2010–2019
శ్రేష్టమైన గ్రంథముల నుండి నేర్చుకొనుడి
అక్టోబర్ 2017


శ్రేష్టమైన గ్రంథాలనుండి వెదకండి

శ్రేష్టమైన గ్రంథములనుండి మనము అధ్యయనము చేసినప్పుడు, మన ఆత్మీయ వేళ్లను నమిలివేయాలని కోరు వారి యొక్క క్రూరమైన కోరలకు వ్యతిరేకంగా మనల్ని మనం కాపాడుకొంటాము.

ఒక వేకువజామున ఒక అందమైన గులాబిపొదపైన ఆకలితో, బాగా దాక్కొని ఉన్న ఒక గొంగలిపురుగును చూసాను. ఆకులు లేని కొన్ని రెమ్మలను చూస్తే, అది దాని భయంకరమైన కోరలతో పళ్ళుకొరుకుతూ లేత ఆకులగుండా తన మార్గములో వెళ్తుందని సాధారణంగా పరిశీలించువారికి కూడా ప్రస్పుటంగా తెలుస్తుంది. రూపకముగా, ఈ గొంగలిపురుగు వలె కొందరు జనులు ఉన్నారని ఆలోచించకుండా ఉండలేకపోయాను; వారు లోకమంతటా కనుగొనబడుదురు, మరియు వారు చాలా తెలివిగా మారువేషములో ఉండుట వలన, వారిని మన జీవితాలలోకి అనుమతిస్తాము, మరియు మనం తెలుసుకొనేలోపు వారు మనవి, మన కుటుంబము మరియ స్నేహితుల ఆత్మీయ వేళ్ళను తినివేసారు.

మన నమ్మకాల గురించి అబద్దపు సమాచారము ప్రబలిన కాలములో మనం ఉన్నాము. ఇటువంటి సమయాలలో, మన ఆత్మీయ వేళ్ళను కాపాడుకొని, బలంగా నాటుకొనడంలో విఫలమైతే, అది క్రీస్తు నందు మన విశ్వాసాన్ని మరియు ఆయన పునఃస్థాపించబడిన సంఘమందు మన నమ్మకాన్ని నాశనము చేయుటకు వెదకువారికి మనలను నమిలివేయుటకు ఒక ఆహ్వానముగా ఉండును. మోర్మన్ గ్రంథ సమయములో, జీజ్రొమ్ విశ్వాసులు నమ్మకాన్ని నాశనము చేయుటకు చూసాడు.

అతడి చేతలు మరియు మాటలు “అతని దాస్యపు శక్తిని బట్టి అతడు తన సంకెళ్ళతో [వారిని] చుట్టివేయునట్లును నిత్య నాశనమునకు సంకెళ్ళు వేయునట్లును ... తన స్వాధీనము లోనికి తెచ్చునట్లును [ఆ] జనులను పట్టుకొనుటకు అతడు వేసియుంచిన అపవాది యొక్క ఉచ్చు” (ఆల్మా 12:6). ఆ ఉచ్చులు నేడు ఉనికిలో ఉన్నాయి మరియు మనం ఆత్మీయంగా అప్రమత్తంగా ఉండి, మన విమోచకునిపైన ఒక స్థిరమైన పునాదిని నిర్మించుకొనకపోతే (హీలమన్ 5:12 చూడండి), సాతాను గొలుసులతో బంధించబడి, మోర్మన్ గ్రంథములో చెప్పబడిన నిషేధించబడిన మార్గములోనికి జాగ్రత్తగా నడిపించుటను మనం కనుగొంటాము (1  నీఫై 8:28 చూడుము).

అపొస్తలుడైన పౌలు తన కాలములో ఒక హెచ్చరిక చేసెను అది నేడు కూడా మనకు అన్వయించబడుతుంది: “మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు” (అపొస్తలుల కార్యములు 20:29–30).

వ్యతిరేకత మరియు మోసపు మాటలకు వ్యతిరేకంగా మనల్ని మనం ఆత్మీయంగా కాపాడుకొనుటకు మనం చేయగలదంతా చెయ్యాలని ఆయన మరియు మన అపొస్తలులు, ప్రవక్తల హెచ్చరికను మనకు గుర్తుచేయును. సంఘము యొక్క వార్డులు మరియు స్టేకులను దర్శించగా, రక్షకుని మరియు ఆయన సేవకుల బోధనలకు పరిశుద్ధులు సానుకూలముగా మరియు విశ్వాసముగా ప్రతిస్పందించగా నేను చూసి, విని, భావించిన వాటివలన నేను ప్రేరేపించబడ్డాను.

ప్రవక్తల ఆహ్వానాలను ఆలకించుట ద్వారా సభ్యులు ఆత్మీయంగా తమను తాము కాపాడుకొనుటకు ఒక ఉదాహరణ సబ్బాతు దిన ఆచరణను హెచ్చించుట. ఇంకా ఎక్కువ బలపడుటకు సాక్ష్యమేమనగా దేవాలయ విధుల ద్వారా కుటుంబాలు తమ పూర్వికులను పోగుచేయగా దేవాలయపు మరియు కుటుంబ చరిత్ర కార్యము ఎక్కువగుట. చిత్తశుద్ధిగల వ్యక్తిగత మరియు కుటుంబ ప్రార్థనలు మన విశ్వాసమునకు బురుజులుగా మారినప్పుడు, మరియు మనం అనుదినము పశ్చాత్తాపపడినప్పుడు, పరిశుద్ధాత్మ సహవాసము వెదకినప్పుడు, మన రక్షకుని గురించి మరియు ఆయన గుణముల గురించి నేర్చుకొని, ఆయనవలె అగుటకు ప్రయత్నించినప్పుడు మన ఆత్మీయవేళ్లు బలంగా నాటుకుంటాయి. (3  నీఫై 27:27 చూడుము).

మన రక్షకుడైన యేసు క్రీస్తు, లోకమునకు వెలుగు, మరియు ఆయనను వెంబడించమని మనకు సైగచేయుచున్నారు. అన్నివేళలా మరి ముఖ్యంగా దొర్లుచున్న పొగమంచు వలె సందేహము మరియు అనిశ్చిత యొక్క తుఫాను ప్రవేశిస్తున్నప్పుడు చీకటియైన, పెనుతుఫాను రాత్రులు ఉన్నప్పుడు మనం ఆయనవైపు చూడాలి. “నది యొక్క అవతలపైవు ఆ గొప్ప విశాలమైన భవనము ఉన్నవైపునుండి” ((1  నీఫై 8:26) ఎత్తిచూపిస్తున్న వేళ్లు, మిమ్మల్ని హేళన చేస్తు, కించపరుస్తు, సైగచేస్తున్నట్లు మీకు అనిపిస్తే, సత్యము మరియు దాని దీవెనలనుండి మిమ్మల్ని వేరుచేయుటకు కపటము మరియు కుటిల మార్గములచేత మీరు ఒప్పించబడకుండా వెంటనే మీరు వెనుతిరగమని నేను అడుగుచున్నాను.

అయినప్పటికి ప్రతికూలమైన మాటలు మాట్లాడబడి, వ్రాయబడి మరియు చిత్రించబడే ఈ రోజులలో అది ఒక్కటే సరిపోదు. “సజీవమైన సువార్తలో -మీ పూర్ణ హృదయము, పూర్ణాత్మ మరియు పూర్ణబలముతో- మీరు పూర్తిగా నిమగ్నమవ్వకపోతే, చీకటిని వెనుకకు త్రోయుటకు మీరు తగినంత ఆత్మీయ వెలుగును కలిగియుండరు” అని ఎల్డర్ రాబర్ట్  డి. హేల్స్ చెప్పారు. (“Out of Darkness into His Marvelous Light,” Liahona, July 2002, 78). లోకమునకు వెలుగైన (యోహాను 8:12 చూడుము), క్రీస్తును అనుసరించుటకు మనకున్న కోరిక అనగా నిశ్చయముగా మనం ఆయన బోధనలపైన పనిచెయ్యాలి. దేవుని యొక్క వాక్యముపైన పనిచేస్తే మనం ఆత్మీయంగా బలపరచబడతాము, దృఢపరచబడతాము మరియు రక్షించబడతాము.

మన జీవితాలలో ఎక్కువ వెలుగుంటే, తక్కువ నీడలు ఉంటాయి. కాని ధారాళముగా వెలుగు ఉన్నప్పటికి, జనులు మరియు వ్యాఖ్యానాలకు మనం బహిర్గతపరచబడతాము, అవి మన నమ్మకాలను తప్పుగా వక్రీకరిస్తాయి మరియు విశ్వాసాన్ని పరిక్షిస్తాయి. “[మన] విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని” (యాకోబు 1:3) అపొస్తలుడైన యాకోబు వ్రాసెను. ”సంఘము తప్పుగా వక్రీకరించబడినప్పుడు సహనముగల శిష్యుడు ఆశ్చర్యపోడు లేదా వెనుదిరుగడు” అని ఎల్డర్ నీల్  ఏ. మ్యాక్స్‌వెల్ బోధించారు. (“Patience” [Brigham Young University devotional, Nov.  27, 1979], speeches.byu.edu).

మన సంఘ చరిత్ర మరియు నమ్మకాల గురించి ప్రశ్నలు వస్తాయి. సరైన సమాధానాలు కనుగొనుటకు మనం ప్రయత్నించినప్పుడు గొప్ప శ్రద్ధ అవసరము. తక్కువ సమాచారము లేదా అసంతృప్తితో ఉన్నవారి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశోధించుట ద్వారా మనం దేనిని సంపాదించలేము. ఉత్తమమైన సలహా అపొస్తలుడైన యాకోబు ద్వారా ఇవ్వబడెను: “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను” ” (యాకోబు 1:5).

దేవుని అడిగిన తరువాత, జాగ్రత్తగా అధ్యయనము చెయ్యాలి ఎందుకంటే మనం “శ్రేష్టమైన గ్రంథాలనుండి జ్ఞానముగల మాటలు; పఠనము ద్వారా మరియు విశ్వాసము ద్వారా నేర్చుకొనుటకు వెదకండి” (సి మరియు ని 88:118) అనే ఆత్మీయ ఆజ్ఞకు లోబడియున్నాము. ఈ గ్రంథాలు ధారాళంగా ఉన్నాయి, అవి పరలోకముచేత ప్రేరేపించబడిన సంఘ నాయకులు, గుర్తించబడిన, సురక్షితమైన, ఆధారపడగల సంఘ చరిత్ర మరియు సిద్ధాంత పండితులచే వ్రాయబడినవి. అలా చెప్పినప్పటికి, పరిశుద్ధ లేఖనాలలో ఉన్న బయలు పరచబడిన దేవుని వాక్యము యొక్క గొప్పతనమును ఏదీ అణిచివెయ్యలేదు. మందమైన ఆత్మయ విషయాలుగల ఆ పలుచని పేజీలనుండి మనం పరిశుద్ధాత్మ ద్వారా సత్యాన్ని నేర్చుకుంటాము తద్వారా వెలుగునందు వృద్ధిచెందుతాము.

అధ్యక్షులు థామస్  ఎస్. మాన్సన్ మనల్ని, “అనుదినము ప్రార్థనాపూర్వకముగా మోర్మన్ గ్రంథమును అధ్యయనము చేసి, లోతుగా ఆలోచించమని” కోరుచున్నారు. (“The Power of the Book of Mormon,” Liahona, May 2017, 87).

అనేక సంవత్సరాల క్రితం, ఫిజి సువ విషనుల అధ్యక్షునిగా నేను సేవచేస్తున్నప్పుడు, కొంతమంది మిషనరీలు ఒక అనుభవాన్ని పొందారు అది మోర్మన్ గ్రంథము యొక్క పరివర్తన శక్తి వారిలో బలోపేతం చేసింది. ఎండగా, తేమగా ఉన్న ఒకరోజు ఇద్దరు ఎల్డర్లు లబాసాలోని క్రొత్తగా ఏర్పడిన ఒక చిరుగ్రామంలో ఒక చిన్న గృహమునకు చేరుకున్నారు.

తట్టిన తలుపును ఒక అలసిపోయిన వ్యక్తి తెరిచి ఆ మిషనరీలు మోర్మన్ గ్రంథము యొక్క యదార్థత గురించి సాక్ష్యము చెప్పగా విన్నాడు. ఆయనకు ఒక ప్రతిని ఇచ్చి, వారివలె దానిని చదివి, అది దేవుని వాక్యమని తెలుసుకొనుటకు ప్రార్థించమని ఆహ్వానించారు. ఆయన సమాధానము చాలా క్లుప్తంగా ఉండెను: “రేపు నేను చేపల వేటకు తిరిగి వెళ్తాను. సముద్రముపైన ఉన్నప్పుడు నేను చదువుతాను, నేను తిరిగి వచ్చినప్పుడు, మీరు వచ్చి మరలా నన్ను కలుసుకోవచ్చు.”

అతడు అలా వెళ్లినప్పుడు వారికి బదిలీలు జరిగి, కొన్ని వారాల తరువాత క్రొత్త ఎల్డర్ల సహచరత్వము ఆ జాలరిని దర్శించుటకు తిరిగి వచ్చారు. అప్పటికి ఆయన మోర్మన్ గ్రంథమంతటిని చదివి, దాని సత్యము యొక్క సంపూర్ణత్వము గురించి సాక్ష్యము పొంది, ఇంకా నేర్చుకోవాలని కోరిక కలిగి ఉండెను.

పరిశుద్ధాత్మ చేత ఈ వ్యక్తి పరివర్తన చెందెను, చాలా కాలం క్రితం బోధించబడి మన కాలము కొరకు భద్రపరచబడిన ఆయన మోర్మన్ గ్రంథములో ప్రతి పేజీలో ఉన్న సంఘటనలు మరియు సిద్ధాంతము యొక్క విలువైన మాటల యొక్క సత్యము గురించి సాక్ష్యమును పొందెను. ఆ దీవెన మనలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది.

లేఖనముల నుండి, ప్రవక్తలు మాటలు పఠించి, వాటి యొక్క విలువైన పరిజ్ఞానములు పంచుకొనుటకు, ఎల్‌డిఎస్.ఆర లో ఉన్న సమాచారమును పొందుటకు గృహము ఆదర్శవంతమైన స్థలము. అక్కడ మొదటి దర్శన వృత్తాంతము, వంటి సువార్త అంశాల గురించి ధారాళమైన సమాచారమును మీరు కనుగొంటారు. శ్రేష్టమైన గ్రంథాలను మనం చదివినప్పుడు, మన ఆత్మీయ వేళ్ళను నమిలివేయు క్రూరమైన కోరలనుండి మనల్ని మనం కాపాడుకొంటాము.

మన ప్రార్థన, పఠనము, లోతుగా ఆలోచించుట అన్ని చేసిన తరువాత కూడా, ఇంకా జవాబు పొందవలసిన కొన్ని ప్రశ్నలు ఉండవచ్చును, కాని మనలో రెపరెపలాడుచున్న విశ్వాసపు వెలుగు ఆరిపోవునట్లు మనం చెయ్యకూడదు. అటువంటి ప్రశ్నలు మన విశ్వాసాన్ని నిర్మించుటకు ఒక ఆహ్వానము మరియు దాటివెళ్తున్న మోసపుచ్చు సందేహపు గడియకు మనం ఆజ్యంపోయకూడదు. ఇ విషయం గురించి, ఎల్డర్ జెఫ్రీ  ఆర్. హాలండ్ ఇలా బోధించారు, “అటువంటి గడియలు వచ్చినప్పుడు, సమస్యలు బహిర్గతమైనప్పుడు వెంటనే జరగకపోవు పరిష్కారమేదనగా, మీకు ఇంతకుముందు తెలిసిన వాటికి అంటిపెట్టుకొని ఉండండి, అదనపు జ్ఞానము వచ్చేవరకు బలంగా నిలబడండి” (“Lord, I Believe,” or Liahona, May 2013, 94).

వారి ఆత్మీయ వేళ్ళను నిరంతరము పోషించుట ద్వారా బలంగా నిలబడుచున్న అనేకుల యొక్క సంతోషమును మన చుట్టూ చూస్తాము. వారి విశ్వాసము మరియు విధేయత వారి రక్షకునియందు గొప్ప నిరీక్షణను ఇచ్చుటకు సరిపోవును మరియు దానినుండి గొప్ప సంతోషము చిగురిస్తుంది. అన్నీ తెలుసని వారు ఆరోపించరు కాని శాంతిని కలిగియుండుటకు, వారు ఇంకా ఎక్కువ తెలుసుకొనుటకు వెదకుచున్నప్పుడు సహనముతో జీవించుటకు కావలసినంత తెలుకొనుటకు వారు వెల చెల్లించారు. వరుస వెంబడి వరుస, వారి విశ్వాసము క్రీస్తునందు దృఢపరచబడింది, మరియు వారు తోటి పౌరులుగా పరిశుద్ధులతో బలంగా నిలబడతారు.

దాక్కొని ఉన్న గొంగలిపురుగు యొక్క క్రూరమైన కోరలు ఇప్పుడు, ఇంకెప్పుడు మన జీవితాలలో ఏ స్థలము దొరకకుండా మనలో ప్రతి ఒక్కరు జీవిద్దాము,  తద్వారా “అంతము వరకు క్రీస్తు యొక్క విశ్వాసములో స్థిరముగా” (ఆల్మా 27:27) మనలో ప్రతి ఒక్కరు జీవించాలి. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.