2010–2019
అత్యవసరమైన సత్యములు—అమలుపరచు మన అవసరము
అక్టోబర్ 2017


అత్యవసరమైన సత్యములు—అమలుపరచాల్సిన మన అవసరము

ప్రథమ దర్శనము మరియు ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఈ జీవితంలో మన సంతోషానికి మరియు మన ఉన్నతస్థితికి అవసరమైన జ్ఞానము మరియు సత్యమును తెచ్చెను.

నాకు ఏడు సంవత్సరాలప్పుడు, నేను మా అమ్మను అడిగాను, “నేను, నువ్వు చనిపోయి, పరలోకానికి వెళ్ళిన తరువాత, నీవింకా మా అమ్మగా ఉంటావా?” ఆమె అటువంటి ప్రశ్నను ఊహించలేదు. తనకు బాగా తెలిసిన జ్ఞానముతో జవాబిస్తూ చెప్పింది, “లేదు, పరలోకములో మనము సహోదర, సహోదరీలుగా ఉంటాము. నేను నీ తల్లిగా ఉండను.” నేనాశించిన జవాబు అది కాదు.

ఆ సంభాషణ జరిగిన కొంతకాలానికి, ఇద్దరు యువకులు మా ఇంటి గేటులో ప్రవేశించారు. ఎదో అద్భుతము ద్వారా, మా నాన్న వారిని లోపలికి రానిచ్చాడు. వారు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము నుండి మిషనరీలమని చెప్పారు.

మేము వారిని పిలవటం నేర్చుకున్నట్లుగా, ఈ ఎల్డర్లు మా కుటుంబానికి బోధించటం ప్రారంభించారు. వాళ్ళు మా ఇంటికి వచ్చిన ప్రతీసారి మా సంతోషము మరియు ఉత్సాహ భావనలు నాకు స్పష్టంగా గుర్తున్నది. ఒక యువకుడు ఏ సంఘము నిజమైనదో తెలుసుకోవటానికి దేవునిని అడుగుటకు ఒక వనములోనికి వెళ్ళాడని, మరియు అతడు దేవునిని మరియు యేసు క్రీస్తును చూసాడని వీరు మాకు చెప్పారు.1 ఆ దర్శనము యొక్క దృష్టాంతమును ఎల్డర్లు మాకు చూపించారు, మరియు నేను దానిని చూసినప్పుడు, జోసెఫ్ స్మిత్ నిజముగా తండ్రియైన దేవునిని మరియు యేసు క్రీస్తును చూసాడని నేను ఎరుగుదును. ఈ దర్శనము వలన యేసు క్రీస్తు యొక్క సంఘము భూమిమీద మరల పునఃస్థాపించబడిందని మిషనరీలు చెప్పారు. 2

చిత్రం
ప్రథమ దర్శనము

మిషనరీలు దేవుని యొక్క సంతోష ప్రణాళికను కూడా మాకు బోధించారు, మరియు మతము గురించి మా కుటుంబపు ప్రశ్నలకు జవాబిచ్చారు. కుటుంబాలు ఈ జీవితము తరువాత కూడా తండ్రి, తల్లి, కుమారులు మరియు కుమార్తెలుగా కలిసి జీవించవచ్చని వారు మాకు బోధించారు.

మా కుటుంబము బాప్తీస్మము పొందింది. పాత అలవాట్లను మార్చుకొనుట, ఆచారములను వదలివేయుట, మరియు సంఘములో చురుకుగల సభ్యులుగా ఉండు దారి కొన్నిసార్లు గతుకులుగా ఉంటుంది. కాని దేవుని యొక్క కృప మరియు ప్రేమ వలన, అనేకమంది నాయకులు, సభ్యుల వలన, మేము మొదటి కష్టమైన సంవత్సరాలను దాటగలిగాము.

మిలియన్లు ఇదివరకే సంఘములో చేరారు, అదేవిధంగా ప్రతీవారము అనేకమంది పరివర్తన చెంది, బాప్తీస్మము తీసుకొని, మొదటి దర్శనమును గూర్చి సాక్ష్యము పొందారు. యేసు క్రీస్తు యొక్క సరళమైన సత్యములను జీవించుటకు మనము ప్రయాసపడినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ప్రతిఒక్కరికి ఈ సాక్ష్యమును పునరావృతం చేయగలదు.

మొదటి దర్శనము మరియు ప్రవక్త జోసెఫ్ స్మిత్ బయటకు తెచ్చిన అదనపు జ్ఞానము మరియు సత్యము ఈ జీవితంలో మన సంతోషానికి మరియు దేవుని సన్నిధిలో మన ఉన్నత స్థితికి అత్యవసరమైనవి. ఒక బాలుడు నిజాయితీగల ప్రార్థనయందు మోకరించుట వలన మనము పొందిన సత్యములలో తప్పక అమలుపరచవలసిన మూడింటిని నేను తెలియజేస్తాను.

మనల్ని నడిపించి, మార్గము చూపుటకు దేవుడు ప్రవక్తలను పిలుచును

మొదటి దర్శనము మరియు ప్రవక్త జోసెఫ్ స్మిత్ నుండి మనము నేర్చుకొన్న అత్యవసరమైన సత్యమేదనగా, మనల్ని ఉపదేశించుటకు, మార్గము చూపుటకు హెచ్చరించుటకు, మరియు నడిపించుటకు దేవుడు ప్రవక్తలను, 3 దీర్ఘదర్శులను మరియు బయల్పాటుదారులను పిలుచును.4 ప్రభువు నామములో మాట్లాడి,6 పనిచేయుటకు అధికారముగల ఈ పురుషులు దేవుని యొక్క రాయబారులు.5 వారి సలహాను ఖచ్చితంగా పాటించుట ద్వారా, మన ప్రయాణములో మనము కాపాడబడతాము మరియు శ్రేష్టమైన దీవెనలు పొందుతాము.

యువకునిగా, ఒంటరిగా, మిషను నుండి తిరిగి వచ్చి నేను బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయములో చదువుచుండగా, నేను టెంపుల్ స్క్వేర్ లో టాబర్నాకిల్ లో సర్వసభ్య సమావేశములో యాజకత్వపు సభకు హాజరయ్యాను. అప్పటి సంఘ అధ్యక్షులైన అధ్యక్షులు ఎజ్రాటాఫ్ట్ బెన్సన్, వివాహమును గంభీరంగా తీసుకోమని మరియు దానిని తన జీవితంలో ప్రధాన ప్రాధన్యతగా చేసుకోమని తిరిగి వచ్చిన ప్రతీ మిషనరీని ఆయన వేడుకున్నారు. 7 సమావేశము తరువాత, నేను పశ్చాత్తాపపడుటకు పిలవబడ్డానని, ప్రవక్త చెప్పిన సలహాను చేయాల్సినవసరం ఉన్నదని నేనెరుగుదును.

కాబట్టి, నేను నా స్వదేశమైన బ్రెజిల్‌కు వెళ్లి, ఒక భార్యను కనుగొనాలని నిర్ణయించాను. రెండు నెలల శిక్షణపై బ్రెజిల్‌కు వెళ్ళకముందు, నేను మా అమ్మకు మరియు కొందరు స్నేహితులకు ఫోను చేసాను మరియు దాదాపు 10 మంది యువతుల జాబితాను చేసాను---వారిలో ఒక్కొక్కరు సాధ్యతగల భార్య.

బ్రెజిల్‌లో ఉండగా, ఎక్కువగా ప్రార్థించి మరియు ధ్యానించిన తరువాత, నేను ఆ జాబితాలోని ఒక యువతిని కలుసుకొని, డేటింగ్ చేసి, నిశ్చితార్ధము చేయబడిన తరువాత, వివాహము చేసుకొనుటకు ఒక తేదిని నిర్ణయించాను. డేటింగ్ చేసి, నిశ్చితార్ధము చేసుకొనుట యూటా, ప్రోవోలోని విద్యార్ధులకు రికార్డింగ్ సమయము కాదు, కానీ బ్రెజిల్ ప్రమాణముల చేత అది వేగమైనది.

కొన్ని నెలల తరువాత, నేను ఎలైన్‌ను వివాహము చేసుకున్నాను. ఆమె నా జీవితపు ప్రేమ మరియు ఒక శ్రేష్టమైన దీవెన.

అదేవిధమైన జాబితాను ప్రతీఒక్కరు చేయాలని నేను సూచించుటలేదు, కానీ మనము ఎల్లప్పుడు మన జీవిస్తున్న ప్రవక్తలు మాట్లాడుచున్నప్పుడు చెయ్యాలని నేను సూచిస్తున్నాను---సూచించుట కంటే ఎక్కువైనది.

చిత్రం
అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ యొక్క రేఖాచిత్రము

నేటి దేవుని యొక్క ప్రవక్త అధ్యక్షులు థామస్  ఎస్. మాన్సన్, మరియు ఖండితముగా ఆయన సలహాను అనుసరించుట ద్వారా మనము దీవించబడతాము.

దేవుని యొక్క నిజమైన స్వభావమును గూర్చిన జ్ఞానము

మొదటి దర్శనము మరియు జోసెఫ్ స్మిత్ వలన మనము నేర్చుకొన్న మరొక సత్యము దేవుని యొక్క నిజమైన స్వరూపము. దేవుడు మన వలె స్పర్శనీయమైన మాంసము, ఎముకలను కలిగిన శరీరముతో ఒక ప్రాణి అని, నిజమైన దేవునిని మనము ఆరాధించగలమని, 8 ఆయనను మనము అర్థము చేసుకోగలమని, ఆయన ప్రవక్తలకు---పాతకాల ప్రవక్తలు మరియు ఈ కడవరి దిన ప్రవక్తలు ఇరువురికి తన్ను తాను బయల్పరచుకొని మరియు ఆయన కుమారునిని చూపారని---మనము తెలుసుకొనుటకు ఎంతగా దీవించబడ్డామో ఊహించుము.9 ఆయన మన ప్రార్థనలు విని ఆలకించు దేవుడు; 10 పైన పరలోకము నుండి మనల్ని కావలికాయు దేవుడు11 మరియు మన ఆత్మీయ మరియు భౌతిక శ్రేయస్సు గురించి నిరంతరము చింతిస్తున్నాడు; ఆయనను వెంబడించుటకు మరియు బలవంతము లేకుండా ఆయన ఆజ్ఞలను పాటించుటకు మనకై మనము నిర్ణయించుటకు మనము స్వతంత్రత ఇచ్చిన దేవుడు; 12 మనకు దీవెనలు ఇచ్చును మరియు మనము ఎదిగి, ఆయనవలె అగునట్లు శ్రమలను ఎదుర్కొనుటకు మనల్ని అనుమతించును.

ఒక ప్రణాళికను అందించిన ఆయన ఒక ప్రేమగల దేవుడు, దాని ద్వారా జీవితంలో మరియు నిత్యత్వములో సంతోషమును మనము ఆనందించగలము.

యేసు క్రీస్తు మన రక్షకుడు

మొదటి దర్శనము మరియు జోసెఫ్ స్మిత్ నుండి, మనము మన మతము యొక్క మూలరాయి అయిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ మిషను మరియు వాస్తవమును మనము పొందాము.

లోకములోనికి మరణము పరిచయము చేయబడినది కనుక, ఇప్పుడు మనము జీవిస్తున్నంత నిశ్ఛయముగా, ఒకరోజు మనమందరము చనిపోతాము. మరణము యొక్క ప్రభావాలలో ఒకటి, మన భౌతిక శరీరము యొక్క శాశ్వతమైన నష్టము, దానిని తిరిగి పొందటానికి దేనినీ మనము చేయలేము. అదనముగా, ఇక్కడ భూమిమీద మన ప్రయాణమునందు మనమందరము పాపము చేస్తాము కనుక, మన పరలోక తండ్రి యొక్క సన్నిధికి ఎన్నడూ తిరిగి వెళ్ళలేము.

దేవుని యొక్క సన్నిధిని కోల్పోవుట వలన పర్యవసానములను మరియు ఎన్నడూ ఒక శరీరమును కోల్పోవుటను మీరూహించగలరా?

మరణము మరియు పాపము నుండి మనల్ని స్వతంత్రులను చేయుటకు ఒక రక్షకుడు మరియు విమోచకుడు అవసరము. పరలోక తండ్రి యొక్క నడిపింపు క్రింద యేసు క్రీస్తు భూమి మీద వచ్చాడు, శ్రమపడ్డాడు, సిలువపై మరణించాడు, మరియు పునరుత్థానము చెందాడు ఆవిధంగా మనము కూడా పునరుత్థానము చెందగలము, మరియు నిజాయితీగల పశ్చాత్తాపముతో, పరిశుద్ధ నిబంధనలను చేసి మరియు పాటించుటతో, మరొకసారి దేవుని సన్నిధిలో ఉండగలము.

జేకబ్ వివరించాడు, “ఓ, మన దేవుని యొక్క మంచితనము ఎంత గొప్పది, ఈ భయంకరమైన రాక్షసి యొక్క కట్ల నుండి మనము తప్పించుకొనుటకు ఒక పాపమును సిద్ధపరచును. ఆ రాక్షసి మరణము మరియు నరకము వేటిని నేను శరీరము యొక్క మరణము మరియు ఆత్మ యొక్క మరణము అని కూడా పిలుచుదును.” 13

చిత్రం
సమాధి వద్ద యేసు మరియు మరియ

యేసు వాగ్దానమివ్వబడిన మెస్సయా, న్యాయమిచ్చువాడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన రాజు, మన సమస్తము.

దేవునికి మరియు ఆయన ప్రియమైన కుమారునికి మన విధేయతను చూపుతూ, మనమందరము ఈ ముఖ్యమైన సత్యములు మరియు జ్ఞానముపై పనిచేసెదముగాక, ఆమేన్.