన వారికి మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని, .”26 మనల్ని చుట్టుకొనే హామీ ఉంటుంది. ఎల్డర్ నీల్ ఎ. మాక్స్ వెల్ చెప్పినట్లుగా, “భయపడకుము, నీతిగా మాత్రము జీవించుము.”27

మా మావయ్య బివైయులో ప్రొఫెసర్ గా బోధించారు మరియు బివైయు ఫుట్ బాల్ ప్రేమించారు, కానీ వారి ఆటలు తనకై తాను చూడలేకపోయాడు, ఎందుకనగా ఫలితం ఎలా ఉంటుందని భయపడ్డారు. అప్పుడు ఒక అద్భుతమైన విషయము జరిగింది---విసిఆర్ కనుగొనబడింది, అది ఆటలను రికార్డు చేయాటానికి అతడికి సాధ్యపరచింది. బివైయు గెలిచినట్లయితే, ముగింపు గురించి పూర్తి నిశ్చయముతో ఆయన పూర్తి విశ్వాసముతో రికార్డింగ్ చూసేవారు! వారు అన్యాయముగా జరిమానా విధించబడి, గాయపడినా లేక నాలగవ క్వార్టరులో వెనుకబడిన, అతడు ఒత్తిడి చెందలేదు, ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళు గెలుస్తారు! అతడు “పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ”!28 కలిగియున్నాడని మీరు చెప్పవచ్చు.

అది మనతో ఆవిధంగా ఉన్నది. మనము విశ్వాసముగా ఉన్నప్పుడు, చివరిలో మనకు అన్నీ సమకూడి జరుగుతాయని మనము సమాన నిశ్చయము కలిగియుండవచ్చు. ప్రభువు యొక్క వాగ్దానములు నిశ్చయమైనవి. ఈ మర్త్య విశ్వవిద్యాలయము సులభమైనదని దాని అర్ధము కాదు లేక అనేకమైన కన్నీళ్ళు లేవని కాదు, కానీ పౌలు వ్రాసినట్లుగా, “దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.” 29

సహోదర మరియు సహోదరిలారా, రేపు ఎవరు పాపమూ చేయలేదు. అవసరమైన యెడల మన మార్గమును మార్చుకొని మరియు గొప్ప నిరీక్షణ మరియు విశ్వాసముతో ముందుకు సాగెదము గాక. మనము సాహసము కలిగియుండుట ద్వారా “దృఢసంకల్పము కలిగి” మరియు “కట్టుబడియుందుము” గాక. మన పరలోక తండ్రి యొక్క ప్రణాళికను మరియు ఆయన కుమారుడైన మన రక్షకుని యొక్క మిషనును కాపాడుకొనుటలో ధైర్యముగా మరియు పరిశుద్ధముగా మనముండెదముగాక. మన తండ్రి జీవిస్తున్నాడని, యేసే క్రీస్తని, మరియు గొప్ప సంతోషము యొక్క ప్రణాళిక వాస్తవమును గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రభువు యొక్క శ్రేష్టమైన దీవెనలు మీతో ఉండును గాక, మరియు దీనిని నేను యేసు క్రీస్తు నామములో చేస్తున్నాను, ఆమేన్.